← Back to న · Booklets 21–30 (digitized file 3)

నరకము narakamu

Original — తెలుగు
  1. దుర్గతి ; అధోగతి ; పాపములు చేయువారలను శిక్షించు నొకా నొక లోకము.

  2. “అసత్ సంసార విషయజన సంసర్గ ఏవ నరకః” (నిరాలంబోపనిషత్)

(అసత్యములందు, శాశ్వతములుగాని సంసార విషయములందాసక్తి గల పురుషులతో సంబంధమే నరకము).

  1. “శుభకర్మ విపాకాన్న నరకం యాతి కర్మభిః |

కు కర్మణాచ నరకం యాతి నానా విధం నరః |

నరకానాం చ కుండాని సంతి నానా విధాని చ |

నానా శాస్త్ర ప్రమాణేన కర్మ భేదేన యానిచ ||“. (దేవీ భాగవతము)

(శుభకర్మలు - పుణ్యములు - చేసిన ఫలమువలన నరకమును పొందరు. పాపకర్మ ఫలముగ నరకమును పొందుదురు - చేసిన కర్మల కనుగుణమగు నరకములనేకములున్నవని శాస్త్రములు చెప్పుచున్నవి).

  1. “క. శ్రీవనితాధిప నామక

థావిముఖులకిహము బరముదవ్వై పిదపం

బోవుదురు నరకమునకున్ - - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - 192)

  1. దేవ మనుష్య తిర్యగాదులకు వేరు వేరు సంచితాగామి కర్మలయందు మానుష శరీరమందలి కర్మఫలమే స్వర్గ నరక మోక్షములకు కారణమై యుండును -“.

  2. “శ్లో||. హరిసేవారతశ్శుద్ధో, యోగసిద్ధో వ్రతీసతీ తపస్వీ బ్రహ్మచారీ చ న యాంతి నరకం ధ్రువం ||” (శ్రీ దేవీ భాగవతం)

(హరి భక్తుడైనవాడు, శుద్ధుడు, యోగసిద్ధిని పొందినవాడు, వ్రతములు చేయువాడు, బ్రహ్మచారి యైనవాడు నరకమును పొందరు).

  1. “సప్తరౌరవాదయో నరకాః పాప ఫల భూమిత్వేన స్మర్యంతే పౌరాణికైః. తాన్ పాపినః ప్రాప్నువంతి, న చంద్రలోకం”.

(రౌరవము మొదలగు నరకములు పాప ఫలముననుభవింప చేయునవి ఏడు ఉన్నవని పౌరాణికులు చెప్పు దురు - పాపులు వాటిని పొందుదురు. వారు భూమాది మార్గముగా పితృలోకము, చంద్రలోకమును పొందరు).

  1. “నరకానేక వింశత్యా సంఖయా వర్ణయంతిహి |

అష్టావింశమితాన్ కేచిత్ తాననుక్రమతే బ్రవే |

తామిస్ర అంధతామిశ్రో రౌరవోపి పితృ తృతీయకః |

మహారౌరవ నామాచకుంభీపాకో పరోమతః |

కాలసూత్రం తదావాసి పత్రారణ్య ముదాహృతం |

సూకరస్య ముఖం చాం ధకూపో ధక్రిమి భోజనః |

సం దం శస్తప్త మూర్తిశ్చ వజ్రకంటక ఏవచ |

శాల్మలీ బాధ దేవర్షే నామ్నా వైతరణీ తథా |

పూయోదః ప్రాణరోదశ్చ తథా విశసనం మతం |

లాలా భక్షస్సారమేయ యాదనముక్త మతః పరం |

అవీ చిరప్యయఃపానం క్షారకర్దమ ఏవచ |

రక్షో గణాఖ్య సంభోజ శూలప్రోతోప్యతః పరం |

దందశూకోవటారో పర్యావర్తనకః పరం |

శూచీముఖమితి ప్రోక్తాః అష్టావింశతి నారకాః |

ఇత్యేతే నారకానామ యాతనా భూమయః పరా |

కర్మభిశ్చాపి భూతానాం గమ్యా పద్మజసంభవ || (దేవీ భాగవతం)

(నరకములు ఇరువదియొకటియని కొందఱి యభిప్రాయము - మఱికొందఱి అభిప్రాయములో ఇరువది ఎనిమిది నరకములున్నవి - తామిశ్రము, అంధతామిశ్రము, రౌరవము, మహారౌరవము,కుంభీపాకము,కాలసూత్రము, అనిపత్రారణ్యము, సూకరముఖము, అంధకూపము, క్రిమిభోజనము, నందంశము, తప్తోల్మియు, వజ్రకంటకము, శాల్మలి, వైతరణి, పుం యోదము, ప్రాణరోధము, విశసనము, లాలాభక్షణము, సారమేయాదనము, అవీచిరయము, రేతఃపానము, అను ఇరువదియొక్క మహానరకములు, క్షారకర్ధమము, రక్షోగణభోజనము, శూలపోతము, దందశూకము, నివటనిరోధము, పర్యావర్తనము, సూచీముఖము అను ఏడుకలిసి ఇరువది ఎనిమిది నరకములు).

  1. “క. ఎడతెగక ముజ్జగంబుల

కడపల నయ్యామ్య దిశను గదలకనిలుచుం

గడుఘోరములుగ నరకము

లడరంగా నంతరాళమందులనధిపా.

వ. మఱియు దక్షిణంబున - - అచ్చట పితౄపతియగు శయనుండు దనలోకంబునకుం జనుదెంచు జంతువుల కర్మంబులకుం దగిన ఫలంబులనిచ్చి శిక్షించుచునుండు. అందు దామిశ్రంబును నంధతామిశ్రంబును,, రౌరవంబును, మహారౌరవంబును, గుంభీపాకంబును, గాలసూత్రంబును - - అను ఏక వింశతిమహానరకంబులును మఱియును - - - సప్తవిధ నరకంబులతోడం గూడి యష్టా వింశతి నరకంబులు గలవని కొందఱు నుడువుదురు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 7 - 133,134)

Transliteration
  1. durgati ; adhōgati ; pāpamulu cēyuvāralanu śikṣiṃcu nokā noka lōkamu.

  2. “asat saṃsāra viṣayajana saṃsarga ēva narakaḥ” (nirālaṃbōpaniṣat)

(asatyamulaṃdu, śāśvatamulugāni saṃsāra viṣayamulaṃdāsakti gala puruṣulatō saṃbaṃdhamē narakamu).

  1. “śubhakarma vipākānna narakaṃ yāti karmabhiḥ |

ku karmaṇāca narakaṃ yāti nānā vidhaṃ naraḥ |

narakānāṃ ca kuṃḍāni saṃti nānā vidhāni ca |

nānā śāstra pramāṇēna karma bhēdēna yānica ||“. (dēvī bhāgavatamu)

(śubhakarmalu - puṇyamulu - cēsina phalamuvalana narakamunu poṃdaru. pāpakarma phalamuga narakamunu poṃduduru - cēsina karmala kanuguṇamagu narakamulanēkamulunnavani śāstramulu ceppucunnavi).

  1. “ka. śrīvanitādhipa nāmaka

thāvimukhulakihamu baramudavvai pidapaṃ

bōvuduru narakamunakun - - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - 192)

  1. dēva manuṣya tiryagādulaku vēru vēru saṃcitāgāmi karmalayaṃdu mānuṣa śarīramaṃdali karmaphalamē svarga naraka mōkṣamulaku kāraṇamai yuṃḍunu -“.

  2. “ślō||. harisēvārataśśuddhō, yōgasiddhō vratīsatī tapasvī brahmacārī ca na yāṃti narakaṃ dhruvaṃ ||” (śrī dēvī bhāgavataṃ)

(hari bhaktuḍainavāḍu, śuddhuḍu, yōgasiddhini poṃdinavāḍu, vratamulu cēyuvāḍu, brahmacāri yainavāḍu narakamunu poṃdaru).

  1. “saptarauravādayō narakāḥ pāpa phala bhūmitvēna smaryaṃtē paurāṇikaiḥ. tān pāpinaḥ prāpnuvaṃti, na caṃdralōkaṃ”.

(rauravamu modalagu narakamulu pāpa phalamunanubhaviṃpa cēyunavi ēḍu unnavani paurāṇikulu ceppu duru - pāpulu vāṭini poṃduduru. vāru bhūmādi mārgamugā pitṛlōkamu, caṃdralōkamunu poṃdaru).

  1. “narakānēka viṃśatyā saṃkhayā varṇayaṃtihi |

aṣṭāviṃśamitān kēcit tānanukramatē bravē |

tāmisra aṃdhatāmiśrō rauravōpi pitṛ tṛtīyakaḥ |

mahāraurava nāmācakuṃbhīpākō parōmataḥ |

kālasūtraṃ tadāvāsi patrāraṇya mudāhṛtaṃ |

sūkarasya mukhaṃ cāṃ dhakūpō dhakrimi bhōjanaḥ |

saṃ daṃ śastapta mūrtiśca vajrakaṃṭaka ēvaca |

śālmalī bādha dēvarṣē nāmnā vaitaraṇī tathā |

pūyōdaḥ prāṇarōdaśca tathā viśasanaṃ mataṃ |

lālā bhakṣassāramēya yādanamukta mataḥ paraṃ |

avī cirapyayaḥpānaṃ kṣārakardama ēvaca |

rakṣō gaṇākhya saṃbhōja śūlaprōtōpyataḥ paraṃ |

daṃdaśūkōvaṭārō paryāvartanakaḥ paraṃ |

śūcīmukhamiti prōktāḥ aṣṭāviṃśati nārakāḥ |

ityētē nārakānāma yātanā bhūmayaḥ parā |

karmabhiścāpi bhūtānāṃ gamyā padmajasaṃbhava || (dēvī bhāgavataṃ)

(narakamulu iruvadiyokaṭiyani koṃdaṟi yabhiprāyamu - maṟikoṃdaṟi abhiprāyamulō iruvadi enimidi narakamulunnavi - tāmiśramu, aṃdhatāmiśramu, rauravamu, mahārauravamu,kuṃbhīpākamu,kālasūtramu, anipatrāraṇyamu, sūkaramukhamu, aṃdhakūpamu, krimibhōjanamu, naṃdaṃśamu, taptōlmiyu, vajrakaṃṭakamu, śālmali, vaitaraṇi, puṃ yōdamu, prāṇarōdhamu, viśasanamu, lālābhakṣaṇamu, sāramēyādanamu, avīcirayamu, rētaḥpānamu, anu iruvadiyokka mahānarakamulu, kṣārakardhamamu, rakṣōgaṇabhōjanamu, śūlapōtamu, daṃdaśūkamu, nivaṭanirōdhamu, paryāvartanamu, sūcīmukhamu anu ēḍukalisi iruvadi enimidi narakamulu).

  1. “ka. eḍategaka mujjagaṃbula

kaḍapala nayyāmya diśanu gadalakanilucuṃ

gaḍughōramuluga narakamu

laḍaraṃgā naṃtarāḷamaṃdulanadhipā.

va. maṟiyu dakṣiṇaṃbuna - - accaṭa pitṝpatiyagu śayanuṃḍu danalōkaṃbunakuṃ janudeṃcu jaṃtuvula karmaṃbulakuṃ dagina phalaṃbulanicci śikṣiṃcucunuṃḍu. aṃdu dāmiśraṃbunu naṃdhatāmiśraṃbunu,, rauravaṃbunu, mahārauravaṃbunu, guṃbhīpākaṃbunu, gālasūtraṃbunu - - anu ēka viṃśatimahānarakaṃbulunu maṟiyunu - - - saptavidha narakaṃbulatōḍaṃ gūḍi yaṣṭā viṃśati narakaṃbulu galavani koṃdaṟu nuḍuvuduru”. (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 7 - 133,134)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.