బోధోపకార ఫలదం తం దృష్టాంతం వి దుర్బుధాః ||
దృష్టాం తేన వినా రామ న పూర్వార్థో (అ)వ బుద్ధ్యతే |
యథా దీపం వినా రాత్రౌ భాండోపస్కరణం గృహౌ ||“. (యోగవాసిష్టము - 18 - 50, 51)
(తెలిసిన విషయ సాదృశ్యము వలన తెలియని విషయమును గ్రహించుటకు వీలగును - ఇట్లు కొత్త విషయమును - తెలియని విషయమును - గ్రహించుటలో సహాయపడు విషయమును దృష్టాంతమందురు. రాత్రివేళ ఇంటిలోనున్న వస్తువులు దీపములేక తెలుసుకొనలేనట్లు దృష్టాంతము లేనిచో అసలు విషయము బోధపడదు).
అంగీకార్యావ బోధాయ ధీమతా నిర్వివాదినా |
అర్థావలోకనేదీపాదా భామాంత్రాద్రుతే కిల |
నస్థాన తైలవర్త్యాది కించి దప్యుపయుజ్యతే ||“. (యోగవాసిష్టము - 18 - 65)
(బంగారము కుండలములు మొదలగు ఆభరణములకు కారణమైనట్లు బ్రహ్మ జగత్తునకు కారణము - ఇందులోని దృష్టాంతము - బంగారమునుగుఱించి చెప్పినది - బ్రహ్మ జగత్కారణమని చెప్పుటకు ఉపయోగపడినది, కాని బంగారము మార్పు చెంది ఆ భరణములుగామారినది - బ్రహ్మ గుఱించి అట్లు అనుకొనరాదు - దృస్టాంతము చెప్పినప్పుడు దానియొక్క ధర్మములన్నియు తీసుకొనరాదు, ముఖ్యాంశమే గ్రహింపబడినది. చీకటిలోవస్తువులను గ్రహించుటకు దీపముయొక్క వెలుతురు మాత్రమే సహాయపడును - ఆ దీపమునకు సంబంధిం చిన నూనె, వత్తి, సెమ్మె సహాయపడవు కనుక వాటిని తీసుకొనరాదు).
bōdhōpakāra phaladaṃ taṃ dṛṣṭāṃtaṃ vi durbudhāḥ ||
dṛṣṭāṃ tēna vinā rāma na pūrvārthō (a)va buddhyatē |
yathā dīpaṃ vinā rātrau bhāṃḍōpaskaraṇaṃ gṛhau ||“. (yōgavāsiṣṭamu - 18 - 50, 51)
(telisina viṣaya sādṛśyamu valana teliyani viṣayamunu grahiṃcuṭaku vīlagunu - iṭlu kotta viṣayamunu - teliyani viṣayamunu - grahiṃcuṭalō sahāyapaḍu viṣayamunu dṛṣṭāṃtamaṃduru. rātrivēḷa iṃṭilōnunna vastuvulu dīpamulēka telusukonalēnaṭlu dṛṣṭāṃtamu lēnicō asalu viṣayamu bōdhapaḍadu).
aṃgīkāryāva bōdhāya dhīmatā nirvivādinā |
arthāvalōkanēdīpādā bhāmāṃtrādrutē kila |
nasthāna tailavartyādi kiṃci dapyupayujyatē ||“. (yōgavāsiṣṭamu - 18 - 65)
(baṃgāramu kuṃḍalamulu modalagu ābharaṇamulaku kāraṇamainaṭlu brahma jagattunaku kāraṇamu - iṃdulōni dṛṣṭāṃtamu - baṃgāramunuguṟiṃci ceppinadi - brahma jagatkāraṇamani ceppuṭaku upayōgapaḍinadi, kāni baṃgāramu mārpu ceṃdi ā bharaṇamulugāmārinadi - brahma guṟiṃci aṭlu anukonarādu - dṛsṭāṃtamu ceppinappuḍu dāniyokka dharmamulanniyu tīsukonarādu, mukhyāṃśamē grahiṃpabaḍinadi. cīkaṭilōvastuvulanu grahiṃcuṭaku dīpamuyokka veluturu mātramē sahāyapaḍunu - ā dīpamunaku saṃbaṃdhiṃ cina nūne, vatti, semme sahāyapaḍavu kanuka vāṭini tīsukonarādu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.