(సమస్తమైన ఔషధములు నిర్మించువాడైనను, సమస్తమైన రోగములను కుదుర్చుటయందు ఎంత నేర్పరి అయినను అట్టివానికి కూడ దుఃఖము అనునది లేకుండపోదు. ఒకానొకనికి కొన్ని కొన్ని రోగములవలన కలుగుదుఃఖము ఔషధము మొదలగు ఉపాయములచేత శమించును, కొందఱికి అట్లుశమించదు. అందుచేత అందఱికి ఔషధములు మొదలగు ఉపాయములచేత రోగములవలన కలుగు దుఃఖము నివారింపబడును అను నియమము లేదు. ఎవరికైనను ఔషధములు మొదలగు ఉపాయములచేత రోగమువలనకలిగిన దుఃఖము నివారింపబడినను, కొంతకాలమైన తర్వాత మరల వచ్చుటకు అవకాశమున్నది. అందుచేత ఔషధములచేత దుఃఖము పూర్తిగా నివారణముకాదు - ఆ రోగము మరల మరల కలుగుచునే యుండును.కనుక ఔషధములచేతనైనను దుఃఖము పూర్తిగా శమింపజాలదు, సమస్తమైన దుఃఖములకు కారణమైన దానిని నిర్మూలించిన సమస్తమైన దుఃఖములు నివారింపబడును. అజ్ఞానము వలన కలుగు ఈ ప్రపంచము పరబ్రహ్మ కన్న వేఱు అని తలచుటయే దుఃఖమునకు మూలకారణము. అజ్ఞానము వలన కలుగు ప్రపంచమును, దానిలోని సమస్త వస్తువులను - ఒక్కొక్కదానిని గుఱించి ” ఇది కాది, ఇది కాదు” అని శ్రుతిలో చేప్పబడిన ప్రకారము త్రోసివేసి తన స్వస్వరూపమైన పరబ్రహ్మమే సకల దుఃఖములకు నివృత్తి సాధనమని తెలియవలెను).
(దుఃఖమునకు కారణము దేహము ఉపాదానమగుటయే - దేహమునకు కారణము పూర్వజన్మలలో చేసిన పాపపుణ్యములు. ఇది పరంపరగా జరుగుచునే యుండును. కనుక దుఃఖమునకు నివృత్తి లేదు).
(samastamaina auṣadhamulu nirmiṃcuvāḍainanu, samastamaina rōgamulanu kudurcuṭayaṃdu eṃta nērpari ayinanu aṭṭivāniki kūḍa duḥkhamu anunadi lēkuṃḍapōdu. okānokaniki konni konni rōgamulavalana kaluguduḥkhamu auṣadhamu modalagu upāyamulacēta śamiṃcunu, koṃdaṟiki aṭluśamiṃcadu. aṃducēta aṃdaṟiki auṣadhamulu modalagu upāyamulacēta rōgamulavalana kalugu duḥkhamu nivāriṃpabaḍunu anu niyamamu lēdu. evarikainanu auṣadhamulu modalagu upāyamulacēta rōgamuvalanakaligina duḥkhamu nivāriṃpabaḍinanu, koṃtakālamaina tarvāta marala vaccuṭaku avakāśamunnadi. aṃducēta auṣadhamulacēta duḥkhamu pūrtigā nivāraṇamukādu - ā rōgamu marala marala kalugucunē yuṃḍunu.kanuka auṣadhamulacētanainanu duḥkhamu pūrtigā śamiṃpajāladu, samastamaina duḥkhamulaku kāraṇamaina dānini nirmūliṃcina samastamaina duḥkhamulu nivāriṃpabaḍunu. ajñānamu valana kalugu ī prapaṃcamu parabrahma kanna vēṟu ani talacuṭayē duḥkhamunaku mūlakāraṇamu. ajñānamu valana kalugu prapaṃcamunu, dānilōni samasta vastuvulanu - okkokkadānini guṟiṃci ” idi kādi, idi kādu” ani śrutilō cēppabaḍina prakāramu trōsivēsi tana svasvarūpamaina parabrahmamē sakala duḥkhamulaku nivṛtti sādhanamani teliyavalenu).
(duḥkhamunaku kāraṇamu dēhamu upādānamaguṭayē - dēhamunaku kāraṇamu pūrvajanmalalō cēsina pāpapuṇyamulu. idi paraṃparagā jarugucunē yuṃḍunu. kanuka duḥkhamunaku nivṛtti lēdu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.