← Back to న · Booklets 21–30 (digitized file 3)

నామాని nāmāni

Original — తెలుగు
  1. గుణ కర్మాను రూపాణి - గుణానురూపాణి, ఈశ్వరః సర్వజ్ఞః ఇత్యాదీని, కర్మానురూపాణి గోవిందః గోవర్ధనోద్ధారకః ఇత్యాదీని.

(నామములు - భగవంతుని పేర్లు - అతని గుణమును బట్టి అతను చేసిన కర్మలను బట్టి కలిగినవి - భగవంతుడు సర్వజ్ఞుడు - అన్నింటిని తెలిసినవాడు - అని చెప్పుటలో అతని గుణమును బట్టి ఆ నామము వచ్చినది యని అర్ధము - గోవర్ధనధారి - గోవర్ధనపర్వతమును ఎత్తినవాడు కనుక భగవంతునికి ఈ పేరు కలిగినది. ఇది అతను చేసిన పని వలన కలిగినవి.

  1. వ్యావహారికము నిమిత్తము మనుజులకు వస్తువులకు మనము పెట్టుకొనిన పేర్లు - ఇతను దేవదత్తుడు మొదలగునవి.

  2. "మాయా స్వరూపావ్యక్తము నాదస్వరూపము. ఈ నాదము తుర్వీవృక్షమందున్న నర్వోర్ధ్వ బిందు వికసనమువలన కలిగినది. శ్రోత్రేంద్రియముచే గ్రహణమగుచున్నది. ఈ నాదోత్పత్తికాలమందు మంద్రమధ్యమాది భేదమునూ, ఆకారాది భేదమును లేనందున అవ్యక్తమనబడుచున్నది, అంతపర్యంతము సూక్ష్మము. అందువలన క్రమక్రమముగా అకారాది ఎనిమిది హ్రస్వ స్వరములు కలిగినవి. ఆది బిందువు శివధక్త్యాత్మకముగాన అకారాది ప్రతిస్వరమును స్త్రీ, పుం భావమును పొందినవి. అందువలన ప్రతిస్వరమును హ్రస్వము దీర్ఘము అని రెండు రూపములు పొందినవి. హ్రస్వములు పుంభాగము, దీర్ఘములు స్త్రీభాగములు, ఇట్లు 14 స్వరములు కలిగినవి. ఆదిబిందువు నాదము విసర్గలుగాన నీ బిందు విసర్గలు కలిసి 16 స్వరములయినవి. వానివలన కకారాది వ్యజనములుకలిగి 50 వర్ణమయ మాతృక ఉత్పన్నమైనది, ఈ నామము వర్ణ, పద, మంత్రములుగా వికసించి బ్రహ్మాండము పిండాండము నిండియున్నది.

Transliteration
  1. guṇa karmānu rūpāṇi - guṇānurūpāṇi, īśvaraḥ sarvajñaḥ ityādīni, karmānurūpāṇi gōviṃdaḥ gōvardhanōddhārakaḥ ityādīni.

(nāmamulu - bhagavaṃtuni pērlu - atani guṇamunu baṭṭi atanu cēsina karmalanu baṭṭi kaliginavi - bhagavaṃtuḍu sarvajñuḍu - anniṃṭini telisinavāḍu - ani ceppuṭalō atani guṇamunu baṭṭi ā nāmamu vaccinadi yani ardhamu - gōvardhanadhāri - gōvardhanaparvatamunu ettinavāḍu kanuka bhagavaṃtuniki ī pēru kaliginadi. idi atanu cēsina pani valana kaliginavi.

  1. vyāvahārikamu nimittamu manujulaku vastuvulaku manamu peṭṭukonina pērlu - itanu dēvadattuḍu modalagunavi.

  2. "māyā svarūpāvyaktamu nādasvarūpamu. ī nādamu turvīvṛkṣamaṃdunna narvōrdhva biṃdu vikasanamuvalana kaliginadi. śrōtrēṃdriyamucē grahaṇamagucunnadi. ī nādōtpattikālamaṃdu maṃdramadhyamādi bhēdamunū, ākārādi bhēdamunu lēnaṃduna avyaktamanabaḍucunnadi, aṃtaparyaṃtamu sūkṣmamu. aṃduvalana kramakramamugā akārādi enimidi hrasva svaramulu kaliginavi. ādi biṃduvu śivadhaktyātmakamugāna akārādi pratisvaramunu strī, puṃ bhāvamunu poṃdinavi. aṃduvalana pratisvaramunu hrasvamu dīrghamu ani reṃḍu rūpamulu poṃdinavi. hrasvamulu puṃbhāgamu, dīrghamulu strībhāgamulu, iṭlu 14 svaramulu kaliginavi. ādibiṃduvu nādamu visargalugāna nī biṃdu visargalu kalisi 16 svaramulayinavi. vānivalana kakārādi vyajanamulukaligi 50 varṇamaya mātṛka utpannamainadi, ī nāmamu varṇa, pada, maṃtramulugā vikasiṃci brahmāṃḍamu piṃḍāṃḍamu niṃḍiyunnadi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.