← Back to న · Booklets 21–30 (digitized file 3)

నారాయణుడు nārāyaṇuḍu

Original — తెలుగు
  1. నరః ఆత్మా, తతో జాతాని ఆకాశాదీని నారాణి కార్యాణి, తాని కార్యాణి అయంకారణాత్మనా వ్యాప్నోతి; అతశ్చ తాన్యయనం అస్య ఇతి నారాయణః (శ్రీ శంకరః)

(నరుడు అనగా పరమాత్మ. ఆత్మవలన - ఆత్మలోనుండి పుట్టిన ఆకాశము మొదలగు కార్యవస్తువులన్ని యు నారములు. ఆ నారములను ఆకాశము మొదలు సమస్త భూతములందు కారణవస్తువుగా ప్రవేశించి, వ్యాపించి, అదియే తనకు అయనముగా - నివాసస్థానముగా - గలవాడు నారాయణుడు).

  1. "నరాజ్జాతాని తత్వాని నారాణీతి తతో విదుః |

తన్యేవ చాయనం తస్య తేన నారాయణ స్స్మృతిః ||" (మహాభారతము - ఉద్యోగపర్వము)

(నరునివలన పుట్టినవి నారములు, తత్వములు. ఈ తత్వములే అయనముగా గలవాడు, నివాసముగా గల వాడు - వాటిలో నివసించియుండువాడు కనుక నారాయణుడు అని చెప్పబడుచున్నాడు).

  1. "నృనయన్ నరః నేతా, సర్వస్య స్వామీ - తస్యా పత్యాని నరాః, సర్వే చేతనా అచేతనా శ్చ; తేషామయనంప్రతిష్టాత్వే న ఆశ్రయభూతః - జలచంద్రాణాం బింబ చద్రవత్ కథే తదీనాం శక్త్యాది వచ్చ నారాయణః".

(నేతృత్వముచే - నరులకు నేతగా నుండువాడు, నడిపించువాడు, అన్నింటికి స్వామి, ప్రభువు అయినవాడు - అతనినుండి పుట్టినవారు నరులు - సమస్తమైన చేతనములు. అచేతనములు, వాటికి ఆశ్రయమైనవాడు - జలములోని చంద్రబింబములకు చంద్రబింబమువలె).

  1. నరాణాం సృష్టినాం ప్రజానాం మధ్యే అను ప్రవిశ్యస్థితత్వాత్ నరాః ఏవ ఆశ్రయో యస్య సః-

(తాను సృష్టించిన నరుల మధ్య (నరులలో) ప్రవేశించి యుండుటచేత ఆ నరులే ఆశ్రయముగా - నివసించు స్థానముగా - గలవాడు).

  1. "నరాజ్జాతాని (ఉద్భూతాః) యే అర్థాః చతుర్వింశతి తత్వాని అయనాద్యోనారాయణః ప్రసిద్ధః".

(నరునిలోనుండి పుట్టినవి ఇరువదినాలుగు తత్వములు అవి అయనముగా గలవాడు నారాయణుడు).

  1. నరాణాం జీవానాం అయనత్వాత్ ప్రలయే ఇతివా.

(ప్రళయకాలమందు జీవులు పరమాత్మలో లయమైపోవుదురుకనుక నారాయణుడు - అయనం అనగా మోక్షస్థానము).

  1. యత్రసూరయః నరమం తే తత్ నరం, స్వావిద్యాపగతత్కార్యజాతం, తదేవనారం, తత్ యత్రపర్యవస్యతి తద్థి తద్థి తస్య అయనం అధికరణం నారాయణ శబ్దార్థః ".

(సూరిజనులు - బ్రహ్మజ్ఞానము గలవారు, మహాభక్తులు - భగవంతునియందు రమించెదరు. అందుచేతనే భగవంతునకు రాముడని పేరువచ్చినది. వారు ఎక్కడ రమించరో అది నరశబ్దముచేత - నర అను మాటచేత చెప్పబడుచున్నది - ఈ నరశబ్దమునకర్థము అవిద్య దాని కార్యములు. నరయే నారము. ఆ నారము దేనియందు పర్యవసించునో - అవసానమును పొందునో - అదియే దానికి అయనము - దానిని అధికరించియుండువాడు, నారాయణశబ్దమున కర్థము).

  1. నారస్య జ్ఞానస్య ముక్తేర్వా అయనం ప్రాప్తిః - సర్వ ప్రాణి బుద్ధి గుహా నివాసాత్ శుద్ధ చైతన్యం.

(జ్ఞానమునకు లేక ముక్తికి ప్రాప్తిస్థానము . సమస్త ప్రాణులయొక్క బుద్ధియను గుహయందు నివసించుటవలన శుద్ధ చైతన్యమే నారాయణుడు).

  1. "నరాః ఏవ నారాః; జీవాః, త్వం పదవాచ్యాః తేషానుయనం అధిష్టానం తత్పదవాచ్యం పరబ్రహ్మ"

(నరులే నారములు, జీవులు. 'తత్వమసి' అను మహావాక్యములోని 'త్వం' (నీవు) అను పదమునకు వాచ్యార్ధము అట్టినరులకు - జీవులకు అయనము అధిష్టానము - 'తత్' పదమునకు వాచ్యార్ధమైన పరబ్రహ్మ. అందుచేత నారాయణుడనగా పరబ్రహ్మ).

  1. "నరాణాం గంతవ్యం" ( నరులకు గమ్యస్థానము - నరులు పొందవలసినచోటు - గత, పరమపదము).

  2. "పురుషో అండం వినిర్భద్య యదా సౌ వినిర్గతః |

ఆత్మనో (అ)యనమన్విచ్ఛన్నపో (అ)సాక్షీ చ్ఛుభిః శుచీః |

సాస్వాసీత్స్వ సృష్టాను సహస్ర పరివత్సరాన్ |

తేన నారాయణో నామ యదాపః పురుషోద్భవః |

ద్రవ్యం కర్మచ కాలం చ స్వభావో జీవ ఏవచ |

యదనుగ్రహతః సంతి, న సంతి యదుపేక్షయా ||". (శ్రీమద్భాగవతం - 2 -10 -10)

(పరమపురుషుడు బ్రహ్మాండమును - అండాకారముగనున్న - కోడిగుడ్డు ఆకారముగానున్న - బ్రహ్మను బ్రహ్మపదార్ధము - లోకములను సృష్టించగలుగు పదార్ధము అండరూపములోనున్నదానిని, చతుర్ముఖబ్రహ్మను - పగిల్చి, వెలికివచ్చి, తానుండుటకు నివాసస్థానమును అన్వేష్టించి (వెదకి) శుద్ధమైన జలములను సూక్ష్మ రూపములోనుండు జలములను) - (hydrogen gas ?) (first element) సృష్టించెను. తనచేత అట్లు సృజించబడిన జలములందు వేయి సంవత్సరములుండెను - ఈ జలములు (నారములు) (నరునివలన పుట్టినవి) నరుడు అయిన పురుషుడైన తనలోనుండి పుట్టినవి కనుక, అవి అతనికి అయనము - నివాసస్థానము - అగుటచేతను, పరమపురుషుడు నారాయణుడని చెప్పబడుచున్నాడు - సృష్టికి కావలసిన ద్రవ్యము, కర్మ,కాలము,స్వభావము ఆ నారాయణుని అనుగ్రహమువలన కలుగును, అనుగ్రహము లేక కలుగక పోవును) (ఇది ఆ మొదటి జలములనుండియే కలిగినవి).

  1. "భగవాన్ ఆదౌ అండం అండకోశం వినిర్భిద్య భిత్స్యా యదా వినిర్గతః, తదా ఆత్మనః స్వస్య అయనం అన్విచ్ఛన్ స్థానం అపేక్షమాణస్సన్ శుచీరాపో జలాన్ ససర్జ, స్వ సౄష్టాసు స్వేన నిర్మితాను తాసు అప్సు సహస్ర పరివత్సరాన్ అవాత్సత్, మహాంభసి శయనం చకార. తేన అప్సు అవస్థానేన నారాయణోనామ, నారాయణో ఇతి ప్రసిద్ధః".

(భగవంతుడైన పరమాత్మ సృష్టిప్రారంభములో బ్రహ్మాండమును (అండాకారముగనుండి - గుడ్డువలెనుండి - బ్రహ్మయని చెప్పబడుదానిని) భేధించి - బద్దలు చేసికొని - పైకి వచ్చి, తనకు నివాసస్థానమును అపేక్షించి, శుద్ధమైన జలములను సౄష్టించెను. తనచేత సృష్టింపబడిన జలములందు వేయి సంవత్సరములుండెను. అనగా, ఆ మహోదకములో - క్షీరసాగరములో శయనించెను. అట్లు జలములలో (నారములలో) వసించియుండుటవలన నారాయణుడని చెప్పబడుచున్నాడు).

  1. "వ. అమ్మహాత్ముండు లీలార్థంబై జగత్సర్జనంబుసేయు తలంపున బ్రహ్మాండంబుని నిర్భేదించి, తనకు సుఖశయనంబు నపేక్షించి మొదల జలతత్వంబు సృజియించె, స్వతః పరిశుద్ధుండుగావున స్వ స్వష్టంబై యేకార్ణవాకారంబైన జలరాశి యందు శయనంబు సేయుటంజేసి - "ఆపోనారా ఇతి ప్రోక్త ఆపో వైనర సూనవః | అయనం తస్యతాః పూర్వం తేన నారాయణ స్స్మృతః ||" అను ప్రమాణముచొప్పున నారాయణ శబ్ద వాచ్యుండు - - ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - 268)

  2. "అపో నారా ఇతి ప్రోక్తా - - - తేన నారాయణస్స్మృతః " (ఛూడుము - 13) - ఇతి స్మృతి సిద్దః స్థూల దృశాం నారాయణ శబ్దార్థః . సూక్ష్మ దర్శినః పునరా చక్షతే - నరశబ్దేన చరాచరాత్మకం శరీరజాతం ఉచ్యతే. తత్రనిత్య సన్నిహితాః చిదా భాసాః జీవాః నారాః ఇతి నిరుచ్యతే. తేషాం అయనం, ఆశ్రయో, నియామకో అంతర్యామీ నారాయణః ఇతి " (శ్రీ అనందగిరి)

(నరుడు అనగా పరమాత్మ. పరమాత్మలోనుండి పుట్టినవి నారములు. నారములనగా ఉదకములు. మొదటపరమాత్మకు ఉదకములు నివాసస్థానము - అందుచేత నారాయణుడు అనగా ఉదకములు నివాసస్థానముగా గలవాడు, అని స్థూల దృష్టికి అర్థమగుచున్నది. సూక్ష్మ దృష్టిగలవారు ఈ ప్రకారముగా దీనికి అర్థము చెప్పుచున్నారు - నరుడు అనగా చరాచర రూపమైన శరీరములు వాటిలో చిదాభాసుడను జీవులు నారములు అని చెప్పబడుచున్నవి. ఆ జీవులకు - ప్రతి శరీరములోనుండు జీవులకు ఆశ్రయమైనవాడు - వాటిలో అంతర్యామిగానుండి వాటిని వాటి వాటి పనులలో నియమించువాడు. కనుక నారాయణుడని చెప్పబడుచున్నాడు).

  1. నారం జీవసమూహం అయనం ఆశ్రయో యస్య సః - సర్వ దేహి నామాత్మత్వాత్ నారాయణః ఇతి భావః -

(నారములనగా జీవ సమూహము - జీవులు. జీవ సమూహము ఆశ్రయముగా గలవాడు కనుక నారాయణుడు - సమస్త దేహములకు ఆత్మ అయినవాడు).

  1. నరీయతే నక్షీయతే ఇతి నరోభగవాన్, అతో, నరోత్పన్నత్వాత్ నారాః ఆపః అయనం యస్యసః నారాయణ ఇతి ప్రోక్తః.

(క్షీణించుట లేనివాడుకనుక భగవంతుడు నరుడు - నరుడు వలన, నరునిలోనుండి పుట్టినటువంటి ఆపః (ఉదకములు) అయనము. (నివాసస్థానముగా గలవాడు కనుక నారాయణుడు).

  1. "జలము, నారము, జీవ చయము నారము, అందు నీవుండుట నీయందవి యుండుటను నారాయణుడను నామమయ్యె"

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10.- పూ.భా. - 561)

  1. నారా ఆపో అయనం యస్య సః నారాయణః - యస్మాత్ కారణాత్ ఆదౌ ఆపః పురుషోద్భవః అతః ఆపో నారా ఇత్యుచ్యంతే.

(పురుషుడగు పరబ్రహ్మనుండి మొదట ఉదకములు పుట్టినవి. ఈ కారణమువలన ఉదకములు నారములు అని చెప్పబడినవి).

  1. ఆపః గర్భోదక సంజ్ఞాః, అప్సు వాసేన పురుషః నరః - తస్మాదుద్భవః యాసాం నారాం ఆపః అయనంఅన్య ఇతి నారాయణః ఇత్యర్థః.

(ఆపః అనగా గర్భోదకములు, వాటియందు నివసించువాడు నరుడు. అతని వలన పుట్టినవి నారములు- ఉదకములు. అవి అయనముగా గలవాడు నారాయణుడు).

  1. "సీ. నళినాక్ష ! నీవాదినారాయణుండవు; జలము నారము, జీవచయము నార

మందు నీవుంట నీయందవి యుంటను నారాయణుండను నామమయ్యె" (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా.- 560, 561)

  1. “నరాజ్జాతాని తత్వని నారాణీతి తతో విదుః |

తాన్యేవ చాయనం తస్య తేన నారాయణ స్స్మృతః ||". (మహభారతము - )

(నరుడనగా భగవంతుడు - అతనిలోనుండి పుట్టిన తత్వములు నారములు. అవియే అయనముగా గలవాడు, వాటికి ప్రళయస్థానము అగువాడు నారాయణుడు) - "తత్వం నారాయణః పరః" (మంత్రపుష్పము)

  1. నరాణా సమూహస్య స్వామిత్వేన, అధవా, ఉపాదానత్వేన పంచభూతాత్మనా స్థితః.

( నరులకు స్వామియగుటవలన నారాయణుడని చెప్పబడుచున్నాడు, లేక నరులకు ఉపాదానమైన పంచభూతములు తానే అయినందున నారాయణుడు).

  1. "నరశరీరాణాం ఉపాదాన రూపాణి అన్నాది పంచభూతాని నారశబ్దేన ఉచ్యంతే. తేషు భూతేషు యా ఆపో ముఖ్యాః తా అయనం అధారో యస్య విష్ణోః సో అయం నారాయణః - సముద్ర జలశాయీ ఇత్యర్థః".

(నరుల శరీరములకు ఉపాదాన కారణమైన పంచభూతములు నారములని చెప్పబడిచున్నవి. ఆ పంచభూతములలో ఆపః (ఉదకములు) ముఖ్యమైనవి. అవి అయనముగా - అనగా, ఆధారముగా - గలవాడు - క్షీరసాగర శయనుడు అగు విష్ణువు).

(జీవుల శరీరము పంచభూతమయమైనను శరీరమంతటకు మనము తినిన ఆహారరసమును పంచియిచ్చుట ఉదకములద్వారానే యగుచున్నది. శరీరములోనున్నది మూడొంతులకు పైగానున్నది జలములే - సూక్ష్మ రూపములోనున్న జలము ప్రాణవాయువుతోకలిసి స్థూలరూపములోనుండు జలమగుచున్నది (Hydrogen gas + Oxygen = water) అందుచేత జలములో ప్రాణవాయువురూపములో భగవంతుడున్నాడు - జలములేనిచోట జీవుడుండడు - ( Hydrogen is the first and simplest element which developes into other elements due to the existence of God in it).

  1. "క. నారములనగా జలముల

పేర యనంబనగనెలవు; ప్రీతిగనాకున్|

నారముల యనంబగుటను

నారాయణుడండ్రు జనులు నన్ను గిరీటీ".

  1. "క. పరమ బ్రహ్మ మనంగా

బరతత్వమనంగ, బరమపదమనగను, నీ

శ్వరుడన, కృష్ణుడన, జగ

ద్భరితుడు నారాయణుండు దా వెలుగొందున్". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 51)

  1. "ద్రవ్యం కర్మచ కాలంచ స్వభావో జీవ ఏవచ |

యదనుగ్రహతః సంతి, నసంతి యదుపేక్షయా" -

"వాసుదేవాత్పరో బ్రహ్మ నచాన్యో (అ)ర్థోస్తి తత్వతః |

నారాయణపరావేదా దేవాః నారాయణాంగజాః |

నారాయణ పరోలోకా నారాయణ పరోమఖాః |

నారాయణపరో యోగో నారాయణ పరంతపః |

నారాయణ పరం జ్ఞానం నారాయణపరా గతిః ||". (శ్రీమద్భాగవతం - 2 - 5 - 14 to 16)

"దేహంబునకు ద్రవ్యంబులైన మహాభూతంబులునూ, జన్మ నిమిత్తంబులైన కర్మంబులును, గర్మ్షోభకంబైన కాలంబును, గాలపరిమాణహేతువైన స్వభావంబును భోక్త అయిన జీవుండును వాసుదేవుండుగా నెఱుంగుము - వాసుదేవ వ్యతిరిక్తంబులేదు, సిద్ధంబు - నారాయణ నియమ్యంబులు లోకంబులు - దేవతులు నారాయణ శరీర సంభూతులు. వేదయాగ తపోయాగ జ్ఞానంబులు నారాయణపరంబులు - జ్ఞాన సాధ్యంబగు ఫల్బు నారాయణాధీనంబు " (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 84)

"విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం |

- - -

నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం |

నారాయణః పరోజ్యోతిరాత్మా నారాయణః పరః |

నారాయణ పరోధ్యాతా, ధ్యానం నారాయణః పరః ||".

ఇతి మంత్ర వర్ణాత్ (నారాయణోపనిషత్)

(ప్రపంచము నారాయణుడు - నారాయణుని స్థూలరూపము. నారాయణుడు క్షీణించనివాడు; పరమ పదమగు వైకుంఠమే తాను అయినవాడు; ప్రపంచమంతకును ఆత్మ అయినవాడు, పరంజ్యోతిస్వరూపుడు, ధ్యానము చేయుటకు తగినవాడు, ధ్యానము, ధ్యానముచేయువాడు అతనే. అతనే పరతత్వమైనవాడు).

  1. "అలోఢ్య సర్వ శాస్త్రాణి విచార్య చ పునః పునః |

ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణస్సదా ||".

(సమస్త శాస్త్రములను గాలించి, మరల మరల విచారించగా తేలిన సారాంశమేమనగా - శ్రీమన్నారాయణుడు ఎల్లపుడు ధ్యానించ తగినవాడు. ఎల్లపుడు నారాయణుని ధ్యానించవలెను - మరణకాలమందు నారాయణుని ధ్యానించిన నారాయణునేపొందును గనుకను, మరణము ఎప్పుడు వచ్చునో తెలియదు కనుక, ఎల్లపుడు - తీరిక అయినపుడల్లా, లేక తీరిక చేసుకొని అయినను నారాయణుని ధ్యానించవలెను).

  1. "మోక్షమిచ్చుటంజేసి నారాయణుండు పూజ్యుండు" (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 - 24)

  2. "యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపివా |

అంతర్బహిశ్చ తత్సర్వం వాప్య నారాయణస్థితః " (నారాయణోపనిషత్)

(కంటికి ఎంత కనబడుచున్నదో అదియును, ఇంకా ఉన్నది అని చూచినవారు చెప్పుటచే ఉన్నదన్నీ, ఈ రెండువిధములకాక ఉన్నదంత ఎంతయున్నదో అట్టి జగత్తు అంతటిని, లోపల పైన పూర్తిగా నారాయణుడు వ్యాపించియున్నాడు).

"అధ నిత్యో నారాయణః బ్రహ్మ, నారాయణః శివశ్చ, నారాయణః శక్రశ్చ, నారాయణః కాలశ్చ, నారాయణః దిశశ్చ, నారాయణః విదిశశ్చ, నారాయణః అంతర్బహిశ్చ, నారాయణ ఏ వేదం సర్వం యద్భూతం, యచ్చ భవ్యం, నిష్కలంకో, నిరంజనో, నిర్వికల్పో, నిరాజాతః, శుద్ధో దేవ ఏకో నారాయణో నద్వితీయో (అ)స్తి కశ్చిత్"

(నారాయణుడు శాశ్వతముగా నుండువాడు. అతనే బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, కాలము, దిక్కులు, విదిక్కులు, ఊర్ధ్వదిక్కు, అధోదిక్కు, అన్నింటిలోపల పైన నుండువాడు అతనే. ఈ సమస్తమైన ప్రపంచము - పుట్టినది, పుట్టబోవునది నారాయణుడే. అతను కళంకము లేనివాడు, నిరంజనుడు, నిర్వికల్పుడు,శుద్ధుడు. ఉన్నవాడు నారాయణుడొక్కడే, రెండవవాడు - రెండవవస్తువు అనునది ఏదియు - లేదు - "ఉండేదీ రాముడొకడు, ఊరక చేడిపోకే మనసా" - )

  1. “ఫ్రళయోదకశాయి త్వత్ స తు నారాయణః".

(ప్రళయకాలమందలి మాహాసముద్రమునందు శయనించువాడు - "ఈ మర్రియాకోకో ఏకార్ణవమునాడు శేషాహిశాయికి సెజ్జయయ్యె" - వటపత్రశాయి).

Transliteration
  1. naraḥ ātmā, tatō jātāni ākāśādīni nārāṇi kāryāṇi, tāni kāryāṇi ayaṃkāraṇātmanā vyāpnōti; ataśca tānyayanaṃ asya iti nārāyaṇaḥ (śrī śaṃkaraḥ)

(naruḍu anagā paramātma. ātmavalana - ātmalōnuṃḍi puṭṭina ākāśamu modalagu kāryavastuvulanni yu nāramulu. ā nāramulanu ākāśamu modalu samasta bhūtamulaṃdu kāraṇavastuvugā pravēśiṃci, vyāpiṃci, adiyē tanaku ayanamugā - nivāsasthānamugā - galavāḍu nārāyaṇuḍu).

  1. "narājjātāni tatvāni nārāṇīti tatō viduḥ |

tanyēva cāyanaṃ tasya tēna nārāyaṇa ssmṛtiḥ ||" (mahābhāratamu - udyōgaparvamu)

(narunivalana puṭṭinavi nāramulu, tatvamulu. ī tatvamulē ayanamugā galavāḍu, nivāsamugā gala vāḍu - vāṭilō nivasiṃciyuṃḍuvāḍu kanuka nārāyaṇuḍu ani ceppabaḍucunnāḍu).

  1. "nṛnayan naraḥ nētā, sarvasya svāmī - tasyā patyāni narāḥ, sarvē cētanā acētanā śca; tēṣāmayanaṃpratiṣṭātvē na āśrayabhūtaḥ - jalacaṃdrāṇāṃ biṃba cadravat kathē tadīnāṃ śaktyādi vacca nārāyaṇaḥ".

(nētṛtvamucē - narulaku nētagā nuṃḍuvāḍu, naḍipiṃcuvāḍu, anniṃṭiki svāmi, prabhuvu ayinavāḍu - ataninuṃḍi puṭṭinavāru narulu - samastamaina cētanamulu. acētanamulu, vāṭiki āśrayamainavāḍu - jalamulōni caṃdrabiṃbamulaku caṃdrabiṃbamuvale).

  1. narāṇāṃ sṛṣṭināṃ prajānāṃ madhyē anu praviśyasthitatvāt narāḥ ēva āśrayō yasya saḥ-

(tānu sṛṣṭiṃcina narula madhya (narulalō) pravēśiṃci yuṃḍuṭacēta ā narulē āśrayamugā - nivasiṃcu sthānamugā - galavāḍu).

  1. "narājjātāni (udbhūtāḥ) yē arthāḥ caturviṃśati tatvāni ayanādyōnārāyaṇaḥ prasiddhaḥ".

(narunilōnuṃḍi puṭṭinavi iruvadinālugu tatvamulu avi ayanamugā galavāḍu nārāyaṇuḍu).

  1. narāṇāṃ jīvānāṃ ayanatvāt pralayē itivā.

(praḷayakālamaṃdu jīvulu paramātmalō layamaipōvudurukanuka nārāyaṇuḍu - ayanaṃ anagā mōkṣasthānamu).

  1. yatrasūrayaḥ naramaṃ tē tat naraṃ, svāvidyāpagatatkāryajātaṃ, tadēvanāraṃ, tat yatraparyavasyati tadthi tadthi tasya ayanaṃ adhikaraṇaṃ nārāyaṇa śabdārthaḥ ".

(sūrijanulu - brahmajñānamu galavāru, mahābhaktulu - bhagavaṃtuniyaṃdu ramiṃcedaru. aṃducētanē bhagavaṃtunaku rāmuḍani pēruvaccinadi. vāru ekkaḍa ramiṃcarō adi naraśabdamucēta - nara anu māṭacēta ceppabaḍucunnadi - ī naraśabdamunakarthamu avidya dāni kāryamulu. narayē nāramu. ā nāramu dēniyaṃdu paryavasiṃcunō - avasānamunu poṃdunō - adiyē dāniki ayanamu - dānini adhikariṃciyuṃḍuvāḍu, nārāyaṇaśabdamuna karthamu).

  1. nārasya jñānasya muktērvā ayanaṃ prāptiḥ - sarva prāṇi buddhi guhā nivāsāt śuddha caitanyaṃ.

(jñānamunaku lēka muktiki prāptisthānamu . samasta prāṇulayokka buddhiyanu guhayaṃdu nivasiṃcuṭavalana śuddha caitanyamē nārāyaṇuḍu).

  1. "narāḥ ēva nārāḥ; jīvāḥ, tvaṃ padavācyāḥ tēṣānuyanaṃ adhiṣṭānaṃ tatpadavācyaṃ parabrahma"

(narulē nāramulu, jīvulu. 'tatvamasi' anu mahāvākyamulōni 'tvaṃ' (nīvu) anu padamunaku vācyārdhamu aṭṭinarulaku - jīvulaku ayanamu adhiṣṭānamu - 'tat' padamunaku vācyārdhamaina parabrahma. aṃducēta nārāyaṇuḍanagā parabrahma).

  1. "narāṇāṃ gaṃtavyaṃ" ( narulaku gamyasthānamu - narulu poṃdavalasinacōṭu - gata, paramapadamu).

  2. "puruṣō aṃḍaṃ vinirbhadya yadā sau vinirgataḥ |

ātmanō (a)yanamanvicchannapō (a)sākṣī cchubhiḥ śucīḥ |

sāsvāsītsva sṛṣṭānu sahasra parivatsarān |

tēna nārāyaṇō nāma yadāpaḥ puruṣōdbhavaḥ |

dravyaṃ karmaca kālaṃ ca svabhāvō jīva ēvaca |

yadanugrahataḥ saṃti, na saṃti yadupēkṣayā ||". (śrīmadbhāgavataṃ - 2 -10 -10)

(paramapuruṣuḍu brahmāṃḍamunu - aṃḍākāramuganunna - kōḍiguḍḍu ākāramugānunna - brahmanu brahmapadārdhamu - lōkamulanu sṛṣṭiṃcagalugu padārdhamu aṃḍarūpamulōnunnadānini, caturmukhabrahmanu - pagilci, velikivacci, tānuṃḍuṭaku nivāsasthānamunu anvēṣṭiṃci (vedaki) śuddhamaina jalamulanu sūkṣma rūpamulōnuṃḍu jalamulanu) - (hydrogen gas ?) (first element) sṛṣṭiṃcenu. tanacēta aṭlu sṛjiṃcabaḍina jalamulaṃdu vēyi saṃvatsaramuluṃḍenu - ī jalamulu (nāramulu) (narunivalana puṭṭinavi) naruḍu ayina puruṣuḍaina tanalōnuṃḍi puṭṭinavi kanuka, avi ataniki ayanamu - nivāsasthānamu - aguṭacētanu, paramapuruṣuḍu nārāyaṇuḍani ceppabaḍucunnāḍu - sṛṣṭiki kāvalasina dravyamu, karma,kālamu,svabhāvamu ā nārāyaṇuni anugrahamuvalana kalugunu, anugrahamu lēka kalugaka pōvunu) (idi ā modaṭi jalamulanuṃḍiyē kaliginavi).

  1. "bhagavān ādau aṃḍaṃ aṃḍakōśaṃ vinirbhidya bhitsyā yadā vinirgataḥ, tadā ātmanaḥ svasya ayanaṃ anvicchan sthānaṃ apēkṣamāṇassan śucīrāpō jalān sasarja, sva sṝṣṭāsu svēna nirmitānu tāsu apsu sahasra parivatsarān avātsat, mahāṃbhasi śayanaṃ cakāra. tēna apsu avasthānēna nārāyaṇōnāma, nārāyaṇō iti prasiddhaḥ".

(bhagavaṃtuḍaina paramātma sṛṣṭiprāraṃbhamulō brahmāṃḍamunu (aṃḍākāramuganuṃḍi - guḍḍuvalenuṃḍi - brahmayani ceppabaḍudānini) bhēdhiṃci - baddalu cēsikoni - paiki vacci, tanaku nivāsasthānamunu apēkṣiṃci, śuddhamaina jalamulanu sṝṣṭiṃcenu. tanacēta sṛṣṭiṃpabaḍina jalamulaṃdu vēyi saṃvatsaramuluṃḍenu. anagā, ā mahōdakamulō - kṣīrasāgaramulō śayaniṃcenu. aṭlu jalamulalō (nāramulalō) vasiṃciyuṃḍuṭavalana nārāyaṇuḍani ceppabaḍucunnāḍu).

  1. "va. ammahātmuṃḍu līlārthaṃbai jagatsarjanaṃbusēyu talaṃpuna brahmāṃḍaṃbuni nirbhēdiṃci, tanaku sukhaśayanaṃbu napēkṣiṃci modala jalatatvaṃbu sṛjiyiṃce, svataḥ pariśuddhuṃḍugāvuna sva svaṣṭaṃbai yēkārṇavākāraṃbaina jalarāśi yaṃdu śayanaṃbu sēyuṭaṃjēsi - "āpōnārā iti prōkta āpō vainara sūnavaḥ | ayanaṃ tasyatāḥ pūrvaṃ tēna nārāyaṇa ssmṛtaḥ ||" anu pramāṇamucoppuna nārāyaṇa śabda vācyuṃḍu - - ". (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - 268)

  2. "apō nārā iti prōktā - - - tēna nārāyaṇassmṛtaḥ " (chūḍumu - 13) - iti smṛti siddaḥ sthūla dṛśāṃ nārāyaṇa śabdārthaḥ . sūkṣma darśinaḥ punarā cakṣatē - naraśabdēna carācarātmakaṃ śarīrajātaṃ ucyatē. tatranitya sannihitāḥ cidā bhāsāḥ jīvāḥ nārāḥ iti nirucyatē. tēṣāṃ ayanaṃ, āśrayō, niyāmakō aṃtaryāmī nārāyaṇaḥ iti " (śrī anaṃdagiri)

(naruḍu anagā paramātma. paramātmalōnuṃḍi puṭṭinavi nāramulu. nāramulanagā udakamulu. modaṭaparamātmaku udakamulu nivāsasthānamu - aṃducēta nārāyaṇuḍu anagā udakamulu nivāsasthānamugā galavāḍu, ani sthūla dṛṣṭiki arthamagucunnadi. sūkṣma dṛṣṭigalavāru ī prakāramugā dīniki arthamu ceppucunnāru - naruḍu anagā carācara rūpamaina śarīramulu vāṭilō cidābhāsuḍanu jīvulu nāramulu ani ceppabaḍucunnavi. ā jīvulaku - prati śarīramulōnuṃḍu jīvulaku āśrayamainavāḍu - vāṭilō aṃtaryāmigānuṃḍi vāṭini vāṭi vāṭi panulalō niyamiṃcuvāḍu. kanuka nārāyaṇuḍani ceppabaḍucunnāḍu).

  1. nāraṃ jīvasamūhaṃ ayanaṃ āśrayō yasya saḥ - sarva dēhi nāmātmatvāt nārāyaṇaḥ iti bhāvaḥ -

(nāramulanagā jīva samūhamu - jīvulu. jīva samūhamu āśrayamugā galavāḍu kanuka nārāyaṇuḍu - samasta dēhamulaku ātma ayinavāḍu).

  1. narīyatē nakṣīyatē iti narōbhagavān, atō, narōtpannatvāt nārāḥ āpaḥ ayanaṃ yasyasaḥ nārāyaṇa iti prōktaḥ.

(kṣīṇiṃcuṭa lēnivāḍukanuka bhagavaṃtuḍu naruḍu - naruḍu valana, narunilōnuṃḍi puṭṭinaṭuvaṃṭi āpaḥ (udakamulu) ayanamu. (nivāsasthānamugā galavāḍu kanuka nārāyaṇuḍu).

  1. "jalamu, nāramu, jīva cayamu nāramu, aṃdu nīvuṃḍuṭa nīyaṃdavi yuṃḍuṭanu nārāyaṇuḍanu nāmamayye"

(śrīmadāṃdhramahābhāgavatamu - 10.- pū.bhā. - 561)

  1. nārā āpō ayanaṃ yasya saḥ nārāyaṇaḥ - yasmāt kāraṇāt ādau āpaḥ puruṣōdbhavaḥ ataḥ āpō nārā ityucyaṃtē.

(puruṣuḍagu parabrahmanuṃḍi modaṭa udakamulu puṭṭinavi. ī kāraṇamuvalana udakamulu nāramulu ani ceppabaḍinavi).

  1. āpaḥ garbhōdaka saṃjñāḥ, apsu vāsēna puruṣaḥ naraḥ - tasmādudbhavaḥ yāsāṃ nārāṃ āpaḥ ayanaṃanya iti nārāyaṇaḥ ityarthaḥ.

(āpaḥ anagā garbhōdakamulu, vāṭiyaṃdu nivasiṃcuvāḍu naruḍu. atani valana puṭṭinavi nāramulu- udakamulu. avi ayanamugā galavāḍu nārāyaṇuḍu).

  1. "sī. naḷinākṣa ! nīvādinārāyaṇuṃḍavu; jalamu nāramu, jīvacayamu nāra

maṃdu nīvuṃṭa nīyaṃdavi yuṃṭanu nārāyaṇuṃḍanu nāmamayye" (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā.- 560, 561)

  1. “narājjātāni tatvani nārāṇīti tatō viduḥ |

tānyēva cāyanaṃ tasya tēna nārāyaṇa ssmṛtaḥ ||". (mahabhāratamu - )

(naruḍanagā bhagavaṃtuḍu - atanilōnuṃḍi puṭṭina tatvamulu nāramulu. aviyē ayanamugā galavāḍu, vāṭiki praḷayasthānamu aguvāḍu nārāyaṇuḍu) - "tatvaṃ nārāyaṇaḥ paraḥ" (maṃtrapuṣpamu)

  1. narāṇā samūhasya svāmitvēna, adhavā, upādānatvēna paṃcabhūtātmanā sthitaḥ.

( narulaku svāmiyaguṭavalana nārāyaṇuḍani ceppabaḍucunnāḍu, lēka narulaku upādānamaina paṃcabhūtamulu tānē ayinaṃduna nārāyaṇuḍu).

  1. "naraśarīrāṇāṃ upādāna rūpāṇi annādi paṃcabhūtāni nāraśabdēna ucyaṃtē. tēṣu bhūtēṣu yā āpō mukhyāḥ tā ayanaṃ adhārō yasya viṣṇōḥ sō ayaṃ nārāyaṇaḥ - samudra jalaśāyī ityarthaḥ".

(narula śarīramulaku upādāna kāraṇamaina paṃcabhūtamulu nāramulani ceppabaḍicunnavi. ā paṃcabhūtamulalō āpaḥ (udakamulu) mukhyamainavi. avi ayanamugā - anagā, ādhāramugā - galavāḍu - kṣīrasāgara śayanuḍu agu viṣṇuvu).

(jīvula śarīramu paṃcabhūtamayamainanu śarīramaṃtaṭaku manamu tinina āhārarasamunu paṃciyiccuṭa udakamuladvārānē yagucunnadi. śarīramulōnunnadi mūḍoṃtulaku paigānunnadi jalamulē - sūkṣma rūpamulōnunna jalamu prāṇavāyuvutōkalisi sthūlarūpamulōnuṃḍu jalamagucunnadi (Hydrogen gas + Oxygen = water) aṃducēta jalamulō prāṇavāyuvurūpamulō bhagavaṃtuḍunnāḍu - jalamulēnicōṭa jīvuḍuṃḍaḍu - ( Hydrogen is the first and simplest element which developes into other elements due to the existence of God in it).

  1. "ka. nāramulanagā jalamula

pēra yanaṃbanaganelavu; prītiganākun|

nāramula yanaṃbaguṭanu

nārāyaṇuḍaṃḍru janulu nannu girīṭī".

  1. "ka. parama brahma manaṃgā

baratatvamanaṃga, baramapadamanaganu, nī

śvaruḍana, kṛṣṇuḍana, jaga

dbharituḍu nārāyaṇuṃḍu dā velugoṃdun". (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 51)

  1. "dravyaṃ karmaca kālaṃca svabhāvō jīva ēvaca |

yadanugrahataḥ saṃti, nasaṃti yadupēkṣayā" -

"vāsudēvātparō brahma nacānyō (a)rthōsti tatvataḥ |

nārāyaṇaparāvēdā dēvāḥ nārāyaṇāṃgajāḥ |

nārāyaṇa parōlōkā nārāyaṇa parōmakhāḥ |

nārāyaṇaparō yōgō nārāyaṇa paraṃtapaḥ |

nārāyaṇa paraṃ jñānaṃ nārāyaṇaparā gatiḥ ||". (śrīmadbhāgavataṃ - 2 - 5 - 14 to 16)

"dēhaṃbunaku dravyaṃbulaina mahābhūtaṃbulunū, janma nimittaṃbulaina karmaṃbulunu, garmṣōbhakaṃbaina kālaṃbunu, gālaparimāṇahētuvaina svabhāvaṃbunu bhōkta ayina jīvuṃḍunu vāsudēvuṃḍugā neṟuṃgumu - vāsudēva vyatiriktaṃbulēdu, siddhaṃbu - nārāyaṇa niyamyaṃbulu lōkaṃbulu - dēvatulu nārāyaṇa śarīra saṃbhūtulu. vēdayāga tapōyāga jñānaṃbulu nārāyaṇaparaṃbulu - jñāna sādhyaṃbagu phalbu nārāyaṇādhīnaṃbu " (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 84)

"viśvaṃ nārāyaṇaṃ dēvamakṣaraṃ paramaṃ padaṃ |

- - -

nārāyaṇaṃ mahājñēyaṃ viśvātmānaṃ parāyaṇaṃ |

nārāyaṇaḥ parōjyōtirātmā nārāyaṇaḥ paraḥ |

nārāyaṇa parōdhyātā, dhyānaṃ nārāyaṇaḥ paraḥ ||".

iti maṃtra varṇāt (nārāyaṇōpaniṣat)

(prapaṃcamu nārāyaṇuḍu - nārāyaṇuni sthūlarūpamu. nārāyaṇuḍu kṣīṇiṃcanivāḍu; parama padamagu vaikuṃṭhamē tānu ayinavāḍu; prapaṃcamaṃtakunu ātma ayinavāḍu, paraṃjyōtisvarūpuḍu, dhyānamu cēyuṭaku taginavāḍu, dhyānamu, dhyānamucēyuvāḍu atanē. atanē paratatvamainavāḍu).

  1. "alōḍhya sarva śāstrāṇi vicārya ca punaḥ punaḥ |

idamēkaṃ suniṣpannaṃ dhyēyō nārāyaṇassadā ||".

(samasta śāstramulanu gāliṃci, marala marala vicāriṃcagā tēlina sārāṃśamēmanagā - śrīmannārāyaṇuḍu ellapuḍu dhyāniṃca taginavāḍu. ellapuḍu nārāyaṇuni dhyāniṃcavalenu - maraṇakālamaṃdu nārāyaṇuni dhyāniṃcina nārāyaṇunēpoṃdunu ganukanu, maraṇamu eppuḍu vaccunō teliyadu kanuka, ellapuḍu - tīrika ayinapuḍallā, lēka tīrika cēsukoni ayinanu nārāyaṇuni dhyāniṃcavalenu).

  1. "mōkṣamiccuṭaṃjēsi nārāyaṇuṃḍu pūjyuṃḍu" (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 - 24)

  2. "yacca kiṃcit jagatsarvaṃ dṛśyatē śrūyatēpivā |

aṃtarbahiśca tatsarvaṃ vāpya nārāyaṇasthitaḥ " (nārāyaṇōpaniṣat)

(kaṃṭiki eṃta kanabaḍucunnadō adiyunu, iṃkā unnadi ani cūcinavāru ceppuṭacē unnadannī, ī reṃḍuvidhamulakāka unnadaṃta eṃtayunnadō aṭṭi jagattu aṃtaṭini, lōpala paina pūrtigā nārāyaṇuḍu vyāpiṃciyunnāḍu).

"adha nityō nārāyaṇaḥ brahma, nārāyaṇaḥ śivaśca, nārāyaṇaḥ śakraśca, nārāyaṇaḥ kālaśca, nārāyaṇaḥ diśaśca, nārāyaṇaḥ vidiśaśca, nārāyaṇaḥ aṃtarbahiśca, nārāyaṇa ē vēdaṃ sarvaṃ yadbhūtaṃ, yacca bhavyaṃ, niṣkalaṃkō, niraṃjanō, nirvikalpō, nirājātaḥ, śuddhō dēva ēkō nārāyaṇō nadvitīyō (a)sti kaścit"

(nārāyaṇuḍu śāśvatamugā nuṃḍuvāḍu. atanē brahma, śivuḍu, iṃdruḍu, kālamu, dikkulu, vidikkulu, ūrdhvadikku, adhōdikku, anniṃṭilōpala paina nuṃḍuvāḍu atanē. ī samastamaina prapaṃcamu - puṭṭinadi, puṭṭabōvunadi nārāyaṇuḍē. atanu kaḷaṃkamu lēnivāḍu, niraṃjanuḍu, nirvikalpuḍu,śuddhuḍu. unnavāḍu nārāyaṇuḍokkaḍē, reṃḍavavāḍu - reṃḍavavastuvu anunadi ēdiyu - lēdu - "uṃḍēdī rāmuḍokaḍu, ūraka cēḍipōkē manasā" - )

  1. “phraḷayōdakaśāyi tvat sa tu nārāyaṇaḥ".

(praḷayakālamaṃdali māhāsamudramunaṃdu śayaniṃcuvāḍu - "ī marriyākōkō ēkārṇavamunāḍu śēṣāhiśāyiki sejjayayye" - vaṭapatraśāyi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.