వాత పిత్త శ్లేష్మాదీన్. (వాతము, పిత్తము, శ్లేష్మము మొదలగునవి).
“స్థూల దేహగత వాత్త పిత్త శ్లేష్మ రూప దోష త్రయ జన్యా రోగనివృత్తయే యథా ధన్వంతరి ప్రభృతిభిః ఆయుర్వేదః ప్రాణాయి, ఏవం సర్వప్రాణి సాధారణాంతఃకరణ గతమల విక్షేపాజ్ఞా నాఖ్య దోష త్రయ నివృత్తయే కర్మోపాసనా జ్ఞానకాండ త్రయోప బృం హితం వేద చతుష్టయం ఈశ్వరేణాకారి”.
(స్థూల దేహమునకు సంబంధించిన వాత పిత్త శ్లేష్మములను మూడువిధముల దోషములవలన కలిగెడు రోగములను నివారించుకొఱకు ధన్వంతరివారిచే ఆయుర్వేదము ఏ ప్రకారముగా చేయబడినదో ఆ ప్రకారముగానే సమస్త ప్రాణులయొక్క అంతఃకరణమునకు సంబంధించిన మలము, విక్షేపము, అజ్ఞానము అను మూడు విధములగు దోషములను నివారించుటకు కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అను మూడింటిని భోధించునటువంటి నాలుగు వేదములు భగవంతునిచే చేయబడినవి).
(అందఱి అంతఃకరణమందు మలము, విక్షేపము, ఆవరణము అను మూడు దోషములుండును).
“నిష్కామకర్మానుష్ఠానేన అంతఃకరణస్థ మలరూపదోష నివృత్తిః; ఉపాసనయా విక్షేపస్య”.
(నిష్కామకర్మానుష్ఠానమువలన - కోరిక లేక కర్మ చేయుటవలన - అంతఃకరణములోనున్న మలమనే దోషము నివృత్తియగును. విక్షేపమను దోషము ఉపాసనవలన నివృత్తియగును).
రాగ ద్వేష మోహాః దోషాః. (రాగము, ద్వేషము, మోహము అను మూడు దోషములు).
కామము, క్రోధము, మొదలగునవి.
“శ్లో||. కాయస్య దోషా వాతాద్యా మనసస్తు రజస్తమః |
దోషాహి ఏవహి సర్వేషాం రోగాణా మేక కారణం |
రాగా దయో మనో రోగాః కాయరోగా జ్వరా ద్యః ||: (చికిత్సాసార సంగ్రహము)
(వాత పిత్త కఫములు శారీరకదోషములు, రజస్తమములు మానసిక దోషములు. ఈ దోషములే శారీరక మానసిక రోగములకు ముఖ్యకారణములు ; జ్వరము, రక్త పిత్తము,క్షయ మొదలగునవి శారీరకదోషములు. కామ, క్రోధ, మోహ మద మాత్సర్యములు మానసిక రోగములకు కారణములు).
శ్లేష్మా కంఠగత ప్రదేశనిహతో దోషత్రయ స్థానకం |
తద్దోష త్రయ వాత పిత్త కఫజాః కర్మ ప్రపాకోద్భవాః |
దృశ్యంతే భువి మానుషేషు సకలా రోగాయ తాః ప్రాయశః| |“. (చికిత్సాసార సంగ్రహము)
(వాతము అను దోషము కటిప్రదేశమందు కలుగును. పైత్యము నాభియందు కలుగును - శ్లేష్మము కంఠము నందు కలుగును. ఇట్లు ఈ మూడు దోషముల స్థానములు చెప్పబడినవి. వాత, పిత్త, కఫములను ఈ మూడు దోషముల వలన కలుగురోగములు వారి వారి కర్మ పరిపక్వమై ఫలమునిచ్చుటవలన కలుగును).
vāta pitta ślēṣmādīn. (vātamu, pittamu, ślēṣmamu modalagunavi).
“sthūla dēhagata vātta pitta ślēṣma rūpa dōṣa traya janyā rōganivṛttayē yathā dhanvaṃtari prabhṛtibhiḥ āyurvēdaḥ prāṇāyi, ēvaṃ sarvaprāṇi sādhāraṇāṃtaḥkaraṇa gatamala vikṣēpājñā nākhya dōṣa traya nivṛttayē karmōpāsanā jñānakāṃḍa trayōpa bṛṃ hitaṃ vēda catuṣṭayaṃ īśvarēṇākāri”.
(sthūla dēhamunaku saṃbaṃdhiṃcina vāta pitta ślēṣmamulanu mūḍuvidhamula dōṣamulavalana kaligeḍu rōgamulanu nivāriṃcukoṟaku dhanvaṃtarivāricē āyurvēdamu ē prakāramugā cēyabaḍinadō ā prakāramugānē samasta prāṇulayokka aṃtaḥkaraṇamunaku saṃbaṃdhiṃcina malamu, vikṣēpamu, ajñānamu anu mūḍu vidhamulagu dōṣamulanu nivāriṃcuṭaku karmakāṃḍa, upāsanākāṃḍa, jñānakāṃḍa anu mūḍiṃṭini bhōdhiṃcunaṭuvaṃṭi nālugu vēdamulu bhagavaṃtunicē cēyabaḍinavi).
(aṃdaṟi aṃtaḥkaraṇamaṃdu malamu, vikṣēpamu, āvaraṇamu anu mūḍu dōṣamuluṃḍunu).
“niṣkāmakarmānuṣṭhānēna aṃtaḥkaraṇastha malarūpadōṣa nivṛttiḥ; upāsanayā vikṣēpasya”.
(niṣkāmakarmānuṣṭhānamuvalana - kōrika lēka karma cēyuṭavalana - aṃtaḥkaraṇamulōnunna malamanē dōṣamu nivṛttiyagunu. vikṣēpamanu dōṣamu upāsanavalana nivṛttiyagunu).
rāga dvēṣa mōhāḥ dōṣāḥ. (rāgamu, dvēṣamu, mōhamu anu mūḍu dōṣamulu).
kāmamu, krōdhamu, modalagunavi.
“ślō||. kāyasya dōṣā vātādyā manasastu rajastamaḥ |
dōṣāhi ēvahi sarvēṣāṃ rōgāṇā mēka kāraṇaṃ |
rāgā dayō manō rōgāḥ kāyarōgā jvarā dyaḥ ||: (cikitsāsāra saṃgrahamu)
(vāta pitta kaphamulu śārīrakadōṣamulu, rajastamamulu mānasika dōṣamulu. ī dōṣamulē śārīraka mānasika rōgamulaku mukhyakāraṇamulu ; jvaramu, rakta pittamu,kṣaya modalagunavi śārīrakadōṣamulu. kāma, krōdha, mōha mada mātsaryamulu mānasika rōgamulaku kāraṇamulu).
ślēṣmā kaṃṭhagata pradēśanihatō dōṣatraya sthānakaṃ |
taddōṣa traya vāta pitta kaphajāḥ karma prapākōdbhavāḥ |
dṛśyaṃtē bhuvi mānuṣēṣu sakalā rōgāya tāḥ prāyaśaḥ| |“. (cikitsāsāra saṃgrahamu)
(vātamu anu dōṣamu kaṭipradēśamaṃdu kalugunu. paityamu nābhiyaṃdu kalugunu - ślēṣmamu kaṃṭhamu naṃdu kalugunu. iṭlu ī mūḍu dōṣamula sthānamulu ceppabaḍinavi. vāta, pitta, kaphamulanu ī mūḍu dōṣamula valana kalugurōgamulu vāri vāri karma paripakvamai phalamuniccuṭavalana kalugunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.