← Back to న · Booklets 21–30 (digitized file 3)

నైర్గుణ్యం nairguṇyaṃ

Original — తెలుగు
  1. నిర్గుణ స్వభావం.

(త్రిగుణములవలన కలుగు స్వభావము లేనివాడు - త్రిగుణములులేని స్వభావము గలవాడు).

  1. సత్వ రజస్తమోగుణ రాహిత్యం - సత్వాది గుణత్రయమేవ పుణ్య పాపాది హేతుః - తస్మాత్ నైర్గుణ్యత్వాత్ అలింగత్వం.

(సత్వ రజస్తమో గుణములు లేకయుండుట - ఈ మూడు గుణములే పుణ్య పాపములకు కారణమైనవి. అందుచేత నైర్గుణ్యమనగా శరీరము లేకుండుట - ఆకారము లేకుండుట).

  1. “దేహంబునకు బీజంబు లింగంబనియును, లింగంబునకు మూలంబు గుణంబులనియును,గుణంబులకు నిదానంబు బ్రకృతియనియు, బ్రహ్మమనియెడు జ్ఞానంబున లీనమై ప్రకృతి లేకుండుననియు, బ్రకృతి యడంగుటయ నైర్గుణ్యంబనియును, నైర్గుణ్యంబువలన గార్యలింగ నాశనంబగును” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 15 - 343)
Transliteration
  1. nirguṇa svabhāvaṃ.

(triguṇamulavalana kalugu svabhāvamu lēnivāḍu - triguṇamululēni svabhāvamu galavāḍu).

  1. satva rajastamōguṇa rāhityaṃ - satvādi guṇatrayamēva puṇya pāpādi hētuḥ - tasmāt nairguṇyatvāt aliṃgatvaṃ.

(satva rajastamō guṇamulu lēkayuṃḍuṭa - ī mūḍu guṇamulē puṇya pāpamulaku kāraṇamainavi. aṃducēta nairguṇyamanagā śarīramu lēkuṃḍuṭa - ākāramu lēkuṃḍuṭa).

  1. “dēhaṃbunaku bījaṃbu liṃgaṃbaniyunu, liṃgaṃbunaku mūlaṃbu guṇaṃbulaniyunu,guṇaṃbulaku nidānaṃbu brakṛtiyaniyu, brahmamaniyeḍu jñānaṃbuna līnamai prakṛti lēkuṃḍunaniyu, brakṛti yaḍaṃguṭaya nairguṇyaṃbaniyunu, nairguṇyaṃbuvalana gāryaliṃga nāśanaṃbagunu” (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 15 - 343)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.