(రెండు వస్తువులు అనుట ‘ద్వితా’, ద్వితాయే ద్వైతము- అట్లుకానిది అద్వైతము).
ద్విథా ఇతం ద్వైతం తస్య భావః ద్వైతం. (రెండు విధములు అనుట ద్వితం. అట్లుండుట ద్వైతము).
ప్రపంచాఖ్యం ద్వైతం మాయా మాత్రం.
(ప్రపంచమను పేరుతో రెండవవస్తువు (బ్రహ్మకాక మఱియొక వస్తువు) అని చెప్పబడినది మాయామాత్రము - మాయయే - మాయవలన అట్లు రెండవ వస్తువుగా చెప్పబడినది).
మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థ తః ||“. (మాండూక్యోపనిషత్ - గౌడపాదకారికా)
(ప్రపంచమనునది ఒకటి ఉన్నట్లయితే అది నశించిపోవును -ఇందుకు సంశయములేదు. ఎందుచేతననగా ఈ ప్రపంచమంతయు బ్రహ్మకన్న వేరే వస్తువుగా కనబడుట మాయవలన. మాయ ఒకమారుండి ఒకమాటులేకపోవును, నిజముగ లేకున్నను ఉన్నట్లు తోపించును. అందుచేత ఉన్నదంతయు ఒకే ఒక పరమాత్మ - ఇదియే యదార్థము - పరమార్థ ధృష్టిలో ఉన్నదంతా పరబ్రహ్మమే, అన్నిరూపములు, అన్నివస్తువులు పరబ్రహ్మమే).
” స్వాజ్ఞాది దృష్ట్యా తాదృశ ప్రపంచో యది స్వాత్మత్వేన, సత్యత్వేన, వ్యావహారికత్వేన ప్రాతిభాసికత్వేన, శూన్యత్వేన వా విద్యతే పరమార్థజ్ఞాన సమకాలం నివర్తేత, న సంశయః”
(తన అజ్ఞానము వలన - తనకు బ్రహ్మజ్ఞానము లేకుండుటవలన - ప్రపంచము తన ఆత్మవలెగాని, నిత్యమైనదానివలెగాని, వ్యవహారమువలనగాని, ప్రాతిభాసికత్వమువలనకాని, - కానిది అయినట్లు, లేనిదిఉన్నట్లు కనబడుటవలన - శూన్యమనిగాని కనిపించుట, పరమార్థజ్ఞానము కలుగగానే - బ్రహ్మజ్ఞానము కలుగగానే, ఉన్నదంతా బ్రహ్మమే మరేదియు లేదు అను జ్ఞానము కలుగగనే - నివర్తించును).
మనసోహ్యమనీ భావే ద్వైతం నోపలభ్యతే ||“. (మాండూక్యోపనిషత్)
(“ఇదం పరిదృశ్యమానం వ్యష్టి సమష్ట్యాత్మకం |
యత్కించిచ్చరా చరాత్మకం విశ్వం ద్వైతం |
మనసా దృశ్యతేకల్ప్యతే ఇతి సర్వం మనోదృశ్య ముచ్యతే ||“).
(మనసులో కల్పితమైనదంతయు మనో దృశ్యము - ఈ చరాచరరూపమంతయు - వ్యష్టి, సముష్టి రూపముతోనున్న ప్రపంచకము మనో దృశ్యము - ఇది కల్పించినది - కనుక ద్వైతము - మనసు అను నీ భావము చెందినపుడు ద్వైతము అనునది లేదు).
ఉపదేశాదయం వాదః జ్ఞాతే ద్వైతం నవిద్యతే ||” (గౌడపాదకారికా -18)
(కల్పింపబడిన వస్తువు నశించును. ద్వైతవాదము - రెండవ వస్తువు ఉన్నదను వాదము. గురూపదేశమువలన జ్ఞానము కలుగగానే ఈ వాదము నశించును).
(సృష్టికి పూర్వము పరమాత్మ ఒక్కడే ఉండెను. అతనిలోనుండియే ప్రపంచమంతయు ఒకదానిలోనుండిఒకటిగా పుట్టినది. పరమాత్మకన్న వేఱైన వస్తువు సృష్టికి ముందు లేదు, ఇప్పటికి లేదు - అందుచేత పరమాత్మగాక - పరమాత్మ కానటువంటి - రెండవ వస్తువు అనునది లేదు. అని శ్రుతి చెప్పుచున్నది - ఇందువలన ఉన్నదంతా ఒకటే - ఆత్మయే - ఆత్మ అద్వితీయము, రెండవ వస్తువు లేనిది - ఈ భావన అద్వైతము - దీనికి విపరీతమైన భావన ద్వైతము - రెండవ వస్తువు ఉన్నదను భావన -).
జీవేశ్వర యోర్భేదః - (జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అను బుద్ధి కలిగియుండుట).
“యత్రహి ద్వైతమివ భవతి తదితరః ఇతరం పశ్యేత్ |
యత్ర త్వస్య సర్వమాత్మైవా భూత్ కేనకం పశ్యేత్||“.
(ఆత్మజ్ఞానము లేనప్పుడు- పరబ్రహ్మ వేఱు, జీవుడు వేఱు, లేక పరబ్రహ్మ వేఱు ప్రపంచము వేఱు అని తలచినప్పుడు ఒకరు ఇంకొకరిని చూచెదరు - అనగా, అప్పుడు రెండవ వస్తువు ఉండును - ఆత్మజ్ఞానము కలిగినపుడు ఈ సృష్టి అంతయు - దానిలోని వస్తువులన్నియు పరమాత్మయే, ఇంకొక వస్తువు లేదు అను అద్వైతభావము కలిగినపుడు ఎవరిని ఎవరు చూతురు - అంతా ఒక్క పరబ్రహ్మమే కనుక).
వ్యోమ్నః శూన్యత్వమేవమ్హి న వృథగ్ద్వైతమీశ్వరాత్ ||“. (యోగవాశిష్టము)
(జలమునకు ద్రవత్వమును, వాయువునకు చలనము, ఆకాశమునకు శూన్యత్వమును వేఱు కానట్లు ఈశ్వరునికి ద్వైత ప్రపంచము వేరుగాదు).
(reṃḍu vastuvulu anuṭa ‘dvitā’, dvitāyē dvaitamu- aṭlukānidi advaitamu).
dvithā itaṃ dvaitaṃ tasya bhāvaḥ dvaitaṃ. (reṃḍu vidhamulu anuṭa dvitaṃ. aṭluṃḍuṭa dvaitamu).
prapaṃcākhyaṃ dvaitaṃ māyā mātraṃ.
(prapaṃcamanu pērutō reṃḍavavastuvu (brahmakāka maṟiyoka vastuvu) ani ceppabaḍinadi māyāmātramu - māyayē - māyavalana aṭlu reṃḍava vastuvugā ceppabaḍinadi).
māyāmātramidaṃ dvaitaṃ advaitaṃ paramārtha taḥ ||“. (māṃḍūkyōpaniṣat - gauḍapādakārikā)
(prapaṃcamanunadi okaṭi unnaṭlayitē adi naśiṃcipōvunu -iṃduku saṃśayamulēdu. eṃducētananagā ī prapaṃcamaṃtayu brahmakanna vērē vastuvugā kanabaḍuṭa māyavalana. māya okamāruṃḍi okamāṭulēkapōvunu, nijamuga lēkunnanu unnaṭlu tōpiṃcunu. aṃducēta unnadaṃtayu okē oka paramātma - idiyē yadārthamu - paramārtha dhṛṣṭilō unnadaṃtā parabrahmamē, annirūpamulu, annivastuvulu parabrahmamē).
” svājñādi dṛṣṭyā tādṛśa prapaṃcō yadi svātmatvēna, satyatvēna, vyāvahārikatvēna prātibhāsikatvēna, śūnyatvēna vā vidyatē paramārthajñāna samakālaṃ nivartēta, na saṃśayaḥ”
(tana ajñānamu valana - tanaku brahmajñānamu lēkuṃḍuṭavalana - prapaṃcamu tana ātmavalegāni, nityamainadānivalegāni, vyavahāramuvalanagāni, prātibhāsikatvamuvalanakāni, - kānidi ayinaṭlu, lēnidiunnaṭlu kanabaḍuṭavalana - śūnyamanigāni kanipiṃcuṭa, paramārthajñānamu kalugagānē - brahmajñānamu kalugagānē, unnadaṃtā brahmamē marēdiyu lēdu anu jñānamu kalugaganē - nivartiṃcunu).
manasōhyamanī bhāvē dvaitaṃ nōpalabhyatē ||“. (māṃḍūkyōpaniṣat)
(“idaṃ paridṛśyamānaṃ vyaṣṭi samaṣṭyātmakaṃ |
yatkiṃciccarā carātmakaṃ viśvaṃ dvaitaṃ |
manasā dṛśyatēkalpyatē iti sarvaṃ manōdṛśya mucyatē ||“).
(manasulō kalpitamainadaṃtayu manō dṛśyamu - ī carācararūpamaṃtayu - vyaṣṭi, samuṣṭi rūpamutōnunna prapaṃcakamu manō dṛśyamu - idi kalpiṃcinadi - kanuka dvaitamu - manasu anu nī bhāvamu ceṃdinapuḍu dvaitamu anunadi lēdu).
upadēśādayaṃ vādaḥ jñātē dvaitaṃ navidyatē ||” (gauḍapādakārikā -18)
(kalpiṃpabaḍina vastuvu naśiṃcunu. dvaitavādamu - reṃḍava vastuvu unnadanu vādamu. gurūpadēśamuvalana jñānamu kalugagānē ī vādamu naśiṃcunu).
(sṛṣṭiki pūrvamu paramātma okkaḍē uṃḍenu. atanilōnuṃḍiyē prapaṃcamaṃtayu okadānilōnuṃḍiokaṭigā puṭṭinadi. paramātmakanna vēṟaina vastuvu sṛṣṭiki muṃdu lēdu, ippaṭiki lēdu - aṃducēta paramātmagāka - paramātma kānaṭuvaṃṭi - reṃḍava vastuvu anunadi lēdu. ani śruti ceppucunnadi - iṃduvalana unnadaṃtā okaṭē - ātmayē - ātma advitīyamu, reṃḍava vastuvu lēnidi - ī bhāvana advaitamu - dīniki viparītamaina bhāvana dvaitamu - reṃḍava vastuvu unnadanu bhāvana -).
jīvēśvara yōrbhēdaḥ - (jīvuḍu vēru, īśvaruḍu vēru anu buddhi kaligiyuṃḍuṭa).
“yatrahi dvaitamiva bhavati taditaraḥ itaraṃ paśyēt |
yatra tvasya sarvamātmaivā bhūt kēnakaṃ paśyēt||“.
(ātmajñānamu lēnappuḍu- parabrahma vēṟu, jīvuḍu vēṟu, lēka parabrahma vēṟu prapaṃcamu vēṟu ani talacinappuḍu okaru iṃkokarini cūcedaru - anagā, appuḍu reṃḍava vastuvu uṃḍunu - ātmajñānamu kaliginapuḍu ī sṛṣṭi aṃtayu - dānilōni vastuvulanniyu paramātmayē, iṃkoka vastuvu lēdu anu advaitabhāvamu kaliginapuḍu evarini evaru cūturu - aṃtā okka parabrahmamē kanuka).
vyōmnaḥ śūnyatvamēvamhi na vṛthagdvaitamīśvarāt ||“. (yōgavāśiṣṭamu)
(jalamunaku dravatvamunu, vāyuvunaku calanamu, ākāśamunaku śūnyatvamunu vēṟu kānaṭlu īśvaruniki dvaita prapaṃcamu vērugādu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.