← Back to న · Booklets 21–30 (digitized file 3)

నారాయణపరాః nārāyaṇaparāḥ

Original — తెలుగు
  1. నారాయణపరం కారణం యేషాం తే, నారాయణ వైభవ ప్రతిపాదక ఏవ ముఖ్య తాత్పర్య వంతః వేదాః నారాయణ పరాః - నారాయణారాధన రూపాః (క్రతువః); నారాయణప్రీతి జనకాః (సర్వే యోగాః) ; తపః జ్ఞానం (పరమభక్తిరూపం) భగవదారాధన రూపం - నారాయణాధీనాః (పరమ పురుషార్థం).

(నారాయణుడే పరమకారణము - అన్నిటికీ కారణమైనవాడు , అనితలచువారు - నారాయణుని వైభవమే ముఖ్యమైన తాత్పర్యముగా గలవాడు. వేదములు నారాయణపరములు - నారాయణని గుఱించి చెప్పునవి - యజ్ఞములు నారాయణపరములు. నారాయణునకు ప్రీతి కలుగచేయునవి. అన్ని యోగములు - తపస్సు, జ్ఞానము నారాయణునందు పరమభక్తిని కలుగచేయునవి. పరమపురుషార్ధమైన మోక్షము నారాయణుని ఆధీనములోనున్నది - మోక్షము నిచ్చువాడు నారాయణుడు).

  1. "తపో నారాయణపరం తదారాధన రూపం; జ్ఞానం పరమభక్తి రూపం; గతిః పరపమ పురుషార్థ సిధిః అపి నారాయణపరా, తదధీనా ; యోగాః నారాయణ పరాః, తత్ప్రీతి సం జననాః; క్రతవః నారాయణారాధన రూపాః; నర్ద్యే లోకాః నారాయణపరాః , తన్నియమ్యాః; సర్వే వేదాః నారాయణ పరాః నారాయణ వైభవ ప్రతిపాదనా ఏవ ముఖ్య తాత్పర్యవంతః"

(తపస్సు నారాయణపరము - నారాయణుని అరాధించునదికనుక, పరమభక్తి రూపమగుటచేత జ్ఞానము. జ్ఞానము నారాయణ పరము - పరమగతి పరమప్రాప్యస్థానము, మోక్షము నారాయణుని ఆధీనములో నున్నది, మోక్షమునిచ్చు వాడు - ముకుందుడు - "ముకుం మోక్షం దథాతీతి ముకుందః" అతనే మోక్షస్థానమైనవాడు. యోగములు నారాయణునికి ప్రీతి కలుగచేయునవి కనుక నారాయణపరములు - యజ్ఞములు నారాయణుని ఆరాధన చేయునవికనుక నారాయణపరములు - సమస్త లోకములు నారాయణునిచే నిర్మింపబడినవికనుక అవి నారాయణపరములు.వేదములు నారాయణుని వైభవము ప్రతిపాదించుటే వాటి అభిప్రాయము కనుక వేదములు నారాయణపరములు)

  1. "వర్షాసు సరిద్భిః సమృద్ధోపి సాగరో యథానోత్సర్పేత, గ్రీష్మే తద్విహీనోపి న శుష్యేత్, తథా సమృద్ధకమః తత్ హనోవా న హృష్యేత్, నచశోచేత్ ఇత్యర్థః - అత్ర హేతుః నారాయణపరః, నతు విషయ పరః".

(వర్షాకాలమందు వర్షములు పడుటవలన నదులు సముద్రములో సమృద్ధిగా కలిసి నప్పటికీ సముద్రము పొంగదు - హెచ్చుకాదు. ఎండాకాలములో మండుటెండలవలన సముద్రము తగ్గిపోవుటలేదు. ఆ ప్రకారముగానే కోరికలు పూర్తి అయినను నారాయణపరుడైనవాడు సంతోషించడు, కోరికలు తీరకపోయిన దుఃఖపడడు).

Transliteration
  1. nārāyaṇaparaṃ kāraṇaṃ yēṣāṃ tē, nārāyaṇa vaibhava pratipādaka ēva mukhya tātparya vaṃtaḥ vēdāḥ nārāyaṇa parāḥ - nārāyaṇārādhana rūpāḥ (kratuvaḥ); nārāyaṇaprīti janakāḥ (sarvē yōgāḥ) ; tapaḥ jñānaṃ (paramabhaktirūpaṃ) bhagavadārādhana rūpaṃ - nārāyaṇādhīnāḥ (parama puruṣārthaṃ).

(nārāyaṇuḍē paramakāraṇamu - anniṭikī kāraṇamainavāḍu , anitalacuvāru - nārāyaṇuni vaibhavamē mukhyamaina tātparyamugā galavāḍu. vēdamulu nārāyaṇaparamulu - nārāyaṇani guṟiṃci ceppunavi - yajñamulu nārāyaṇaparamulu. nārāyaṇunaku prīti kalugacēyunavi. anni yōgamulu - tapassu, jñānamu nārāyaṇunaṃdu paramabhaktini kalugacēyunavi. paramapuruṣārdhamaina mōkṣamu nārāyaṇuni ādhīnamulōnunnadi - mōkṣamu niccuvāḍu nārāyaṇuḍu).

  1. "tapō nārāyaṇaparaṃ tadārādhana rūpaṃ; jñānaṃ paramabhakti rūpaṃ; gatiḥ parapama puruṣārtha sidhiḥ api nārāyaṇaparā, tadadhīnā ; yōgāḥ nārāyaṇa parāḥ, tatprīti saṃ jananāḥ; kratavaḥ nārāyaṇārādhana rūpāḥ; nardyē lōkāḥ nārāyaṇaparāḥ , tanniyamyāḥ; sarvē vēdāḥ nārāyaṇa parāḥ nārāyaṇa vaibhava pratipādanā ēva mukhya tātparyavaṃtaḥ"

(tapassu nārāyaṇaparamu - nārāyaṇuni arādhiṃcunadikanuka, paramabhakti rūpamaguṭacēta jñānamu. jñānamu nārāyaṇa paramu - paramagati paramaprāpyasthānamu, mōkṣamu nārāyaṇuni ādhīnamulō nunnadi, mōkṣamuniccu vāḍu - mukuṃduḍu - "mukuṃ mōkṣaṃ dathātīti mukuṃdaḥ" atanē mōkṣasthānamainavāḍu. yōgamulu nārāyaṇuniki prīti kalugacēyunavi kanuka nārāyaṇaparamulu - yajñamulu nārāyaṇuni ārādhana cēyunavikanuka nārāyaṇaparamulu - samasta lōkamulu nārāyaṇunicē nirmiṃpabaḍinavikanuka avi nārāyaṇaparamulu.vēdamulu nārāyaṇuni vaibhavamu pratipādiṃcuṭē vāṭi abhiprāyamu kanuka vēdamulu nārāyaṇaparamulu)

  1. "varṣāsu saridbhiḥ samṛddhōpi sāgarō yathānōtsarpēta, grīṣmē tadvihīnōpi na śuṣyēt, tathā samṛddhakamaḥ tat hanōvā na hṛṣyēt, nacaśōcēt ityarthaḥ - atra hētuḥ nārāyaṇaparaḥ, natu viṣaya paraḥ".

(varṣākālamaṃdu varṣamulu paḍuṭavalana nadulu samudramulō samṛddhigā kalisi nappaṭikī samudramu poṃgadu - heccukādu. eṃḍākālamulō maṃḍuṭeṃḍalavalana samudramu taggipōvuṭalēdu. ā prakāramugānē kōrikalu pūrti ayinanu nārāyaṇaparuḍainavāḍu saṃtōṣiṃcaḍu, kōrikalu tīrakapōyina duḥkhapaḍaḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.