(జ్ఞాతజ్ఞానము జ్ఞేయము అను త్రిపుటి తోచకుండ ఆ అద్వితీయవస్తువునందు తదాకారాకారితమైన చిత్తవృత్తిని అత్యంత ఐఖ్యభావముతోనుంచుట నిర్వికల్పకసమాధి అనబడుచున్నది. నీటియందు వేయబడిన ఉప్పు ఆ జలాకార కారితముగా కనబడక జలము మాత్రము గోచరించునట్లు అద్వితీయవస్తు ఆకారాకారితమైన చిత్తవృత్తి గోచరించక కేవల అద్వితీయ వస్తుమాత్రము అపుడు గోచరించును).
(నాలుగు విధముల విఘ్నములు లేని మనస్సు నిర్వాత దీపమువలె అచలము, అఖండ చైతన్య రూపమునై ఏప్పుడుండునో అదియే నిర్వికల్పక సమాధి అని చెప్పబడుచున్నది).
(ధ్యానము మొదలగు త్రిపుటీ వికల్ప లయమే నిర్వికల్పక సమాధి) (ధ్యానించువాడు, ధ్యానము.ధ్యానింపతగినది అను భేదములు లేని సమాధి).
(ప్రాణ దృష్టి మనోగ్నులచేత కుండలినీ శక్తి - త్రికోణాలంకార సుషుమ్నానాడి తాలువ క్రిందనుసహస్రారమును భేదించి దానిలోపల ప్రవేశించునప్పుడు మునియగువాని తనలోన, తన బైటనున్నప్రపంచమును విస్మరించిన అంతఃకరణము నిర్వికల్ప బ్రహ్మ పదమును పొందుచుండును).
(jñātajñānamu jñēyamu anu tripuṭi tōcakuṃḍa ā advitīyavastuvunaṃdu tadākārākāritamaina cittavṛttini atyaṃta aikhyabhāvamutōnuṃcuṭa nirvikalpakasamādhi anabaḍucunnadi. nīṭiyaṃdu vēyabaḍina uppu ā jalākāra kāritamugā kanabaḍaka jalamu mātramu gōcariṃcunaṭlu advitīyavastu ākārākāritamaina cittavṛtti gōcariṃcaka kēvala advitīya vastumātramu apuḍu gōcariṃcunu).
(nālugu vidhamula vighnamulu lēni manassu nirvāta dīpamuvale acalamu, akhaṃḍa caitanya rūpamunai ēppuḍuṃḍunō adiyē nirvikalpaka samādhi ani ceppabaḍucunnadi).
(dhyānamu modalagu tripuṭī vikalpa layamē nirvikalpaka samādhi) (dhyāniṃcuvāḍu, dhyānamu.dhyāniṃpataginadi anu bhēdamulu lēni samādhi).
(prāṇa dṛṣṭi manōgnulacēta kuṃḍalinī śakti - trikōṇālaṃkāra suṣumnānāḍi tāluva kriṃdanusahasrāramunu bhēdiṃci dānilōpala pravēśiṃcunappuḍu muniyaguvāni tanalōna, tana baiṭanunnaprapaṃcamunu vismariṃcina aṃtaḥkaraṇamu nirvikalpa brahma padamunu poṃducuṃḍunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.