“ఈశ్వరోహం అహంభోగీ, నిర్ధోహం బలవాన్ సుఖీ |
ఆఢ్యో అభిజనవాన్ అస్మి కో అన్యోస్తి సదృశోమయా ||
ఇతాది ప్రలాపహేతుః దుర్మదః, మదిరాదిమత్తస్య ఇపమదిః తేన అంథాన్ ఉత్తమాధమ మధ్యమ పురుష తారతమ్య వివేక విధురతయా అంధ ప్రాయాన్“.
(నేనే ఈశ్వరుడను, భోగిని, బలవంతుడను, సౌఖ్యముగలవాడను, నాసాటివారు లేరు. నేనే గొప్ప కులములో పుట్టినవాడను. ఈ విధముగా పెద్దగా మాటలాడుటకు కారణమైనది దుర్మదము - కల్లు త్రాగి మదించినవాని మత్తు వంటిది. అట్లు మదము వలన కండ్లు కనబడనివాడు - వీడు ఉత్తముడు, వీడు అధముడు, వీడు మధ్యముడు అను తారతమ్యము లేకపోవుటచేత అంధులు అయినవారు).
“īśvarōhaṃ ahaṃbhōgī, nirdhōhaṃ balavān sukhī |
āḍhyō abhijanavān asmi kō anyōsti sadṛśōmayā ||
itādi pralāpahētuḥ durmadaḥ, madirādimattasya ipamadiḥ tēna aṃthān uttamādhama madhyama puruṣa tāratamya vivēka vidhuratayā aṃdha prāyān”.
(nēnē īśvaruḍanu, bhōgini, balavaṃtuḍanu, saukhyamugalavāḍanu, nāsāṭivāru lēru. nēnē goppa kulamulō puṭṭinavāḍanu. ī vidhamugā peddagā māṭalāḍuṭaku kāraṇamainadi durmadamu - kallu trāgi madiṃcinavāni mattu vaṃṭidi. aṭlu madamu valana kaṃḍlu kanabaḍanivāḍu - vīḍu uttamuḍu, vīḍu adhamuḍu, vīḍu madhyamuḍu anu tāratamyamu lēkapōvuṭacēta aṃdhulu ayinavāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.