← Back to ద · Booklets 21–30 (digitized file 3)

ద్రవ్యా ద్వైతం dravyā dvaitaṃ

Original — తెలుగు
  1. “ఆత్మ జాయా సుతాదీనాం అన్యేషామపి దేహినాం|

యత్స్వార్థ కామయోః ఐక్యం ద్రవ్యా ద్వైతం తదుచ్యతే||“. (శ్రీమద్భాగవతం - 7 -)

(తనను, తన భార్యను, పుత్రులను మొదలగువారలను, ఇతరులను, తన అర్థకామములతో ఒకటిగానే చూచుట ద్రవ్యాద్వైతము - ద్రవ్యములన్నియు ఒకటే, భగవంతుడే ద్రవ్యములన్నియు అని తలచుట).

  1. “ఆత్మనః స్వస్యజాయా దీనాంచ స్వస్యర్థశ్చ కామశ్చ తయోః దేహాదీనాం పంచభూతాత్మకత్వేన భోక్తుః చ పరమాత్మకత్వేన అభేదాలోచనేన అర్థకామయోః యత్ ఐక్యదర్శనం ద్రవ్యా ద్వైతమిత్యర్థః”.

(తన శరీరము, తన భార్య మొదలగువారున్నూ, తన అర్థము, కామము ఇవి అన్నియు పంచభూతమయములే, వాటికి భోక్త అయినవాడు పరమాత్మయేయని, వాటిలో ఒకదానికి ఇంకొకదానికి భేదములేదని వాటినిచూచుట ద్రవ్యాద్వైతము - ద్రవ్యములన్నియు పంచభూతమయములే, భగవంతుని రూపములే - భగవంతునుకి వాటికి భేదములేదని, భగవంతుడుకాక ఇంకొక వస్తువు (ద్వయవస్తువు) లేదని - భగవంతుడు అద్వయుడని తలచినట్లే మిగిలిన వస్తువులన్ని భగవదేతరములుకావని తలచుట).

  1. పుత్ర మిత్ర కళత్రాది సర్వ ప్రాణులకుం దనకును దేహంబునకున్ పంచభూతాత్మకత్వంబున భోక్త యొక్కండను పరమార్థత్వంబున అర్థ కామంబులయెడ నైక్య దృష్టి చేయుట ద్రవ్యాద్వైతము - స్వకీయ పరకీయ బుద్ధి స్వప్నముగా తలంచవలెను”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 15 - 469)

Transliteration
  1. “ātma jāyā sutādīnāṃ anyēṣāmapi dēhināṃ|

yatsvārtha kāmayōḥ aikyaṃ dravyā dvaitaṃ taducyatē||“. (śrīmadbhāgavataṃ - 7 -)

(tananu, tana bhāryanu, putrulanu modalaguvāralanu, itarulanu, tana arthakāmamulatō okaṭigānē cūcuṭa dravyādvaitamu - dravyamulanniyu okaṭē, bhagavaṃtuḍē dravyamulanniyu ani talacuṭa).

  1. “ātmanaḥ svasyajāyā dīnāṃca svasyarthaśca kāmaśca tayōḥ dēhādīnāṃ paṃcabhūtātmakatvēna bhōktuḥ ca paramātmakatvēna abhēdālōcanēna arthakāmayōḥ yat aikyadarśanaṃ dravyā dvaitamityarthaḥ”.

(tana śarīramu, tana bhārya modalaguvārunnū, tana arthamu, kāmamu ivi anniyu paṃcabhūtamayamulē, vāṭiki bhōkta ayinavāḍu paramātmayēyani, vāṭilō okadāniki iṃkokadāniki bhēdamulēdani vāṭinicūcuṭa dravyādvaitamu - dravyamulanniyu paṃcabhūtamayamulē, bhagavaṃtuni rūpamulē - bhagavaṃtunuki vāṭiki bhēdamulēdani, bhagavaṃtuḍukāka iṃkoka vastuvu (dvayavastuvu) lēdani - bhagavaṃtuḍu advayuḍani talacinaṭlē migilina vastuvulanni bhagavadētaramulukāvani talacuṭa).

  1. putra mitra kaḷatrādi sarva prāṇulakuṃ danakunu dēhaṃbunakun paṃcabhūtātmakatvaṃbuna bhōkta yokkaṃḍanu paramārthatvaṃbuna artha kāmaṃbulayeḍa naikya dṛṣṭi cēyuṭa dravyādvaitamu - svakīya parakīya buddhi svapnamugā talaṃcavalenu”

(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 15 - 469)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.