శరీరమునందు ప్రాణవాయువు సంచారమువలన పుట్టుధ్వనియే నాదము - ఇదియే ఓంకారనాదము -
"అక్షరం పరమో నాదశ్శబ్ద బ్రహ్మేతి కధ్యతే |
మూలాధార గతా శక్తిః స్వాధారా బిందు రూపిణీ |
తస్యా ముత్పద్యతే నాదః సూక్ష్మ బీజా దివాం కురః || (యోగశిఖోపనిషత్)
(బ్రహ్మనుండి పుట్టి బ్రహ్మస్వరూపమైనందువలన నాదము నాశము లేనిది. ఇదియే శబ్ధ బ్రహ్మయని చెప్పబడినది. బ్రహ్మాండ భేదనమువలన కలిగిన రవము, శబ్దము. అప్పుడు అట్లు కలిగిన రవము - శబ్దము - బ్రహ్మాండము పగులగా ఏర్పడిన లోకములలో అణువణువులోను సూక్ష్మరూపముతో ప్రవేశించి, వ్యాపించినది. అది ప్రాణుల శరీరములో ప్రవేశించి మూలాధార చక్రమునుపొంది సూక్ష్మశక్తిరూపమును పొందనది -అదియే కుండలినీ శక్తి. దాని నుండి నాదము అగ్ని వాయువులతో కలిసి, సూక్ష్మ బీజమునుండిపుట్టు మొలకలవలె, నాదముగా శబ్దముగా స్థూలరూపముపొంది శరీరమునకు శక్తిని కలిగించుచున్నది). (చూడుము - ఓంకారము).
అక్షరేభ్యః పదానిస్యుః పదేభ్యో వాక్య సంభవః |
సర్వ వాక్యాత్మకా మంత్రా వేదశాస్త్రాణి కృత్స్నశః |
పురాణాని చ కా భాషాశ్చ వివిధా అపి |
సప్తస్వరాశ్చ గాధాశ్చ సర్వేనాద సముద్భావః |
ఏషా సరస్వతీ దేవీ సర్వ భూత గుహశ్రయా |
వాయునాద వహ్నియుక్తేన ప్రేర్యమాణా శనైశ్శనైః |
తద్వివర్త పదైర్వాక్యేఇరిత్యేవం వర్తతే సదా |
య ఇమాం వైఖరీం శక్తిం యోగీస్వాత్మని పశ్యతి |
సవాక్సిద్ధి మవాప్నోతి సరస్వత్యాః ప్రసాదతః ||". (యోగశిఖఓపనిషత్)
(అకారము మొదలు క్షకారము వఱకు గల అక్షరములవలన పదములు - మాటలు - కలుగుచున్నవి. పదములవలన వాక్యములేర్పడుచున్నవి. మంత్రములు, వేదములు, శాస్త్రములు, పురాణములు, కావ్యములు, అనేకవిధములైన భాషలు, సప్తస్వరములు, గాధలు, ఇవన్నియు వాక్యాత్మకములు - వాక్యములు కలిసి రూపమును పొందినవి. ఇవన్నియు నాదమువలన పుట్టినవి, నాదమే అధారముగా గలవి. ఇదియే, ఈ నాదమను శక్తియే సమస్త భూతములను గుహలయందుండి సరస్వతీదేవియని చెప్పబడుచున్నది. ఈ శక్తి రూపిణి అగ్నివాయువుల ప్రోద్బలమువలన మెలిమెల్లిగా పైకి వచ్చుచుండును. ఇట్టి నాదశక్తి వైఖరీ వాక్కు అని చెప్పబడును. యోగియగువాడు ఎవడు ఈ వాగ్రూపశక్తిని తనలో కనుగొనునో అట్టివాడు సరస్వతీ ప్రసాదమున వాక్సిద్ధిని పొందును).
స్వశక్తి సహితాదేవ, ద్విజా! జ్యోతిర్మయః పరః |
శబ్దః సూక్ష్మః స్వభావేన ప్రాదురాసీద ఖండితః |
సశబ్దః పునరాధారే ప్రాణినా మాస్తికోత్తమాః |
పిండీ భూతతయా భాతి - - - | " (సూతసంహితాయాం)
(పరమైన - ఉత్కృష్టమైన - ప్రకృతికన్న ఉత్కృష్టమైనటువంటిన్నీ, తన శక్తి స్వరూపమైన పార్వతీదేవితో కూడియున్నటువంటిన్నీ, చైతన్యలక్షణముగల శివుని వలన - శివుని నుండి - శివునివలనే ఉత్కృష్టమైనదిన్నీ, జ్యోతిర్మయమైనటువంటిదిన్నీ, స్వభావము చేతనే సూక్ష్మమైనదిన్నీ, అఖండితమైనదిన్నీ (అంతములేనిదిన్నీ), అయిన ఒక శబ్దము పుట్టెను. ఆ శబ్దమే ప్రాణుల శరీరములో పిండీభూతమై - పిండమువలె, గట్టి ముద్దవలె కాక కరుడుగట్టినదై - ప్రకాశించును. ఇదియే నాదము.) (ఈ నాదము బ్రహ్మాండము నిర్భేదించబడినపుడు కలిగి, ఆ బ్రహ్మాండము ముక్కలు ముక్కలయి ఇప్పటి లోకములుగా మారగా వాటిలోను సమస్త వస్తువులుగా మారి ఆకసమున విరజిమ్మబడగా, వాటి అన్నింటిలోను, వాటిలోని ప్రతి అణువు అణువులోను అంతర్గతమై జీర్ణించిపోయి నట్లు సూక్ష్మరూపములో వాటి అన్నింటిలోను వ్యాపించియున్నది).
(బిందువునుండి అవ్యక్తము పుట్టినది. అదియే జగత్తునకు మొలకవంటిది; కుండలినీ శక్తియని, అధ్యాత్మమని చెప్పబడుచున్నది. కొంత కాలము గడిచినతర్వాత ఆ బిందువు పగిలి - పరబ్రహ్మ శక్తిచేతి భేదింపబడి మూడు విధములుగా, మూడుగా మారెను - స్థూలము, సూక్ష్మము, పరము అని మూడువిధములుగా మారెను. అవి బిందువు, నాదము, బీజము అని చెప్పబడుచున్నవి. స్థూలమైన అచిత్ అంశ - భాగము - బీజము. చిత్ అచిత్ రెండు కలిసినది సూక్ష్మరూపములోనున్న నాదము, అదియే పురుషుడు. చిత్ అంశ బిందువు కేవలము చైతన్యాంశ - చైతన్య భాగము - పరమాత్మ - అట్లు బిందువు మూడుగా విడిపోయినపుడు - మారిపోయినపుడు - శబ్ద బ్రహ్మమను పేరుగల రవము - శబ్దము - పుట్టినదని చెప్పబడినది. ఆ ప్రకారముగా మూడు విధములుగా బ్రద్దలయిన - మారిన - బిందువునుండి అవ్యక్తమైన - సూక్ష్మమైన - అత్యంత శక్తివంతమైన రవము - శబ్దము - పుట్టినది. ఆ శబ్దము శబ్దబ్రహ్మ అని చెప్పబడుచున్నది. అది బిందువుతో తాదాత్మ్యమును పొందినదగుటచేత - ఆ బిందువునుండి పుట్టినదగుటచేత ఆ బిందువే తాను అగుటచేత - అన్నింటిలోన (సృష్టిలోని సమస్త వస్తువులలోను, బ్రహ్మాండభేదన సమయమందు ఆ అండమునుండి విరజిమ్ముకుపోయిన భాగములన్నింటిలోను, వాటిలోని అణువు అణువులోను) వ్యాపించియుండుటచేత ప్రాణుల శరీరములోని మూలాధార చక్రములో అభిద్యజ్యమగుచున్నది - దాని శక్తి పైకి కనపర్చుచున్నది). (చూడుము - ఓంకారము).
śarīramunaṃdu prāṇavāyuvu saṃcāramuvalana puṭṭudhvaniyē nādamu - idiyē ōṃkāranādamu -
"akṣaraṃ paramō nādaśśabda brahmēti kadhyatē |
mūlādhāra gatā śaktiḥ svādhārā biṃdu rūpiṇī |
tasyā mutpadyatē nādaḥ sūkṣma bījā divāṃ kuraḥ || (yōgaśikhōpaniṣat)
(brahmanuṃḍi puṭṭi brahmasvarūpamainaṃduvalana nādamu nāśamu lēnidi. idiyē śabdha brahmayani ceppabaḍinadi. brahmāṃḍa bhēdanamuvalana kaligina ravamu, śabdamu. appuḍu aṭlu kaligina ravamu - śabdamu - brahmāṃḍamu pagulagā ērpaḍina lōkamulalō aṇuvaṇuvulōnu sūkṣmarūpamutō pravēśiṃci, vyāpiṃcinadi. adi prāṇula śarīramulō pravēśiṃci mūlādhāra cakramunupoṃdi sūkṣmaśaktirūpamunu poṃdanadi -adiyē kuṃḍalinī śakti. dāni nuṃḍi nādamu agni vāyuvulatō kalisi, sūkṣma bījamunuṃḍipuṭṭu molakalavale, nādamugā śabdamugā sthūlarūpamupoṃdi śarīramunaku śaktini kaligiṃcucunnadi). (cūḍumu - ōṃkāramu).
akṣarēbhyaḥ padānisyuḥ padēbhyō vākya saṃbhavaḥ |
sarva vākyātmakā maṃtrā vēdaśāstrāṇi kṛtsnaśaḥ |
purāṇāni ca kā bhāṣāśca vividhā api |
saptasvarāśca gādhāśca sarvēnāda samudbhāvaḥ |
ēṣā sarasvatī dēvī sarva bhūta guhaśrayā |
vāyunāda vahniyuktēna prēryamāṇā śanaiśśanaiḥ |
tadvivarta padairvākyēirityēvaṃ vartatē sadā |
ya imāṃ vaikharīṃ śaktiṃ yōgīsvātmani paśyati |
savāksiddhi mavāpnōti sarasvatyāḥ prasādataḥ ||". (yōgaśikhaōpaniṣat)
(akāramu modalu kṣakāramu vaṟaku gala akṣaramulavalana padamulu - māṭalu - kalugucunnavi. padamulavalana vākyamulērpaḍucunnavi. maṃtramulu, vēdamulu, śāstramulu, purāṇamulu, kāvyamulu, anēkavidhamulaina bhāṣalu, saptasvaramulu, gādhalu, ivanniyu vākyātmakamulu - vākyamulu kalisi rūpamunu poṃdinavi. ivanniyu nādamuvalana puṭṭinavi, nādamē adhāramugā galavi. idiyē, ī nādamanu śaktiyē samasta bhūtamulanu guhalayaṃduṃḍi sarasvatīdēviyani ceppabaḍucunnadi. ī śakti rūpiṇi agnivāyuvula prōdbalamuvalana melimelligā paiki vaccucuṃḍunu. iṭṭi nādaśakti vaikharī vākku ani ceppabaḍunu. yōgiyaguvāḍu evaḍu ī vāgrūpaśaktini tanalō kanugonunō aṭṭivāḍu sarasvatī prasādamuna vāksiddhini poṃdunu).
svaśakti sahitādēva, dvijā! jyōtirmayaḥ paraḥ |
śabdaḥ sūkṣmaḥ svabhāvēna prādurāsīda khaṃḍitaḥ |
saśabdaḥ punarādhārē prāṇinā māstikōttamāḥ |
piṃḍī bhūtatayā bhāti - - - | " (sūtasaṃhitāyāṃ)
(paramaina - utkṛṣṭamaina - prakṛtikanna utkṛṣṭamainaṭuvaṃṭinnī, tana śakti svarūpamaina pārvatīdēvitō kūḍiyunnaṭuvaṃṭinnī, caitanyalakṣaṇamugala śivuni valana - śivuni nuṃḍi - śivunivalanē utkṛṣṭamainadinnī, jyōtirmayamainaṭuvaṃṭidinnī, svabhāvamu cētanē sūkṣmamainadinnī, akhaṃḍitamainadinnī (aṃtamulēnidinnī), ayina oka śabdamu puṭṭenu. ā śabdamē prāṇula śarīramulō piṃḍībhūtamai - piṃḍamuvale, gaṭṭi muddavale kāka karuḍugaṭṭinadai - prakāśiṃcunu. idiyē nādamu.) (ī nādamu brahmāṃḍamu nirbhēdiṃcabaḍinapuḍu kaligi, ā brahmāṃḍamu mukkalu mukkalayi ippaṭi lōkamulugā māragā vāṭilōnu samasta vastuvulugā māri ākasamuna virajimmabaḍagā, vāṭi anniṃṭilōnu, vāṭilōni prati aṇuvu aṇuvulōnu aṃtargatamai jīrṇiṃcipōyi naṭlu sūkṣmarūpamulō vāṭi anniṃṭilōnu vyāpiṃciyunnadi).
(biṃduvunuṃḍi avyaktamu puṭṭinadi. adiyē jagattunaku molakavaṃṭidi; kuṃḍalinī śaktiyani, adhyātmamani ceppabaḍucunnadi. koṃta kālamu gaḍicinatarvāta ā biṃduvu pagili - parabrahma śakticēti bhēdiṃpabaḍi mūḍu vidhamulugā, mūḍugā mārenu - sthūlamu, sūkṣmamu, paramu ani mūḍuvidhamulugā mārenu. avi biṃduvu, nādamu, bījamu ani ceppabaḍucunnavi. sthūlamaina acit aṃśa - bhāgamu - bījamu. cit acit reṃḍu kalisinadi sūkṣmarūpamulōnunna nādamu, adiyē puruṣuḍu. cit aṃśa biṃduvu kēvalamu caitanyāṃśa - caitanya bhāgamu - paramātma - aṭlu biṃduvu mūḍugā viḍipōyinapuḍu - māripōyinapuḍu - śabda brahmamanu pērugala ravamu - śabdamu - puṭṭinadani ceppabaḍinadi. ā prakāramugā mūḍu vidhamulugā braddalayina - mārina - biṃduvunuṃḍi avyaktamaina - sūkṣmamaina - atyaṃta śaktivaṃtamaina ravamu - śabdamu - puṭṭinadi. ā śabdamu śabdabrahma ani ceppabaḍucunnadi. adi biṃduvutō tādātmyamunu poṃdinadaguṭacēta - ā biṃduvunuṃḍi puṭṭinadaguṭacēta ā biṃduvē tānu aguṭacēta - anniṃṭilōna (sṛṣṭilōni samasta vastuvulalōnu, brahmāṃḍabhēdana samayamaṃdu ā aṃḍamunuṃḍi virajimmukupōyina bhāgamulanniṃṭilōnu, vāṭilōni aṇuvu aṇuvulōnu) vyāpiṃciyuṃḍuṭacēta prāṇula śarīramulōni mūlādhāra cakramulō abhidyajyamagucunnadi - dāni śakti paiki kanaparcucunnadi). (cūḍumu - ōṃkāramu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.