← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దుఃఖం duḥkhaṃ

Original — తెలుగు
  1. “సంసారవిషయ సంకల్ప ఏవ దుఃఖం”. (నిరాలంబోపనిషత్)

(సంసారమునకు సంబంధించిన విషయముల గుఱించి తృష్ణయే - సంకల్పమే, కోరికయే - దుఃఖము).

  1. “అనాత్మరూపః విషయ సంకల్పః ఏవ దుఃఖం”. (నిరాలంబోపనిషత్)

(ఆత్మగుఱించి కాక సంసారమునకు సంబంధించిన విషయములగుఱించి సంకల్పము కలిగియుండుటే దుఃఖము).

  1. సర్వప్రతికూల తయా వేద్యో అంతః కరణ వృత్తి విశేషః -

(తనకు ప్రతికూలముగా జరుగు విషయములగుఱించి మనస్సులో కలుగు వృత్తి విశేషము).

  1. ” నన్నెఱుంగలేక తమోగుణంబునం బరగుటయే దుఃఖంబనంబడు” (శ్రీమదాంధ్రమహాభాగవతము -11 -109)

  2. దుఃఖం చింతస్య సంతాపో - (మనసులోని సంతాపమే - బాధయే, మనోవ్యధయే - దుఃఖము).

దుఃఖమునకు కారణము : -

    1. “వాతాది త్రిధాతు మూలంబైన క్షుత్తౄడాది దుఃఖంబుల చేతను, శీతోష్ణ వర్ష వాతాది దుఃఖంబులచేతను --”

(వాతము, పిత్తము - పైత్యము - శ్లేష్మము - ఇవి ఆకలి దప్పికలవలన కలుగు దుఃఖములకు కారణము_).

  1. దుఃఖములు మూడువిధములు : - ఆధ్యాత్మిక దుఃఖము, ఆధి భేదికదుఃఖము, ఆధి దైవికదుఃఖము -

“శ్లో||. శోక మోహ జ్వరాదీని దుఃఖాన్యాధ్యాత్మికానివై |

ఆధిభేతిక దుఃఖాని వ్యాఘ్ర సర్పాది జానిచ |

అతివాతాతి వృష్ట్యాది దుఃఖం స్వాచ్చాధి దైవికం ||“. (గీతాభావప్రకాశము - 2 - 559, 560)

(శోకమోహ జ్వర శిరోరోగములవలన కలిగిన దుఃఖములు అధ్యాత్మికములు. వ్యాఘ్రము, సర్పములు మొదలగు భూతములవలన కలుగు దుఃఖములు ఆధి భౌతికములు. అతివృష్టి, అతివాతము మొదలగువాటివలన కలుగు దుఃఖములు ఆధి దైవికములు. శోక మోహములవలన కలుగు నాశి మానసికములు - మనస్సునకు సంబంధించినవి. జ్వర, శిరో రోగములు శరీరమునకు సంబంధించినవి.)

  1. “చింతయా జాయతే దుఃఖం నాన్యధాహేతి నిశ్చయీ |

తయాహీనః సుఖీ, శాంతః సర్వత్ర గలిత స్పృహః ||” (అష్టావక్రగీత - 11 - 5)

(చింతవలననే - ఆలోచనవలననే, సంకల్పమువలననే దుఃఖము కలుగుచున్నది, ఇతర విధముగా కాదు అనుట నిశ్చయము - ఆ మనస్సంకల్పము లేనివానికి అదే సుఖము, అదే శాంతి).

  1. “ద్వైతమూల మహాదుఃఖం నాన్యత్తస్స్యాస్తి భేషజం |

దృశ్యమేతన్మృషా సర్వమేకో (అ)హం చిద్రసో (అ)మలః ||. (అష్టావక్రగీత - 2 - 16)

(యధార్ధముగా ఇదంతా పరబ్రహ్మమే అయియుండగా పరబ్రహ్మకాక ఇంకొక వస్తువు (ప్రపంచమనునది) ఉన్నదని భావించు ద్వైతభావనయే దుఃఖమునకు కారణము - ఈ దృశ్యమంతయు - ఈ కనబడునదంతయు - ప్రపంచమంతయు మిధ్యయే - ఉన్నదంతా ఒకటే - చిన్మాత్రుడు, నిర్మలుడు అయిన పరబ్రహ్మమే - అదే నేను).

  1. “జన్మ దుఃఖం జరాదుఃఖం దుఃఖం మృత్యుః పునః పునః |

సంసారసాగరం దుఃఖం పతం తేయత్ర జంతవః ||“.

(సంసారమనగా - “గర్భ జన్మ, జరామరణరూపం” - తల్లి కడుపులో ప్రవేశించుట, జన్మించుట, పెరిగి పెరిగి ముసలియగుట చనిపోవుట. ఇది మరల మరల జరుగుచుండునది సంసారము - ఇట్టి సంసారములో పడి దానిలో మునిగిపోవు జీవులకు గర్భములో పడుట మొదలు మరణమువరకు గలవన్నియు దుఃఖకారణములు).

  1. “అర్ధానా మార్జనే దుఃఖం ఆర్జితానాం చ రక్షణే |

నాశే దుఃఖం వ్యయే దుఃఖం ఘ్నంతి చైవార్ధ కారణాత్||” (మహాభారతం)

(ధనమును - అర్ధములను - సంపాదించుటలో దుఃఖము, సంపాదించిన దానిని పోకుండ రక్షించుటలో దుఃఖము, అట్లు ఆర్జించి, రక్షించుకొనిన ధనమును తగ్గిపోవునని, నశించిపోవునని - తగ్గిపోయినను, నశించిపోయినను దుఃఖము కలుగును. అందుచేత ధనమును గుఱించి అన్నివిధముల దుఃఖమే కలుగును. దానిని సంపాదించుటకు హత్యలు కూడ చేయబడుచున్నవి).

  1. దుఃఖస్య దేహాపాదానైక హేతుత్వాత్. (దుఃఖమునకు దేహమే ఉపాదానమగుట ఒకటే కారణము).

  2. “అవిద్యా జన్యాంతః కరణా వచ్ఛిన్నో జీవో మనో వృత్యా స్వావిద్యయా స్వకూటస్థం ఆత్మానాం అజ్ఞాత్వా బుద్ధ్యా ద్యధ్యానేన బుద్ధ్యా ద్య ధ్యాసేన బుద్ధ్యాది నిష్ట ధర్మాచ్చ త్రిన్యాయేన కర్తృత్వ భోక్తృత్వ ముక్తత్వాదీన్ ఆత్మన్యతి దిశతి. తేనచ సుఖదుఃఖాదీన్ బుద్ధినిష్టాన్ ఆత్మని ఆరోపయతి. తస్మాత్ మన ఏవ కారణం సుఖదుఃఖానాం, నాన్యత్ ఇతి భావః”.

(అవిద్యవలన కలిగిన అంతః కరణరూపమైన జీవుడు మనోవృత్తి చేత తన అజ్ఞానమువలన కూటస్థుడైన ఆత్మను తెలుసుకొనలేక అధ్యాసమువలన, కర్తృత్వమును, భోక్తృత్వమును, ముక్తత్వమును తనయందే ఆరోపించుకొనును. అందువలన బుద్ధిననుసరించియుండు సుఖ దుఃఖములను తనవే అని ఆరోపించుకొనును. దీనిని బట్టి మనసే సుఖదుఃఖములకు కారణము. ఇతరము కాదు అని భావము).

  1. దుఃఖం స్వర్గా త్ప్రపాతే బహువిధనరకే గర్భవాసేతి దుఃఖం |

నిస్స్వాతం త్యాశ్రానా యా గ్రహ గదరి తైశ్శెశవదుఃఖమేవ |

తారుణ్యే అమర్షలోభ వ్యసన పరిభవో ద్వేగ దారిద్ర్యదుఃఖం |

వార్థక్యే శోకమోహేంద్రియ విలయ గదైర్దుఃఖమంతే అతి దుఃఖం ||“.

(స్వర్గానుభవమునకు పిమ్మట స్వర్గమునుండి క్రిందకేతెంచినపుడు దుఃఖము, నరకయాతన ననుభవించినపుడు దుఃఖము, గర్భవాసమున దుఃఖము, పుట్టిన పిమ్మట, ఆకలి దప్పికలను తొలగించుటకు స్వాంత్ర్యము లేకపోవుటచేత దుఃఖము, బాల గ్రహములచే దుఃఖము, ఈ విధముగా బాల్యమున దుఃఖము కలుగుచున్నది. యౌవనమందు దుఃఖము, క్రోధముచేత, లోభముచేతను దుఃఖము, వ్యసనముచే దుఃఖము, పరాభవముచే దుఃఖము, రాజభోగ్యాదులచే దుఃఖము, ఉద్వేగముచే దుఃఖము, దారిద్ర్యముచే దుఃఖము, వార్థక్యముచే దుఃఖము, ఇష్టబంధుజనవియోగముచే దుఃఖము; విస్మరణశీలుడగుటచేత దుఃఖము; ఇంద్రియముల పాటవమణుగుటచేత దుఃఖము; రోగముచే దుఃఖము.; అవసానసమయమున దుఃఖము - కావున సంసారమే దుఃఖభూయిష్టము).

Transliteration
  1. “saṃsāraviṣaya saṃkalpa ēva duḥkhaṃ”. (nirālaṃbōpaniṣat)

(saṃsāramunaku saṃbaṃdhiṃcina viṣayamula guṟiṃci tṛṣṇayē - saṃkalpamē, kōrikayē - duḥkhamu).

  1. “anātmarūpaḥ viṣaya saṃkalpaḥ ēva duḥkhaṃ”. (nirālaṃbōpaniṣat)

(ātmaguṟiṃci kāka saṃsāramunaku saṃbaṃdhiṃcina viṣayamulaguṟiṃci saṃkalpamu kaligiyuṃḍuṭē duḥkhamu).

  1. sarvapratikūla tayā vēdyō aṃtaḥ karaṇa vṛtti viśēṣaḥ -

(tanaku pratikūlamugā jarugu viṣayamulaguṟiṃci manassulō kalugu vṛtti viśēṣamu).

  1. ” nanneṟuṃgalēka tamōguṇaṃbunaṃ baraguṭayē duḥkhaṃbanaṃbaḍu” (śrīmadāṃdhramahābhāgavatamu -11 -109)

  2. duḥkhaṃ ciṃtasya saṃtāpō - (manasulōni saṃtāpamē - bādhayē, manōvyadhayē - duḥkhamu).

duḥkhamunaku kāraṇamu : -

    1. “vātādi tridhātu mūlaṃbaina kṣuttṝḍādi duḥkhaṃbula cētanu, śītōṣṇa varṣa vātādi duḥkhaṃbulacētanu --”

(vātamu, pittamu - paityamu - ślēṣmamu - ivi ākali dappikalavalana kalugu duḥkhamulaku kāraṇamu_).

  1. duḥkhamulu mūḍuvidhamulu : - ādhyātmika duḥkhamu, ādhi bhēdikaduḥkhamu, ādhi daivikaduḥkhamu -

“ślō||. śōka mōha jvarādīni duḥkhānyādhyātmikānivai |

ādhibhētika duḥkhāni vyāghra sarpādi jānica |

ativātāti vṛṣṭyādi duḥkhaṃ svāccādhi daivikaṃ ||“. (gītābhāvaprakāśamu - 2 - 559, 560)

(śōkamōha jvara śirōrōgamulavalana kaligina duḥkhamulu adhyātmikamulu. vyāghramu, sarpamulu modalagu bhūtamulavalana kalugu duḥkhamulu ādhi bhautikamulu. ativṛṣṭi, ativātamu modalaguvāṭivalana kalugu duḥkhamulu ādhi daivikamulu. śōka mōhamulavalana kalugu nāśi mānasikamulu - manassunaku saṃbaṃdhiṃcinavi. jvara, śirō rōgamulu śarīramunaku saṃbaṃdhiṃcinavi.)

  1. “ciṃtayā jāyatē duḥkhaṃ nānyadhāhēti niścayī |

tayāhīnaḥ sukhī, śāṃtaḥ sarvatra galita spṛhaḥ ||” (aṣṭāvakragīta - 11 - 5)

(ciṃtavalananē - ālōcanavalananē, saṃkalpamuvalananē duḥkhamu kalugucunnadi, itara vidhamugā kādu anuṭa niścayamu - ā manassaṃkalpamu lēnivāniki adē sukhamu, adē śāṃti).

  1. “dvaitamūla mahāduḥkhaṃ nānyattassyāsti bhēṣajaṃ |

dṛśyamētanmṛṣā sarvamēkō (a)haṃ cidrasō (a)malaḥ ||. (aṣṭāvakragīta - 2 - 16)

(yadhārdhamugā idaṃtā parabrahmamē ayiyuṃḍagā parabrahmakāka iṃkoka vastuvu (prapaṃcamanunadi) unnadani bhāviṃcu dvaitabhāvanayē duḥkhamunaku kāraṇamu - ī dṛśyamaṃtayu - ī kanabaḍunadaṃtayu - prapaṃcamaṃtayu midhyayē - unnadaṃtā okaṭē - cinmātruḍu, nirmaluḍu ayina parabrahmamē - adē nēnu).

  1. “janma duḥkhaṃ jarāduḥkhaṃ duḥkhaṃ mṛtyuḥ punaḥ punaḥ |

saṃsārasāgaraṃ duḥkhaṃ pataṃ tēyatra jaṃtavaḥ ||“.

(saṃsāramanagā - “garbha janma, jarāmaraṇarūpaṃ” - talli kaḍupulō pravēśiṃcuṭa, janmiṃcuṭa, perigi perigi musaliyaguṭa canipōvuṭa. idi marala marala jarugucuṃḍunadi saṃsāramu - iṭṭi saṃsāramulō paḍi dānilō munigipōvu jīvulaku garbhamulō paḍuṭa modalu maraṇamuvaraku galavanniyu duḥkhakāraṇamulu).

  1. “ardhānā mārjanē duḥkhaṃ ārjitānāṃ ca rakṣaṇē |

nāśē duḥkhaṃ vyayē duḥkhaṃ ghnaṃti caivārdha kāraṇāt||” (mahābhārataṃ)

(dhanamunu - ardhamulanu - saṃpādiṃcuṭalō duḥkhamu, saṃpādiṃcina dānini pōkuṃḍa rakṣiṃcuṭalō duḥkhamu, aṭlu ārjiṃci, rakṣiṃcukonina dhanamunu taggipōvunani, naśiṃcipōvunani - taggipōyinanu, naśiṃcipōyinanu duḥkhamu kalugunu. aṃducēta dhanamunu guṟiṃci annividhamula duḥkhamē kalugunu. dānini saṃpādiṃcuṭaku hatyalu kūḍa cēyabaḍucunnavi).

  1. duḥkhasya dēhāpādānaika hētutvāt. (duḥkhamunaku dēhamē upādānamaguṭa okaṭē kāraṇamu).

  2. “avidyā janyāṃtaḥ karaṇā vacchinnō jīvō manō vṛtyā svāvidyayā svakūṭasthaṃ ātmānāṃ ajñātvā buddhyā dyadhyānēna buddhyā dya dhyāsēna buddhyādi niṣṭa dharmācca trinyāyēna kartṛtva bhōktṛtva muktatvādīn ātmanyati diśati. tēnaca sukhaduḥkhādīn buddhiniṣṭān ātmani ārōpayati. tasmāt mana ēva kāraṇaṃ sukhaduḥkhānāṃ, nānyat iti bhāvaḥ”.

(avidyavalana kaligina aṃtaḥ karaṇarūpamaina jīvuḍu manōvṛtti cēta tana ajñānamuvalana kūṭasthuḍaina ātmanu telusukonalēka adhyāsamuvalana, kartṛtvamunu, bhōktṛtvamunu, muktatvamunu tanayaṃdē ārōpiṃcukonunu. aṃduvalana buddhinanusariṃciyuṃḍu sukha duḥkhamulanu tanavē ani ārōpiṃcukonunu. dīnini baṭṭi manasē sukhaduḥkhamulaku kāraṇamu. itaramu kādu ani bhāvamu).

  1. duḥkhaṃ svargā tprapātē bahuvidhanarakē garbhavāsēti duḥkhaṃ |

nissvātaṃ tyāśrānā yā graha gadari taiśśeśavaduḥkhamēva |

tāruṇyē amarṣalōbha vyasana paribhavō dvēga dāridryaduḥkhaṃ |

vārthakyē śōkamōhēṃdriya vilaya gadairduḥkhamaṃtē ati duḥkhaṃ ||“.

(svargānubhavamunaku pimmaṭa svargamunuṃḍi kriṃdakēteṃcinapuḍu duḥkhamu, narakayātana nanubhaviṃcinapuḍu duḥkhamu, garbhavāsamuna duḥkhamu, puṭṭina pimmaṭa, ākali dappikalanu tolagiṃcuṭaku svāṃtryamu lēkapōvuṭacēta duḥkhamu, bāla grahamulacē duḥkhamu, ī vidhamugā bālyamuna duḥkhamu kalugucunnadi. yauvanamaṃdu duḥkhamu, krōdhamucēta, lōbhamucētanu duḥkhamu, vyasanamucē duḥkhamu, parābhavamucē duḥkhamu, rājabhōgyādulacē duḥkhamu, udvēgamucē duḥkhamu, dāridryamucē duḥkhamu, vārthakyamucē duḥkhamu, iṣṭabaṃdhujanaviyōgamucē duḥkhamu; vismaraṇaśīluḍaguṭacēta duḥkhamu; iṃdriyamula pāṭavamaṇuguṭacēta duḥkhamu; rōgamucē duḥkhamu.; avasānasamayamuna duḥkhamu - kāvuna saṃsāramē duḥkhabhūyiṣṭamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.