(బ్రాహ్మణులుమొదలగువారు చేయు ఆచారము శూద్రులుమొదలగువారికి విధించబడిన ధర్మముకాదు. ఈ ప్రకారముగానే శూద్రులు మొదలగువారి ఆచారము బ్రాహ్మణులు చేయకూడనిది, కల్లు త్రాగుట, మాంసభక్షణము, బ్రాహ్మణులు చేయకూడనిపని. శూద్రులకు ఇది నిషేదింప బడలేదు. శూద్రునకునిషేధించిన కపిలాక్షరము మొదలగునవి బ్రాహ్మణులకు ప్రశస్తములని చెప్పబడినవి. స్వజాతికి నియమించినవికాక ఇతరములు దురాచారము, దోషము అని చెప్పబడినది. శాస్త్రములో చెప్పబడిన వాటిని ఆచరింపకపోవుట, నిషేధింపబడిన వాటిని ఆచరించుట దురాచారమని చెప్పబడినది).
సాధురేవ సమంతవ్యః సమ్యగ్వ్యవస్తితో హి సః |
క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాం తా నిగచ్ఛతి |
కౌంతేయ! ప్రతిజానీహ నమే భక్తః ప్రణశ్యతి ||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 30,31)
(అనన్యభక్తితో నన్ను - భగవంతుని - సేవించువాడు, ఎంత దురాచారము చేయువాడైనను, నాయందే ధ్యానముకలిగి యున్నవాడగుటచేత, సాధువే - అట్టివాడు ధర్మాత్ముడై వేగముగా శాశ్వతమైన శాంతిని - మోక్షమును - పొందును. నా భక్తుడైనవాడెవడు నాశము పొందడు).
(ఆచారము - సదాచారము - లేనివానిని దేవతులుకూడ పవిత్రుడుగా చేయలేరు).
(brāhmaṇulumodalaguvāru cēyu ācāramu śūdrulumodalaguvāriki vidhiṃcabaḍina dharmamukādu. ī prakāramugānē śūdrulu modalaguvāri ācāramu brāhmaṇulu cēyakūḍanidi, kallu trāguṭa, māṃsabhakṣaṇamu, brāhmaṇulu cēyakūḍanipani. śūdrulaku idi niṣēdiṃpa baḍalēdu. śūdrunakuniṣēdhiṃcina kapilākṣaramu modalagunavi brāhmaṇulaku praśastamulani ceppabaḍinavi. svajātiki niyamiṃcinavikāka itaramulu durācāramu, dōṣamu ani ceppabaḍinadi. śāstramulō ceppabaḍina vāṭini ācariṃpakapōvuṭa, niṣēdhiṃpabaḍina vāṭini ācariṃcuṭa durācāramani ceppabaḍinadi).
sādhurēva samaṃtavyaḥ samyagvyavastitō hi saḥ |
kṣipraṃ bhavati dharmātmā śaśvacchāṃ tā nigacchati |
kauṃtēya! pratijānīha namē bhaktaḥ praṇaśyati ||“. (śrīmadbhagavadgīta - 9 - 30,31)
(ananyabhaktitō nannu - bhagavaṃtuni - sēviṃcuvāḍu, eṃta durācāramu cēyuvāḍainanu, nāyaṃdē dhyānamukaligi yunnavāḍaguṭacēta, sādhuvē - aṭṭivāḍu dharmātmuḍai vēgamugā śāśvatamaina śāṃtini - mōkṣamunu - poṃdunu. nā bhaktuḍainavāḍevaḍu nāśamu poṃdaḍu).
(ācāramu - sadācāramu - lēnivānini dēvatulukūḍa pavitruḍugā cēyalēru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.