← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిరోధము nirōdhamu

Original — తెలుగు
  1. ప్రళయము, నాశము.

  2. పరమాత్మనః శక్తిభిస్సవం అనుశయనం ప్రళయపయోనిధౌ శయనం నిరోధః నిరోధి శబ్దేన ఉచ్యతే.

(ప్రళయ సముద్రములో తన శక్తులతో పరమాత్మ శయనించుట నిరోధమనబడును - సృష్టికి పూర్వపు స్థితి).

  1. "సీ. వసుమతీ నాధ ! సర్వస్వామియైన గోవిందుడు చిదచిదానందమూర్తి

సలలితోపాధి శక్తి సమేతుడై తనరారు నాత్మీయ ధామమందు

ఫణిరాజ మృదుల తల్పంబుపై సుఖలీల యోగనిద్రారతినున్న వేళ

నిఖిల జీవులు నిజ వ్యాపార శూన్యులై యున్నత తేజంబు లురలు కొనగ

తే. జరుగనయ్యవస్థా విశేషంబులెల్ల

విదితమగునట్లు వలుకుట యది నిరోధ

ము - - యది యవాంతర ప్రళయంబనంగబరగు - -". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - 266)

Transliteration
  1. praḷayamu, nāśamu.

  2. paramātmanaḥ śaktibhissavaṃ anuśayanaṃ praḷayapayōnidhau śayanaṃ nirōdhaḥ nirōdhi śabdēna ucyatē.

(praḷaya samudramulō tana śaktulatō paramātma śayaniṃcuṭa nirōdhamanabaḍunu - sṛṣṭiki pūrvapu sthiti).

  1. "sī. vasumatī nādha ! sarvasvāmiyaina gōviṃduḍu cidacidānaṃdamūrti

salalitōpādhi śakti samētuḍai tanarāru nātmīya dhāmamaṃdu

phaṇirāja mṛdula talpaṃbupai sukhalīla yōganidrāratinunna vēḷa

nikhila jīvulu nija vyāpāra śūnyulai yunnata tējaṃbu luralu konaga

tē. jaruganayyavasthā viśēṣaṃbulella

viditamagunaṭlu valukuṭa yadi nirōdha

mu - - yadi yavāṃtara praḷayaṃbanaṃgabaragu - -". (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - 266)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.