← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిజరూపము nijarūpamu

Original — తెలుగు
  1. నిజస్య ఆత్మనః రూపం. (ఆత్మ యొక్క రూపము).

  2. భేదదర్శనరహితం రూపం.

(సృష్టి అంతటిలోను ఆత్మరూపములో భగవంతుడు ఉన్నాడు. అందులోని ప్రతి వస్తువు భగవంతుడే. ఈ ప్రకారము తను వేరు, సృష్టిలోనున్న వస్తువులు వేరు అను భేదము లేకుండా ఎందులోనున్నను తాను సృష్టికి ముందుండు సన్మాత్రముగాను, చిన్మాత్రముగానుండుట).

  1. "భార్యాసహితుండైన హరిశ్చంద్రునివలనం బ్రీతుండై విశ్వామిత్రుడు నిరస్తదోషుండైన యతనికి ముఖ్యజ్ఞానంబుపదేశించిన (గృప సేసిన) మన్నంబన్నమయంబుగావున మనంబున నన్న రూపంబైన పృధివినెఱింగి పృధివిని జలంబువలన నడంచి, జలంబు దేజలంబువలన నింకించి తేజంబు వాయువలనం జేరిచి, వాయువు నాకాశంబునం గలిపి, యాకసంబు దామసాహంకారంబునందు లయంబు సేసి, యహంకార త్రయంబు మహత్తత్త్వంబునందు డిందించి, పరతత్వంబునకు లోకంబులు సృజించె దనను తలంపైన మహత్తత్త్వంబునందు విషయాకారంబు నివర్తించి, విషయ వర్జితంబైన మహత్తత్త్వంబును బరతత్వంబుగా నెఱుంగుచు, న యెఱుకవలన సంసార హేతువైన ప్రకృతిని భస్మంబుసేసి యయ్యెఱుకను నిర్వాణ సుఖపారవశ్యంబునం బరిహరించి సకల బందవిముక్తుండై హరిశ్చంద్రుడు అవాజ్ఞ్మానస గోచరంబైన నిజరూపంబుతో వెలుంగుచుండె". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 7 - 201)

(దీనినిబట్టి జీవాత్మయే పరమాత్మ, అదియే జీవుని నిజరూపము అని తెలియుచున్నది).

Transliteration
  1. nijasya ātmanaḥ rūpaṃ. (ātma yokka rūpamu).

  2. bhēdadarśanarahitaṃ rūpaṃ.

(sṛṣṭi aṃtaṭilōnu ātmarūpamulō bhagavaṃtuḍu unnāḍu. aṃdulōni prati vastuvu bhagavaṃtuḍē. ī prakāramu tanu vēru, sṛṣṭilōnunna vastuvulu vēru anu bhēdamu lēkuṃḍā eṃdulōnunnanu tānu sṛṣṭiki muṃduṃḍu sanmātramugānu, cinmātramugānuṃḍuṭa).

  1. "bhāryāsahituṃḍaina hariścaṃdrunivalanaṃ brītuṃḍai viśvāmitruḍu nirastadōṣuṃḍaina yataniki mukhyajñānaṃbupadēśiṃcina (gṛpa sēsina) mannaṃbannamayaṃbugāvuna manaṃbuna nanna rūpaṃbaina pṛdhivineṟiṃgi pṛdhivini jalaṃbuvalana naḍaṃci, jalaṃbu dējalaṃbuvalana niṃkiṃci tējaṃbu vāyuvalanaṃ jērici, vāyuvu nākāśaṃbunaṃ galipi, yākasaṃbu dāmasāhaṃkāraṃbunaṃdu layaṃbu sēsi, yahaṃkāra trayaṃbu mahattattvaṃbunaṃdu ḍiṃdiṃci, paratatvaṃbunaku lōkaṃbulu sṛjiṃce dananu talaṃpaina mahattattvaṃbunaṃdu viṣayākāraṃbu nivartiṃci, viṣaya varjitaṃbaina mahattattvaṃbunu baratatvaṃbugā neṟuṃgucu, na yeṟukavalana saṃsāra hētuvaina prakṛtini bhasmaṃbusēsi yayyeṟukanu nirvāṇa sukhapāravaśyaṃbunaṃ barihariṃci sakala baṃdavimuktuṃḍai hariścaṃdruḍu avājñmānasa gōcaraṃbaina nijarūpaṃbutō veluṃgucuṃḍe". (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 7 - 201)

(dīninibaṭṭi jīvātmayē paramātma, adiyē jīvuni nijarūpamu ani teliyucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.