అనేక ఫల విజ్ఞానస్య ఉత్పాదకస్య పౌరైరి వాధిష్టితం” (శ్రీశంకరః)
(శిరస్సులో నున్నవి ఏడు, చెవులు రెండు, కండ్లు రెండు, ముక్కు - రంధ్రములు - రెండు, వాక్కు ఒకటి కలిసి ఏడు. వాయువు ఉపస్థు - శరీరమునుండి బైటకు వదలునవి -. ఇవన్నియు కలిసి నవరంధ్రములు - తొమ్మిది ద్వారములు. ఈ నవద్వారములతోనుండు పురమని శరీరము చెప్పబడుచున్నది. ఈ పురమను శరీరమునకు స్వామి - యజమాని - ఆత్మ. ఈ శరీరమునకు ఉపయోగపడు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనేకవిషయములను గ్రహించుటద్వారా వాటి ఫలము జ్ఞానము కలిగించుటచేత ఆ పురములలోనుండు పౌరులవలె కలిగియుండునవి నవద్వారపురము).
అయిదు జ్ఞానేంద్రియములు, ప్రాణము - ఈ ఆరింటిచేత కర్మేంద్రియములు వాటి వాటి క్రియలలో నడపబడుచున్నవి. ఈ ఆరున్నూ, బుద్ధి, అహంకారము, చిత్తమున్నూ కలిసి తొమ్మిది జీవుడు ఉండుటకు పురమువలె నుండునదియగు శరీరమునకు ద్వారములు. విషయములను జీవుడు అనుభవించుటకు స్థానమైనది, అనేక విషయములననుభవించి అనేక కర్మవాసనలు కలిగి అనేక సుఖదుఃఖములననుభవించునదియైన శరీరమను పురమును -రాజకార్యములను వదలివేసిన రాజువలె - తొమ్మిది ద్వారములను ఛేదించుకొని పైకి వచ్చి సంవిద్రూపముతోజీవుడు స్వేచ్ఛగా నుండును.
(రెండుచెవులు, రెండుకన్నులు, రెండు ముక్కు రంధ్రములు, వాక్కు ఒకటి, పాయువు ఉపస్థు, అనునవి ద్వారములు గల పురమను దేహముగల జీవుడు - దేహముకన్న వేరైనవాడు - ఇతరుని గృహములోనుండు వాని వలె - దేహమునకు సుఖము వచ్చిన సంతోషింపక, దుఃఖముకలిగిన దుఃఖింపక, శరీరమును గుఱించి అహంకార మమకారములు లేక - నేను, నాది యను అభిమానములేక - ఉండును -).
(శరీరమును పురముగాను, ఇంద్రియములను పురములోనుండు పౌరులుగాను, పరమాత్మను సార్వభౌముడుగాను, తనను భృత్యుడుగాను - సేవకుడుగాను - చూచువానికి స్వస్థత చేకూరును. దేహమే ఆత్మయను భ్రమవలన ఈ పురమందు నేను ఉంటున్నాను అను భ్రమ పోయినపుడు దేహము పురమని తెలియును).
(నవద్వారపురము శరీరము అని చెప్పబడుటవలన శరీరము అవయవములు కలదని, జీవుడు అవయవములు లేనివాడని, శరీరము ద్వారములను రంధ్రములు కలదని, జీవునికి రంధ్రములు లేవని, శరీరము స్థూలరూపము కలదని, జీవుడు అణువువలె సూక్ష్ముడని, దేహము పరతంత్రమని, జీవుడు స్వతంత్రుడని, శరీరము నియమించబడునదని, జీవుడు నియమించువాడు అని - ఈ ప్రకారముగా దేహమునకు ఆత్మకు తారతమ్యము - వేరు వేరు - ఉన్నదని స్ఫురించునట్లు చెప్పడమైనది).
anēka phala vijñānasya utpādakasya paurairi vādhiṣṭitaṃ” (śrīśaṃkaraḥ)
(śirassulō nunnavi ēḍu, cevulu reṃḍu, kaṃḍlu reṃḍu, mukku - raṃdhramulu - reṃḍu, vākku okaṭi kalisi ēḍu. vāyuvu upasthu - śarīramunuṃḍi baiṭaku vadalunavi -. ivanniyu kalisi navaraṃdhramulu - tommidi dvāramulu. ī navadvāramulatōnuṃḍu puramani śarīramu ceppabaḍucunnadi. ī puramanu śarīramunaku svāmi - yajamāni - ātma. ī śarīramunaku upayōgapaḍu iṃdriyamulu, manassu, buddhi anēkaviṣayamulanu grahiṃcuṭadvārā vāṭi phalamu jñānamu kaligiṃcuṭacēta ā puramulalōnuṃḍu paurulavale kaligiyuṃḍunavi navadvārapuramu).
ayidu jñānēṃdriyamulu, prāṇamu - ī āriṃṭicēta karmēṃdriyamulu vāṭi vāṭi kriyalalō naḍapabaḍucunnavi. ī ārunnū, buddhi, ahaṃkāramu, cittamunnū kalisi tommidi jīvuḍu uṃḍuṭaku puramuvale nuṃḍunadiyagu śarīramunaku dvāramulu. viṣayamulanu jīvuḍu anubhaviṃcuṭaku sthānamainadi, anēka viṣayamulananubhaviṃci anēka karmavāsanalu kaligi anēka sukhaduḥkhamulananubhaviṃcunadiyaina śarīramanu puramunu -rājakāryamulanu vadalivēsina rājuvale - tommidi dvāramulanu chēdiṃcukoni paiki vacci saṃvidrūpamutōjīvuḍu svēcchagā nuṃḍunu.
(reṃḍucevulu, reṃḍukannulu, reṃḍu mukku raṃdhramulu, vākku okaṭi, pāyuvu upasthu, anunavi dvāramulu gala puramanu dēhamugala jīvuḍu - dēhamukanna vērainavāḍu - itaruni gṛhamulōnuṃḍu vāni vale - dēhamunaku sukhamu vaccina saṃtōṣiṃpaka, duḥkhamukaligina duḥkhiṃpaka, śarīramunu guṟiṃci ahaṃkāra mamakāramulu lēka - nēnu, nādi yanu abhimānamulēka - uṃḍunu -).
(śarīramunu puramugānu, iṃdriyamulanu puramulōnuṃḍu paurulugānu, paramātmanu sārvabhaumuḍugānu, tananu bhṛtyuḍugānu - sēvakuḍugānu - cūcuvāniki svasthata cēkūrunu. dēhamē ātmayanu bhramavalana ī puramaṃdu nēnu uṃṭunnānu anu bhrama pōyinapuḍu dēhamu puramani teliyunu).
(navadvārapuramu śarīramu ani ceppabaḍuṭavalana śarīramu avayavamulu kaladani, jīvuḍu avayavamulu lēnivāḍani, śarīramu dvāramulanu raṃdhramulu kaladani, jīvuniki raṃdhramulu lēvani, śarīramu sthūlarūpamu kaladani, jīvuḍu aṇuvuvale sūkṣmuḍani, dēhamu parataṃtramani, jīvuḍu svataṃtruḍani, śarīramu niyamiṃcabaḍunadani, jīvuḍu niyamiṃcuvāḍu ani - ī prakāramugā dēhamunaku ātmaku tāratamyamu - vēru vēru - unnadani sphuriṃcunaṭlu ceppaḍamainadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.