← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దృగ్వివేకంబు dṛgvivēkaṃbu

Original — తెలుగు

” మృత్తిక యొక్కటియే నామ రూపంబులవలన ఘటాదులు బహు విధంబులైన తెఱంగున, సువర్ణం బొక్కటియే వాచారంభణమువలన కటకమకుటాది బహు భూషణంబులైన కైవడి, జలంబొక్కటియే వాయువశంబున ఫేన తరంగాది సముదాయంబగు విధంబున, దీపం బొక్కటియే బహురంధ్రంబులవలనబహువిధ దీపంబులై తోచు చందంబున, మారుతంబొకటియే వంశరంధ్రంబులవలన మధురమందరాది విభిన్న స్వరూపంబులైన పోలిక, ఆకాశంబొక్కటియే ఘట మఠాద్యుపాథివలన ననేకంబులగు భాతి, ధ్వని యొక్కటియే వాద్యభేదంబులవలన బహువిధంబులైన తెఱంగున, నభంబొక్కటియే కదళీదళ ఖండంబులవలన కరితురగాది విచిత్రంబగునట్లు, సూర్య చంద్రులొక్కొక్కటియే జలకుంభాదులవలన నానాత్వంబు బడయు భాతి, లెక్క యొక్కటియే బహుబింధువులవలన దశ శత సహస్రాదికంబులైన లాగున, చిత్తొక్కటియందు పూర్వోక్త జీవేశాది భేదవ్యవహారంబులవలన గూడినయది మొదలైనవి యెల్లను దృగ్వివేకంబనంబడు”

(వివేకచింతామణి - పరమానందతీర్థ)

Transliteration

” mṛttika yokkaṭiyē nāma rūpaṃbulavalana ghaṭādulu bahu vidhaṃbulaina teṟaṃguna, suvarṇaṃ bokkaṭiyē vācāraṃbhaṇamuvalana kaṭakamakuṭādi bahu bhūṣaṇaṃbulaina kaivaḍi, jalaṃbokkaṭiyē vāyuvaśaṃbuna phēna taraṃgādi samudāyaṃbagu vidhaṃbuna, dīpaṃ bokkaṭiyē bahuraṃdhraṃbulavalanabahuvidha dīpaṃbulai tōcu caṃdaṃbuna, mārutaṃbokaṭiyē vaṃśaraṃdhraṃbulavalana madhuramaṃdarādi vibhinna svarūpaṃbulaina pōlika, ākāśaṃbokkaṭiyē ghaṭa maṭhādyupāthivalana nanēkaṃbulagu bhāti, dhvani yokkaṭiyē vādyabhēdaṃbulavalana bahuvidhaṃbulaina teṟaṃguna, nabhaṃbokkaṭiyē kadaḷīdaḷa khaṃḍaṃbulavalana karituragādi vicitraṃbagunaṭlu, sūrya caṃdrulokkokkaṭiyē jalakuṃbhādulavalana nānātvaṃbu baḍayu bhāti, lekka yokkaṭiyē bahubiṃdhuvulavalana daśa śata sahasrādikaṃbulaina lāguna, cittokkaṭiyaṃdu pūrvōkta jīvēśādi bhēdavyavahāraṃbulavalana gūḍinayadi modalainavi yellanu dṛgvivēkaṃbanaṃbaḍu”

(vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.