← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిరతిశయసుఖం niratiśayasukhaṃ

Original — తెలుగు

"నిరతిశయం సుఖం చ బ్రహ్మైవ" , "ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్" (తైత్తరీయోపనిషత్ - 3 - 6)

"విజ్ఞానమానందం బ్రహ్మ" (బృహదారణ్యకోపనిషత్ - 3 - 1 - 8)

ఇతి శ్రుతేః - ఆనందాత్మక బ్రహ్మ వాప్తిశ్చ మోక్షః, శోకనివృత్తిశ్చ - "బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి" (ముండకోపనిహత్ - 3 - 2 - 6). "తరతి శోకమాత్మవిత్" (ఛాందోగ్యోపనిషత్ - 2 - 1 - 3)

ఇత్యాది శ్రుతేః -

(అన్నిటికన్న మించిన సుఖము, ఇంతకంటె మించిన సుఖము మరిలేదు అనునది బ్రహ్మమే. ఈ విషయము శ్రుతులలో ఈ క్రింద ప్రకారము చెప్పబడినది :- "బ్రహ్మమే ఆనందము" అని తైత్తిరీయోపనిషత్తులోను 'విజ్ఞానము, ఆనందము బ్రహ్మము' అని బృహదారణ్యకోపనిషత్తులోను, "బ్రహ్మ జ్ఞానము గలవాడు బ్రహ్మమే యగును" అని ముండకోపనిషత్తులోను, "ఆత్మజ్ఞానము గలవాడు శోకము దాటిపోవును - తరించును" అని చాందోగ్యోపనిషత్తులోను చెప్పబడినది. ఆనందరూపుడైన పరబ్రహ్మను పొందుటే మోక్షము, శోకము లేకుండుట. అదియే ఆనందము, పరమానందము, నిరతిశయానందము. - నిరతిశయసుఖము - నిరతిశయమనగా అతిశయించిన - గొప్పదగు - అనందము (ఆనందము కలిగించునది) మఱిలేదు).

Transliteration

"niratiśayaṃ sukhaṃ ca brahmaiva" , "ānaṃdō brahmēti vyajānāt" (taittarīyōpaniṣat - 3 - 6)

"vijñānamānaṃdaṃ brahma" (bṛhadāraṇyakōpaniṣat - 3 - 1 - 8)

iti śrutēḥ - ānaṃdātmaka brahma vāptiśca mōkṣaḥ, śōkanivṛttiśca - "brahma vēda brahmaiva bhavati" (muṃḍakōpanihat - 3 - 2 - 6). "tarati śōkamātmavit" (chāṃdōgyōpaniṣat - 2 - 1 - 3)

ityādi śrutēḥ -

(anniṭikanna miṃcina sukhamu, iṃtakaṃṭe miṃcina sukhamu marilēdu anunadi brahmamē. ī viṣayamu śrutulalō ī kriṃda prakāramu ceppabaḍinadi :- "brahmamē ānaṃdamu" ani taittirīyōpaniṣattulōnu 'vijñānamu, ānaṃdamu brahmamu' ani bṛhadāraṇyakōpaniṣattulōnu, "brahma jñānamu galavāḍu brahmamē yagunu" ani muṃḍakōpaniṣattulōnu, "ātmajñānamu galavāḍu śōkamu dāṭipōvunu - tariṃcunu" ani cāṃdōgyōpaniṣattulōnu ceppabaḍinadi. ānaṃdarūpuḍaina parabrahmanu poṃduṭē mōkṣamu, śōkamu lēkuṃḍuṭa. adiyē ānaṃdamu, paramānaṃdamu, niratiśayānaṃdamu. - niratiśayasukhamu - niratiśayamanagā atiśayiṃcina - goppadagu - anaṃdamu (ānaṃdamu kaligiṃcunadi) maṟilēdu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.