← Back to న · Booklets 21–30 (digitized file 3)

నైష్కర్మ్య సిద్ధి naiṣkarmya siddhi

Original — తెలుగు
  1. నిర్గతాని కర్మాణి యస్మాత్, యస్మాత్ నిష్క్రియ బ్రహ్మాత్మ సంబోధాత్ సః నిష్కర్మా,తస్య భావః నైష్కర్మ్యం. నైష్కర్మ్యం చ తత్సిద్ధిశ్చ సా నైష్కర్మ్య సిద్ధిః, నిష్కర్మత్వస్య వా, నిష్క్రియాత్మరూపావస్థానలక్షణస్య సిద్ధిః. నిష్పత్తిః, తాం నైష్కర్మ్యసిద్ధిం పరమాం ప్రకృష్టాం కర్మజసిద్ధివిలక్షణాం, సద్యో ముక్త్యావస్థాన రూపాం“. (శ్రీశంకరః)

(నిష్క్రియుడైన పరబ్రహ్మ జ్ఞానమువలన కర్మలు చేయనివాడు నిష్కర్ముడు. అట్టివాని భావము (అట్లుండుట నైష్కర్మ్యము. నైష్కర్మ్యము, దాని సిద్ధి కలిగియుండుట నైష్కర్మ్య సిద్ధి - కర్మలేకుండనుండుస్థితి, లేక నిష్క్రియుడైన ఆత్మవలెనుండి సిద్ధిని పొందియుండుట.- అనగా, ఒక కర్మవలన కలిగినసిద్ధికన్న విలక్షణమైన సిద్ధి, వేఱైన సిద్ధి. సద్యోముక్తుడైనవాని యవస్థ).

  1. నైష్కర్మార్థా సిద్ధిః నైష్కర్మ్య సిద్ధిః సాచ యోగస్య ఇత్యర్థః.

(నైష్కర్మ్యమువలన సాధించగలుగు సిద్ధి - యోగ సిద్ధి).

  1. “పరమాం ధ్యాననిష్టాం, జ్ఞానయోగస్యాపి ఫల భూతాం”. (శ్రీరామానుజః)

(ఉత్కృష్టమైన జ్ఞాన నిష్ట - జ్ఞానయోగమునకు ఫలమగునది - యోగసిద్ధి).

  1. “అసక్త బుద్ధిః సర్వత్ర జితాత్మా విగత స్పృహః |

నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధి గచ్ఛతి ” (శ్రీమద్భగవద్గీత - 18 - 49)

(దేనియందును ఆసక్తిలేని బుద్ధికలవాడును, మనోజయము కలవాడును, కర్మఫలమందు స్పృహలేనివాడును అగువాడు సన్యాసమువలన - కర్మఫలసన్యాసము వలన - నైష్కర్మ్య సిద్ధి పొందును).

Transliteration
  1. nirgatāni karmāṇi yasmāt, yasmāt niṣkriya brahmātma saṃbōdhāt saḥ niṣkarmā,tasya bhāvaḥ naiṣkarmyaṃ. naiṣkarmyaṃ ca tatsiddhiśca sā naiṣkarmya siddhiḥ, niṣkarmatvasya vā, niṣkriyātmarūpāvasthānalakṣaṇasya siddhiḥ. niṣpattiḥ, tāṃ naiṣkarmyasiddhiṃ paramāṃ prakṛṣṭāṃ karmajasiddhivilakṣaṇāṃ, sadyō muktyāvasthāna rūpāṃ”. (śrīśaṃkaraḥ)

(niṣkriyuḍaina parabrahma jñānamuvalana karmalu cēyanivāḍu niṣkarmuḍu. aṭṭivāni bhāvamu (aṭluṃḍuṭa naiṣkarmyamu. naiṣkarmyamu, dāni siddhi kaligiyuṃḍuṭa naiṣkarmya siddhi - karmalēkuṃḍanuṃḍusthiti, lēka niṣkriyuḍaina ātmavalenuṃḍi siddhini poṃdiyuṃḍuṭa.- anagā, oka karmavalana kaliginasiddhikanna vilakṣaṇamaina siddhi, vēṟaina siddhi. sadyōmuktuḍainavāni yavastha).

  1. naiṣkarmārthā siddhiḥ naiṣkarmya siddhiḥ sāca yōgasya ityarthaḥ.

(naiṣkarmyamuvalana sādhiṃcagalugu siddhi - yōga siddhi).

  1. “paramāṃ dhyānaniṣṭāṃ, jñānayōgasyāpi phala bhūtāṃ”. (śrīrāmānujaḥ)

(utkṛṣṭamaina jñāna niṣṭa - jñānayōgamunaku phalamagunadi - yōgasiddhi).

  1. “asakta buddhiḥ sarvatra jitātmā vigata spṛhaḥ |

naiṣkarmya siddhiṃ paramāṃ sanyāsēnādhi gacchati ” (śrīmadbhagavadgīta - 18 - 49)

(dēniyaṃdunu āsaktilēni buddhikalavāḍunu, manōjayamu kalavāḍunu, karmaphalamaṃdu spṛhalēnivāḍunu aguvāḍu sanyāsamuvalana - karmaphalasanyāsamu valana - naiṣkarmya siddhi poṃdunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.