← Back to న · Booklets 21–30 (digitized file 3)

నేతి నేతి nēti nēti

Original — తెలుగు
  1. ‘కాదు కాదు’ అని.

  2. “నైతాదృశం, నైతాదృశం” ఇతి జగద్విలక్షణత్వేన భగవాన్ భోధ్యతే.

(“ఇటువంటివాడు కాడు, ఇటువంటివాడు కాడు” అని - జగత్తులోనున్న సమస్తవస్తువులవంటివాడు కాడు,వాటికంటె వేరులక్షణములు గలవాడు. భగవంతుడు అని ఈ మాటలచే భగవంతుడు చెప్పబడు చున్నాడు).

  1. “నేతి నేతీతి వ్యాపోహే క్రియమాణే స్వయమేవా తత్వజ్ఞన్ అనాత్మవర్గాత్ పృథక్ పృధక్ ఉపలభ్యమానః పురుషః ఆత్మా అన్వేష్టవ్యః మణిషుసూత్రమివ ఏకైక వ్యతిరేకేణ విచారమద్భిః శుద్ధేనమనసా అన్వేష్టవ్యః”.

(ఇదికాదు, ఇదికాదు అని అతత్ వస్తువులను (తత్ అనగా బ్రహ్మ - అతత్ వస్తువులు అనగా బ్రహ్మకాని వస్తువులు) వదలివేయుచు - ఆత్మగాని వస్తువులను ఒకటిని ఒకటిని వేరు వేరుగా నిరాకరించుచు, వాటికంటె వేరైన పురుషుడు (ఆత్మ) అన్వేషింప తగినది - కనుగొనవలసినది.మణులలో దూరియున్న త్రాడును ఒక్కొక్క మణిని తీసివేసి చూచినట్లు చిత్తశుద్ధి కలిగినవారిచే ఆత్మ విచారించి అన్వేషించతగినది. మణులన్నిటిలోను దూరి ఉన్నది ఒకటే త్రాడు అని మణులను ఒక్కొక్క దానిని తీసి వేసిననే తెలియనగును).

  1. “సర్వాసు ఉపనిషత్సు జ్ఞేయం బ్రహ్మ”నేతి నేతి“, ‘అస్థూలం అనిణుం’ ఇత్యాది విశేష ప్రతిషేదేనైవ నిర్దిశ్యతే న ఇదం తత్ ఇతి వాచః అగోచరత్వాత్”.

(ఉపనిషత్తులన్నింటిలోను జ్ఞేయ బ్రహ్మ (నిర్గుణ నిరాకార పరబ్రహ్మ) ’ ఇదికాదు, ఇదికాదు ’ అని మొదలగు విశేషణములు లేనివాడుగనే నిర్దేశింపబడినది. పరబ్రహ్మ అగోచరమైనవాడు కనుక (కంటికి కనబడదు, మనసులో ఊహించుటకు వీలుకానిది కనుక) గోచరమైన వస్తువులు ఒక్కొక్కటిని చెప్పుచు, ఒక్కొక్కటిని ’ ఇది కాదు, ఇదికాదు ’ అని నిషేధించడమైనది. అట్లు జగత్తులోనివస్తువులనన్నింటినీ నిషేధించగా మిగిలినది పరబ్రహ్మయే. పరబ్రహ్మను ఈ ప్రకారముగా తెలుసుకొనవలెను).

  1. “సకలాగమైః సకలైః వేదైః ‘నేతి నేతి’ ఇతిసర్వ నిషేధింప థిత్వేన యా భోధ్యతే సా భవనేశ్వరీ”

(ఆగమములన్నింటిలోను, వేదములన్నింటిలోను ’ ఇదికాదు, ఇదికాదు ’ అని యేపరమాత్మ చెప్పబడుచున్నదో ఆమెయే భవనేశ్వరీదేవి).

  1. ‘ఇదం న ఇదం న’ ఇతి సర్వ దృశ్య నిషే ధేన య ఆత్మా ఉప దిష్టః స ఏషః “యస్మాత్ తతః ప్రపంచ నిషేధానంతరం భూయః”నహ్యేతస్మాదితి” నాన్యత్పరమస్తి “ఇతి ఏ తస్మాత్ నేతి నేతీ త్యాధిష్టాత్ బ్రహ్మణః అన్యత్ వ్యతిరిక్తం నాస్తి, బ్రహ్మైవతు పరమస్తీత్యే తన్నిర్వచన వాక్యం బ్రవీతి”.

(‘ఇది కాదు, ఇది కాదు’ అని ఈ కనుపించు జగత్తులోని సమస్త పదార్థములను నిషేధించి మిగిలినదిఆత్మయని ఉపదేశించబడినది). (పై ప్రకారము ఈ ప్రపంచమునందును ఆత్మకాదని నిషేధించి, మిగిలినదాని కన్న ఉత్కృష్టమైనది లేదు, అదికాక ఏదియు లేదు అని చెప్పుటవలన బ్రహ్మ కానిది లేదని, బ్రహ్మమేఉత్కృష్టమైనదని చెప్పబడినది).

  1. సదాది శబ్దైః బ్రహ్మ న ఉచ్యతే. సర్వోహి శబ్దః అర్థ ప్రకాశనాయ ప్రయుక్తః; శ్రూయమాణశ్చ శ్రుతిభిఃజాతి క్రియా గుణ సంబంధ ద్వారేణ సంగతి గ్రహణ సవ్యపేక్షః అర్థం ప్రత్రాయతి, న అన్యథా అదృష్టత్వాత్తత్ యథా ‘గౌః’, ‘అశ్వః’ ఇతివా జాతితః; “పాచకః” “పాఠకః” ఇతినా క్రియాతః; శుక్లః; కృష్ణః; ఇతి వా గుణతః; ‘ధనీ’ ‘గోమాన్’ ఇతి వా సంబంధితః. నతుబ్రహ్మ జాతిమత్ తః న సదాదిశబ్ద వాచ్యం నాపి గుణవత్ యేన గుణ శబ్దేన ఉచ్యతే; నిర్గుణత్వాత్; నాపిక్రియశబ్ద వాచ్యం నిష్క్రియత్వాత్. న చ సంబంధీ ఏకత్వాత్. ఏకత్వాత్ అద్వయత్వాత్ అవిషయత్వాత్. ఆత్మత్వాచ్చ న కేనా చిత్ శబ్దేన ఉచ్యతే ఇతి యుక్తం - “యతోవాచో నివర్తంతే” ఇత్యాది శ్రుతి భిశ్చ – (శ్రీశంకరః)

సత్ చిత్ ఆనందము అను మొదలగు శబ్దముల చేత - పదముల చేత పరబ్రహ్మ (తెలియునట్లు) చెప్పబడుటలేదు. ఇటువంటి శబ్దములన్నియు అర్థమును స్పురింపచేయుటకు ఉపయోగించబడినవి.శ్రుతులలోజాతి క్రియా గుణ సంబంధములద్వారా అర్థమగునట్లు పదములు వాడుక చేయబడుచున్నవి. ఇట్లుగాకఇంకొకరీతిగా బ్రహ్మగుఱించి చెప్పుటకు వీలులేదు - వాక్కునకుగాని, మనస్సునకుగాని గోచరముకానిదగుటచేత. అది యెట్లంటే - ‘ఆవు’, ‘గుర్రము’ అని జాతినిబట్టిన్నీ; పాచకుడు, పాఠకుడు అనిచేయు పనిని బట్టిన్నీ, తెల్లనిదీ, నల్లనిదీ అని గుణమును బట్టిన్నీ; ధనవంతుడు, పాడిగలవాడు అనిసంబంధము బట్టిన్నీ; కొన్ని చెప్పుటకు వీలగును. కాని, పరబ్రహ్మకు ఆవు, గుర్రము వలె జాతిలేదు.అందుచేత సత్తనిగాని, చిత్తనిగాని ఆనందమనిగాని చెప్పుటకు వీలుకానివాడు - తెల్లనివాడు, నల్లనివాడు అని గుణముచేత చెప్పుటకు వీలుకానివాడు - నిర్గుణుడు అగుటవలన. పాఠకుడు మొదలగువారివలె క్రియలు చేయువాడుకాడు - నిష్క్రియుడగుటవలన. ధనసంపదతోగాని, గోసంపదతో గాని,ఇటువంటి ఇతరమైనవాటితోగాని సంబంధములేనివాడు - ఒక్కడే యగుటవలనను, తనకన్న ఇతరమేమియులేనివాడున్నూ (రెండవ వస్తువు లేనివాడున్నూ) అగుటచేత; విశేషములు లేనివాడగుటచేత నిర్విశేషుడు, ఆత్మయగుటవలనను ఏ శబ్దముచేతను, (ఏమాటచేతను) చెప్పుటకు అలవికానివాడు. అందుచేత సృష్టిలోనున్న ఏ వస్తువునైనను పోలియున్నాడని చెప్పుటకు వీలుకానందునఇవన్నియు బ్రహ్మ కావు, కావు అని చెప్పబడినవి. వాక్కుతో చెప్పుటకు అలవికానివాడు, ఏ విధముగాచెప్పినను అతనిని సరిగా చెప్పినట్లుకాదు అని శ్రుతి చెప్పుచున్నది).

  1. “ద్వేవావ బ్రహ్మణో రూపే మూర్తం చైవా మూర్తం చ”. ఇత్యు పక్రమ్య “అధాత ఆదేశో నేతి నేతి,నహ్యే తస్మా దితి నేత్యన్యత్పరమ స్తీతి” శ్రూయతే. ప్రకృతం ప్రధానం ఏతావత్త్వః, ఇయత్తా పరిచ్ఛిన్నంయత్ బ్రహ్మణో రూపద్వయం తత్ప్రకృతైవాత్వం. తదేవ ప్రతిషేదతి. “నేతి, నేతి” ఇత్యాది శ్రుతిఃఇతశ్చ బ్రహ్మణో న నిషేధః హి యస్మాత్ తతః ప్రపంచ నిషేధానంతరం భూయః నహ్యే తస్మాదితినాన్యత్పర మస్తి” ఇతి ఏ తస్మాత్ నేతి నేతీ త్యాది శాత్ బ్రహ్మణః అన్యత్ వ్యతిరిక్తం నాస్తి, బ్రహ్మైవతు పరమస్తీత్యే తన్నిర్వచన వాక్యం బ్రవీతి. “ద్వేవా బ్రహ్మణో రూపే - మూర్తం చా మూర్తం చ” (బృహదారణ్యకోపనిషత్ 2 - 3 - 1)

(బ్రహ్మకు మూర్తము అమూర్తము అను రెండు రూపములు కలవు. అని బృహదారణ్యకోపనిషత్తులోప్రారంభించి - అందు కంటికి గోచరించు పృధివ్యప్తేజస్సులను మూడు భూతములు మూర్తమనియు,అగోచరములగు వాయువ్యాకాశములు రెండును అమూర్తమనియు విభజించి, రెండింటి ధర్మములనుతెలిపి చివర రూపద్వయసహితుడగు బ్రహ్మయొక్క స్వరూపమును తెలుపుటకై “అధాత ఆదేశో ‘నేతినేతి’ (బ్రహ్మదారణ్యకోపనిషత్ - 2 - 3 - 6) అని చెప్పబడినది - ‘కాదు’, ‘కాదు’ అని చెప్పబడినది. ఇంతరూపము కలదియని (ఇయత్తా పరిచ్ఛిన్నమని) చెప్పుచున్న మూర్తా మూర్తములను రెండింటిని నిషేధించుచున్నది. తర్వాత” నహ్యే తస్మాత్ పరమస్తి (దీనికన్న ఉత్కృష్టమైనది పరమైనది లేదు(గొప్పది లేదు) అని చెప్పబడినది. అనగా, పైన చెప్పిన రూపద్వయమును నిషేధించి ‘నేతి’, ‘నేతి’అని చెప్పిన బ్రహ్మకంటె అతిరిక్తమైనది కాని, ఇతరమైనది కాని ఏమియులేదు. అట్టి బ్రహ్మ ఇంద్రియగోచరముకాదు. స్థూలవస్తువులందఱికి కనబడును. సూక్ష్మదృష్టికలవారికి సూక్ష్మవస్తువు కనబడును.ఈ రెండింటికీ అతీతమైనది కనుక బ్రహ్మ ’అవ్యక్తము’ (అగోచరము) అని చెప్పబడినది.

  1. ‘నేతి’, ‘నేతి’; “యతో వాచో నివర్తంతే ఇత్యాది శ్రుతిభిః కో అద్ధా (సాక్షాత్) వేదేత్యాది మంత్రవర్ణాత్ కథంతర్హి తస్య సమ ఆత్మా ఇది వేదనం బ్రుంహి, కేన ప్రకారేణ తమహం సమ ఆత్మా ఇతివిద్యాం.అత్రాఖ్యాయి కామా చక్షతే - కశ్చిత్కిలమనుష్యో ముగ్ధః (మూఢః) కైశ్చిదుక్తం కస్కింశ్చి దీపరాధేసతి ధిక్ - ‘త్వాం’ నాసి మనుష్యః ఇతి సముగ్థతయా ఆత్మనో మనుష్యత్వం ప్రత్యయితుం కం చిదుపే త్యాహ ‘బ్రవీతు భగవాన్’ కో హ మస్మతి. సతస్య ముగ్థతాం జ్ఞాత్వా ఆహ -”క్రమేణ బోధ ఇష్యామీతి. స్థావరాద్యాత్మ భావ మపోహ్య ‘నత్వం అమనుష్యః’ ఇత్యుక్త్వా ఉపరరామ. ముగ్ధః సతం ప్రత్యాహ” భవాన్ మాం భోధయితుం ప్రవృత్తః తూష్ణీం బభూవ, కిం న భోధయతీతి. తాదృగేవ తద్భవతఃవచనం నాస్య మనుష్యః ఇత్యుక్తే మనుష్యత్వ మాత్మనః న ప్రతిపద్యతే యః కథం మనుష్యో అస్తీత్యుక్తే అపి మనుష్యత్వ మాత్మనః ప్రతిపద్యేత తస్మాత్ యథా శాస్త్రోపదేశ ఏవాత్మావ బోధ విధిః.నాన్యః నహ్యగ్నేర్థాహ్యం తృణాదన్యేన కే చిద్దగ్ధుం శక్యం. అత ఏవ శాస్త్రం ఆత్మ స్వరూపం బోధయితుం ప్రవృత్తిం సదమనుష్యత్వ ప్రతిషేధ నేనేవ ‘నేతి, నేతీ’ తి ఉక్త్వా ఉపరరామః. తథా అనంతరం అబాహ్యమయమాత్మా బ్రహ్మ సర్వానుభూరిత్యను శాసనం” (శ్రీశంకరః)

“యావ గయమేవం యధోక్తం ఇమ మాత్మానం న వేత్తితావదయం బాహ్యా నిత్య దృష్టి లక్షణం ఉపాధిం ఆత్మత్వేన ఉపేత్య అవిద్యయోపాధి ధర్మాన్ ఆత్మ నః మన్య మానో బ్రహ్మాదిస్తంబ పర్యం తేషు దేవతిర్యజ్ఞిరయ స్థానేషు పునః పునరావర్తమానో అవిద్యా కామ కర్మ వశాత్ సం సరతి” (శ్రీశంకరః)

(‘కాదు’, ‘కాదు’ అనిన్నీ “వాక్కుకు అందరానిది” అనిన్నీ “ఎవనికి సాక్షాత్తుగా తెలుసును”అనిన్నీ శ్రుతి చెప్పుచున్నప్పుడు ఆత్మతో సమానమైనది, దానితో పోల్చతగినది, అట్లు పోల్చుకొనుటవలన ఆత్మ లక్షణములు తెలుసుకోతగినది ఏది? ఆత్మను ఎట్లు తెలుసుకొనగలము? దీనికిసమాధానముగా ఒక ఉపాఖ్యానము గలదు - అది ఎట్లంటే - ఒక మూఢుడు ఉండెడివాడు - వాడుఒకానొక అపరాధము చేయగా ” నీవు మనుష్యుడవు కావు అని ఒకడు అనెను. ఆ మూఢుడు నేనుమనుష్యుడు కానియెడల ఎవడను అని ప్రశ్నించెను. వాడు వాని మూఢత్వమును గమనించి ‘నీకుక్రమముగా బోధపరచెదను’ అని చెప్పెను - స్థావరములు మొదలగువాటిని చూపి నీవు వాటివలెలేవుకనుక నీవు మనుష్యుడవే అని చెప్పి ఊరకుండెను - నాకు జ్ఞానము చెప్పుట ప్రారంభించిఊరకుండిరి ఏమి? అని ఆ మూఢుడు అతనిని అడిగెను. ఆత్మమనుష్యుడుకాడు - (న మనుష్యఃఇతి; న + ఇతి = నేతి) - ఇట్లు ‘నీవు మనుష్యుడవు కావు’ అనినట్లే అన్నివస్తువులు చెప్పి ఒక్కొక్కటి బ్రహ్మ కాదు అని చెప్పినట్లగును - శాస్త్రములో ఉపదేశించినదే ఆత్మ బోధవిధి - ఇంకొకరీతిగా కాదు - అట్లే అగ్నిచేతనే గడ్డిపోచ దహింపబడును. అట్లే శాస్త్రము ఆత్మస్వరూపమునుబోధించుట ప్రారంభించి నీవు మనుష్యుడవు కావు అని ప్రతివస్తువు ‘అది కాదు, అది కాదు’ (నేతి, నేతి) అని చెప్పి మిగిలినది ఆత్మయని చెప్పి ఊరుకున్నది).

  1. “స్థూల సూక్ష్మ కారణ దేహ త్రయ మధ్యే పంచకోశాః అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయానంద మయాఖ్యా అంతర్భూతాః భవంతి. తతశ్చ దేహత్రయ త్యాగేన పంచకోశ త్యాగేసతి”బ్రహ్మ పుచ్ఛం ప్రతిష్ఠా” ఇతి శుత్యుక్తం వస్తు లభ్యతే. తదేవ బ్రహ్మ నేతి నేతి ఇత్యాది వాక్తైఃసర్వ నిషేధావధిత్వేన ఉచ్యతే”

(“అధాత ఆదేశో నేతి నేతి” అనెడి శ్రుతివాక్యము, దేహ ప్రాణ, మనోబుద్ధి ఆనందములనెడి కోశములు అయిదు ఆత్మకావని, వీని కాధారమైన చైతన్యమే ఆత్మయని ప్రతిపాదించుచున్నది).

Transliteration
  1. ‘kādu kādu’ ani.

  2. “naitādṛśaṃ, naitādṛśaṃ” iti jagadvilakṣaṇatvēna bhagavān bhōdhyatē.

(“iṭuvaṃṭivāḍu kāḍu, iṭuvaṃṭivāḍu kāḍu” ani - jagattulōnunna samastavastuvulavaṃṭivāḍu kāḍu,vāṭikaṃṭe vērulakṣaṇamulu galavāḍu. bhagavaṃtuḍu ani ī māṭalacē bhagavaṃtuḍu ceppabaḍu cunnāḍu).

  1. “nēti nētīti vyāpōhē kriyamāṇē svayamēvā tatvajñan anātmavargāt pṛthak pṛdhak upalabhyamānaḥ puruṣaḥ ātmā anvēṣṭavyaḥ maṇiṣusūtramiva ēkaika vyatirēkēṇa vicāramadbhiḥ śuddhēnamanasā anvēṣṭavyaḥ”.

(idikādu, idikādu ani atat vastuvulanu (tat anagā brahma - atat vastuvulu anagā brahmakāni vastuvulu) vadalivēyucu - ātmagāni vastuvulanu okaṭini okaṭini vēru vērugā nirākariṃcucu, vāṭikaṃṭe vēraina puruṣuḍu (ātma) anvēṣiṃpa taginadi - kanugonavalasinadi.maṇulalō dūriyunna trāḍunu okkokka maṇini tīsivēsi cūcinaṭlu cittaśuddhi kaliginavāricē ātma vicāriṃci anvēṣiṃcataginadi. maṇulanniṭilōnu dūri unnadi okaṭē trāḍu ani maṇulanu okkokka dānini tīsi vēsinanē teliyanagunu).

  1. “sarvāsu upaniṣatsu jñēyaṃ brahma”nēti nēti”, ‘asthūlaṃ aniṇuṃ’ ityādi viśēṣa pratiṣēdēnaiva nirdiśyatē na idaṃ tat iti vācaḥ agōcaratvāt”.

(upaniṣattulanniṃṭilōnu jñēya brahma (nirguṇa nirākāra parabrahma) ’ idikādu, idikādu ’ ani modalagu viśēṣaṇamulu lēnivāḍuganē nirdēśiṃpabaḍinadi. parabrahma agōcaramainavāḍu kanuka (kaṃṭiki kanabaḍadu, manasulō ūhiṃcuṭaku vīlukānidi kanuka) gōcaramaina vastuvulu okkokkaṭini ceppucu, okkokkaṭini ’ idi kādu, idikādu ’ ani niṣēdhiṃcaḍamainadi. aṭlu jagattulōnivastuvulananniṃṭinī niṣēdhiṃcagā migilinadi parabrahmayē. parabrahmanu ī prakāramugā telusukonavalenu).

  1. “sakalāgamaiḥ sakalaiḥ vēdaiḥ ‘nēti nēti’ itisarva niṣēdhiṃpa thitvēna yā bhōdhyatē sā bhavanēśvarī”

(āgamamulanniṃṭilōnu, vēdamulanniṃṭilōnu ’ idikādu, idikādu ’ ani yēparamātma ceppabaḍucunnadō āmeyē bhavanēśvarīdēvi).

  1. ‘idaṃ na idaṃ na’ iti sarva dṛśya niṣē dhēna ya ātmā upa diṣṭaḥ sa ēṣaḥ “yasmāt tataḥ prapaṃca niṣēdhānaṃtaraṃ bhūyaḥ”nahyētasmāditi” nānyatparamasti “iti ē tasmāt nēti nētī tyādhiṣṭāt brahmaṇaḥ anyat vyatiriktaṃ nāsti, brahmaivatu paramastītyē tannirvacana vākyaṃ bravīti”.

(‘idi kādu, idi kādu’ ani ī kanupiṃcu jagattulōni samasta padārthamulanu niṣēdhiṃci migilinadiātmayani upadēśiṃcabaḍinadi). (pai prakāramu ī prapaṃcamunaṃdunu ātmakādani niṣēdhiṃci, migilinadāni kanna utkṛṣṭamainadi lēdu, adikāka ēdiyu lēdu ani ceppuṭavalana brahma kānidi lēdani, brahmamēutkṛṣṭamainadani ceppabaḍinadi).

  1. sadādi śabdaiḥ brahma na ucyatē. sarvōhi śabdaḥ artha prakāśanāya prayuktaḥ; śrūyamāṇaśca śrutibhiḥjāti kriyā guṇa saṃbaṃdha dvārēṇa saṃgati grahaṇa savyapēkṣaḥ arthaṃ pratrāyati, na anyathā adṛṣṭatvāttat yathā ‘gauḥ’, ‘aśvaḥ’ itivā jātitaḥ; “pācakaḥ” “pāṭhakaḥ” itinā kriyātaḥ; śuklaḥ; kṛṣṇaḥ; iti vā guṇataḥ; ‘dhanī’ ‘gōmān’ iti vā saṃbaṃdhitaḥ. natubrahma jātimat taḥ na sadādiśabda vācyaṃ nāpi guṇavat yēna guṇa śabdēna ucyatē; nirguṇatvāt; nāpikriyaśabda vācyaṃ niṣkriyatvāt. na ca saṃbaṃdhī ēkatvāt. ēkatvāt advayatvāt aviṣayatvāt. ātmatvācca na kēnā cit śabdēna ucyatē iti yuktaṃ - “yatōvācō nivartaṃtē” ityādi śruti bhiśca – (śrīśaṃkaraḥ)

sat cit ānaṃdamu anu modalagu śabdamula cēta - padamula cēta parabrahma (teliyunaṭlu) ceppabaḍuṭalēdu. iṭuvaṃṭi śabdamulanniyu arthamunu spuriṃpacēyuṭaku upayōgiṃcabaḍinavi.śrutulalōjāti kriyā guṇa saṃbaṃdhamuladvārā arthamagunaṭlu padamulu vāḍuka cēyabaḍucunnavi. iṭlugākaiṃkokarītigā brahmaguṟiṃci ceppuṭaku vīlulēdu - vākkunakugāni, manassunakugāni gōcaramukānidaguṭacēta. adi yeṭlaṃṭē - ‘āvu’, ‘gurramu’ ani jātinibaṭṭinnī; pācakuḍu, pāṭhakuḍu anicēyu panini baṭṭinnī, tellanidī, nallanidī ani guṇamunu baṭṭinnī; dhanavaṃtuḍu, pāḍigalavāḍu anisaṃbaṃdhamu baṭṭinnī; konni ceppuṭaku vīlagunu. kāni, parabrahmaku āvu, gurramu vale jātilēdu.aṃducēta sattanigāni, cittanigāni ānaṃdamanigāni ceppuṭaku vīlukānivāḍu - tellanivāḍu, nallanivāḍu ani guṇamucēta ceppuṭaku vīlukānivāḍu - nirguṇuḍu aguṭavalana. pāṭhakuḍu modalaguvārivale kriyalu cēyuvāḍukāḍu - niṣkriyuḍaguṭavalana. dhanasaṃpadatōgāni, gōsaṃpadatō gāni,iṭuvaṃṭi itaramainavāṭitōgāni saṃbaṃdhamulēnivāḍu - okkaḍē yaguṭavalananu, tanakanna itaramēmiyulēnivāḍunnū (reṃḍava vastuvu lēnivāḍunnū) aguṭacēta; viśēṣamulu lēnivāḍaguṭacēta nirviśēṣuḍu, ātmayaguṭavalananu ē śabdamucētanu, (ēmāṭacētanu) ceppuṭaku alavikānivāḍu. aṃducēta sṛṣṭilōnunna ē vastuvunainanu pōliyunnāḍani ceppuṭaku vīlukānaṃdunaivanniyu brahma kāvu, kāvu ani ceppabaḍinavi. vākkutō ceppuṭaku alavikānivāḍu, ē vidhamugāceppinanu atanini sarigā ceppinaṭlukādu ani śruti ceppucunnadi).

  1. “dvēvāva brahmaṇō rūpē mūrtaṃ caivā mūrtaṃ ca”. ityu pakramya “adhāta ādēśō nēti nēti,nahyē tasmā diti nētyanyatparama stīti” śrūyatē. prakṛtaṃ pradhānaṃ ētāvattvaḥ, iyattā paricchinnaṃyat brahmaṇō rūpadvayaṃ tatprakṛtaivātvaṃ. tadēva pratiṣēdati. “nēti, nēti” ityādi śrutiḥitaśca brahmaṇō na niṣēdhaḥ hi yasmāt tataḥ prapaṃca niṣēdhānaṃtaraṃ bhūyaḥ nahyē tasmāditinānyatpara masti” iti ē tasmāt nēti nētī tyādi śāt brahmaṇaḥ anyat vyatiriktaṃ nāsti, brahmaivatu paramastītyē tannirvacana vākyaṃ bravīti. “dvēvā brahmaṇō rūpē - mūrtaṃ cā mūrtaṃ ca” (bṛhadāraṇyakōpaniṣat 2 - 3 - 1)

(brahmaku mūrtamu amūrtamu anu reṃḍu rūpamulu kalavu. ani bṛhadāraṇyakōpaniṣattulōprāraṃbhiṃci - aṃdu kaṃṭiki gōcariṃcu pṛdhivyaptējassulanu mūḍu bhūtamulu mūrtamaniyu,agōcaramulagu vāyuvyākāśamulu reṃḍunu amūrtamaniyu vibhajiṃci, reṃḍiṃṭi dharmamulanutelipi civara rūpadvayasahituḍagu brahmayokka svarūpamunu telupuṭakai “adhāta ādēśō ‘nētinēti’ (brahmadāraṇyakōpaniṣat - 2 - 3 - 6) ani ceppabaḍinadi - ‘kādu’, ‘kādu’ ani ceppabaḍinadi. iṃtarūpamu kaladiyani (iyattā paricchinnamani) ceppucunna mūrtā mūrtamulanu reṃḍiṃṭini niṣēdhiṃcucunnadi. tarvāta” nahyē tasmāt paramasti (dīnikanna utkṛṣṭamainadi paramainadi lēdu(goppadi lēdu) ani ceppabaḍinadi. anagā, paina ceppina rūpadvayamunu niṣēdhiṃci ‘nēti’, ‘nēti’ani ceppina brahmakaṃṭe atiriktamainadi kāni, itaramainadi kāni ēmiyulēdu. aṭṭi brahma iṃdriyagōcaramukādu. sthūlavastuvulaṃdaṟiki kanabaḍunu. sūkṣmadṛṣṭikalavāriki sūkṣmavastuvu kanabaḍunu.ī reṃḍiṃṭikī atītamainadi kanuka brahma ’avyaktamu’ (agōcaramu) ani ceppabaḍinadi.

  1. ‘nēti’, ‘nēti’; “yatō vācō nivartaṃtē ityādi śrutibhiḥ kō addhā (sākṣāt) vēdētyādi maṃtravarṇāt kathaṃtarhi tasya sama ātmā idi vēdanaṃ bruṃhi, kēna prakārēṇa tamahaṃ sama ātmā itividyāṃ.atrākhyāyi kāmā cakṣatē - kaścitkilamanuṣyō mugdhaḥ (mūḍhaḥ) kaiściduktaṃ kaskiṃści dīparādhēsati dhik - ‘tvāṃ’ nāsi manuṣyaḥ iti samugthatayā ātmanō manuṣyatvaṃ pratyayituṃ kaṃ cidupē tyāha ‘bravītu bhagavān’ kō ha masmati. satasya mugthatāṃ jñātvā āha -”kramēṇa bōdha iṣyāmīti. sthāvarādyātma bhāva mapōhya ‘natvaṃ amanuṣyaḥ’ ityuktvā upararāma. mugdhaḥ sataṃ pratyāha” bhavān māṃ bhōdhayituṃ pravṛttaḥ tūṣṇīṃ babhūva, kiṃ na bhōdhayatīti. tādṛgēva tadbhavataḥvacanaṃ nāsya manuṣyaḥ ityuktē manuṣyatva mātmanaḥ na pratipadyatē yaḥ kathaṃ manuṣyō astītyuktē api manuṣyatva mātmanaḥ pratipadyēta tasmāt yathā śāstrōpadēśa ēvātmāva bōdha vidhiḥ.nānyaḥ nahyagnērthāhyaṃ tṛṇādanyēna kē ciddagdhuṃ śakyaṃ. ata ēva śāstraṃ ātma svarūpaṃ bōdhayituṃ pravṛttiṃ sadamanuṣyatva pratiṣēdha nēnēva ‘nēti, nētī’ ti uktvā upararāmaḥ. tathā anaṃtaraṃ abāhyamayamātmā brahma sarvānubhūrityanu śāsanaṃ” (śrīśaṃkaraḥ)

“yāva gayamēvaṃ yadhōktaṃ ima mātmānaṃ na vēttitāvadayaṃ bāhyā nitya dṛṣṭi lakṣaṇaṃ upādhiṃ ātmatvēna upētya avidyayōpādhi dharmān ātma naḥ manya mānō brahmādistaṃba paryaṃ tēṣu dēvatiryajñiraya sthānēṣu punaḥ punarāvartamānō avidyā kāma karma vaśāt saṃ sarati” (śrīśaṃkaraḥ)

(‘kādu’, ‘kādu’ aninnī “vākkuku aṃdarānidi” aninnī “evaniki sākṣāttugā telusunu”aninnī śruti ceppucunnappuḍu ātmatō samānamainadi, dānitō pōlcataginadi, aṭlu pōlcukonuṭavalana ātma lakṣaṇamulu telusukōtaginadi ēdi? ātmanu eṭlu telusukonagalamu? dīnikisamādhānamugā oka upākhyānamu galadu - adi eṭlaṃṭē - oka mūḍhuḍu uṃḍeḍivāḍu - vāḍuokānoka aparādhamu cēyagā ” nīvu manuṣyuḍavu kāvu ani okaḍu anenu. ā mūḍhuḍu nēnumanuṣyuḍu kāniyeḍala evaḍanu ani praśniṃcenu. vāḍu vāni mūḍhatvamunu gamaniṃci ‘nīkukramamugā bōdhaparacedanu’ ani ceppenu - sthāvaramulu modalaguvāṭini cūpi nīvu vāṭivalelēvukanuka nīvu manuṣyuḍavē ani ceppi ūrakuṃḍenu - nāku jñānamu ceppuṭa prāraṃbhiṃciūrakuṃḍiri ēmi? ani ā mūḍhuḍu atanini aḍigenu. ātmamanuṣyuḍukāḍu - (na manuṣyaḥiti; na + iti = nēti) - iṭlu ‘nīvu manuṣyuḍavu kāvu’ aninaṭlē annivastuvulu ceppi okkokkaṭi brahma kādu ani ceppinaṭlagunu - śāstramulō upadēśiṃcinadē ātma bōdhavidhi - iṃkokarītigā kādu - aṭlē agnicētanē gaḍḍipōca dahiṃpabaḍunu. aṭlē śāstramu ātmasvarūpamunubōdhiṃcuṭa prāraṃbhiṃci nīvu manuṣyuḍavu kāvu ani prativastuvu ‘adi kādu, adi kādu’ (nēti, nēti) ani ceppi migilinadi ātmayani ceppi ūrukunnadi).

  1. “sthūla sūkṣma kāraṇa dēha traya madhyē paṃcakōśāḥ annamaya prāṇamaya manōmaya vijñānamayānaṃda mayākhyā aṃtarbhūtāḥ bhavaṃti. tataśca dēhatraya tyāgēna paṃcakōśa tyāgēsati”brahma pucchaṃ pratiṣṭhā” iti śutyuktaṃ vastu labhyatē. tadēva brahma nēti nēti ityādi vāktaiḥsarva niṣēdhāvadhitvēna ucyatē”

(“adhāta ādēśō nēti nēti” aneḍi śrutivākyamu, dēha prāṇa, manōbuddhi ānaṃdamulaneḍi kōśamulu ayidu ātmakāvani, vīni kādhāramaina caitanyamē ātmayani pratipādiṃcucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.