చూచువాడు.
దర్శనక్రియాసాక్షీ - (చూచుట యను పని చేయువాడు).
జీవః, సాక్షీ, ఈశ్వరః -
(సాక్షి, జీవుడు, ఈశ్వరుడు - అన్నింటిలోను ఉన్నవాడుకనుక అవి చేయుపనులు చూచువాడు).
చక్షుషా సర్వాణిరూపాణి పశ్యతీ త్యేవం ద్రష్టా. (కంటితో అన్ని రూపములను చూచువాడుకనుక ద్రష్ట).
సర్వ పదార్థ సాక్షాత్కారవాన్. (సమస్త వస్తువులను తనకంటితో చూడగలుగువాడు).
” నాన్యతో స్తి ద్రష్టా” ఇతి శ్రుతిః.
(ఇతనికంటె - భగవంతుని కంటె ఇంకొకడు చూచువాడు లేడు - అన్నింటిలోను ఉండుటవలన ఆనింటిని చూచువాడితడే).
(సర్వజ్ఞుడైన పరమాత్మకన్న ఇతరుడు అన్నింటినీ చూచువాడు - ద్రష్ట - మరొకడు లేడు అని శ్రుతి చెప్పుచున్నది. దీనివలన మాయచేత కల్పించబడిన శరీరముగల ద్రష్ట భోక్త అయిన జీవుడుకన్న పరమేశ్వరుడు అన్యుడు కాడు - ఎట్లనగా ఇంద్రజాలముచేయు ఒకమాయావి భూమిమీద తానుండియు త్రాడుపట్టుకొని ఆకాశములోనికి పోయినవాడు ఒకడే అయినట్లు. ఘటాకాశము, మహాకాశము ఒకటే అయినట్లు ఆ పరమాత్మయే ద్రష్ట. పైన చెప్పిన మాయావికిని ఆకాశములోనికి పోయినదానికి కనబడు భేదము కల్పితము - ఆ ప్రకారముగానే ఘటాకాశమునకు, మహాకాశమునకు భేదము కల్పితమే. అన్నీ భగవంతుడే కనుక అన్నింటినీ తాను చూచును గాని తనను చూచువాడు ఇంకొకడు లేడు).
“అరూపుండయి చిదాత్మకుండయి పరగు జీవునికి బరమేశ్వరు మాయాగుణంబులైన మహదాది రూపంబుల చేత నాత్మస్థానంబుగా విరచితంబైన స్థూలశరీరంబు గగనంబునందు బవనాశ్రితమేఘ సమూహంబును గాలియందు బార్థివధూళి ధూనరత్వంబును నేరీతి, నారీతి ద్రష్టయగు నాత్మయందు దృశ్యత్వంబై బుద్ధిమంతులు గానివారిచేత నారోపింపబడు -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 3 - 30)
” బుద్ధి ద్వారా చిదాత్మవాచమింద్రియం సమారుహ్య తస్యాః ప్రేరకో భూత్వా వాచా కరణేన సర్వాణి నామాని వక్తవ్యత్వేన ఆప్నోతి. చక్షుసా సర్వాణిరూపాణి పశ్యతి ఇత్యేవం ద్రష్టా భవిష్యతీత్యర్థః. తథాచ సర్వద్రష్టృత్వం చిదాత్మని ద్రష్ట.
(చిదాత్మ బుద్ధి ద్వారా వాగింద్రియమును అధిష్టించి, దానిని ప్రేరేపించుచు దానిచేత అన్ని పేర్లను చెప్పించ గలుగుచున్నది. అట్లే కంటితో అన్నిరూపములను చూచుచున్నది - ఇట్లు ద్రష్ట యగుచున్నది. అందుచేత ద్రష్టృత్వా ధ్యాసమునకు కారణము బుద్ధి).
cūcuvāḍu.
darśanakriyāsākṣī - (cūcuṭa yanu pani cēyuvāḍu).
jīvaḥ, sākṣī, īśvaraḥ -
(sākṣi, jīvuḍu, īśvaruḍu - anniṃṭilōnu unnavāḍukanuka avi cēyupanulu cūcuvāḍu).
cakṣuṣā sarvāṇirūpāṇi paśyatī tyēvaṃ draṣṭā. (kaṃṭitō anni rūpamulanu cūcuvāḍukanuka draṣṭa).
sarva padārtha sākṣātkāravān. (samasta vastuvulanu tanakaṃṭitō cūḍagaluguvāḍu).
” nānyatō sti draṣṭā” iti śrutiḥ.
(itanikaṃṭe - bhagavaṃtuni kaṃṭe iṃkokaḍu cūcuvāḍu lēḍu - anniṃṭilōnu uṃḍuṭavalana āniṃṭini cūcuvāḍitaḍē).
(sarvajñuḍaina paramātmakanna itaruḍu anniṃṭinī cūcuvāḍu - draṣṭa - marokaḍu lēḍu ani śruti ceppucunnadi. dīnivalana māyacēta kalpiṃcabaḍina śarīramugala draṣṭa bhōkta ayina jīvuḍukanna paramēśvaruḍu anyuḍu kāḍu - eṭlanagā iṃdrajālamucēyu okamāyāvi bhūmimīda tānuṃḍiyu trāḍupaṭṭukoni ākāśamulōniki pōyinavāḍu okaḍē ayinaṭlu. ghaṭākāśamu, mahākāśamu okaṭē ayinaṭlu ā paramātmayē draṣṭa. paina ceppina māyāvikini ākāśamulōniki pōyinadāniki kanabaḍu bhēdamu kalpitamu - ā prakāramugānē ghaṭākāśamunaku, mahākāśamunaku bhēdamu kalpitamē. annī bhagavaṃtuḍē kanuka anniṃṭinī tānu cūcunu gāni tananu cūcuvāḍu iṃkokaḍu lēḍu).
“arūpuṃḍayi cidātmakuṃḍayi paragu jīvuniki baramēśvaru māyāguṇaṃbulaina mahadādi rūpaṃbula cēta nātmasthānaṃbugā viracitaṃbaina sthūlaśarīraṃbu gaganaṃbunaṃdu bavanāśritamēgha samūhaṃbunu gāliyaṃdu bārthivadhūḷi dhūnaratvaṃbunu nērīti, nārīti draṣṭayagu nātmayaṃdu dṛśyatvaṃbai buddhimaṃtulu gānivāricēta nārōpiṃpabaḍu -” (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 3 - 30)
” buddhi dvārā cidātmavācamiṃdriyaṃ samāruhya tasyāḥ prērakō bhūtvā vācā karaṇēna sarvāṇi nāmāni vaktavyatvēna āpnōti. cakṣusā sarvāṇirūpāṇi paśyati ityēvaṃ draṣṭā bhaviṣyatītyarthaḥ. tathāca sarvadraṣṭṛtvaṃ cidātmani draṣṭa.
(cidātma buddhi dvārā vāgiṃdriyamunu adhiṣṭiṃci, dānini prērēpiṃcucu dānicēta anni pērlanu ceppiṃca galugucunnadi. aṭlē kaṃṭitō annirūpamulanu cūcucunnadi - iṭlu draṣṭa yagucunnadi. aṃducēta draṣṭṛtvā dhyāsamunaku kāraṇamu buddhi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.