← Back to ద · Booklets 21–30 (digitized file 3)

దుస్సంగః dussaṃgaḥ

Original — తెలుగు
  1. దుష్టుల సహవాసము.

  2. “చ. సమమతినొప్పు సత్పురుషుల సఖ్యము సద్గతికారణంబు నీ

చమతి విలోల దుష్పురుష సఖ్యము దుర్గతి హేతువంచు చి

త్తమునదలంచి, యోగి జనతానుత|మిమ్ము భజింతు; - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 23)

  1. “దుస్సంగః సర్వదైవత్యాజ్యః, కామక్రోధమోహ స్మృతిభ్రంశంబు బుద్ధినాశ సర్వనాశ కారణాత్వేత్|”. (నారద భక్తిసూత్రములు - 43 - 44)

(దుష్టుల సహవాసము ఎప్పుదునూ విడిచిపెట్టవలసినదే ఎందుచేతననగా అది కామమునకు, క్రోధమునకు, స్మృతి భ్రంశమునకు, బుద్ధినాశమునకు, సర్వనాశమునకు కారణమైనది).

  1. “దుస్సంగేన విషయవార్తా యాం, జగచ్చర్చా యాం, లోకనిందాయాం, భోగప్రీతౌ, దురాచారే, ఉచ్ఛృంకలతా యాం, దుషాభ్యాసే,మానే, దంభే, దర్పే, క్రోధే, అసహిష్ణు తా యాం, అపవిత్రతా యాం, నిర్దయతా యాం హింసాయం మనత్యే, ఇంద్రియ లంపట తా యాం, అభిమానే అశాంత్యాదే చ ప్రవృత్తో భూత్వా మనుష్యః పాపపరాయణో, అత్యంత విషయాసక్తశ్చ భవతి. దుస్సంగేనాసుర సంపదః సర్వేషాం దుర్గుణానాం దురాచారాణాం చ వికారో విస్తారశ్చ భవతః - కైకేయీ మందరా యోః దుస్సంగేన యథా; శుకునోః దుస్సగతిరేవ మహాభారతే భీషణసంహారే ముఖ్యకారణమ భూత్”

“దుష్టసంగశబ్దేన కేవలానాం దురాచారాణాం మనుష్యాణామేవ సంగోన బోద్ధవ్యః ఇంద్రియాణాం కోపి విషయా యో అస్మాకం మనసి అసద్విచారం విషయలాలసాం చ ఉత్పాదయేత్ తథా భగవద్బక్తి మార్గాత్ చిత్తం విచాలయేత్. దుస్సంగో భవితుం శక్నోతి. అస్మాభిః నకించిదపి ఈదృశం చేతనం జడం వా వస్తు ద్రష్టవ్యం, నేదృశ వార్తా శ్రోతవ్యా, నేదృశచర్యా కర్తవ్యా; నైతాదృశేస్థానే గంతవ్యం, న తాదృశం పుస్తకం, పత్రికావా పఠనీయా, నతాదృశం చిత్రం ద్రష్టవ్యం, నతాదృశం వస్తు భోక్తవ్యం, ఘ్రాతవ్యం, స్ప్రష్టవ్యం, నాపిచ తాదృశో విచార ఏవ కర్తవ్యో, యేనాస్మాకం చిత్తే విషయ చింతనస్య ప్రాబల్యం భవేత్.”

” యదీమాని రాజసాని తామసాని వాసం తి తర్హ్యేషాం సేవనం దుస్సం గోస్తి, తేనచ అజ్ఞానస్య వృద్ధే రూర్థ్వం ప్రాయః సర్వేషాం దోషాణాం వికాసో భవతి. అత ఏవ దుస్సంగస్య సర్వాత్మనా సర్వథా త్యాగః కర్తవ్యః - యతః నదుస్సంగః కామ క్రోధ మోహ, స్మృతిభ్రంశ, బుద్ధినాశ సర్వ నాశానాం కారణమస్తి.”

(దుస్సంగమువలన విషయములగుఱించి అయిన వార్తలందు, ఈ జగత్తు ఎట్లు పుట్టినది యను విషయము గుఱించిచర్చించిట యందును, లోకులను నిందించుటయందును, భోగములయెడల ప్రీతి కలిగి యుండుటయందును, చెడ్డప్రవర్తనయందును, చెడ్డలవాటులందును, అభిమానమందును, దంభమందును, దర్పమందును, క్రోధమందును, సహింపు లేకుండుటయందును, అపవిత్రతయందును, దయలేకుండుటయందును, హింసచేయుటయందును, అసత్యమందును, ఇంద్రియ భోగములందు తగిలియుండుటయందును, అశాంతి మొదలగు వాటియందును ప్రవృత్తిగలిగినవాడై, మనుజుడు పాపములను చేయుటయందే ఆసక్తికలవాడై (అదియే పరమపురుషార్ధము అనునట్లుగా) విషయములందు మిక్కిలి ఆసక్తి గలవాడగును).

(దుస్సంగమనగా కేవలము దురాచారులతో - దుర్మార్గులతో సహవాసమనియే యర్థముకాదు. మన మనసులో ఇంద్రియములకు విషయములైన వాటినిగుఱించి చెడ్డ ఆలోచనకలుగచేయునో, మఱియు, భగవంతునిపొందుమార్గమునుండి - మోక్షమార్గమునుండి - మనస్సును మరలించునదియే దుస్సంగము. విషయముల గుఱించి ఆలోచన చేయుట, మఱింత మఱింత వృద్ధి యగునట్టి పనులేవియు చేయరాదు.- ఎట్లనగా - ఈ కనబడు జడప్రపంచములో ఏ వస్తువైనను, అచేతనముగాని, చేతనముగాని, మనము విషయవాంచతో చూడకూడదు, వినకూడనివార్త వినకూడదు - విషయవాంచలను రెచ్చి కొనువార్తలను వినకూడదు, అటువంటి చర్చ చేయకూడదు, అటువంటి స్థలమునకు పోగూడదు, అటువంటి పుస్తకముగాని, పత్రికగాని చదవకూడదు, అటువంటి చిత్రమును - వ్రాసిన బొమ్మనుగాని, చలనచిత్రమునుగాని చూడకూడదు. అటువంటి వస్తువును అనుభవింపరాదు, ముట్టుకొనరాదు, వాసనయైన చూడరాదు, అటువంటి అలోచననైన చేయరాదు. రజోగుణమునకు, తమోగుణమునకు సంబంధించినవి యున్నయెడల అవి దుస్సంగమే యగును- దానివలన అజ్ఞానము వృద్ధిపొందుటవలన సమస్త దోషములు చెలరేగును. ఇందుచేత దుస్సంగము అన్నివిధముల, ఎల్లపుడు వదలివేయవలసినదే - అది కామ, క్రోధ, మోహ న్మృతిభ్రంశ బుద్ధినాశ సర్వ నాశములకు కారణమగుటచేత).

Transliteration
  1. duṣṭula sahavāsamu.

  2. “ca. samamatinoppu satpuruṣula sakhyamu sadgatikāraṇaṃbu nī

camati vilōla duṣpuruṣa sakhyamu durgati hētuvaṃcu ci

ttamunadalaṃci, yōgi janatānuta|mimmu bhajiṃtu; - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 23)

  1. “dussaṃgaḥ sarvadaivatyājyaḥ, kāmakrōdhamōha smṛtibhraṃśaṃbu buddhināśa sarvanāśa kāraṇātvēt|”. (nārada bhaktisūtramulu - 43 - 44)

(duṣṭula sahavāsamu eppudunū viḍicipeṭṭavalasinadē eṃducētananagā adi kāmamunaku, krōdhamunaku, smṛti bhraṃśamunaku, buddhināśamunaku, sarvanāśamunaku kāraṇamainadi).

  1. “dussaṃgēna viṣayavārtā yāṃ, jagaccarcā yāṃ, lōkaniṃdāyāṃ, bhōgaprītau, durācārē, ucchṛṃkalatā yāṃ, duṣābhyāsē,mānē, daṃbhē, darpē, krōdhē, asahiṣṇu tā yāṃ, apavitratā yāṃ, nirdayatā yāṃ hiṃsāyaṃ manatyē, iṃdriya laṃpaṭa tā yāṃ, abhimānē aśāṃtyādē ca pravṛttō bhūtvā manuṣyaḥ pāpaparāyaṇō, atyaṃta viṣayāsaktaśca bhavati. dussaṃgēnāsura saṃpadaḥ sarvēṣāṃ durguṇānāṃ durācārāṇāṃ ca vikārō vistāraśca bhavataḥ - kaikēyī maṃdarā yōḥ dussaṃgēna yathā; śukunōḥ dussagatirēva mahābhāratē bhīṣaṇasaṃhārē mukhyakāraṇama bhūt”

“duṣṭasaṃgaśabdēna kēvalānāṃ durācārāṇāṃ manuṣyāṇāmēva saṃgōna bōddhavyaḥ iṃdriyāṇāṃ kōpi viṣayā yō asmākaṃ manasi asadvicāraṃ viṣayalālasāṃ ca utpādayēt tathā bhagavadbakti mārgāt cittaṃ vicālayēt. dussaṃgō bhavituṃ śaknōti. asmābhiḥ nakiṃcidapi īdṛśaṃ cētanaṃ jaḍaṃ vā vastu draṣṭavyaṃ, nēdṛśa vārtā śrōtavyā, nēdṛśacaryā kartavyā; naitādṛśēsthānē gaṃtavyaṃ, na tādṛśaṃ pustakaṃ, patrikāvā paṭhanīyā, natādṛśaṃ citraṃ draṣṭavyaṃ, natādṛśaṃ vastu bhōktavyaṃ, ghrātavyaṃ, spraṣṭavyaṃ, nāpica tādṛśō vicāra ēva kartavyō, yēnāsmākaṃ cittē viṣaya ciṃtanasya prābalyaṃ bhavēt.”

” yadīmāni rājasāni tāmasāni vāsaṃ ti tarhyēṣāṃ sēvanaṃ dussaṃ gōsti, tēnaca ajñānasya vṛddhē rūrthvaṃ prāyaḥ sarvēṣāṃ dōṣāṇāṃ vikāsō bhavati. ata ēva dussaṃgasya sarvātmanā sarvathā tyāgaḥ kartavyaḥ - yataḥ nadussaṃgaḥ kāma krōdha mōha, smṛtibhraṃśa, buddhināśa sarva nāśānāṃ kāraṇamasti.”

(dussaṃgamuvalana viṣayamulaguṟiṃci ayina vārtalaṃdu, ī jagattu eṭlu puṭṭinadi yanu viṣayamu guṟiṃcicarciṃciṭa yaṃdunu, lōkulanu niṃdiṃcuṭayaṃdunu, bhōgamulayeḍala prīti kaligi yuṃḍuṭayaṃdunu, ceḍḍapravartanayaṃdunu, ceḍḍalavāṭulaṃdunu, abhimānamaṃdunu, daṃbhamaṃdunu, darpamaṃdunu, krōdhamaṃdunu, sahiṃpu lēkuṃḍuṭayaṃdunu, apavitratayaṃdunu, dayalēkuṃḍuṭayaṃdunu, hiṃsacēyuṭayaṃdunu, asatyamaṃdunu, iṃdriya bhōgamulaṃdu tagiliyuṃḍuṭayaṃdunu, aśāṃti modalagu vāṭiyaṃdunu pravṛttigaliginavāḍai, manujuḍu pāpamulanu cēyuṭayaṃdē āsaktikalavāḍai (adiyē paramapuruṣārdhamu anunaṭlugā) viṣayamulaṃdu mikkili āsakti galavāḍagunu).

(dussaṃgamanagā kēvalamu durācārulatō - durmārgulatō sahavāsamaniyē yarthamukādu. mana manasulō iṃdriyamulaku viṣayamulaina vāṭiniguṟiṃci ceḍḍa ālōcanakalugacēyunō, maṟiyu, bhagavaṃtunipoṃdumārgamunuṃḍi - mōkṣamārgamunuṃḍi - manassunu maraliṃcunadiyē dussaṃgamu. viṣayamula guṟiṃci ālōcana cēyuṭa, maṟiṃta maṟiṃta vṛddhi yagunaṭṭi panulēviyu cēyarādu.- eṭlanagā - ī kanabaḍu jaḍaprapaṃcamulō ē vastuvainanu, acētanamugāni, cētanamugāni, manamu viṣayavāṃcatō cūḍakūḍadu, vinakūḍanivārta vinakūḍadu - viṣayavāṃcalanu recci konuvārtalanu vinakūḍadu, aṭuvaṃṭi carca cēyakūḍadu, aṭuvaṃṭi sthalamunaku pōgūḍadu, aṭuvaṃṭi pustakamugāni, patrikagāni cadavakūḍadu, aṭuvaṃṭi citramunu - vrāsina bommanugāni, calanacitramunugāni cūḍakūḍadu. aṭuvaṃṭi vastuvunu anubhaviṃparādu, muṭṭukonarādu, vāsanayaina cūḍarādu, aṭuvaṃṭi alōcananaina cēyarādu. rajōguṇamunaku, tamōguṇamunaku saṃbaṃdhiṃcinavi yunnayeḍala avi dussaṃgamē yagunu- dānivalana ajñānamu vṛddhipoṃduṭavalana samasta dōṣamulu celarēgunu. iṃducēta dussaṃgamu annividhamula, ellapuḍu vadalivēyavalasinadē - adi kāma, krōdha, mōha nmṛtibhraṃśa buddhināśa sarva nāśamulaku kāraṇamaguṭacēta).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.