← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిరంజనం niraṃjanaṃ

Original — తెలుగు
  1. అజ్యతే అనేన ఇత్యం జనం, ఉపాధిః ; తన్నివర్తకం నిరంజనం.

(కప్పి పుచ్చునది, అంజనము, కాటుక వంటిది ; ఉపాధి. ఆత్మను తనలో కప్పి ఉంచునది, అట్టి ఉపాధి లేకుండ చేయువాడు , జన్మ లేకుండ చేయువాడు నిరంజనుడు , భగవంతుడు - ఆవరణము లేనివాడు).

  1. నిర్లేపః; విదతక్లేశః ; శుద్ధం , నిర్మలః, శుచిః.

(పైపూత లేనిది, మలము - దోషము - లేనిది, అందుచేత శుద్ధమైనది; బాధలు లేనిది).

  1. అసంగః, అసంగత్వాత్ నిరంజనః, నిస్సంగః.

(దేనితోను అంటనివాడు కనుక నిరంజనుడు - ఏ శరీరములోనున్నను - ఏ ఉపాధిలోనున్నను దాని దోషములనంటనివాడు).

  1. అంజనం మూల తమస్సంబంధో ధర్మాధికం వా, తభ్భూన్యం నిరంజనం.

(అంజనమనగా మూల ప్రకృతి గుణమైన తమస్సునకు సంబంధించినది, లేక దాని ధర్మము (గుణము). అది లేనిది నిరంజనము).

  1. అంజనతుల్య తమశ్శూన్యం.(అంజనము - కాటుక, పైపూత, కప్పు - దానితోసమానమైన తమోగుణము లేనిది).

  2. నిర్గతం అంజనమవిద్యా సర్వకారణం, యస్మాత్త న్నిరంజనం.

(అంజమనగ అవిద్య - యథార్థము కనబడకుండా కప్పి పుచ్చునది. ఇటువంటి వాటికి కారణమైనది - ఇది లేనిది నిరంజనము).

  1. విజ్ఞాన రూపం (విజ్ఞానరూపము).

  2. కర్తృత్వాది దోష రహితః. (కర్తృత్వము మొదలగు దోషములు లేనివాడు).

  3. అంజనము వంటి ఇతర సహాయములేకనే, తనంతట తానే ప్రకాశించువాడు.

Transliteration
  1. ajyatē anēna ityaṃ janaṃ, upādhiḥ ; tannivartakaṃ niraṃjanaṃ.

(kappi puccunadi, aṃjanamu, kāṭuka vaṃṭidi ; upādhi. ātmanu tanalō kappi uṃcunadi, aṭṭi upādhi lēkuṃḍa cēyuvāḍu , janma lēkuṃḍa cēyuvāḍu niraṃjanuḍu , bhagavaṃtuḍu - āvaraṇamu lēnivāḍu).

  1. nirlēpaḥ; vidataklēśaḥ ; śuddhaṃ , nirmalaḥ, śuciḥ.

(paipūta lēnidi, malamu - dōṣamu - lēnidi, aṃducēta śuddhamainadi; bādhalu lēnidi).

  1. asaṃgaḥ, asaṃgatvāt niraṃjanaḥ, nissaṃgaḥ.

(dēnitōnu aṃṭanivāḍu kanuka niraṃjanuḍu - ē śarīramulōnunnanu - ē upādhilōnunnanu dāni dōṣamulanaṃṭanivāḍu).

  1. aṃjanaṃ mūla tamassaṃbaṃdhō dharmādhikaṃ vā, tabhbhūnyaṃ niraṃjanaṃ.

(aṃjanamanagā mūla prakṛti guṇamaina tamassunaku saṃbaṃdhiṃcinadi, lēka dāni dharmamu (guṇamu). adi lēnidi niraṃjanamu).

  1. aṃjanatulya tamaśśūnyaṃ.(aṃjanamu - kāṭuka, paipūta, kappu - dānitōsamānamaina tamōguṇamu lēnidi).

  2. nirgataṃ aṃjanamavidyā sarvakāraṇaṃ, yasmātta nniraṃjanaṃ.

(aṃjamanaga avidya - yathārthamu kanabaḍakuṃḍā kappi puccunadi. iṭuvaṃṭi vāṭiki kāraṇamainadi - idi lēnidi niraṃjanamu).

  1. vijñāna rūpaṃ (vijñānarūpamu).

  2. kartṛtvādi dōṣa rahitaḥ. (kartṛtvamu modalagu dōṣamulu lēnivāḍu).

  3. aṃjanamu vaṃṭi itara sahāyamulēkanē, tanaṃtaṭa tānē prakāśiṃcuvāḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.