← Back to న · Booklets 21–30 (digitized file 3)

నాశము nāśamu

Original — తెలుగు
  1. "అనిత్యత్వం, దేహ హానాం దుఃఖప్రాప్తిర పూర్ణతా |

నాసశ్చ తుర్విధో జ్ఞేయః తదభావో హరేస్సదా ||".

(అనిత్యత్వము - (ఎల్లపుడు - ఎల్లకాలములందు ఉండకపోవుట), దేహహాని - (దేహమునకు హానికలుగుట, దేహము నశించుట), దుఃఖము ప్రాప్తించుట, పూర్తిగా వ్యాపించియుండకుండుట అని నాశము నాలుగు విధములు - ఇవి భగవంతునియందు లేవు. అందుచేత భగవంతుడు నిత్యుడు, సత్యుడు).

  1. నాశం ద్వివిధం - యథాదేహో భస్మీభూతో ఆదర్శ సంగతః నష్టః ఉచ్యతే, విద్యమానోపి అన్యథా పరిణతః వ్యాద్యాది యుక్తో జాతో నష్టః ఉచ్యతే.

(నాశము రెండువిధములు –

(1) దేహము తగలబడి భస్మము అయిపోయి కనబడకుండుట.

(2) దేహము కనబడుచున్నను వ్యాధి (రోగము) చేతగాని, ఇతర కారణము చేతగాని బాల్యాది అవస్తలచేత గాని మరియొక విధముగా మారుట).

  1. అదర్శనం, స్వధర్మభ్రంశం వా.(వస్తువు కనబడకపోవుటకు, లేక, వస్తువు దానిధర్మమును పోగొట్టుకొనుట).

  2. నాశము రెండు విధములు –

(1) వస్తువు విరిగినను కాలినను మఱియొక రూపము వచ్చుట, ముందుండు రూపము నశించుట - ఇది ధ్వంసమని చెప్పబడును.

(2) ఒక వస్తువును భ్రాంతిచేత మఱియొకవస్తువుగా గ్రహించుట, దాని నిజరూపమును జ్ఞానముచేత గ్రహించగా ఆ భ్రాంతి రూపము నశించుట - ఇది బాధ యని చెప్పబడును. బ్రహ్మయొక్క జ్ఞానము మాయ నశించుట ఇటువంటిదే.

  1. "ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూప జాయతే |

సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో (అ)భిజా

యతో క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మౄతివిభ్రమః |

స్మృతి భ్రంశాద్బుద్ధినాశో బుద్ధి నాశాత్ప్రణస్యతి ||".

(పురుషుడు విషయములగుఱించి అదేపనిగా అలోచించుచుండిన యడల "ఇవి నాకు సుఖమును కలుగచేయునవి" అని వాటియందు అతనికి సంగము (ఆసక్తి) జనించును. ఆ సంగమువల్ల ఇవినాకు కావలెననుకోరిక గలుగును - (కామము కలుగును - ఆ కామము నెరవేరకపోయిన క్రోధము కలుగును. అట్టి క్రోధమువలన "ఇది చేయవచ్చును, ఇది చేయకూడదు" అను వివేకము పోయి సమ్మోహము కలుగును, దానివలన స్మృతి విభ్రమము కలుగును, దాని వలన బుద్ధి చెడిపోయి పురుషర్థములనుసాధించలేక నరుడు నశించినవాడగును). (పురుషార్థములను సాధించలేకపోవుటయే పురుషుడు పెడత్రోవ పట్టి నశించుట).

Transliteration
  1. "anityatvaṃ, dēha hānāṃ duḥkhaprāptira pūrṇatā |

nāsaśca turvidhō jñēyaḥ tadabhāvō harēssadā ||".

(anityatvamu - (ellapuḍu - ellakālamulaṃdu uṃḍakapōvuṭa), dēhahāni - (dēhamunaku hānikaluguṭa, dēhamu naśiṃcuṭa), duḥkhamu prāptiṃcuṭa, pūrtigā vyāpiṃciyuṃḍakuṃḍuṭa ani nāśamu nālugu vidhamulu - ivi bhagavaṃtuniyaṃdu lēvu. aṃducēta bhagavaṃtuḍu nityuḍu, satyuḍu).

  1. nāśaṃ dvividhaṃ - yathādēhō bhasmībhūtō ādarśa saṃgataḥ naṣṭaḥ ucyatē, vidyamānōpi anyathā pariṇataḥ vyādyādi yuktō jātō naṣṭaḥ ucyatē.

(nāśamu reṃḍuvidhamulu –

(1) dēhamu tagalabaḍi bhasmamu ayipōyi kanabaḍakuṃḍuṭa.

(2) dēhamu kanabaḍucunnanu vyādhi (rōgamu) cētagāni, itara kāraṇamu cētagāni bālyādi avastalacēta gāni mariyoka vidhamugā māruṭa).

  1. adarśanaṃ, svadharmabhraṃśaṃ vā.(vastuvu kanabaḍakapōvuṭaku, lēka, vastuvu dānidharmamunu pōgoṭṭukonuṭa).

  2. nāśamu reṃḍu vidhamulu –

(1) vastuvu viriginanu kālinanu maṟiyoka rūpamu vaccuṭa, muṃduṃḍu rūpamu naśiṃcuṭa - idi dhvaṃsamani ceppabaḍunu.

(2) oka vastuvunu bhrāṃticēta maṟiyokavastuvugā grahiṃcuṭa, dāni nijarūpamunu jñānamucēta grahiṃcagā ā bhrāṃti rūpamu naśiṃcuṭa - idi bādha yani ceppabaḍunu. brahmayokka jñānamu māya naśiṃcuṭa iṭuvaṃṭidē.

  1. "dhyāyatō viṣayān puṃsaḥ saṃgastēṣūpa jāyatē |

saṃgāt saṃjāyatē kāmaḥ kāmāt krōdhō (a)bhijā

yatō krōdhāt bhavati sammōhaḥ, sammōhāt smṝtivibhramaḥ |

smṛti bhraṃśādbuddhināśō buddhi nāśātpraṇasyati ||".

(puruṣuḍu viṣayamulaguṟiṃci adēpanigā alōciṃcucuṃḍina yaḍala "ivi nāku sukhamunu kalugacēyunavi" ani vāṭiyaṃdu ataniki saṃgamu (āsakti) janiṃcunu. ā saṃgamuvalla ivināku kāvalenanukōrika galugunu - (kāmamu kalugunu - ā kāmamu neravērakapōyina krōdhamu kalugunu. aṭṭi krōdhamuvalana "idi cēyavaccunu, idi cēyakūḍadu" anu vivēkamu pōyi sammōhamu kalugunu, dānivalana smṛti vibhramamu kalugunu, dāni valana buddhi ceḍipōyi puruṣarthamulanusādhiṃcalēka naruḍu naśiṃcinavāḍagunu). (puruṣārthamulanu sādhiṃcalēkapōvuṭayē puruṣuḍu peḍatrōva paṭṭi naśiṃcuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.