(నామములు అనగా కుండమొదలగు వస్తువుల పేర్లు, వస్తువులను వ్యవహరించుటలో వాటి పేర్లు - రూపములు అనగా కుండ మొదలగు వస్తువుల ఆకారము).
(నామములు అనగా సృష్టి అంతటిలోను చతుర్ముఖబ్రహ్మ మొదలు స్తంబము వరకుగల సమస్త వస్తువులపేర్లు. రూపములు అనగా ఆ వస్తువులపేర్లతో పిలువబడు లేక చెప్పబడు రూపములన్నియు).
(ఈ సృష్టిలోని వస్తువులలో - నేను జీవాత్మరూపములో ప్రవేశించి నామరూపములు కలుగచేయుదును - అని పరబ్రహ్మ జీవుని రూపముతో ప్రవేశించుటచేతనే సమస్తమైన వస్తువులకు నామరూపములు కలిగియున్నవి.అంతా పరబ్రహ్మమే యనిచెప్పి అన్నియు బ్రహ్మాండమునుండి కల్పించబడినవి అని వ్యాఖ్యానము చేయబడియుండుటచేత వాటి అన్నింటికి వేఱు వేఱుగా పేర్లు పెట్టబడియుండడమైనది. ఇదంతా ఒకే పరబ్రహ్మ అయినను వేఱు వేఱు వస్తువులుగా కనబడుచుండుట వలన అవి వేఱు వేఱు అని భావనయే. అందుచేత వేఱు వేఱుగా కనబడుచున్నవాటికి వేఱు వేఱు నామములు పెట్టడియున్నవి. యధార్థముగా చూచిన ఈ నామములన్నియు సర్వము తానే అయిన పరబ్రహ్మయొక్క నామములే).
కరోతి బహురూపణి నిర్గుణాని సగుణాని చ |
కార్య కర్మానుసారేణ నామని ప్రభవంతి హి |
ధాత్వర్థ గుణయుక్తాని గౌణాని సబహూన్యపి " (శ్రీ దేవీ భాగవతము)
(దేవకార్యము సాధించుకొఱకు దేవిరూపములేనిదైనను తన లీలగా అనేక రూపములను - సగుణరూపములను నిర్గుణరూపములను చేయుచున్నది. చేయవలసిన కర్మలలనుసరించి ఆ రూపములకు పేర్లు కలుగుచున్నవి - వాటి వాటి ద్రవ్యమును బట్టి గుణములను బట్టి ఈ పేర్లు కలుగుచున్నవి).
(శ్రీదేవి కార్యముననుసరించి అనేకరూపములు గైకొనుచున్నది. అట్లే అనేక కర్మలవలన కాలి, తార, సుందరీ, భువనేశ్వరీ, దుర్గా అను మొదలగు పేర్లు కలిగియున్నది).
"లౌకికి ప్రతీతి సిద్ధం కారణాత్ కార్యస్య అనన్యత్వం తావత్ యధా ఏక మృత్పిండారబ్ధానాం. ఘటశరావాదీనాం, తస్మాత్ అనతిరిక్త ద్రవ్యతయా తత్ జ్ఞానేన జ్ఞాత్వా ఇత్యర్థః - అత్ర కారణాది వాదేన కారణాత్ కార్యస్య బుద్ధి శబ్దాంతరాదిభిః - ద్రవ్యాం తరత్వం ఆశంక్య లోక ప్రతత్వైవ కారణాత్ కార్యస్య అనన్యతా ఉపపాద్యతే"
(కుండ మొదలగు కార్యవస్తువులు నామ మాత్రముగా వేఱు వేఱు వస్తువులుగా నున్నవి. కాని అవన్నియు యథార్ధముగా వాటి కారణమైన మట్టియే. అవన్నియు మట్టియే అయినను మేఱు వేఱు రూపములు కలిగియుండుటవలన వాటికి వేఱు వేఱు నామములు కలిగినవి. ఆ ప్రకారముగానే ఆకాశము మొదలగునవన్నియు కార్యవస్తువులగుటచేత కారణమైన పరమాత్మనుండియే పుట్టినవి. అవి నామమాత్రముచే వేఱుగానున్నవి కాని యదార్ధముగా పరమాత్మవలన పుట్టినవి కనుక అవన్నియు యదార్ధముగా పరమాత్మయే - పరమాత్మ రూపములే).
(ఒకవస్తువులోనుండి ఇంకొక వస్తువుపుట్టినపుడు పుట్టినవస్తువు కార్యమనియు, ఎందులోనుండి అది పుట్టినదోఅది దానికారణవస్తువనియు చెప్పబడినది. లోకములో కారణవస్తువులోనుండి పుట్టిన కార్యవస్తువుకన్న వేఱుకాదు అనిప్రసిద్ధి. అది యెట్లంటే - ఒక మట్టిముద్దతో చేయబడినకుండ, మూకుడు మొదలగునవి ఆమట్టిముద్దతోనే చేయబడి యుండుటవలన వాటి అన్నింటిలోను ఉండు ద్రవ్యము ఆ మట్టేకనుక ఆ మట్టిముద్దకన్న అవి వేఱుకావు).
తధా విద్వాన్నామరూపా ద్విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యం ||". (ముండకోపనిషత్ - 3 - 2 - 8)
"యథావద్యః స్యందమానాః సముద్రే అస్తం గచ్ఛంతి నామ రూపే విహాయ, యథా మధుని సకల కుసుమ రసాః విశేషతః అనుప లక్ష్యమాణః అపి (అశేషాః రసాః మకరందాః) సామాన్యేన ఉపలక్ష్యంతే, తథా అసుభృతః ప్రాణినః పరమేత్వయివినిల్యుః, ప్రళయదశాయాం నామరూపే - విహాయ త్వయి అవిభక్తతాం ఆపుః, విద్వాన్ నామరూపాద్విముక్తిః పరాత్పరం పురుషం ఉపైతి. సంసారం విహాయ పరాత్ కారణాత్ వరం పూర్ణం స్వయంజ్యోతిరానంద ప్రాప్యతిష్టతి.”
(ప్రవహించుచున్న నదులు వాటి వాటి రూపములు, పేర్లు - గంగ, యమున, గోదావరియను మొదలగు పేర్లు - వదలి సముద్రములో కలిసి పోవుచున్నవి. ఆ ప్రకారముగానే విద్వాంసులైనవారు వారి రూపములను వదలి పరాత్పరుడైన దివ్యపురుషుని పొందుచున్నారు).
(తేనెలో అనేకపువ్వుల రసము కలిసియున్నట్లు - ప్రాణులన్నియు నీలోనే - భగవంతునిలోనే లీనమగుచున్నవి. ప్రళయకాలమందు వాటి వాటి నామరూపములు వదలి - వాటి వాటి విభక్తమైన రూపము కోల్పోయి నీలో అవిభక్తమైన రూపములో - స్థితిలో - చేరియుందురు).
(నదిలో కలుగు బుడగలు కేవలము నీళ్ళవలన కాని, కేవలము వాయువువలన కాని కలుగవు - కాని ఆ రెండునూ కలియుటవలననే కలుగుచున్నవి. ఆ ప్రకారముగానే ఒక్క ప్రకృతి వలననే కాని, ఒక్క పరమాత్మ వలననే కాని సృష్టి కలుగుటలేదు. కంటికి కనబడుచున్న నీళ్ళు వాయువు కలియుటచేత బుడగలు కలుగుచుండునట్లు ప్రకృతి పురుష సం యోగము వలననే ప్రాణులు అనేకరూపములతో అనేకనామములతో నీయందే ఆధారభూతములై యున్నవి. ఈ ప్రకారముగా దేవతులని, మనుష్యులని నామరూపములు గలవి యగుచున్నవి. జలము లోని బుడగలకు వాయువు నిమిత్తకారణము, నీరు ఉపాదానకారణము అయినట్లు ప్రకృతి ఉపాదానము, పురుషుడు - భగవంతుడు - నిమిత్త కారణము. ఈ ప్రకారము గానే అవ్యక్తము మహత్తత్వము, అహంకారము, మనసు, ప్రాణములు, ఇంద్రియములు, విషయములు పరమాత్మలోనుండి పుట్టి నామరూపములు కలిగి ప్రళయకాలమునందు ఆ నామరూపములు వదలి పరమాత్మలో ఐక్యమగుచున్నవి).
(సమస్త చిదచిద్వస్తువులకు తానేశరీరమైనవాడు - అవన్నియు తానే అయినవాడు - అగుటచేత,సమస్తవస్తువులకుతానే ఆత్మ అగుటచేత, శరీరము అగుటచేత, ఒకప్పుడు విభక్తమైన (వేరు వేరుగా నుండు)
నామరూపములుగలవాడుగాను, మఱియొకప్పుడు అవిభక్తనామరూపములు గలవాడుగాను - వేరువేరు నామరూపములు లేని వాడుగును - అన్ని నామరూపములు తనయందే లీనమైపోయినవాడుగను నుండును - ఎప్పుడు నామరూపములుగలవాడుగనుండునో అప్పుడు అనేక కార్యవస్తువులుగా తానే చెప్పబడుచున్నాడు . ఎప్పుడు నామరూపములతోవిభక్తము కాక అన్నింటినీ తనలోనే ఉంచుకొనినప్పుడు ఒకడే అయి తనుగాక ఇతరవస్తువు లేనివాడుగను అయినాద్వితీయ (అద్వయ) పరమాత్మగను, అందుచేత ఈ నామరూపములన్నింటికి కారణము అయినవాడుగ నుండును.
(గంగ, యమున, సరస్వతి మొదలగు నదులు వాటి వాటి ఉత్పత్తిస్థానములనుండి ప్రవహించుచు, గంగ, యమున, సరస్వతి అను మొదలగు నామములను తెలుపు, నలుపు, పసుపు మొదలగు రూపములను విడిచిపెట్టి సముద్రములో ఏకమైపోవుచున్నవి. ఆ ప్రకారముగానే విద్వాన్సుడైనవాడు నామరూపములు మొదలగువాటిని విడిచిపెట్టినవాడై నిరాకారుడైన దివ్యపురుషుని మంత్రము చెప్పినట్లు పొందుచున్నాడు - నదీ జలములు సముద్రములో ఏకమగుచున్నవని చెప్పుటలో ఆ రెండుజలములకు భేదము పోవునని చెప్పుటయేకాని, రెండింటి స్వరూపములు ఏకమగుటకాదు - నదీ సముద్రజలములు వస్తురూపముగా ఏకమగుటకానట్లే ముక్తుడైనవాడు పరమాత్మతో ఐక్యముకాడు, పరమాత్మ సామ్యమును పొందును).
వివిధాభరణములైన విధమున నితడు
దివియై, భువియై. రవియై
కవియై, సర్వాత్ముడై ప్రకాశించుతగన్". (శ్రీసీతారామాంజనేయ సంవాదము - 1 - 78)
సర్గంబు సేయ ప్రజాపతి రూపుడై, యింద్రుడై దైత్యులనేపడంచు
జ్ఞానంబు నెఱిగించు జతుర సిద్ధాకృతి, కాలరూపంబున బాకంబుసేయు
నానా విధాకార నామరూపంబుల గర్మలోచనులకు గానబడడు
ఆ. చనిన రూపములను జనురూపముల నింక
జరగనున్న రూపచయము నతడు
వివిధుడై యనేక వృత్తుల వెలిగించు
విష్ణుడవ్యయుండు విమలచరిత". (పోతనభాగవతము - 8 - 435)
(నామ రూపములను వదలివేసిన ఆత్మవస్తువు పరమాత్మతో సమానము. అందుచేత ప్రకృతిని వదలిన ఆత్మలన్నియు - ఏ వస్తువులో ఉన్న ఆత్మ అయినను - ఒకదానికి ఒకటి సమానము, పరమాత్మతో కూడ సమానము).
పరమాత్మకు నామరూపములు లేవు - నిరాకారుడు (ఆకారము లేనివాడు, రూపము లేనివాడు - కాని ప్రకృతియను ఉపాధిలో కలిసి అనేక రూపములుగా తానే మారెను - ప్రకృతి పురుష (పరమాత్మ) సం యోగమువలన సృష్టిలోని వస్తువులన్నియు అనేక రూపములుగలవిగా పుట్టుచున్నవి. అందుచేత ఇవన్నియు భగవంతుని రూపములే - " సహస్ర శీర్షా పురుషః " భగవంతునికంటె వేరే వస్తువులేదు కనుక - ఆ రూపములు అనేకములుగా నుండుటచేత వ్యవహరించుటకు నామములు కల్పించబడినవి. అందుచేత సృష్టిలోని ప్రతి వస్తువునకు నామరూపములు రెండును కలవు - రూపములు భగవంతుని శక్తిని వినియోగించుకొని ప్రకృతి కలుగచేసినవి - అనగా ప్రకృతి కార్యములు. కార్యములు కారణములో నశించునవి కనుక వాటితో వాటినామములుకూడ నశించునవియే. భగవంతుని ఉపాసకుల వినియోగము కొఱకు ఇవి కల్పించబడినవి).
"మ. గరిమన్ స్వర్ణమనేక భూషణములై గన్పట్టు చందంబునం
బరమాత్ముండఖిల ప్రపంచమయుడై భాసిల్లు, నట్లౌటచే
సురసిద్ధోరగ యక్ష కిన్నర నరస్థోమాది శశ్వచ్చరా
చరరూపోజ్వల సర్వభూతములకున్ సద్భక్తితో మ్రొక్కెదన్ ||". (శ్రీ సీతారామాంజనేయ సంవాదము - 14)
(శ్రీరామచంద్రుని దివ్యమంగళరూపమునకు, అతని తారకనామమునకు జయమంగళమగుగాక, శుభమంగళమగుగాక. శ్రీ త్యాగరాజు శ్రీరామభక్తుడు, తత్వజ్ఞుడు, అందుచేత అతను వ్రాసిన పైవాక్యమునకు ఈ క్రిందవిధముగాకూడా అర్థము స్ఫురించును - ఈ సృష్టిలోనున్న వస్తువులన్నియు భగవంతునిలోనుండి పుట్టినవే - భగవంతుడు ప్రకృతితో కలియుటవలన పుట్టినవే - కలిగినవే - అందుచేత ఆ వస్తువులన్నియు భగవంతునిరూపమలే, వాటి నామములన్నియు అతని నామములే. అంతా, అన్నీ భగవంతుడే కనుక ఏ రూపము చూచినను, భగవంతుని చూచినట్లే, ఏ నామమునుచ్చరించినను భగవంతుని నామము నుచ్చరించినట్లే యగును. కనుక భగవంతుని సర్వరూపములకు, సర్వనామములకు జయమంగళమగుగాకయని పరమభక్తుడైన శ్రీత్యాగరాజులవారి ఆశయముగా భావించవలెను).
(nāmamulu anagā kuṃḍamodalagu vastuvula pērlu, vastuvulanu vyavahariṃcuṭalō vāṭi pērlu - rūpamulu anagā kuṃḍa modalagu vastuvula ākāramu).
(nāmamulu anagā sṛṣṭi aṃtaṭilōnu caturmukhabrahma modalu staṃbamu varakugala samasta vastuvulapērlu. rūpamulu anagā ā vastuvulapērlatō piluvabaḍu lēka ceppabaḍu rūpamulanniyu).
(ī sṛṣṭilōni vastuvulalō - nēnu jīvātmarūpamulō pravēśiṃci nāmarūpamulu kalugacēyudunu - ani parabrahma jīvuni rūpamutō pravēśiṃcuṭacētanē samastamaina vastuvulaku nāmarūpamulu kaligiyunnavi.aṃtā parabrahmamē yaniceppi anniyu brahmāṃḍamunuṃḍi kalpiṃcabaḍinavi ani vyākhyānamu cēyabaḍiyuṃḍuṭacēta vāṭi anniṃṭiki vēṟu vēṟugā pērlu peṭṭabaḍiyuṃḍaḍamainadi. idaṃtā okē parabrahma ayinanu vēṟu vēṟu vastuvulugā kanabaḍucuṃḍuṭa valana avi vēṟu vēṟu ani bhāvanayē. aṃducēta vēṟu vēṟugā kanabaḍucunnavāṭiki vēṟu vēṟu nāmamulu peṭṭaḍiyunnavi. yadhārthamugā cūcina ī nāmamulanniyu sarvamu tānē ayina parabrahmayokka nāmamulē).
karōti bahurūpaṇi nirguṇāni saguṇāni ca |
kārya karmānusārēṇa nāmani prabhavaṃti hi |
dhātvartha guṇayuktāni gauṇāni sabahūnyapi " (śrī dēvī bhāgavatamu)
(dēvakāryamu sādhiṃcukoṟaku dēvirūpamulēnidainanu tana līlagā anēka rūpamulanu - saguṇarūpamulanu nirguṇarūpamulanu cēyucunnadi. cēyavalasina karmalalanusariṃci ā rūpamulaku pērlu kalugucunnavi - vāṭi vāṭi dravyamunu baṭṭi guṇamulanu baṭṭi ī pērlu kalugucunnavi).
(śrīdēvi kāryamunanusariṃci anēkarūpamulu gaikonucunnadi. aṭlē anēka karmalavalana kāli, tāra, suṃdarī, bhuvanēśvarī, durgā anu modalagu pērlu kaligiyunnadi).
"laukiki pratīti siddhaṃ kāraṇāt kāryasya ananyatvaṃ tāvat yadhā ēka mṛtpiṃḍārabdhānāṃ. ghaṭaśarāvādīnāṃ, tasmāt anatirikta dravyatayā tat jñānēna jñātvā ityarthaḥ - atra kāraṇādi vādēna kāraṇāt kāryasya buddhi śabdāṃtarādibhiḥ - dravyāṃ taratvaṃ āśaṃkya lōka pratatvaiva kāraṇāt kāryasya ananyatā upapādyatē"
(kuṃḍa modalagu kāryavastuvulu nāma mātramugā vēṟu vēṟu vastuvulugā nunnavi. kāni avanniyu yathārdhamugā vāṭi kāraṇamaina maṭṭiyē. avanniyu maṭṭiyē ayinanu mēṟu vēṟu rūpamulu kaligiyuṃḍuṭavalana vāṭiki vēṟu vēṟu nāmamulu kaliginavi. ā prakāramugānē ākāśamu modalagunavanniyu kāryavastuvulaguṭacēta kāraṇamaina paramātmanuṃḍiyē puṭṭinavi. avi nāmamātramucē vēṟugānunnavi kāni yadārdhamugā paramātmavalana puṭṭinavi kanuka avanniyu yadārdhamugā paramātmayē - paramātma rūpamulē).
(okavastuvulōnuṃḍi iṃkoka vastuvupuṭṭinapuḍu puṭṭinavastuvu kāryamaniyu, eṃdulōnuṃḍi adi puṭṭinadōadi dānikāraṇavastuvaniyu ceppabaḍinadi. lōkamulō kāraṇavastuvulōnuṃḍi puṭṭina kāryavastuvukanna vēṟukādu aniprasiddhi. adi yeṭlaṃṭē - oka maṭṭimuddatō cēyabaḍinakuṃḍa, mūkuḍu modalagunavi āmaṭṭimuddatōnē cēyabaḍi yuṃḍuṭavalana vāṭi anniṃṭilōnu uṃḍu dravyamu ā maṭṭēkanuka ā maṭṭimuddakanna avi vēṟukāvu).
tadhā vidvānnāmarūpā dvimuktaḥ parātparaṃ puruṣamupaiti divyaṃ ||". (muṃḍakōpaniṣat - 3 - 2 - 8)
"yathāvadyaḥ syaṃdamānāḥ samudrē astaṃ gacchaṃti nāma rūpē vihāya, yathā madhuni sakala kusuma rasāḥ viśēṣataḥ anupa lakṣyamāṇaḥ api (aśēṣāḥ rasāḥ makaraṃdāḥ) sāmānyēna upalakṣyaṃtē, tathā asubhṛtaḥ prāṇinaḥ paramētvayivinilyuḥ, praḷayadaśāyāṃ nāmarūpē - vihāya tvayi avibhaktatāṃ āpuḥ, vidvān nāmarūpādvimuktiḥ parātparaṃ puruṣaṃ upaiti. saṃsāraṃ vihāya parāt kāraṇāt varaṃ pūrṇaṃ svayaṃjyōtirānaṃda prāpyatiṣṭati.”
(pravahiṃcucunna nadulu vāṭi vāṭi rūpamulu, pērlu - gaṃga, yamuna, gōdāvariyanu modalagu pērlu - vadali samudramulō kalisi pōvucunnavi. ā prakāramugānē vidvāṃsulainavāru vāri rūpamulanu vadali parātparuḍaina divyapuruṣuni poṃducunnāru).
(tēnelō anēkapuvvula rasamu kalisiyunnaṭlu - prāṇulanniyu nīlōnē - bhagavaṃtunilōnē līnamagucunnavi. praḷayakālamaṃdu vāṭi vāṭi nāmarūpamulu vadali - vāṭi vāṭi vibhaktamaina rūpamu kōlpōyi nīlō avibhaktamaina rūpamulō - sthitilō - cēriyuṃduru).
(nadilō kalugu buḍagalu kēvalamu nīḷḷavalana kāni, kēvalamu vāyuvuvalana kāni kalugavu - kāni ā reṃḍunū kaliyuṭavalananē kalugucunnavi. ā prakāramugānē okka prakṛti valananē kāni, okka paramātma valananē kāni sṛṣṭi kaluguṭalēdu. kaṃṭiki kanabaḍucunna nīḷḷu vāyuvu kaliyuṭacēta buḍagalu kalugucuṃḍunaṭlu prakṛti puruṣa saṃ yōgamu valananē prāṇulu anēkarūpamulatō anēkanāmamulatō nīyaṃdē ādhārabhūtamulai yunnavi. ī prakāramugā dēvatulani, manuṣyulani nāmarūpamulu galavi yagucunnavi. jalamu lōni buḍagalaku vāyuvu nimittakāraṇamu, nīru upādānakāraṇamu ayinaṭlu prakṛti upādānamu, puruṣuḍu - bhagavaṃtuḍu - nimitta kāraṇamu. ī prakāramu gānē avyaktamu mahattatvamu, ahaṃkāramu, manasu, prāṇamulu, iṃdriyamulu, viṣayamulu paramātmalōnuṃḍi puṭṭi nāmarūpamulu kaligi praḷayakālamunaṃdu ā nāmarūpamulu vadali paramātmalō aikyamagucunnavi).
(samasta cidacidvastuvulaku tānēśarīramainavāḍu - avanniyu tānē ayinavāḍu - aguṭacēta,samastavastuvulakutānē ātma aguṭacēta, śarīramu aguṭacēta, okappuḍu vibhaktamaina (vēru vērugā nuṃḍu)
nāmarūpamulugalavāḍugānu, maṟiyokappuḍu avibhaktanāmarūpamulu galavāḍugānu - vēruvēru nāmarūpamulu lēni vāḍugunu - anni nāmarūpamulu tanayaṃdē līnamaipōyinavāḍuganu nuṃḍunu - eppuḍu nāmarūpamulugalavāḍuganuṃḍunō appuḍu anēka kāryavastuvulugā tānē ceppabaḍucunnāḍu . eppuḍu nāmarūpamulatōvibhaktamu kāka anniṃṭinī tanalōnē uṃcukoninappuḍu okaḍē ayi tanugāka itaravastuvu lēnivāḍuganu ayinādvitīya (advaya) paramātmaganu, aṃducēta ī nāmarūpamulanniṃṭiki kāraṇamu ayinavāḍuga nuṃḍunu.
(gaṃga, yamuna, sarasvati modalagu nadulu vāṭi vāṭi utpattisthānamulanuṃḍi pravahiṃcucu, gaṃga, yamuna, sarasvati anu modalagu nāmamulanu telupu, nalupu, pasupu modalagu rūpamulanu viḍicipeṭṭi samudramulō ēkamaipōvucunnavi. ā prakāramugānē vidvānsuḍainavāḍu nāmarūpamulu modalaguvāṭini viḍicipeṭṭinavāḍai nirākāruḍaina divyapuruṣuni maṃtramu ceppinaṭlu poṃducunnāḍu - nadī jalamulu samudramulō ēkamagucunnavani ceppuṭalō ā reṃḍujalamulaku bhēdamu pōvunani ceppuṭayēkāni, reṃḍiṃṭi svarūpamulu ēkamaguṭakādu - nadī samudrajalamulu vasturūpamugā ēkamaguṭakānaṭlē muktuḍainavāḍu paramātmatō aikyamukāḍu, paramātma sāmyamunu poṃdunu).
vividhābharaṇamulaina vidhamuna nitaḍu
diviyai, bhuviyai. raviyai
kaviyai, sarvātmuḍai prakāśiṃcutagan". (śrīsītārāmāṃjanēya saṃvādamu - 1 - 78)
sargaṃbu sēya prajāpati rūpuḍai, yiṃdruḍai daityulanēpaḍaṃcu
jñānaṃbu neṟigiṃcu jatura siddhākṛti, kālarūpaṃbuna bākaṃbusēyu
nānā vidhākāra nāmarūpaṃbula garmalōcanulaku gānabaḍaḍu
ā. canina rūpamulanu janurūpamula niṃka
jaraganunna rūpacayamu nataḍu
vividhuḍai yanēka vṛttula veligiṃcu
viṣṇuḍavyayuṃḍu vimalacarita". (pōtanabhāgavatamu - 8 - 435)
(nāma rūpamulanu vadalivēsina ātmavastuvu paramātmatō samānamu. aṃducēta prakṛtini vadalina ātmalanniyu - ē vastuvulō unna ātma ayinanu - okadāniki okaṭi samānamu, paramātmatō kūḍa samānamu).
paramātmaku nāmarūpamulu lēvu - nirākāruḍu (ākāramu lēnivāḍu, rūpamu lēnivāḍu - kāni prakṛtiyanu upādhilō kalisi anēka rūpamulugā tānē mārenu - prakṛti puruṣa (paramātma) saṃ yōgamuvalana sṛṣṭilōni vastuvulanniyu anēka rūpamulugalavigā puṭṭucunnavi. aṃducēta ivanniyu bhagavaṃtuni rūpamulē - " sahasra śīrṣā puruṣaḥ " bhagavaṃtunikaṃṭe vērē vastuvulēdu kanuka - ā rūpamulu anēkamulugā nuṃḍuṭacēta vyavahariṃcuṭaku nāmamulu kalpiṃcabaḍinavi. aṃducēta sṛṣṭilōni prati vastuvunaku nāmarūpamulu reṃḍunu kalavu - rūpamulu bhagavaṃtuni śaktini viniyōgiṃcukoni prakṛti kalugacēsinavi - anagā prakṛti kāryamulu. kāryamulu kāraṇamulō naśiṃcunavi kanuka vāṭitō vāṭināmamulukūḍa naśiṃcunaviyē. bhagavaṃtuni upāsakula viniyōgamu koṟaku ivi kalpiṃcabaḍinavi).
"ma. gariman svarṇamanēka bhūṣaṇamulai ganpaṭṭu caṃdaṃbunaṃ
baramātmuṃḍakhila prapaṃcamayuḍai bhāsillu, naṭlauṭacē
surasiddhōraga yakṣa kinnara narasthōmādi śaśvaccarā
cararūpōjvala sarvabhūtamulakun sadbhaktitō mrokkedan ||". (śrī sītārāmāṃjanēya saṃvādamu - 14)
(śrīrāmacaṃdruni divyamaṃgaḷarūpamunaku, atani tārakanāmamunaku jayamaṃgaḷamagugāka, śubhamaṃgaḷamagugāka. śrī tyāgarāju śrīrāmabhaktuḍu, tatvajñuḍu, aṃducēta atanu vrāsina paivākyamunaku ī kriṃdavidhamugākūḍā arthamu sphuriṃcunu - ī sṛṣṭilōnunna vastuvulanniyu bhagavaṃtunilōnuṃḍi puṭṭinavē - bhagavaṃtuḍu prakṛtitō kaliyuṭavalana puṭṭinavē - kaliginavē - aṃducēta ā vastuvulanniyu bhagavaṃtunirūpamalē, vāṭi nāmamulanniyu atani nāmamulē. aṃtā, annī bhagavaṃtuḍē kanuka ē rūpamu cūcinanu, bhagavaṃtuni cūcinaṭlē, ē nāmamunuccariṃcinanu bhagavaṃtuni nāmamu nuccariṃcinaṭlē yagunu. kanuka bhagavaṃtuni sarvarūpamulaku, sarvanāmamulaku jayamaṃgaḷamagugākayani paramabhaktuḍaina śrītyāgarājulavāri āśayamugā bhāviṃcavalenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.