← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిర్గుణః nirguṇaḥ

Original — తెలుగు
  1. సత్వ రజ ఆది గుణరహితః, తమ ఆది గుణత్ర యాస్పృష్టత్వాత్ నిర్గుణః, గుణరహితః, సత్వాని ప్రాకృత గుణ రహితః .

(ప్రకృతి యొక్క గుణములైన సత్వరజస్తమములను త్రిగుణము లేనివాడు, ఆ త్రిగుణములను అంటనివాడు)

  1. వస్తుతః గుణాభావాత్ నిర్గుణః, స్వభావతః. సత్వాది గుణ రహితః, పరమార్థతః గుణా భావాత్ నిర్గుణః.

(స్వభావమువలన, పరమార్థ దృష్టిలోను, వస్తు రీత్యా త్రిగుణములు లేనివాడు).

  1. హేయ గుణ రహితః; రాగ ద్వేషాది రహితః ఇత్యర్థః -

(హేయగుణములు లేనివాడు - అనగా, రాగము, ద్వేషము మొదలగునవి లేనివాడు).

  1. నిర్గతత్త్రైగుణ్యః, త్త్రైగుణ్య ప్రత్యనీకః, యద్వాగుణ శబ్దానాం యేయే ప్రవృత్తి నివృత్తి భూతాః గుణాః, తేభ్యః సర్వేభ్యః నిర్గతః నిర్గుణ ఇతి నిష్క్రియస్యాపి ఉపలక్షణం -

(త్రిగుణములు లేనివాడు. గుణములనగా ప్రవృత్తి నివృత్తికి సంబంధించిన అన్ని విధములైన గుణములు లేనివాడు - అందుచేత ఏ పనియును చేయనివాడు, పుట్టుట, పేరుగుట మొదలగు షడ్భావ వికారములు లేనివాడు).

  1. అగుణవశ్యత్వాత్ అభోక్తా.

(త్రిగుణముల వశములో లేనివారు, త్రిగుణములకు అతీతుడైనవాడు కనుక నిర్గుణుడు; త్రిగుణములవలన కలుగు దోషములననుభవించనివాడు, అందుచేత భోక్త కానివాడు).

  1. "సీ. పరమ నీధామంబు భాసుర సత్వంబు, శాంతంబు, హత రజస్తమము, నిత్య

మధిక తపోమయమట్లు గావున మాయ నెగడెడి గుణములు నీకు లేవు

గుణహీనుడవుగాన గుణముల నయ్యెడి లోభాధికములు నీలోన జేర

వు - -". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 940)

  1. "వ. నిర్గుణుండైన పరమేశ్వరుండు గలుగుచు, లేకుండుచు త్రిగుణంబులతోడం గూడిన తనమాయచేత నింతయు సృజియించి గుణవంతుని చందంబున నిజమాయా విలసితంబులైన గుణంబులలో బ్రవేశించి విజ్ఞాన విజృంభితుండై వెలుంగు - - అతండు మనోభూత సూక్షేంద్రియంబులతోడంగూడి గుణమయంబులైన భావంబులం దనచేత నిర్మితంబులైన భూతంబులందు దగులువడక తద్గుణంబు లనుభవంబుసేయు" (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 - 24)

  2. "నిష్కలం, నిష్క్రియం, శాంతం, నిరవద్యం, నిరంజనం" - "నిర్గుణం" ఇత్యాదికాః, శ్రుతయో బ్రహ్మణో నిరవయవత్వం, నిష్క్రీయత్వం, నిర్గుణత్వం చ ప్రతిపాదయంతి. ఏవం శ్రుతిషు బ్రహ్మాభిన్నస్య జగతః నాస్తిత్వ ప్రతిపాదనాత్ బ్రహ్మణః నిర్గుణత్వ నిష్క్రియత్వాది ప్రతిపాదనాచ్చ బ్రహ్మ నిర్విశేషమితి ప్రతీయతే. పరంతు -"యః సర్వజ్ఞః సర్వవిత్, యస్య జ్ఞానమయం తపః,"సత్యకామః సత్య సంకల్పః, పరాస్యశక్తి ర్వివిధైవశ్రూయతే, స్వాభావికీ జ్ఞానబలక్రియం చ ఇత్యాదిభిః శ్రుతిభిః తేజో బలైశ్వైర్య మహావబోధ సువీర్య శక్త్యాది గుణైక రాశిః" . "తవానంతగుణస్యాపి షడేవ ప్రథమే గుణాః" ఇత్యాదిభి రుప బృమ్హ ణైశ్చ బ్రహ్మణః సవిశేషత్వావ గమాత్ పూర్వోక్త మేకత్వ మద్వితీయత్వంచ స విశేష బ్రహ్మణః ఇత్యవ గమ్యతే. అతశ్చా ద్వైతం నిర్విశేషాద్వైతం, సవిశేషాద్వైతం ఇత్య ద్వైత ఏవ ద్వైతం సంపన్న ఇతి మహదిదం వైచిత్ర్యం"

(బ్రహ్మ నిష్కలము, నిష్క్రియము, శాంతము, నిరవద్యము, నిరంజనము, నిర్గుణము అని శ్రుతులు చెప్పుచున్నవి. అందుచేత బ్రహ్మముకన్న వేఱుకానిది అని చెప్పుట వల్లను బ్రహ్మము నిర్గుణమని, నిష్క్రియమని చెప్పబడుచున్నది. కాని, బ్రహ్మ సర్వజ్ఞుడు, అన్నియు తెలిసినవాడు, అతని తపస్సు జ్ఞానమయము "అనిన్నీ", సత్యకాముడు, సత్యసంకల్పుడు, గొప్పదైన ఇతని శక్తి అనేకవిధములగా వినబడుచున్నది. ఆ శక్తి అతనికి స్వాభా వికము - అది మూడువిధములు - జ్ఞానము, బలము, క్రియ "అని మొదలగు శ్రుతులవలన తేజోబలైశ్వర్య జ్ఞాన వీర్యములు మొదలగు షడ్విధై శ్వర్యములు గలవాడనిన్నీ," లేక్క లేనన్ని గుణములలో ముఖ్యమైనవి ఆరు " అని బ్రహ్మ గుఱించి చెప్పబడుటచేతను బ్రహ్మ సవిశేషమని కూడ చెప్పబడుచున్నది. దీనినిబట్టి బ్రహ్మ అద్వయుడు (రెండవ బ్రహ్మ లేనివాడు ; తనకంటె ఇతరవస్తువు లేనివాడు) అను అద్వైతభావన రెండు విధములుగా చెప్పబడుచున్నది - నిర్విశేషాద్వైతము, సవిశేషాద్వై తము, లేక, నిర్గుణబ్రహ్మ, సగుణ బ్రహ్మ అని చెప్పబడినది. ఇట్లు అద్వైతమనునది ద్వైతముగా - రెండు విధములుగా చెప్పబడుచున్నది - ఇదియే విచిత్రమైన విషయము).

  1. "కేవలో నిర్గుణశ్చ" ఇతి శ్రుతేః - (శ్వేతాశ్వతరోపనిషత్)

(త్రిగుణములు లేనివాడు, కేవలుడు. దేనితోను కలియకుండ నుండువాడు. సృష్టిలోని ప్రతివస్తువు లోను భగవంతుడు ఉన్నా, ప్రతివస్తువు ప్రకృతి యొక్కసత్వరజస్తమోగుణములు కలిగియున్నది - కాని భగవంతుడువాటిని అంటడు పాదరసమువలె, తామరాకు పైన నీటిబొట్టువలె దేనిని అంటకుండనుండు. సృష్టికిముందు, ప్రకృతితో కలియకముందు తానొక్కడె ఉండెను. ఆ స్థితిలో భగవంతుడు కేవలుడు - ప్రకృతితో కలియనందువలన ప్రకృతి గుణముల విషయమే లేనివాడు - అందుచేత సృష్టికాలములోను, సృష్టికిముందు త్రిగుణములతో సంబంధములేనివాడు - అందుచేత నిర్గుణుడు).

  1. "ఏ తద్వై తదక్షరంగార్గి బ్రహ్మణా అభివదంతి, అస్థూలం, అనణ్వం, అహ్రస్వం, అదీర్ఘం" ఇత్యాది శ్రుతి ప్రతి షిద్ధ సర్వోపాధి రహితం నిర్గుణం బ్రహ్మ, నిరాకారం బ్రహ్మ .

(ఆ పరబ్రహ్మ స్థూలముకాదు, అణువుకాదు, పొట్టిదికాదు, పొడుగుదికాదు అని బ్రాహ్మణులు చెప్పుచున్నారు. అని శ్రుతి చెప్పుచున్నది - ఇట్లు శ్రుతిలో చెప్పబడినట్లు పరబ్రహ్మ ఏ విధమైన ఉపాధి లేనివాడు, నిర్గుణుడు (త్రిగుణము లేనివాడు), నిరాకారుడు (ఆకారము - రూపము - లేనివాడు).

  1. "క. అగుణుండగు పరమేశుడు

జగముల కల్పించుకొఱకు జతురత మాయా

సగుణుండగు గావున హరి

భగవంతుడనగ బరగె భవ్య చరిత్రా (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 99)

  1. "నిర్గుణం పరమాత్మానాం స్వయం సగుణో అహంకారాది విశిష్టః పురుషః కథః చక్షుసాపశ్యతి - నకధిమపి ఇత్యర్థః తస్మాత్ యోగ్యతాభావాత్ సగుణమేవ అధికార ప్రాప్తి పర్యంతం చేతసా సం విచారయోపాస్వ",

(నిర్గుణుడు, నిరాకారుడు అయిన పరమాత్మను సగుణుడైన (త్రిగుణములతో కూడి యున్న) పురుషుడు - అహంకారము మొదలగునవిగలవాడు కండ్లతోనెట్లు చూడగలడు - చూడలేడు. అందుచేత నిర్గుణ పరబ్రహ్మను చూచుటకు అర్హత గలుగునంతవరకు - అధికారము కలుగునంతవరకు – నిర్గుణ ఫర బ్రహ్మను చూచుటకు అధికారము కలుగునంతవరకు సగుణ బ్రహ్మమునే మనసులో ధ్యానించి ఉపాసించవలెను).

  1. "ఆ. అన్నమవనియందు, నమృతంబు గోవులందు

వహ్ని సమిధలందు

యోగవశతనుండు నోజను

అగుణు నిన్నుగాంతురాత్మవిదులు (శ్రీమదాంధ్రమహాభాగవతము - - -)

(చూచుటకు మట్టిగానున్న భూమిలో మనము తిను ఆహారమున్నట్లు - (సస్యములన్నియు భూమిలోనేపుట్టును -), గడ్డి తిని నీరుత్రాగు ఆవులు పాలనిచ్చునట్లు, పట్టుకొనిన కాలని కట్టెలందు అగ్ని ఉండునట్లు - యోగవశమున ఉండునట్లు ప్రకృతి పురుష సం యోగమున నుండునట్లు - ఆత్మ తత్వమును తెలిసినవారు నిర్గుణుడైన పరబ్రహ్మను అన్నింటిలోను ఉన్నవానినిగా, వాటిచేత వాటి వాటి పనులు చేయించువాడుగను తెలుసుకొందురు).

  1. "రూపరహితుండవైన నీకు బీజాంకురంబులకైవడి గారణ కార్యంబులయిన సదసద్రూపంబులు రెండును బ్రకాశమానంబులగు - ఆ రెంటియందును భక్తి యోగంబున బుద్ధిమంతులు మథనంబున దారువులందు వహ్నింగనియెడు తెఱంగున నిన్ను బొడగందురు. పంచభూత తన్మాత్రంబులును, ప్రాణంబులు, నింద్రియంబులును, మనో బుద్ధ్యహంకార చిత్తంబులును నీవ. సగుణంబును, నిర్గుణంబును నీవ. గుణాభిమానులయిన జననమరణంబున నొందు విబుధులాద్యంతంబుగానక నిరుపాధికుండవైన నిన్నెఱుంగరు. తత్వజ్ఞులయిన విద్వాంసులు వేదాధ్యయనాది వ్యాపారంబులు మాని వేదాంత ప్రతిపాద్యుండ వగు నిన్ను సమాధి విశేషంబుల నెఱింగి సేవింతురు-"

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 9 - 366)

  1. "అధాత ఆదేశో నేతి నేతి" ('ఈ పదార్థముకాదు - (బ్రహ్మకాదు) - ఈ పదార్థముకాదు అని అన్నింటిని నిషేధింపగా ఆఖరుకు మిగిలి ఉండు నదే పరమేశ్వరుడు అని బృహదారణ్యమునందునూ, "అన్య దేవ తద్విదితాత్ అధో అవిదితావధో” (ఆ పరబ్రహ్మము బుద్ధికి గోచరములగు వానికంటెను, గోచరముకాని వానికంటెను కూడ భిన్నుడు' అని కేనోపనిషత్తునందును ; "యతో వాచో నివర్తంతే అప్రాప్యమనసా సహ” (బుద్ధి, వాక్కులు ఎచ్చటికి పోవ నిశ్చయించి ఆ స్థానము చేరలేక వెను తిరిగిపోవునో) - అనగా, - మనసులో ఊహించుటకుగాని, నోటితో చెప్పుటకు గాని వీలులేనివాడు -). అని తైత్తరీయోపనిషత్తునందును చెప్పబడియున్నది. దేనిని తెలుసుకొనిన మోక్ష మును పొందునో దానిని చెప్పుచున్నాను. అది అనాది - జన్మలేనిది, అది ' సత్ ' ; అనిగాని, అసత్ అనిగాని చెప్పుటకు అలవికాని పరబ్రహ్మము

"జ్ఞేయం యత్ప్రవక్ష్యామి యజ్జ్యాత్వామృతమశ్నుతే |

అనాదిమత్పరం బ్రహ్మ న సత్ నా సదుచ్యతే"

అని శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పి యున్నాడు - (శ్రీమద్భగవద్గీత - 13 - 12)

స్మృతి ఇంకను ఇట్లు చెప్పుచున్నది –

"మాయాహ్యేషామయా సృష్టా యన్మాం పశ్యసి కేశవ |

సర్వభూత గుణైర్యుక్తం నైవం జ్ఞాతు మర్హసి"

అని విశ్వరూపమును దాల్చిన నారాయణుడు నారదునితో చెప్పెను.- (నన్ను ఇప్పుడు నీవు చూచుచున్నది నేను సృష్టించిన నా మాయ - నా మాయ నాకు కలిగించిన రూపము సగుణ రూపము - (సర్వభూతములతోను కూడియున్నట్లు నీకు కానవచ్చుచున్నాను. ఇది యంతయు నామాయ. నా యదార్ధస్వరూపము ఇది యని భ్రాంతి నొంద్కము).

ఈ వాక్యము భగవంతునికి ఆకారములేదని స్పష్టము చేయుచున్నవి. దీనినిబట్టి బాగుగా అలోచించిన ఏ ఆకారము మనోవాక్కాయములకు గోచరించుచున్నదో అది యంతయు పరమేశ్వరునిదికాదని తేలుచున్నది. ఈ కారణములవలన పరమేశ్వరుడు నిరాకారుడు, నిర్గుణుడు).

  1. "యథాహ్యజం జ్యోతిరాత్మ వివస్వానపో భిన్నా బహుధైకో అనుగచ్ఛన్ ఉపాధినా క్రియతే భేధరూపో దేవః. క్షేత్రష్వేవ మజో(అ)యమాత్మా ఏక ఏవహి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః ఏకధా బహుధా చైవ దృశ్యతే జల చంద్రవత్ "

(సూర్యుడు ఒక్కడే అయినప్పటికీ అనేక స్థలములందు గల జలములలో ప్రతిబింబించి ఎట్లు అనేక రూపములు గలవాడిగా తోచుచున్నాడో, యట్లే పరమేశ్వరుడుకూడా ఉపాధులవలన అనేక దేహములందు అనేక రూపములుగలవాడుగా దోచుచున్నాడు. సర్వేశ్వరుడొక్కడే ప్రతి భూతమునందును వ్యాపించి ఆ ఉపాధి భేధములచే జలములందు ప్రతిబింబించిన చంద్రునివలె నొక్కడుగాను అనేకముగాను గనబడు చున్నాడు - అందుచేతపరమేశ్వరునకు రూపభేదములేదు - రూపమే లేనివానికి రూపభేదమెట్లు కలుగును. సర్వము అవిద్యాకల్పితమే - మాయా కల్పితమే - సూర్యుడు పరమార్థ స్థితిలో ఏ వికారమును చెందకున్నను ప్రతిబింబాధారమగు జలమభివృద్ధి అభివృద్ధినొందును, క్షీణించెనేని క్షీణించును, నశించెనేని నశించును, చలించనేని చలించును - అనగా, ఉపాధియగు జలములకు గల ధర్మములు స్వయముగనే కలిగియున్నట్లు అజ్ఞానులచే భావింపబడును. ఇట్లే నిర్వికారుడయ్యును పరమేశ్వరుడు దేహాద్యభివృద్ధివలన అభివృద్ధి నొందును, క్షీణతవలన క్షీణించును, నాశమువలన నశించును, గమనాగమనములవలన గమనాగమనముల నాచరించును -అట్లు అజ్ఞానులచే భావింపబడును - కావున ఈశ్వరునకు సూర్యునకువలె పరమార్థ స్థితిలో ఏ వికారములు లేవు).

Transliteration
  1. satva raja ādi guṇarahitaḥ, tama ādi guṇatra yāspṛṣṭatvāt nirguṇaḥ, guṇarahitaḥ, satvāni prākṛta guṇa rahitaḥ .

(prakṛti yokka guṇamulaina satvarajastamamulanu triguṇamu lēnivāḍu, ā triguṇamulanu aṃṭanivāḍu)

  1. vastutaḥ guṇābhāvāt nirguṇaḥ, svabhāvataḥ. satvādi guṇa rahitaḥ, paramārthataḥ guṇā bhāvāt nirguṇaḥ.

(svabhāvamuvalana, paramārtha dṛṣṭilōnu, vastu rītyā triguṇamulu lēnivāḍu).

  1. hēya guṇa rahitaḥ; rāga dvēṣādi rahitaḥ ityarthaḥ -

(hēyaguṇamulu lēnivāḍu - anagā, rāgamu, dvēṣamu modalagunavi lēnivāḍu).

  1. nirgatattraiguṇyaḥ, ttraiguṇya pratyanīkaḥ, yadvāguṇa śabdānāṃ yēyē pravṛtti nivṛtti bhūtāḥ guṇāḥ, tēbhyaḥ sarvēbhyaḥ nirgataḥ nirguṇa iti niṣkriyasyāpi upalakṣaṇaṃ -

(triguṇamulu lēnivāḍu. guṇamulanagā pravṛtti nivṛttiki saṃbaṃdhiṃcina anni vidhamulaina guṇamulu lēnivāḍu - aṃducēta ē paniyunu cēyanivāḍu, puṭṭuṭa, pēruguṭa modalagu ṣaḍbhāva vikāramulu lēnivāḍu).

  1. aguṇavaśyatvāt abhōktā.

(triguṇamula vaśamulō lēnivāru, triguṇamulaku atītuḍainavāḍu kanuka nirguṇuḍu; triguṇamulavalana kalugu dōṣamulananubhaviṃcanivāḍu, aṃducēta bhōkta kānivāḍu).

  1. "sī. parama nīdhāmaṃbu bhāsura satvaṃbu, śāṃtaṃbu, hata rajastamamu, nitya

madhika tapōmayamaṭlu gāvuna māya negaḍeḍi guṇamulu nīku lēvu

guṇahīnuḍavugāna guṇamula nayyeḍi lōbhādhikamulu nīlōna jēra

vu - -". (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 940)

  1. "va. nirguṇuṃḍaina paramēśvaruṃḍu galugucu, lēkuṃḍucu triguṇaṃbulatōḍaṃ gūḍina tanamāyacēta niṃtayu sṛjiyiṃci guṇavaṃtuni caṃdaṃbuna nijamāyā vilasitaṃbulaina guṇaṃbulalō bravēśiṃci vijñāna vijṛṃbhituṃḍai veluṃgu - - ataṃḍu manōbhūta sūkṣēṃdriyaṃbulatōḍaṃgūḍi guṇamayaṃbulaina bhāvaṃbulaṃ danacēta nirmitaṃbulaina bhūtaṃbulaṃdu daguluvaḍaka tadguṇaṃbu lanubhavaṃbusēyu" (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 - 24)

  2. "niṣkalaṃ, niṣkriyaṃ, śāṃtaṃ, niravadyaṃ, niraṃjanaṃ" - "nirguṇaṃ" ityādikāḥ, śrutayō brahmaṇō niravayavatvaṃ, niṣkrīyatvaṃ, nirguṇatvaṃ ca pratipādayaṃti. ēvaṃ śrutiṣu brahmābhinnasya jagataḥ nāstitva pratipādanāt brahmaṇaḥ nirguṇatva niṣkriyatvādi pratipādanācca brahma nirviśēṣamiti pratīyatē. paraṃtu -"yaḥ sarvajñaḥ sarvavit, yasya jñānamayaṃ tapaḥ,"satyakāmaḥ satya saṃkalpaḥ, parāsyaśakti rvividhaivaśrūyatē, svābhāvikī jñānabalakriyaṃ ca ityādibhiḥ śrutibhiḥ tējō balaiśvairya mahāvabōdha suvīrya śaktyādi guṇaika rāśiḥ" . "tavānaṃtaguṇasyāpi ṣaḍēva prathamē guṇāḥ" ityādibhi rupa bṛmha ṇaiśca brahmaṇaḥ saviśēṣatvāva gamāt pūrvōkta mēkatva madvitīyatvaṃca sa viśēṣa brahmaṇaḥ ityava gamyatē. ataścā dvaitaṃ nirviśēṣādvaitaṃ, saviśēṣādvaitaṃ itya dvaita ēva dvaitaṃ saṃpanna iti mahadidaṃ vaicitryaṃ"

(brahma niṣkalamu, niṣkriyamu, śāṃtamu, niravadyamu, niraṃjanamu, nirguṇamu ani śrutulu ceppucunnavi. aṃducēta brahmamukanna vēṟukānidi ani ceppuṭa vallanu brahmamu nirguṇamani, niṣkriyamani ceppabaḍucunnadi. kāni, brahma sarvajñuḍu, anniyu telisinavāḍu, atani tapassu jñānamayamu "aninnī", satyakāmuḍu, satyasaṃkalpuḍu, goppadaina itani śakti anēkavidhamulagā vinabaḍucunnadi. ā śakti ataniki svābhā vikamu - adi mūḍuvidhamulu - jñānamu, balamu, kriya "ani modalagu śrutulavalana tējōbalaiśvarya jñāna vīryamulu modalagu ṣaḍvidhai śvaryamulu galavāḍaninnī," lēkka lēnanni guṇamulalō mukhyamainavi āru " ani brahma guṟiṃci ceppabaḍuṭacētanu brahma saviśēṣamani kūḍa ceppabaḍucunnadi. dīninibaṭṭi brahma advayuḍu (reṃḍava brahma lēnivāḍu ; tanakaṃṭe itaravastuvu lēnivāḍu) anu advaitabhāvana reṃḍu vidhamulugā ceppabaḍucunnadi - nirviśēṣādvaitamu, saviśēṣādvai tamu, lēka, nirguṇabrahma, saguṇa brahma ani ceppabaḍinadi. iṭlu advaitamanunadi dvaitamugā - reṃḍu vidhamulugā ceppabaḍucunnadi - idiyē vicitramaina viṣayamu).

  1. "kēvalō nirguṇaśca" iti śrutēḥ - (śvētāśvatarōpaniṣat)

(triguṇamulu lēnivāḍu, kēvaluḍu. dēnitōnu kaliyakuṃḍa nuṃḍuvāḍu. sṛṣṭilōni prativastuvu lōnu bhagavaṃtuḍu unnā, prativastuvu prakṛti yokkasatvarajastamōguṇamulu kaligiyunnadi - kāni bhagavaṃtuḍuvāṭini aṃṭaḍu pādarasamuvale, tāmarāku paina nīṭiboṭṭuvale dēnini aṃṭakuṃḍanuṃḍu. sṛṣṭikimuṃdu, prakṛtitō kaliyakamuṃdu tānokkaḍe uṃḍenu. ā sthitilō bhagavaṃtuḍu kēvaluḍu - prakṛtitō kaliyanaṃduvalana prakṛti guṇamula viṣayamē lēnivāḍu - aṃducēta sṛṣṭikālamulōnu, sṛṣṭikimuṃdu triguṇamulatō saṃbaṃdhamulēnivāḍu - aṃducēta nirguṇuḍu).

  1. "ē tadvai tadakṣaraṃgārgi brahmaṇā abhivadaṃti, asthūlaṃ, anaṇvaṃ, ahrasvaṃ, adīrghaṃ" ityādi śruti prati ṣiddha sarvōpādhi rahitaṃ nirguṇaṃ brahma, nirākāraṃ brahma .

(ā parabrahma sthūlamukādu, aṇuvukādu, poṭṭidikādu, poḍugudikādu ani brāhmaṇulu ceppucunnāru. ani śruti ceppucunnadi - iṭlu śrutilō ceppabaḍinaṭlu parabrahma ē vidhamaina upādhi lēnivāḍu, nirguṇuḍu (triguṇamu lēnivāḍu), nirākāruḍu (ākāramu - rūpamu - lēnivāḍu).

  1. "ka. aguṇuṃḍagu paramēśuḍu

jagamula kalpiṃcukoṟaku jaturata māyā

saguṇuṃḍagu gāvuna hari

bhagavaṃtuḍanaga barage bhavya caritrā (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 99)

  1. "nirguṇaṃ paramātmānāṃ svayaṃ saguṇō ahaṃkārādi viśiṣṭaḥ puruṣaḥ kathaḥ cakṣusāpaśyati - nakadhimapi ityarthaḥ tasmāt yōgyatābhāvāt saguṇamēva adhikāra prāpti paryaṃtaṃ cētasā saṃ vicārayōpāsva",

(nirguṇuḍu, nirākāruḍu ayina paramātmanu saguṇuḍaina (triguṇamulatō kūḍi yunna) puruṣuḍu - ahaṃkāramu modalagunavigalavāḍu kaṃḍlatōneṭlu cūḍagalaḍu - cūḍalēḍu. aṃducēta nirguṇa parabrahmanu cūcuṭaku arhata galugunaṃtavaraku - adhikāramu kalugunaṃtavaraku – nirguṇa phara brahmanu cūcuṭaku adhikāramu kalugunaṃtavaraku saguṇa brahmamunē manasulō dhyāniṃci upāsiṃcavalenu).

  1. "ā. annamavaniyaṃdu, namṛtaṃbu gōvulaṃdu

vahni samidhalaṃdu

yōgavaśatanuṃḍu nōjanu

aguṇu ninnugāṃturātmavidulu (śrīmadāṃdhramahābhāgavatamu - - -)

(cūcuṭaku maṭṭigānunna bhūmilō manamu tinu āhāramunnaṭlu - (sasyamulanniyu bhūmilōnēpuṭṭunu -), gaḍḍi tini nīrutrāgu āvulu pālaniccunaṭlu, paṭṭukonina kālani kaṭṭelaṃdu agni uṃḍunaṭlu - yōgavaśamuna uṃḍunaṭlu prakṛti puruṣa saṃ yōgamuna nuṃḍunaṭlu - ātma tatvamunu telisinavāru nirguṇuḍaina parabrahmanu anniṃṭilōnu unnavāninigā, vāṭicēta vāṭi vāṭi panulu cēyiṃcuvāḍuganu telusukoṃduru).

  1. "rūparahituṃḍavaina nīku bījāṃkuraṃbulakaivaḍi gāraṇa kāryaṃbulayina sadasadrūpaṃbulu reṃḍunu brakāśamānaṃbulagu - ā reṃṭiyaṃdunu bhakti yōgaṃbuna buddhimaṃtulu mathanaṃbuna dāruvulaṃdu vahniṃganiyeḍu teṟaṃguna ninnu boḍagaṃduru. paṃcabhūta tanmātraṃbulunu, prāṇaṃbulu, niṃdriyaṃbulunu, manō buddhyahaṃkāra cittaṃbulunu nīva. saguṇaṃbunu, nirguṇaṃbunu nīva. guṇābhimānulayina jananamaraṇaṃbuna noṃdu vibudhulādyaṃtaṃbugānaka nirupādhikuṃḍavaina ninneṟuṃgaru. tatvajñulayina vidvāṃsulu vēdādhyayanādi vyāpāraṃbulu māni vēdāṃta pratipādyuṃḍa vagu ninnu samādhi viśēṣaṃbula neṟiṃgi sēviṃturu-"

(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 9 - 366)

  1. "adhāta ādēśō nēti nēti" ('ī padārthamukādu - (brahmakādu) - ī padārthamukādu ani anniṃṭini niṣēdhiṃpagā ākharuku migili uṃḍu nadē paramēśvaruḍu ani bṛhadāraṇyamunaṃdunū, "anya dēva tadviditāt adhō aviditāvadhō” (ā parabrahmamu buddhiki gōcaramulagu vānikaṃṭenu, gōcaramukāni vānikaṃṭenu kūḍa bhinnuḍu' ani kēnōpaniṣattunaṃdunu ; "yatō vācō nivartaṃtē aprāpyamanasā saha” (buddhi, vākkulu eccaṭiki pōva niścayiṃci ā sthānamu cēralēka venu tirigipōvunō) - anagā, - manasulō ūhiṃcuṭakugāni, nōṭitō ceppuṭaku gāni vīlulēnivāḍu -). ani taittarīyōpaniṣattunaṃdunu ceppabaḍiyunnadi. dēnini telusukonina mōkṣa munu poṃdunō dānini ceppucunnānu. adi anādi - janmalēnidi, adi ' sat ' ; anigāni, asat anigāni ceppuṭaku alavikāni parabrahmamu

"jñēyaṃ yatpravakṣyāmi yajjyātvāmṛtamaśnutē |

anādimatparaṃ brahma na sat nā saducyatē"

ani śrīmadbhagavadgītalō śrīkṛṣṇaparamātma ceppi yunnāḍu - (śrīmadbhagavadgīta - 13 - 12)

smṛti iṃkanu iṭlu ceppucunnadi –

"māyāhyēṣāmayā sṛṣṭā yanmāṃ paśyasi kēśava |

sarvabhūta guṇairyuktaṃ naivaṃ jñātu marhasi"

ani viśvarūpamunu dālcina nārāyaṇuḍu nāradunitō ceppenu.- (nannu ippuḍu nīvu cūcucunnadi nēnu sṛṣṭiṃcina nā māya - nā māya nāku kaligiṃcina rūpamu saguṇa rūpamu - (sarvabhūtamulatōnu kūḍiyunnaṭlu nīku kānavaccucunnānu. idi yaṃtayu nāmāya. nā yadārdhasvarūpamu idi yani bhrāṃti noṃdkamu).

ī vākyamu bhagavaṃtuniki ākāramulēdani spaṣṭamu cēyucunnavi. dīninibaṭṭi bāgugā alōciṃcina ē ākāramu manōvākkāyamulaku gōcariṃcucunnadō adi yaṃtayu paramēśvarunidikādani tēlucunnadi. ī kāraṇamulavalana paramēśvaruḍu nirākāruḍu, nirguṇuḍu).

  1. "yathāhyajaṃ jyōtirātma vivasvānapō bhinnā bahudhaikō anugacchan upādhinā kriyatē bhēdharūpō dēvaḥ. kṣētraṣvēva majō(a)yamātmā ēka ēvahi bhūtātmā bhūtē bhūtē vyavasthitaḥ ēkadhā bahudhā caiva dṛśyatē jala caṃdravat "

(sūryuḍu okkaḍē ayinappaṭikī anēka sthalamulaṃdu gala jalamulalō pratibiṃbiṃci eṭlu anēka rūpamulu galavāḍigā tōcucunnāḍō, yaṭlē paramēśvaruḍukūḍā upādhulavalana anēka dēhamulaṃdu anēka rūpamulugalavāḍugā dōcucunnāḍu. sarvēśvaruḍokkaḍē prati bhūtamunaṃdunu vyāpiṃci ā upādhi bhēdhamulacē jalamulaṃdu pratibiṃbiṃcina caṃdrunivale nokkaḍugānu anēkamugānu ganabaḍu cunnāḍu - aṃducētaparamēśvarunaku rūpabhēdamulēdu - rūpamē lēnivāniki rūpabhēdameṭlu kalugunu. sarvamu avidyākalpitamē - māyā kalpitamē - sūryuḍu paramārtha sthitilō ē vikāramunu ceṃdakunnanu pratibiṃbādhāramagu jalamabhivṛddhi abhivṛddhinoṃdunu, kṣīṇiṃcenēni kṣīṇiṃcunu, naśiṃcenēni naśiṃcunu, caliṃcanēni caliṃcunu - anagā, upādhiyagu jalamulaku gala dharmamulu svayamuganē kaligiyunnaṭlu ajñānulacē bhāviṃpabaḍunu. iṭlē nirvikāruḍayyunu paramēśvaruḍu dēhādyabhivṛddhivalana abhivṛddhi noṃdunu, kṣīṇatavalana kṣīṇiṃcunu, nāśamuvalana naśiṃcunu, gamanāgamanamulavalana gamanāgamanamula nācariṃcunu -aṭlu ajñānulacē bhāviṃpabaḍunu - kāvuna īśvarunaku sūryunakuvale paramārtha sthitilō ē vikāramulu lēvu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.