- - - యస్యోపనయనం బ్రహ్మన్ స ఏవ ద్విజ ఉచ్యతే|| (దేవీ భాగవతం)
(బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ద్విజులని చెప్పబడుచున్నారు. ఉపనయనము అయినవాడే ద్విజుడని చెప్పబడుచున్నాడు).
(పుట్టుక చేత శూద్రుడు - చేసిన కర్మ వలన - ఉపనయనము మొదలగునవి అయి, చేసిన కర్మవలన ద్విజుడు అని చెప్పబడును. తల్లి కడుపునుండి పుట్టుట ఒక జన్మ - ఉపనయనమగుట రెండవ జన్మ. ఈ రెండు జన్మలుగలవాడు ద్విజుడు).
(జన్మవలన శూద్రుడు - ఉపనయనము మొదలగు సంస్కారములచేత ద్విజుడని చెప్పబడును).
ద్వేజాతీ జన్మనీ యేషాంతే ద్విజాత యః” (మనుః). (రెండు జన్మలు కలవాడు ద్విజుడు).
త్రైవర్ణికాః. (బ్రహ్మణ, క్షత్రియ వైశ్యవర్ణములు అను మూడు వర్ణములకు చెందినవారు ద్విజులు).
ద్వేజాతీ జన్మని గర్భ నిర్గమన సంస్కారాద్యాః యస్య సః ద్విజాతిః.
(తల్లికడుపులోనుండి పుట్టుట అనునది ఒక జన్మ. సంస్కారము అనునది రెండవ జన్మ - ఈ రెండు జన్మలుగలవారు ద్విజులు).
(ఉపనయనమను సంస్కారముద్వారా బ్రహ్మజ్ఞానమునకు అర్హుడై, అజ్ఞానమును విడిచిపెట్టి బ్రహ్మజ్ఞానము గుఱించి చేయు యత్నము రెండవజన్మ).
” సత్కులాచారుండయి మంత్రవంతంబులైన గర్భాదానాది సంస్కారంబుల విచ్ఛిన్నంబులుగలవాడు ద్విజుండు. ద్విజునకు యజన యాజనాధ్యాయ నాధ్యాపన దాన ప్రతిగ్రహంబులను షట్కర్మంబులు విహితంబులు“-. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 11 - 409)
” గావః పశ్యంతి గంధేన దైః పశ్యంతి ద్విజాః |
చారైః పశ్యంతి రాజానశ్చక్షుభ్యాం ఇతరే జననాః ||“.
(గోవుల వాసనవలన మంచి చెడ్డ చూచును, ద్విజులు వేదములవలన చూచెదరు - రాజులు దొంగలను చారులద్వారా కనిపెట్టెదరు - మిగిలిన జనులు - సాధారణులు వాళ్ళ కండ్లతోనే చూచెదరు).
- - - yasyōpanayanaṃ brahman sa ēva dvija ucyatē|| (dēvī bhāgavataṃ)
(brāhmaṇulu, kṣatriyulu, vaiśyulu dvijulani ceppabaḍucunnāru. upanayanamu ayinavāḍē dvijuḍani ceppabaḍucunnāḍu).
(puṭṭuka cēta śūdruḍu - cēsina karma valana - upanayanamu modalagunavi ayi, cēsina karmavalana dvijuḍu ani ceppabaḍunu. talli kaḍupunuṃḍi puṭṭuṭa oka janma - upanayanamaguṭa reṃḍava janma. ī reṃḍu janmalugalavāḍu dvijuḍu).
(janmavalana śūdruḍu - upanayanamu modalagu saṃskāramulacēta dvijuḍani ceppabaḍunu).
dvējātī janmanī yēṣāṃtē dvijāta yaḥ” (manuḥ). (reṃḍu janmalu kalavāḍu dvijuḍu).
traivarṇikāḥ. (brahmaṇa, kṣatriya vaiśyavarṇamulu anu mūḍu varṇamulaku ceṃdinavāru dvijulu).
dvējātī janmani garbha nirgamana saṃskārādyāḥ yasya saḥ dvijātiḥ.
(tallikaḍupulōnuṃḍi puṭṭuṭa anunadi oka janma. saṃskāramu anunadi reṃḍava janma - ī reṃḍu janmalugalavāru dvijulu).
(upanayanamanu saṃskāramudvārā brahmajñānamunaku arhuḍai, ajñānamunu viḍicipeṭṭi brahmajñānamu guṟiṃci cēyu yatnamu reṃḍavajanma).
” satkulācāruṃḍayi maṃtravaṃtaṃbulaina garbhādānādi saṃskāraṃbula vicchinnaṃbulugalavāḍu dvijuṃḍu. dvijunaku yajana yājanādhyāya nādhyāpana dāna pratigrahaṃbulanu ṣaṭkarmaṃbulu vihitaṃbulu”-. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 11 - 409)
” gāvaḥ paśyaṃti gaṃdhēna daiḥ paśyaṃti dvijāḥ |
cāraiḥ paśyaṃti rājānaścakṣubhyāṃ itarē jananāḥ ||“.
(gōvula vāsanavalana maṃci ceḍḍa cūcunu, dvijulu vēdamulavalana cūcedaru - rājulu doṃgalanu cāruladvārā kanipeṭṭedaru - migilina janulu - sādhāraṇulu vāḷḷa kaṃḍlatōnē cūcedaru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.