← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దృఢవ్రతాః dṛḍhavratāḥ

Original — తెలుగు
  1. దృఢం స్థిరం అచాల్యం వ్రతం యేషాంతే దృఢ వ్రతాః“. (శ్రీ శంకరః)

(స్థిరమైన చలించని - చంచలముకాని వ్రతము కలవారు).

  1. దృఢ సంకల్పాః (అచంచలమైన సంకల్పము గలవారు).

  2. ” ఏవ మేవ పరమార్థ తత్వం, నాన్యథా ఇత్యేవం సర్వపరిత్యాగవ్రతేన నిశ్చిత విజ్ఞానాః దృఢవ్రతాః ఉచ్యతే“. (శ్రీశంకరః)

(పరమార్థ తత్వము, భగవత్తత్వము ఇదియే - ఈ ప్రకారముగా నున్నదే అని మిగిలిన విషయములను విని వదలివేయుటయే వ్రతముగా నిశ్చయించు కొనినవారు).

  1. “ప్రకృత తారతమ్యేన మాం శరణం అనుప్రపద్య గుణమయాన్మోహాత్ ముక్తాః జరామరణ మోక్షాయ మహితేచ ఐశ్వర్యాయ మత్ప్రాప్తయే చ దృఢవ్రతాః (శ్రీమాన్ రామానుజః)

(స్వభావమువలన హెచ్చుతగ్గులగా నైనను నన్ను (భగవంతుని) శరణుపొంది, సత్వ రజస్తమములను త్రిగుణములచేత కలుగుమోహమును పోగొట్టుకొనినవారై జరా మరణములు లేకుండుటకై - జన్మ రాహిత్యము కొఱకు, మహదైశ్వర్యమైన మోక్షము కొఱకు - నన్ను పొందుటకు దృఢమైన వ్రతము కలవారు).

  1. అంగీకృత నిర్వాహకః, నిర్భరనియమ సంపన్నః.

(అంగీకరించిన కార్యమును నిర్వహించువాడు, నిర్భరమైన నియమము కలవాడు).

  1. “అబాల్యో నిశ్చయో యస్య వాదిభిశ్చ కుతార్కికైః” (గీతాభావప్రకాశము - 12 - 111)

(కుతర్కవాదములచేత చలింపని, మారని, నిశ్చయముకలవాడు).

  1. “చాలయితు మశక్యాన్యహింసా సత్య ముఖానిచ |

వ్రతాని ప్రతిపక్షైశ్చ యేషాంతే దృఢ సం యమాః ||“. (గీతాభావప్రకాశము - 9 - 103)

(అహింస, సత్యము మొదలగు వ్రతములనుండి ఇతరులచే చలింపచేయుటకు శక్యముకానివారు).

  1. “సకృదేవ ప్రసన్నాయ తవాస్మితి చ యాబతే |

అభయం సర్వభూతేభ్యో దదామ్యేత ద్ర్వతం మమ ||“. (శ్రీమద్రామాయణం - యుద్ధఖాండ)

(“ఇతర సాధనములను మఱచి నేను నీవాడనని నన్ను యాచించిన వారెవ్వరైనను వారికి అభయమిచ్చెదను. ఇది నా వ్రతము” - శ్రీరాముడు).

Transliteration
  1. dṛḍhaṃ sthiraṃ acālyaṃ vrataṃ yēṣāṃtē dṛḍha vratāḥ”. (śrī śaṃkaraḥ)

(sthiramaina caliṃcani - caṃcalamukāni vratamu kalavāru).

  1. dṛḍha saṃkalpāḥ (acaṃcalamaina saṃkalpamu galavāru).

  2. ” ēva mēva paramārtha tatvaṃ, nānyathā ityēvaṃ sarvaparityāgavratēna niścita vijñānāḥ dṛḍhavratāḥ ucyatē”. (śrīśaṃkaraḥ)

(paramārtha tatvamu, bhagavattatvamu idiyē - ī prakāramugā nunnadē ani migilina viṣayamulanu vini vadalivēyuṭayē vratamugā niścayiṃcu koninavāru).

  1. “prakṛta tāratamyēna māṃ śaraṇaṃ anuprapadya guṇamayānmōhāt muktāḥ jarāmaraṇa mōkṣāya mahitēca aiśvaryāya matprāptayē ca dṛḍhavratāḥ (śrīmān rāmānujaḥ)

(svabhāvamuvalana heccutaggulagā nainanu nannu (bhagavaṃtuni) śaraṇupoṃdi, satva rajastamamulanu triguṇamulacēta kalugumōhamunu pōgoṭṭukoninavārai jarā maraṇamulu lēkuṃḍuṭakai - janma rāhityamu koṟaku, mahadaiśvaryamaina mōkṣamu koṟaku - nannu poṃduṭaku dṛḍhamaina vratamu kalavāru).

  1. aṃgīkṛta nirvāhakaḥ, nirbharaniyama saṃpannaḥ.

(aṃgīkariṃcina kāryamunu nirvahiṃcuvāḍu, nirbharamaina niyamamu kalavāḍu).

  1. “abālyō niścayō yasya vādibhiśca kutārkikaiḥ” (gītābhāvaprakāśamu - 12 - 111)

(kutarkavādamulacēta caliṃpani, mārani, niścayamukalavāḍu).

  1. “cālayitu maśakyānyahiṃsā satya mukhānica |

vratāni pratipakṣaiśca yēṣāṃtē dṛḍha saṃ yamāḥ ||“. (gītābhāvaprakāśamu - 9 - 103)

(ahiṃsa, satyamu modalagu vratamulanuṃḍi itarulacē caliṃpacēyuṭaku śakyamukānivāru).

  1. “sakṛdēva prasannāya tavāsmiti ca yābatē |

abhayaṃ sarvabhūtēbhyō dadāmyēta drvataṃ mama ||“. (śrīmadrāmāyaṇaṃ - yuddhakhāṃḍa)

(“itara sādhanamulanu maṟaci nēnu nīvāḍanani nannu yāciṃcina vārevvarainanu vāriki abhayamiccedanu. idi nā vratamu” - śrīrāmuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.