← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దివ్యం divyaṃ

Original — తెలుగు
  1. దివిభవం, స్వర్గ్యం, స్వర్గజం. (స్వర్గమందు పుట్టినది ; ఆకాశమందు పుట్టినది).

  2. స్వమాత్రతయా దీప్యమాన త్వాత్ దివ్యం, స్వమాత్రతయా ద్యోతనత్వాత్ దివ్యం.

(తనంతటతానే ప్రకాశించునది, స్వయంప్రకాశము).

  1. ద్యోతనాత్మకం ; ద్యోతనవాన్. (ప్రకాశించునది ; ప్రకాశము గలది - ప్రకాశమే రూపముగా గలది).

  2. స్వయం జ్యోతిష్ట్వాత్ దివ్యం;స్వయం జ్యోతిః;స్వయం ప్రభః. (స్వయముగా ప్రకాశించువాడు - స్వప్రకాశరూపుడు).

  3. దేదీప్యమానత్వాత్ దివ్యం. (బాగుగా ప్రకాశించుటవలన’ దివ్యం’).

  4. పరమ వ్యోమనిలయం (పరమాకాశమునందుండునది).

  5. దివిస్థితం - పరమపదనిలయః ఇత్యర్ధః -

(స్వర్గమందుండువాడు - పరమపదము నిలయముగా గలవాడు - పరమపదమందుండువాడు). (దేవలోకమందుండువాడు ; దేవుడు).

  1. దివి, సూర్యమండలే భవం (సూర్యమండలమందు పుట్టినది).

  2. స్వాత్మని భవం (పరమాత్మ వలన కలిగినది) (దైవసంబంధమైనది).

  3. అప్రాకృతం (ప్రకృతికి, దాని కార్యములకు సంబంధించినది).

  4. అలౌకికం (లోకమునకు సంబంధించనిది ; లోకమునకు మించినది).

  5. సర్వప్రపంచాతీత మద్భుతం. (సమస్త ప్రపంచమును మించినది ; అద్భుతమైనది).

  6. అనింద్రియ గోచరం.

(ఇంద్రియములకు గోచరముకానిది, అందనిది.మనసులో ఊహించుటకుగాని, కండ్లతోచూచుటకుగానివీలుపడనిది).

  1. అసాధారణం ; అతిమానుషత్వ ప్రయుక్తాద్భుతత్వం ; అత్యద్భుత ప్రభావం.

(సాధారణమైనది కాదు; మానవశక్తికి మించిన అద్భుతము కలది; మిక్కిలి అద్భుతమైన ప్రభావము కలది).

  1. అన్యధాన భావ్యం. (ఇంకొకరీతిగా జరుగునది).

  2. అమానుషం (మానవశక్తికి, బుద్ధికి, మించినది - అతీతమైనది).

  3. కల్యాణయుక్తం (మంగళప్రదమైనది).

  4. “చ. ఎఱుగడు జీవనౌషధము లెవ్వరు భర్తలులేరు, బాధలం

దఱలడు, నైజ తేజమున దథ్యము జాడ్యము లేదు ; మిక్కిలిన్

మెఱయుచునన్నవాడొక నిమేషము దైనము నొంద డింకనే

తెఱగున ద్రుంతు? దివ్యము వీని ప్రభావమెట్టిదో“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 5 - 202)

Transliteration
  1. divibhavaṃ, svargyaṃ, svargajaṃ. (svargamaṃdu puṭṭinadi ; ākāśamaṃdu puṭṭinadi).

  2. svamātratayā dīpyamāna tvāt divyaṃ, svamātratayā dyōtanatvāt divyaṃ.

(tanaṃtaṭatānē prakāśiṃcunadi, svayaṃprakāśamu).

  1. dyōtanātmakaṃ ; dyōtanavān. (prakāśiṃcunadi ; prakāśamu galadi - prakāśamē rūpamugā galadi).

  2. svayaṃ jyōtiṣṭvāt divyaṃ;svayaṃ jyōtiḥ;svayaṃ prabhaḥ. (svayamugā prakāśiṃcuvāḍu - svaprakāśarūpuḍu).

  3. dēdīpyamānatvāt divyaṃ. (bāgugā prakāśiṃcuṭavalana’ divyaṃ’).

  4. parama vyōmanilayaṃ (paramākāśamunaṃduṃḍunadi).

  5. divisthitaṃ - paramapadanilayaḥ ityardhaḥ -

(svargamaṃduṃḍuvāḍu - paramapadamu nilayamugā galavāḍu - paramapadamaṃduṃḍuvāḍu). (dēvalōkamaṃduṃḍuvāḍu ; dēvuḍu).

  1. divi, sūryamaṃḍalē bhavaṃ (sūryamaṃḍalamaṃdu puṭṭinadi).

  2. svātmani bhavaṃ (paramātma valana kaliginadi) (daivasaṃbaṃdhamainadi).

  3. aprākṛtaṃ (prakṛtiki, dāni kāryamulaku saṃbaṃdhiṃcinadi).

  4. alaukikaṃ (lōkamunaku saṃbaṃdhiṃcanidi ; lōkamunaku miṃcinadi).

  5. sarvaprapaṃcātīta madbhutaṃ. (samasta prapaṃcamunu miṃcinadi ; adbhutamainadi).

  6. aniṃdriya gōcaraṃ.

(iṃdriyamulaku gōcaramukānidi, aṃdanidi.manasulō ūhiṃcuṭakugāni, kaṃḍlatōcūcuṭakugānivīlupaḍanidi).

  1. asādhāraṇaṃ ; atimānuṣatva prayuktādbhutatvaṃ ; atyadbhuta prabhāvaṃ.

(sādhāraṇamainadi kādu; mānavaśaktiki miṃcina adbhutamu kaladi; mikkili adbhutamaina prabhāvamu kaladi).

  1. anyadhāna bhāvyaṃ. (iṃkokarītigā jarugunadi).

  2. amānuṣaṃ (mānavaśaktiki, buddhiki, miṃcinadi - atītamainadi).

  3. kalyāṇayuktaṃ (maṃgaḷapradamainadi).

  4. “ca. eṟugaḍu jīvanauṣadhamu levvaru bhartalulēru, bādhalaṃ

daṟalaḍu, naija tējamuna dathyamu jāḍyamu lēdu ; mikkilin

meṟayucunannavāḍoka nimēṣamu dainamu noṃda ḍiṃkanē

teṟaguna druṃtu? divyamu vīni prabhāvameṭṭidō”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 5 - 202)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.