దేనిని అంటనివాడు. కర్మవలన కలుగు ఫలము ననుభవించవలసిన వాడు కాడు -ఏ విధమైన పూత (మైపూత వంటిది) లేనివాడు. భగవంతుడు సృష్టి చేయుట మొదలగు ఏ విధమైనకర్మలను చేసినను ఆ కర్మల ఫలము అతనిని అంటదు - వాటికి అతను కర్త కాడు కనుక వాటిఫలము అతనిని అంటదు.
“అనాదిత్వా న్నిర్గుణత్వా త్పరమాత్మా యమ వ్యయః |
శరీరస్థోపి కౌంతేయ నకఠోతి నలిప్యతే ||
యథాసర్వగతంసౌక్ష్మాదాకాశం నోప లిప్యతే |
సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే ||” (శ్రీమద్భగవద్గీత - 13 - 31,32)
“యథా సర్వగతం సర్వ వ్యాపి ఆకాశం సూక్ష్మభావాత్ న ఉపలిప్యతే - న సంబధ్యతే - తథాదేహే సర్వత్ర అవస్థితః ఆత్మాన ఉపలిప్యతే” (శ్రీ శంకరః)
“యథా ఆకాశం సర్వగతమపి సర్వైః వస్తుభిః సం యుక్తమపి సౌక్ష్మాత్ సర్వ వస్తు స్వభావైఃన లిప్యతే” (శ్రీమాన్ రామానుజః)
(ఆకాశము అన్నింటిలోను వ్యాపించియుండుటవలన, సూక్ష్మమైనదగుటవలన దేనితోను సంబంధములేనిది. దేనిని అంటనిది. ఆ ప్రకారముగానే అంతకంటె సూక్ష్మమైన ఆత్మ దేహమంతంటను ఉన్నప్పటికీదేనిని అంటియుండదు).
సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే |
నైవ కించిత్కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ |
పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్ఛన్ స్వపన్శ్వసన్ |
ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి |
ఇంద్రియాణీంద్రి యార్థేషు వర్తంతే ఇతి ధారయన్ |
బ్రహ్మణ్యా ధాయ కర్మాణి సంగంత్యక్త్వా కరోతియః |
లిప్యతే న నసాపేన పద్మ పత్ర మివాంభసా ||” (శ్రీమద్భగవద్గీత - 5 - 6 to 9)
(భగవంతుడు నిర్లేపుడు అయినట్లే కర్మయోగికూడ సమయములందు నిర్లేపుడు అగుచున్నాడు -).
(ఆత్మ తత్వమును తెలియకపోయినను కర్మయోగి యగువాడు బ్రహ్మముందు కర్మను ఉంచి బ్రహ్మ కొరకుకర్మ చేయుచున్నాను - అని స్వామిని గుఱించి భక్తుడు చేయునట్లు చేయుచు, కర్మఫలము మోక్షమైననుదానియందు ఆశలేక కర్మచేయువానిని పాపము అంటదు. నీటిలోనున్న తామరాకును నీరు అంటనట్లుఅట్టియొక్క ఫలము సత్వశుద్ధి మాత్రమే.
(నీటిలోనుండు తామరాకును నీరు అంటనట్లు ఎవడు బ్రహ్మముందు కర్మను అర్పణచేసి (ఇంద్రియములుప్రకృతి పరిణామరూపములు - ప్రకృతియే ఇంద్రియములుగా పరిణమించినవి - మారినవి. అందుచేతఇంద్రియాకారములుగా మారిన ప్రకృతియందు కర్మను అర్పణ చేసి) కర్మయొక్క ఫలమందాశ లేనివాడై’ నేను ఏ కర్మను, ఏ కొంచెమైనను చేయలేదు ” అని తలచుచు కర్మ చేయునో ప్రకృతికి సంబంధించినసన్సారములో ఉన్నప్పటికీ ప్రకృతి సంబంధమువలన కలుగు కర్మయందభిమానము కలిగియుండుటయను బంధము - అను పాపము - తనని అంటనివాడు).
(తామరాకు నీళ్ళలోపుట్టి నీళ్ళలోనే పెరుగుచునుండును. అది అంతయు నీరే - నీటిమయం. అయినప్పటికీ (ఆ తామరాకు ఆ నీళ్ళను అంటదు). ఆ నీళ్ళు తామరాకును అంటవు. ఆ ప్రకారముగానే ప్రకృతి ఆధీనములోనుండు భోగములవలన దేహాత్మ భ్రమ ఇట్టివానికి కలుగదు).
శృణు కృష్ణార్పణం కర్మ ఫల సంగ వివర్జితం|
యోగ ఇత్యుచ్యతే తేన యుక్తస్సన్ ప్రధమం తతః |
రజస్తమో మలా స్పృష్టం సత్యం యస్య స శుద్ధ ధీః |
స్వవశీకృత దేహస్సన్ స్వాధీన కృతేంద్రియః |
- - - జడా జడాత్మకం విశ్వం పశ్యన్నాత్మమయం మునిః |
ఉభయత్రాప్ర్య ఖండార్థభోధి సిద్ధి రితీరితా |
ఈ దృశః తత్వ దృక్ కుర్వన్నపి లోక దృశా క్రియాః |
తా భిర్నలిప్యతే యస్మాత్స్వదృష్ట్యా తద భావతః |
ధీ శుద్ధ్యా యుక్త ఏవా దౌ భూత్వాతత్వవిదేవసః |
క్రియా మాణాసుచేష్టాసు న కరోమీతి మన్యతే |
జ్ఞానకర్మేంద్రియైః కర్మ దశభిః తద్యదాయధం |
కుర్వన్న కుర్వతా బుద్ధ్యాపశ్యత్యాత్మాన మక్రియం |
స్వసన్ ప్రాణైః స్వపన్నంతః కరణేన మునిస్తథా |
ఉన్మిషన్నిమి షన్నేవం నాగకూర్మాది పంచకైః |
ఏతాని స్వ స్వవిషయే వర్తంతే న త్వహం త్వతిః |
ధారయ సర్వ వ్యాపారే ష్వాత్మానమక్రియం వి దన్ |
కుర్వన్న లిప్యతే చాతో యుక్తమేవేరితం వచాః |
- - - ఫలా సంగం పరిత్యజ్య సమర్ప్యపరమేశ్వరే |
కర్మాణి వైదికాన్యజ్ఞో లౌకికాని కరోతి యః |
పాప పుణ్యాత్మకేనా సౌ కర్మణా నైవ లిప్యతే |
యథో పరి ప్రక్షిప్తేన పద్మ పత్రం నచాం భసా |
లిప్యతే తద్వ దీశేపి కర్మార్పిత మ లేపకం ప్రత్యుతేశ
ప్రసాదేన ధీ శుద్ధి శ్చాస్య జాయతే || (గీతాభావ ప్రకాశము - 5 - 68 to 70, 75 to 81, 83 to 85)
(కర్మ బంధమును కలుగచేయునుకదా అదిమోక్షమునకు ఒకే కారణమెట్లగుననగా - కర్మ వలనకలుగుఫలమందాసక్తి లేక ఆ కర్మను భగవంతునికి అర్పణ చేసిన అదియే యోగమనిపించుకొనును - నిష్కామకర్మయోగము. ఇట్టి కర్మయోగము చేయుచు రజోగుణము, తమోగుణము అను వాటియొక్క దోషములంటనివాడై, చిత్త శుద్ధిగలవాడై, దేహమును, ఇంద్రియములను తనస్వాధీనములోనుంచుకొనినవాడై, తన ఆత్మయేసమస్త భూతములలోనుండు ఆత్మయని తలచుచు, ఈ ప్రకారము బ్రహ్మమొక్కటే, మరేదియు లేదు అనుఅఖండాద్వైతభావముకలిగి, యేవిధమైన భేధములేక (బ్రహ్మవేరు ప్రపంచము వేరు అనుభావములేక) జడజడాత్మకమైనజగత్తు అంతయు, ఆత్మతోనిండియున్నదని భావించుచు ఇట్టివాడు లోక దృష్టిలో ఏకర్మచేసినను తన దృష్టిలో ఏ కర్మ చేసినను తనదృష్టిలో అది తన చేసిన కర్మ కాదని - తాను ఏకర్మను చేయలేదని - భావించుటచేత ఆ కర్మ (ఆ కర్మఫలము) వానినంటదు - - - తత్వమును తెలిసినవాడు నిష్కామకర్మ యోగములోనుండి తాను చేయుచున్నపనులు తాను చేయుటలేదని తలచును. అయిదు కర్మేంద్రియములచేతను అయిదు జ్ఞానేంద్రియములచేతను ఏయే కర్మలు చేయుచున్నను తాను వాటిని చేయుటలేదని భావించుటవలన అక్రియుడే (ఏ పని చేయనివాడే) అని భావించును. పంచప్రాణములచే ఊపిరి తీయుచున్నను, అంతఃకరణము చేత నిదురించుచున్నను, ఉపప్రాణములచేత కండ్లు మూయుట, తెరచుట చేయుచున్నను, ఈ కర్మలన్నియు ఆయా ఇంద్రియములు వాటి వాటి పనులు చేయుచున్నవని, ఆ పనులు నేను చేయుటలేదని, అన్ని వ్యాపారములందును తాను అక్రియుడే (ఏ పనియును చేయనివాడుగనే) అని తెలుసుకొనుచు ఆ పనులు చేయువానిని ఆ పనులు అంటవు - వాటి ఫలమును అతనిచే అనుభవింపచేయవు. కర్మఫలమందాసక్తిలేక వైదిక కర్మలను, లౌకిక కర్మలను పరమేశ్వరునకు అర్పణము చేయువాడు అజ్ఞుడు(ఈ జ్ఞానము లేనివాడు). పాప పుణ్య రూపములైన కర్మలు అతనిని అంటవు. నీటిమీదనున్న తామరాకుకు నీరు అంటదు. ఆ రీతిగనే ఇటువంటివానిని కర్మఫలమంటదు. కనుక అతను నిర్లేపుడు).
సూర్యుడు పవిత్రమైన గంగా జలములోను, కల్లులోను ప్రతిబింబించును - అయినను గంగయొక్కగుణము కల్లుకు సంబంధించిన మలినమును ఆ సూర్యప్రతిబింబమునకు అంటదు. అట్లే భగవంతుడుశుద్ధమైన ఉపాధిలోనున్నను అశుద్ధమైన ఉపాధిలోనున్నను వాటి గుణాగుణములు భగవంతునంటవు.
“వ. వివిధ కాష్టాంతర్గతుండైన వాయుసఖుండు తద్గత దోషంబునం బొరయక నిత్యశుద్ధుండై తరతమభావంబున వర్తించు చందంబున స్వసంకల్పకృతంబులైన విచిత్రశరీరంబులందు నంతర్యామివై ప్రవేశించి తత్తద్విచిత్రయోనిగతంబైన హేయంబులం బొరయక సకలాత్మ సమంబై యేక రసంబై బ్రహ్మంబైననిన్ను నైహికాముష్మిక ఫల సంగమంబు లేక విగత రజోగుణంబులుగలిగి భజించుచుండుదురు”. (శ్రీమదాంధ్రమహభాగవతము - 10 - ఉ.భా. - 1215)
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః |
తస్య కర్తా రమపిమాం విద్ధ్యకర్తారమ వ్యయం |
నమే కర్మాణి లింపతి నమే కర్మ ఫలే స్ఫృహా |
ఇతి మాం యో (అ)భిజానాతి కర్మ భిర్న బద్ధ్యతే||” (శ్రీమద్భగవద్గీత - 4 - 13, 14)
“చత్వార ఏవ వర్ణాస్తే - - - |
గుణకర్మ విభాగేన వర్ణాస్తే బ్రాహ్మణాదయః |
చత్వారో నిర్మతాః సర్గేమయా భగవతా యతః |
సత్వ ప్రధానా యే విప్రాస్తేషాం కర్మ శమాదికం |
సత్వగౌణ రజో ముఖ్యా నృపాః శౌర్యాది కర్మిణః |
తమోగౌణ రజోముఖ్యా వైశ్యాః కృష్యాదికర్మిణః |
తమః ప్రథానాః శూద్రాస్తత్కర్మ శుశ్రూషణాదికం |
తదిదం మానుషే లోకే చాతుర్వర్ణ్యం వ్యవస్థితః |
ఏవం వైషమ్య సృష్టేస్తే కర్తృత్వాత్త త్పలేనచ |
సంబంధోదుర్నివారః స్యాదిత్య తః ప్రాహమాధవః |
వ్యవహారదృశాతస్య చాతుర్వర్ణస్య సర్వ శః |
కర్తారం నంతమపిమాం పరమార్థ దృశా (అ)వ్యయం|
విద్ధ్య కర్తా రమక్షీణ స్వభావ మనహం కృతిం |
నిర్వికారతయాసంతం మాం జ్ఞాత్వా ముచ్యతే భయాత్ ||” (గీతాభావప్రకాశము - 4 - 85 to 91)
(బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని వర్ణములు నాలుగు. సృష్టి ప్రారంభములో త్రిగుణముల బట్టియు, వారు వారు చేయు పనులబట్టియు నేను ఈ నాలుగు వర్ణములను సృష్టించితిని. సత్వగుణము ప్రధానముగలవారు, శమదమాదులు వారి కర్మగా గలవారు బ్రాహ్మణులు. రజోగుణము ప్రధానముగానుండి సత్వగుణము గౌణముగా గలవారు (అప్రధానముగా గలవారు) క్షత్రియులు. వారికర్మ శౌర్యము, ధైర్యము,సాహసము చేయుట. రజో గుణము ప్రధానముగా నుండి తమోగుణము గౌణముగా నుండువారు వైశ్యులు.వీరి కర్మ కృష్యాదులు. తమోగుణము ప్రధానముగాగలవారు శూద్రులు. వీరికర్మ శుశ్రూష మొదలగునవి.ఈ విధముగా సృష్టిలో వైషమ్యమున్నది - హెచ్చు తగ్గులున్నవి. సృష్టియే వేరువేరుగా నున్నది. దీనికికారణము త్రిగుణముల వైషమ్యము. దీని కారణముగా సృష్టిలో అందరూ ఒక్క లాగ ఉండరు. ఈ వర్ణములలోనే కాక ఈ వైషమ్యము ఒక వస్తువునకు ఇంకొక వస్తువునకు కూడ కనబడుచున్నది. ఈ విధముగా సృష్టిలోనే వైషమ్యమున్నపుడు వారివారి కర్మలకువాటివాటి ఫలితములకు సంబంధము నివారింప శక్యముకానిది - ఈ చాతుర్వర్ణముల సృష్టించినందువల్ల వ్యవహార రీతిని బట్టి నేను (భగవంతుడు) కర్తవలె కనిపించినప్పటికి పరమార్థ దృష్టిలో వికారములు లేకపోవుటచే క్షీణింపని స్వభావము గలవాడను, అవ్యయుడను, అహంకారము లేనివాడను అయిననన్ను ఎల్లపుడు అకర్త (ఏ కర్తయు చేయనివాడు)గా తెలుసుకొనుము. నేను అకర్తను అగుటవలన ఈ కర్మ వల్ల కలుగు ఫలము నాకు ఉండదు - అందుచేత నేను నిర్లేపుడను).
dēnini aṃṭanivāḍu. karmavalana kalugu phalamu nanubhaviṃcavalasina vāḍu kāḍu -ē vidhamaina pūta (maipūta vaṃṭidi) lēnivāḍu. bhagavaṃtuḍu sṛṣṭi cēyuṭa modalagu ē vidhamainakarmalanu cēsinanu ā karmala phalamu atanini aṃṭadu - vāṭiki atanu karta kāḍu kanuka vāṭiphalamu atanini aṃṭadu.
“anāditvā nnirguṇatvā tparamātmā yama vyayaḥ |
śarīrasthōpi kauṃtēya nakaṭhōti nalipyatē ||
yathāsarvagataṃsaukṣmādākāśaṃ nōpa lipyatē |
sarvatrāvasthitō dēhē tathātmā nōpalipyatē ||” (śrīmadbhagavadgīta - 13 - 31,32)
“yathā sarvagataṃ sarva vyāpi ākāśaṃ sūkṣmabhāvāt na upalipyatē - na saṃbadhyatē - tathādēhē sarvatra avasthitaḥ ātmāna upalipyatē” (śrī śaṃkaraḥ)
“yathā ākāśaṃ sarvagatamapi sarvaiḥ vastubhiḥ saṃ yuktamapi saukṣmāt sarva vastu svabhāvaiḥna lipyatē” (śrīmān rāmānujaḥ)
(ākāśamu anniṃṭilōnu vyāpiṃciyuṃḍuṭavalana, sūkṣmamainadaguṭavalana dēnitōnu saṃbaṃdhamulēnidi. dēnini aṃṭanidi. ā prakāramugānē aṃtakaṃṭe sūkṣmamaina ātma dēhamaṃtaṃṭanu unnappaṭikīdēnini aṃṭiyuṃḍadu).
sarvabhūtātma bhūtātmā kurvannapi na lipyatē |
naiva kiṃcitkarōmīti yuktō manyēta tatvavit |
paśyan śṛṇvan spṛśan jighran aśnan gacchan svapanśvasan |
pralapan visṛjan gṛhṇan unmiṣan nimiṣannapi |
iṃdriyāṇīṃdri yārthēṣu vartaṃtē iti dhārayan |
brahmaṇyā dhāya karmāṇi saṃgaṃtyaktvā karōtiyaḥ |
lipyatē na nasāpēna padma patra mivāṃbhasā ||” (śrīmadbhagavadgīta - 5 - 6 to 9)
(bhagavaṃtuḍu nirlēpuḍu ayinaṭlē karmayōgikūḍa samayamulaṃdu nirlēpuḍu agucunnāḍu -).
(ātma tatvamunu teliyakapōyinanu karmayōgi yaguvāḍu brahmamuṃdu karmanu uṃci brahma korakukarma cēyucunnānu - ani svāmini guṟiṃci bhaktuḍu cēyunaṭlu cēyucu, karmaphalamu mōkṣamainanudāniyaṃdu āśalēka karmacēyuvānini pāpamu aṃṭadu. nīṭilōnunna tāmarākunu nīru aṃṭanaṭluaṭṭiyokka phalamu satvaśuddhi mātramē.
(nīṭilōnuṃḍu tāmarākunu nīru aṃṭanaṭlu evaḍu brahmamuṃdu karmanu arpaṇacēsi (iṃdriyamuluprakṛti pariṇāmarūpamulu - prakṛtiyē iṃdriyamulugā pariṇamiṃcinavi - mārinavi. aṃducētaiṃdriyākāramulugā mārina prakṛtiyaṃdu karmanu arpaṇa cēsi) karmayokka phalamaṃdāśa lēnivāḍai’ nēnu ē karmanu, ē koṃcemainanu cēyalēdu ” ani talacucu karma cēyunō prakṛtiki saṃbaṃdhiṃcinasansāramulō unnappaṭikī prakṛti saṃbaṃdhamuvalana kalugu karmayaṃdabhimānamu kaligiyuṃḍuṭayanu baṃdhamu - anu pāpamu - tanani aṃṭanivāḍu).
(tāmarāku nīḷḷalōpuṭṭi nīḷḷalōnē perugucunuṃḍunu. adi aṃtayu nīrē - nīṭimayaṃ. ayinappaṭikī (ā tāmarāku ā nīḷḷanu aṃṭadu). ā nīḷḷu tāmarākunu aṃṭavu. ā prakāramugānē prakṛti ādhīnamulōnuṃḍu bhōgamulavalana dēhātma bhrama iṭṭivāniki kalugadu).
śṛṇu kṛṣṇārpaṇaṃ karma phala saṃga vivarjitaṃ|
yōga ityucyatē tēna yuktassan pradhamaṃ tataḥ |
rajastamō malā spṛṣṭaṃ satyaṃ yasya sa śuddha dhīḥ |
svavaśīkṛta dēhassan svādhīna kṛtēṃdriyaḥ |
- - - jaḍā jaḍātmakaṃ viśvaṃ paśyannātmamayaṃ muniḥ |
ubhayatrāprya khaṃḍārthabhōdhi siddhi ritīritā |
ī dṛśaḥ tatva dṛk kurvannapi lōka dṛśā kriyāḥ |
tā bhirnalipyatē yasmātsvadṛṣṭyā tada bhāvataḥ |
dhī śuddhyā yukta ēvā dau bhūtvātatvavidēvasaḥ |
kriyā māṇāsucēṣṭāsu na karōmīti manyatē |
jñānakarmēṃdriyaiḥ karma daśabhiḥ tadyadāyadhaṃ |
kurvanna kurvatā buddhyāpaśyatyātmāna makriyaṃ |
svasan prāṇaiḥ svapannaṃtaḥ karaṇēna munistathā |
unmiṣannimi ṣannēvaṃ nāgakūrmādi paṃcakaiḥ |
ētāni sva svaviṣayē vartaṃtē na tvahaṃ tvatiḥ |
dhāraya sarva vyāpārē ṣvātmānamakriyaṃ vi dan |
kurvanna lipyatē cātō yuktamēvēritaṃ vacāḥ |
- - - phalā saṃgaṃ parityajya samarpyaparamēśvarē |
karmāṇi vaidikānyajñō laukikāni karōti yaḥ |
pāpa puṇyātmakēnā sau karmaṇā naiva lipyatē |
yathō pari prakṣiptēna padma patraṃ nacāṃ bhasā |
lipyatē tadva dīśēpi karmārpita ma lēpakaṃ pratyutēśa
prasādēna dhī śuddhi ścāsya jāyatē || (gītābhāva prakāśamu - 5 - 68 to 70, 75 to 81, 83 to 85)
(karma baṃdhamunu kalugacēyunukadā adimōkṣamunaku okē kāraṇameṭlagunanagā - karma valanakaluguphalamaṃdāsakti lēka ā karmanu bhagavaṃtuniki arpaṇa cēsina adiyē yōgamanipiṃcukonunu - niṣkāmakarmayōgamu. iṭṭi karmayōgamu cēyucu rajōguṇamu, tamōguṇamu anu vāṭiyokka dōṣamulaṃṭanivāḍai, citta śuddhigalavāḍai, dēhamunu, iṃdriyamulanu tanasvādhīnamulōnuṃcukoninavāḍai, tana ātmayēsamasta bhūtamulalōnuṃḍu ātmayani talacucu, ī prakāramu brahmamokkaṭē, marēdiyu lēdu anuakhaṃḍādvaitabhāvamukaligi, yēvidhamaina bhēdhamulēka (brahmavēru prapaṃcamu vēru anubhāvamulēka) jaḍajaḍātmakamainajagattu aṃtayu, ātmatōniṃḍiyunnadani bhāviṃcucu iṭṭivāḍu lōka dṛṣṭilō ēkarmacēsinanu tana dṛṣṭilō ē karma cēsinanu tanadṛṣṭilō adi tana cēsina karma kādani - tānu ēkarmanu cēyalēdani - bhāviṃcuṭacēta ā karma (ā karmaphalamu) vāninaṃṭadu - - - tatvamunu telisinavāḍu niṣkāmakarma yōgamulōnuṃḍi tānu cēyucunnapanulu tānu cēyuṭalēdani talacunu. ayidu karmēṃdriyamulacētanu ayidu jñānēṃdriyamulacētanu ēyē karmalu cēyucunnanu tānu vāṭini cēyuṭalēdani bhāviṃcuṭavalana akriyuḍē (ē pani cēyanivāḍē) ani bhāviṃcunu. paṃcaprāṇamulacē ūpiri tīyucunnanu, aṃtaḥkaraṇamu cēta niduriṃcucunnanu, upaprāṇamulacēta kaṃḍlu mūyuṭa, teracuṭa cēyucunnanu, ī karmalanniyu āyā iṃdriyamulu vāṭi vāṭi panulu cēyucunnavani, ā panulu nēnu cēyuṭalēdani, anni vyāpāramulaṃdunu tānu akriyuḍē (ē paniyunu cēyanivāḍuganē) ani telusukonucu ā panulu cēyuvānini ā panulu aṃṭavu - vāṭi phalamunu atanicē anubhaviṃpacēyavu. karmaphalamaṃdāsaktilēka vaidika karmalanu, laukika karmalanu paramēśvarunaku arpaṇamu cēyuvāḍu ajñuḍu(ī jñānamu lēnivāḍu). pāpa puṇya rūpamulaina karmalu atanini aṃṭavu. nīṭimīdanunna tāmarākuku nīru aṃṭadu. ā rītiganē iṭuvaṃṭivānini karmaphalamaṃṭadu. kanuka atanu nirlēpuḍu).
sūryuḍu pavitramaina gaṃgā jalamulōnu, kallulōnu pratibiṃbiṃcunu - ayinanu gaṃgayokkaguṇamu kalluku saṃbaṃdhiṃcina malinamunu ā sūryapratibiṃbamunaku aṃṭadu. aṭlē bhagavaṃtuḍuśuddhamaina upādhilōnunnanu aśuddhamaina upādhilōnunnanu vāṭi guṇāguṇamulu bhagavaṃtunaṃṭavu.
“va. vividha kāṣṭāṃtargatuṃḍaina vāyusakhuṃḍu tadgata dōṣaṃbunaṃ borayaka nityaśuddhuṃḍai taratamabhāvaṃbuna vartiṃcu caṃdaṃbuna svasaṃkalpakṛtaṃbulaina vicitraśarīraṃbulaṃdu naṃtaryāmivai pravēśiṃci tattadvicitrayōnigataṃbaina hēyaṃbulaṃ borayaka sakalātma samaṃbai yēka rasaṃbai brahmaṃbainaninnu naihikāmuṣmika phala saṃgamaṃbu lēka vigata rajōguṇaṃbulugaligi bhajiṃcucuṃḍuduru”. (śrīmadāṃdhramahabhāgavatamu - 10 - u.bhā. - 1215)
cāturvarṇyaṃ mayā sṛṣṭaṃ guṇa karma vibhāgaśaḥ |
tasya kartā ramapimāṃ viddhyakartārama vyayaṃ |
namē karmāṇi liṃpati namē karma phalē sphṛhā |
iti māṃ yō (a)bhijānāti karma bhirna baddhyatē||” (śrīmadbhagavadgīta - 4 - 13, 14)
“catvāra ēva varṇāstē - - - |
guṇakarma vibhāgēna varṇāstē brāhmaṇādayaḥ |
catvārō nirmatāḥ sargēmayā bhagavatā yataḥ |
satva pradhānā yē viprāstēṣāṃ karma śamādikaṃ |
satvagauṇa rajō mukhyā nṛpāḥ śauryādi karmiṇaḥ |
tamōgauṇa rajōmukhyā vaiśyāḥ kṛṣyādikarmiṇaḥ |
tamaḥ prathānāḥ śūdrāstatkarma śuśrūṣaṇādikaṃ |
tadidaṃ mānuṣē lōkē cāturvarṇyaṃ vyavasthitaḥ |
ēvaṃ vaiṣamya sṛṣṭēstē kartṛtvātta tpalēnaca |
saṃbaṃdhōdurnivāraḥ syāditya taḥ prāhamādhavaḥ |
vyavahāradṛśātasya cāturvarṇasya sarva śaḥ |
kartāraṃ naṃtamapimāṃ paramārtha dṛśā (a)vyayaṃ|
viddhya kartā ramakṣīṇa svabhāva manahaṃ kṛtiṃ |
nirvikāratayāsaṃtaṃ māṃ jñātvā mucyatē bhayāt ||” (gītābhāvaprakāśamu - 4 - 85 to 91)
(brāhmaṇulu, kṣatriyulu, vaiśyulu, śūdrulu ani varṇamulu nālugu. sṛṣṭi prāraṃbhamulō triguṇamula baṭṭiyu, vāru vāru cēyu panulabaṭṭiyu nēnu ī nālugu varṇamulanu sṛṣṭiṃcitini. satvaguṇamu pradhānamugalavāru, śamadamādulu vāri karmagā galavāru brāhmaṇulu. rajōguṇamu pradhānamugānuṃḍi satvaguṇamu gauṇamugā galavāru (apradhānamugā galavāru) kṣatriyulu. vārikarma śauryamu, dhairyamu,sāhasamu cēyuṭa. rajō guṇamu pradhānamugā nuṃḍi tamōguṇamu gauṇamugā nuṃḍuvāru vaiśyulu.vīri karma kṛṣyādulu. tamōguṇamu pradhānamugāgalavāru śūdrulu. vīrikarma śuśrūṣa modalagunavi.ī vidhamugā sṛṣṭilō vaiṣamyamunnadi - heccu taggulunnavi. sṛṣṭiyē vēruvērugā nunnadi. dīnikikāraṇamu triguṇamula vaiṣamyamu. dīni kāraṇamugā sṛṣṭilō aṃdarū okka lāga uṃḍaru. ī varṇamulalōnē kāka ī vaiṣamyamu oka vastuvunaku iṃkoka vastuvunaku kūḍa kanabaḍucunnadi. ī vidhamugā sṛṣṭilōnē vaiṣamyamunnapuḍu vārivāri karmalakuvāṭivāṭi phalitamulaku saṃbaṃdhamu nivāriṃpa śakyamukānidi - ī cāturvarṇamula sṛṣṭiṃcinaṃduvalla vyavahāra rītini baṭṭi nēnu (bhagavaṃtuḍu) kartavale kanipiṃcinappaṭiki paramārtha dṛṣṭilō vikāramulu lēkapōvuṭacē kṣīṇiṃpani svabhāvamu galavāḍanu, avyayuḍanu, ahaṃkāramu lēnivāḍanu ayinanannu ellapuḍu akarta (ē kartayu cēyanivāḍu)gā telusukonumu. nēnu akartanu aguṭavalana ī karma valla kalugu phalamu nāku uṃḍadu - aṃducēta nēnu nirlēpuḍanu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.