← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దృశ్యము dṛśyamu

Original — తెలుగు
  1. దృష్టి గోచరం (కంటికి కనబడునది).

  2. ద్రష్టుం యోగ్యం (చూచుటకు యోగ్యమైనది, తగినది).

  3. దృశ్యం సర్వ జగదిదం, జడం- (జడరూపమైన ఈ జగత్తంతయు దృశ్యము).

  4. బుద్థ్యా దయః, జ్ఞానవిషయాః -

(బుద్ధి మొదలగునవి, జ్ఞానమునకు విషయములైనవి - జ్ఞానముచేత తెలియబడునవి).

  1. దృశ్యాః గుణాః దేహాదయః భోగ్యపదార్థాః.

(దృశ్యములనగా గుణములు. ఇంద్రియములు, విషయములు, దేహము మొదలగునవి; భోగించవలసిన పదార్థములు - అనుభవించుటకు తగిన పదార్థములు).

  1. యస్మాత్ హేతోః యద్దృశ్యం తత్ నశ్వరమితి వ్యాప్తిః, తస్మాత్ పరమాత్మా ఆత్మనః నశ్వరత్వా భావాత్ న దృశ్యత్వం - దృశ్యత్వే నశ్వరత్వం స్యాత్ ఏవ.

(కంటికి కనబడునది నశించు స్వభావము కలది అనునది ప్రసిద్ధి. ఆత్మ నశించు స్వభావము లేనిది కనుక దృశ్యము కాదు - కనబడునది కాదు, కనబడునదే అయిన యెడల నశించునదే).

  1. ” బాహ్యా ఆకారవాన్ గ్రాహ్యో“. (పైకి ప్రత్యక్షమగు ఆకారము కలిగియున్నది దృశ్యము - ‘ఇదం’ = ఇది అని చెప్పబడు సమస్త పదార్థములు, వాటితో నిండిన జగత్తు దృశ్యము).

  2. ” ప్రకాశ క్రియా స్థితి శీలం భూతేంద్రియాత్మకం భోగ సవర్గార్థం దృశ్యం” (పతంజలి - 2 - 18)

(ప్రకాశము, క్రియ, స్థితి కలిగి, సత్వరజస్తమో గుణములవలన కలిగి, పంచభూతములు, మనస్సు, ఇంద్రియములు అను రూపములోనుండి పురుషుని భోగములకు, మోక్షమునకు, సుఖ దుఃఖములకు కారణమగు శరీరము దృశ్యము).

  1. “మనోదృశ్యమిదం ద్వైతం యత్కించిత్స చరాచరం |

మనసోహ్యమనీ భావే ద్వైతం నోపలభ్యతే ||“. (గౌడపాదకారికా)

(కనబడునదంతయు మనసునుబట్టి వేఱుగా - పరబ్రహ్మకంటె వేఱుగా - నున్నట్లు కనబడుచున్నది.మనస్సు ఉన్మనీ అవస్థలోనున్నపుడు అంతా భగవంతుడే కనుక అతను తప్ప వేఱొక వస్తువు - రెండవ వస్తువు - కనబడదు - అప్పుడు దృశ్యమనునదే ఉండదు).

  1. యద్దృశ్యం తదసత్.

(దృశ్యమంతయు - కనబడు ఈ ప్రపంచమంతయు అసత్తే - లేనిదే).

Transliteration
  1. dṛṣṭi gōcaraṃ (kaṃṭiki kanabaḍunadi).

  2. draṣṭuṃ yōgyaṃ (cūcuṭaku yōgyamainadi, taginadi).

  3. dṛśyaṃ sarva jagadidaṃ, jaḍaṃ- (jaḍarūpamaina ī jagattaṃtayu dṛśyamu).

  4. budthyā dayaḥ, jñānaviṣayāḥ -

(buddhi modalagunavi, jñānamunaku viṣayamulainavi - jñānamucēta teliyabaḍunavi).

  1. dṛśyāḥ guṇāḥ dēhādayaḥ bhōgyapadārthāḥ.

(dṛśyamulanagā guṇamulu. iṃdriyamulu, viṣayamulu, dēhamu modalagunavi; bhōgiṃcavalasina padārthamulu - anubhaviṃcuṭaku tagina padārthamulu).

  1. yasmāt hētōḥ yaddṛśyaṃ tat naśvaramiti vyāptiḥ, tasmāt paramātmā ātmanaḥ naśvaratvā bhāvāt na dṛśyatvaṃ - dṛśyatvē naśvaratvaṃ syāt ēva.

(kaṃṭiki kanabaḍunadi naśiṃcu svabhāvamu kaladi anunadi prasiddhi. ātma naśiṃcu svabhāvamu lēnidi kanuka dṛśyamu kādu - kanabaḍunadi kādu, kanabaḍunadē ayina yeḍala naśiṃcunadē).

  1. ” bāhyā ākāravān grāhyō”. (paiki pratyakṣamagu ākāramu kaligiyunnadi dṛśyamu - ‘idaṃ’ = idi ani ceppabaḍu samasta padārthamulu, vāṭitō niṃḍina jagattu dṛśyamu).

  2. ” prakāśa kriyā sthiti śīlaṃ bhūtēṃdriyātmakaṃ bhōga savargārthaṃ dṛśyaṃ” (pataṃjali - 2 - 18)

(prakāśamu, kriya, sthiti kaligi, satvarajastamō guṇamulavalana kaligi, paṃcabhūtamulu, manassu, iṃdriyamulu anu rūpamulōnuṃḍi puruṣuni bhōgamulaku, mōkṣamunaku, sukha duḥkhamulaku kāraṇamagu śarīramu dṛśyamu).

  1. “manōdṛśyamidaṃ dvaitaṃ yatkiṃcitsa carācaraṃ |

manasōhyamanī bhāvē dvaitaṃ nōpalabhyatē ||“. (gauḍapādakārikā)

(kanabaḍunadaṃtayu manasunubaṭṭi vēṟugā - parabrahmakaṃṭe vēṟugā - nunnaṭlu kanabaḍucunnadi.manassu unmanī avasthalōnunnapuḍu aṃtā bhagavaṃtuḍē kanuka atanu tappa vēṟoka vastuvu - reṃḍava vastuvu - kanabaḍadu - appuḍu dṛśyamanunadē uṃḍadu).

  1. yaddṛśyaṃ tadasat.

(dṛśyamaṃtayu - kanabaḍu ī prapaṃcamaṃtayu asattē - lēnidē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.