శరీరముతో చేయు అర్చన.
స్వాప కర్షస్య స్వాభీష్ట దేవతా గుర్వాదేః ఉత్కర్షస్యచ మనసా చింతనం, వాచా కీర్తనం, తధా ఉత్కృష్ట దేవతా గుర్వాదీన్ ప్రతికాయేన ప్రణిపాతాది కరణం చ నమస్కారః -
(తన నికృష్టతను తనకు ఇష్టమైన దైవము యొక్కగాని, గురువుయొక్క గాని ఉత్కృష్టతను మనస్సులో చింతించుట, మాటలటో కీర్తించుత, ఆ యిష్టదేవతా గురువులకు శరీరమును వంచుట, మొదలగునవి చేయట నమస్కారము).
(తత్వమసి అను మహావాక్యములోని - జీవపరమాత్మల వాచ్యార్థమును వదలి లక్ష్యార్థమునే తీసుకొని ఆ రెండింటికి ఐక్యము నమస్కారము చెప్పును - నమస్కారముచేయు జీవుడు -నమస్కారము చేయబడు పరమాత్మ ఒక్కడేయని తెలుపును).
‘న మః’ = న + మః = నావాడనుకాను. పరమాత్మకు సంబంధించినవాడను, అతని స్వాధీనములోనివాడను అని భగవంతునకు మనవి చేయుట - నేను చేయు కార్యములన్నియు నాచేత భగవంతుడే చేయించుచున్నాడు. ఆ కార్యముల ఫలము నాదికాదు).
“ధన్యం తదేవ లగ్నం తన్నక్షత్రాం తదేవ పుణ్యమాహుః |
కరణస్య చ సాద్ధిర్యత్ర హరిః ప్రాజ్ఞమస్క్రియతే ||”
ఇతి స్మృతి వాక్యం.
(ముందుగా శ్రీహరికి నమస్కారము చేసి ప్రారంభించినచో అదియే మంచిలగ్నము, అదియే మంచి నక్షత్రము, అదియే మంచిరోజు, అదియే మంచి కరణము అని స్మృతి చెప్పుచున్నది).
సర్వ దేవ నమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి ||“.
(ఆకాశమునుండి వర్షరూపములో భూమిమీద పడిననీరు ఎక్కడపడినను పల్లపు ప్రదేశమగు సముద్రమునే చేరునట్లు భూమిలోపలి మధ్యభాగములోనుండు ఆకర్షణశక్తి ఆ నీరును తన దగ్గరగా లాగుకొనుటవలన, సముద్రము ఇతర ప్రదేశములకంటె పల్లముగా నుండుటవలన, ఎక్కడపడిన నీరైనను - ఆటంకము లేనియెడల - సముద్రమునకే చేరును. ఆ ప్రకారముగానే భావంతుడు అన్ని దేవతా స్వరూపములు తానే అయియుండుటవలన ఏ దేవునికి నమస్కరించినను ఆ నమస్కారము భగవంతునికే చేరును).
śarīramutō cēyu arcana.
svāpa karṣasya svābhīṣṭa dēvatā gurvādēḥ utkarṣasyaca manasā ciṃtanaṃ, vācā kīrtanaṃ, tadhā utkṛṣṭa dēvatā gurvādīn pratikāyēna praṇipātādi karaṇaṃ ca namaskāraḥ -
(tana nikṛṣṭatanu tanaku iṣṭamaina daivamu yokkagāni, guruvuyokka gāni utkṛṣṭatanu manassulō ciṃtiṃcuṭa, māṭalaṭō kīrtiṃcuta, ā yiṣṭadēvatā guruvulaku śarīramunu vaṃcuṭa, modalagunavi cēyaṭa namaskāramu).
(tatvamasi anu mahāvākyamulōni - jīvaparamātmala vācyārthamunu vadali lakṣyārthamunē tīsukoni ā reṃḍiṃṭiki aikyamu namaskāramu ceppunu - namaskāramucēyu jīvuḍu -namaskāramu cēyabaḍu paramātma okkaḍēyani telupunu).
‘na maḥ’ = na + maḥ = nāvāḍanukānu. paramātmaku saṃbaṃdhiṃcinavāḍanu, atani svādhīnamulōnivāḍanu ani bhagavaṃtunaku manavi cēyuṭa - nēnu cēyu kāryamulanniyu nācēta bhagavaṃtuḍē cēyiṃcucunnāḍu. ā kāryamula phalamu nādikādu).
“dhanyaṃ tadēva lagnaṃ tannakṣatrāṃ tadēva puṇyamāhuḥ |
karaṇasya ca sāddhiryatra hariḥ prājñamaskriyatē ||”
iti smṛti vākyaṃ.
(muṃdugā śrīhariki namaskāramu cēsi prāraṃbhiṃcinacō adiyē maṃcilagnamu, adiyē maṃci nakṣatramu, adiyē maṃcirōju, adiyē maṃci karaṇamu ani smṛti ceppucunnadi).
sarva dēva namaskāraḥ kēśavaṃ prati gacchati ||“.
(ākāśamunuṃḍi varṣarūpamulō bhūmimīda paḍinanīru ekkaḍapaḍinanu pallapu pradēśamagu samudramunē cērunaṭlu bhūmilōpali madhyabhāgamulōnuṃḍu ākarṣaṇaśakti ā nīrunu tana daggaragā lāgukonuṭavalana, samudramu itara pradēśamulakaṃṭe pallamugā nuṃḍuṭavalana, ekkaḍapaḍina nīrainanu - āṭaṃkamu lēniyeḍala - samudramunakē cērunu. ā prakāramugānē bhāvaṃtuḍu anni dēvatā svarūpamulu tānē ayiyuṃḍuṭavalana ē dēvuniki namaskariṃcinanu ā namaskāramu bhagavaṃtunikē cērunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.