“ఆశ్చర్య వ త్పశ్యతి కశ్చిదేన మాశ్చర్యా వద్య దతి తదైవచాన్యః |
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శృత్వా ప్యేనం వేద న చైవ కశ్చిత్ ||” (శ్రీమద్భవద్గీత - 2 - 29)
(ఆత్మ తత్వము తెలియనివారు కొందఱు దానిని ఆశ్చర్యముగా చూచెదరు - దీని సంగతి ఏమియు తెలియదేమిటియని ఆశ్చర్య పడుదురు - మఱికొందఱు దానిని గుఱించి ఆశ్చర్యముగా పలుకుదురు, ఇంకను కొందఱు ఆశ్చర్యముతో విందురు - కాని ఎవరును దీనిని గుఱించి యధార్ధముగా తెలుసుకొనలేరు).
(నిత్యానిత్యములగు అనేక విరుద్ధ ధర్మములు గల ఉపాధితో కలిసి యుండుటచేత చింతామణివలె ప్రకాశించుచున్నది. అందుచేత బాగుగా దీనిని గుఱించి తెలుసుకొనుట కష్టము. అనేక రూపములుగల మణి అనేకరూపములుగా ప్రకాశించుచున్నట్లు అనేక విధములైన ఉపాధితో కలిసియుండుటవలన, స్వతః నానారూపములుగలవాడు కాకపోయినను, చింతామణి యే యే రూపములతో నున్నదనుకొనినను ఆయా రూపములతో నున్నట్లు, నిత్యా నిత్యాములు, విరుద్ధములైన అనేక ధర్మములు గల ఉపాధులవలన ఆత్మ కూడా అనేక విరుద్ధధర్మములుగలదిగా ప్రకాశించును - యదార్ధముగా కాదు. అందుచేత ఆత్మ యనిన నేమిటో, యెట్లుండునో తెలుసుకొనుటకష్టము - కనుక దుర్విజ్ఞేయము అని చెప్పబడినది).
న బహునాశ్రుతేన కేవలేన. నిష్కామశ్చ ఆత్మానమేవ ప్రార్థయతే, ఆత్మ నైవ ఆత్మాలభ్యతే, ఉపాసకస్య ఆత్మా పరమాత్మ స్వరూపం ప్రకాశయతి.”
(ఈ ఆత్మ అనేక వేదవాక్యములను వ్యాఖ్యానములతో చదివినను, గ్రంధములను చదివి, వాటి యర్ధమును తెలిసికొని యుండుటవలనగాని, శ్రవణమువలనగాని తెలియబడదు. నిష్కాముడగు ఉపాసకునకు ఆత్మచేతనే (మనస్సుచేతనే) ఆత్మ లభ్యమగును - తన ఆత్మయే పరమాత్మ స్వరూపమని తెలుసుకొనుటవలన లభ్యమగును - ” ఆత్మానమాత్మనా వేత్సి” (కుమారసంభవము)
(ఆత్మ మిక్కిలి చిన్నదగుటచేత చాలా కష్టము పడిన తెలియబడును).
ఏవం ప్రకృతమాత్మానం మాశ్చర్యేణాద్భుతేనహి |
తుల్యం మాయా విపర్యాస కల్పనాధార మక్షతం |
శాస్త్రాచార్యోపదేశాభ్యాం సర్వ ద్వైత నిషేధతః |
వేదాంత వాక్య జన్యాయాం ధీవృత్తా ప్రతిబింబితం |
సమాధి పరిపాకేన కశ్చిచ్ఛాం త్యాది సం యుతః |
పశ్యత్యేనం, ననత్యోపి దౌర్లభ్యం తత్వ దర్శినః |
- - - యత్సర్వరూపా న్మృషాభూతం సత్యస్య వ్యంజకం విభోః |
యః పశ్యతి న ఆశ్చర్య వన్నిరీక్ష్యో ముము క్షుభిః |
యతో(అ)సౌ తత్వ విద్బ్రహ్మ భూతో ప్యజ్ఞ వదేవచ |
సదాచారే ప్రవృత్తస్సన్దేహ వానివ లక్ష్యతే |
తద్వచ్ఛ తద్ జ్ఞానమేత దాశ్చర్యవత్రయం దుర్విజ్ఞేయ మతోహేనం జానీయాః కథమంజసా |
తధోప దేష్టృ దౌర్లభ్యాద్దు ర్విజ్ఞేయ ఇతోప్యసౌ ||”
(మాయావికల్పనకు ఆధారభూతమైన ఈ ఆత్మను శాస్త్రోపదేశము వలననూ, గురూపదేశమువలనను, ద్వైతాభిప్రాయమును నిషేధించుట వలననూ, ఉపనిషద్వాక్యములద్వారాను కలిగిన మనస్సునందు ప్రతిబింబించిన దానినిగా సమాధి పరిపక్వమునొందినపుడు శాంతి మొదలగునవి కలిగినవాడు చూడగలుగును. అట్టివానికి ఈ ఆత్మ ఆశ్చర్యకరముగా కనబడును. అందరూ ఈ రీతిగా చూడలేరు. ఆత్మ తత్వమును చూడగలిగినవారు అరుదు - ముముక్షువులు ఇట్టివానిని ఆశ్చర్యముగా చూచెదరు - ఎందుచేతననగా ఈ ఆత్మ తత్వదర్శి బ్రహ్మ భూతుడైనను అజ్ఞానివలెనే దేహదారివలెకనుపించును - అందుచేత ఆత్మ, ఆత్మవిదుడు, ఆత్మజ్ఞానము అను ఈ మూడున్నూ దుర్విజ్ఞేయములే - తెలుసుకొనుటకు అతికష్టమైనవే. ఆత్మతత్వమును తెలిసినవాడున్నను దానినిఉపదేశించువాడు దొరుకుట కష్టము. ఎందుచేతననగా -” య ఆత్మానం విజానాతి స బ్రూయాన్నేతరోజనః” (గీతాభావప్రకాశము - 2 - 344, 345)
(ఆత్మను తెలుసుకొనినవాడే ఆత్మ తత్వమును చెప్పగలడు, ఇతరుడు చెప్పలేడు).
(పైన చెప్పిన ప్రకారము ఆత్మ దుర్విజ్ఞేయమైనను ఉపాయముచేత బాగుగా తెలుసుకొనుటకు వీలయినదే).
(తన ఆత్మయే పరమాత్మ స్వరూపమని తెలుసుకొనుటవలన ఆత్మలభ్యమగును).
“āścarya va tpaśyati kaścidēna māścaryā vadya dati tadaivacānyaḥ |
āścaryavaccainamanyaḥ śṛṇōti śṛtvā pyēnaṃ vēda na caiva kaścit ||” (śrīmadbhavadgīta - 2 - 29)
(ātma tatvamu teliyanivāru koṃdaṟu dānini āścaryamugā cūcedaru - dīni saṃgati ēmiyu teliyadēmiṭiyani āścarya paḍuduru - maṟikoṃdaṟu dānini guṟiṃci āścaryamugā palukuduru, iṃkanu koṃdaṟu āścaryamutō viṃduru - kāni evarunu dīnini guṟiṃci yadhārdhamugā telusukonalēru).
(nityānityamulagu anēka viruddha dharmamulu gala upādhitō kalisi yuṃḍuṭacēta ciṃtāmaṇivale prakāśiṃcucunnadi. aṃducēta bāgugā dīnini guṟiṃci telusukonuṭa kaṣṭamu. anēka rūpamulugala maṇi anēkarūpamulugā prakāśiṃcucunnaṭlu anēka vidhamulaina upādhitō kalisiyuṃḍuṭavalana, svataḥ nānārūpamulugalavāḍu kākapōyinanu, ciṃtāmaṇi yē yē rūpamulatō nunnadanukoninanu āyā rūpamulatō nunnaṭlu, nityā nityāmulu, viruddhamulaina anēka dharmamulu gala upādhulavalana ātma kūḍā anēka viruddhadharmamulugaladigā prakāśiṃcunu - yadārdhamugā kādu. aṃducēta ātma yanina nēmiṭō, yeṭluṃḍunō telusukonuṭakaṣṭamu - kanuka durvijñēyamu ani ceppabaḍinadi).
na bahunāśrutēna kēvalēna. niṣkāmaśca ātmānamēva prārthayatē, ātma naiva ātmālabhyatē, upāsakasya ātmā paramātma svarūpaṃ prakāśayati.”
(ī ātma anēka vēdavākyamulanu vyākhyānamulatō cadivinanu, graṃdhamulanu cadivi, vāṭi yardhamunu telisikoni yuṃḍuṭavalanagāni, śravaṇamuvalanagāni teliyabaḍadu. niṣkāmuḍagu upāsakunaku ātmacētanē (manassucētanē) ātma labhyamagunu - tana ātmayē paramātma svarūpamani telusukonuṭavalana labhyamagunu - ” ātmānamātmanā vētsi” (kumārasaṃbhavamu)
(ātma mikkili cinnadaguṭacēta cālā kaṣṭamu paḍina teliyabaḍunu).
ēvaṃ prakṛtamātmānaṃ māścaryēṇādbhutēnahi |
tulyaṃ māyā viparyāsa kalpanādhāra makṣataṃ |
śāstrācāryōpadēśābhyāṃ sarva dvaita niṣēdhataḥ |
vēdāṃta vākya janyāyāṃ dhīvṛttā pratibiṃbitaṃ |
samādhi paripākēna kaścicchāṃ tyādi saṃ yutaḥ |
paśyatyēnaṃ, nanatyōpi daurlabhyaṃ tatva darśinaḥ |
- - - yatsarvarūpā nmṛṣābhūtaṃ satyasya vyaṃjakaṃ vibhōḥ |
yaḥ paśyati na āścarya vannirīkṣyō mumu kṣubhiḥ |
yatō(a)sau tatva vidbrahma bhūtō pyajña vadēvaca |
sadācārē pravṛttassandēha vāniva lakṣyatē |
tadvaccha tad jñānamēta dāścaryavatrayaṃ durvijñēya matōhēnaṃ jānīyāḥ kathamaṃjasā |
tadhōpa dēṣṭṛ daurlabhyāddu rvijñēya itōpyasau ||”
(māyāvikalpanaku ādhārabhūtamaina ī ātmanu śāstrōpadēśamu valananū, gurūpadēśamuvalananu, dvaitābhiprāyamunu niṣēdhiṃcuṭa valananū, upaniṣadvākyamuladvārānu kaligina manassunaṃdu pratibiṃbiṃcina dāninigā samādhi paripakvamunoṃdinapuḍu śāṃti modalagunavi kaliginavāḍu cūḍagalugunu. aṭṭivāniki ī ātma āścaryakaramugā kanabaḍunu. aṃdarū ī rītigā cūḍalēru. ātma tatvamunu cūḍagaliginavāru arudu - mumukṣuvulu iṭṭivānini āścaryamugā cūcedaru - eṃducētananagā ī ātma tatvadarśi brahma bhūtuḍainanu ajñānivalenē dēhadārivalekanupiṃcunu - aṃducēta ātma, ātmaviduḍu, ātmajñānamu anu ī mūḍunnū durvijñēyamulē - telusukonuṭaku atikaṣṭamainavē. ātmatatvamunu telisinavāḍunnanu dāniniupadēśiṃcuvāḍu dorukuṭa kaṣṭamu. eṃducētananagā -” ya ātmānaṃ vijānāti sa brūyānnētarōjanaḥ” (gītābhāvaprakāśamu - 2 - 344, 345)
(ātmanu telusukoninavāḍē ātma tatvamunu ceppagalaḍu, itaruḍu ceppalēḍu).
(paina ceppina prakāramu ātma durvijñēyamainanu upāyamucēta bāgugā telusukonuṭaku vīlayinadē).
(tana ātmayē paramātma svarūpamani telusukonuṭavalana ātmalabhyamagunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.