← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిర్విశేషం బ్రహ్మ nirviśēṣaṃ brahma

Original — తెలుగు
  1. సకల విశేష శూన్యం బ్రహ్మ. (బ్రహ్మ ఏ విధమైన విశేషములు లేనివాడు).

  2. నామ రూపాది విశేష శూన్యః. (నామము రూపము మొదలగు విశేషములు లేనిది).

  3. యస్మిన్ న కశ్చిద్విశేషోస్తి, నామ వా, రూపం వా, జాతిర్వా, గుణోవా, తద్ద్వారేణైవ హి శబ్దవృత్తిర్భవతి న చైషాం కశ్చిత్ విశేషో బ్రహ్మణి అస్తి. అతో న నిర్దేష్టుం శక్యతే ఇదం తత్ ఇతి.

(నామము గాని, రూపము గాని, జాతికాని, గుణముకాని లేక ఏవిధమైన విశేషములు లేనివాడు - బ్రహ్మమందు ఏ విధమైన విశేషములు లేవు, అందుచేత అది ఇటువంటిది యని నిర్దేశించుటకు వీలు లేనిది).

  1. వాజ్ఞ్మనసయో రగోచరత్వా భిధానాత్ నిర్విశేషం బ్రహ్మ.(వాక్కుచే చెప్పుటకు గాని, మనసుచే ఆలోచించుటకుగాని వీలుకానివాడు కనుక బ్రహ్మ నిర్విశేషుడు).

  2. పృధివ్యాది పరిణామ రాహిత్వాత్ పృధివీత్యాదిభిః విశేషణైః నిర్దేష్టుం అశక్యం.

(భూమి మొదలగు వాటివలె పరిణామము చెందనిదగుటచేత అట్టివిశేషములచేత నిర్దేశింపవీలుకానిది).

  1. మూర్తి భేదం వినా పరం తత్వం.

(మూర్తి - ఆకారము - మొదలగు భేదములు లేనటువంటి పరమాత్మ తత్వము).

  1. కాలముగడచినకొలది వస్తువులు పరిణామమును - మార్పును - చెందుచున్నవి - బాలుడు యౌవనుడు, వృద్ధుడుగా మారినట్లు - ఇటువంటి మార్పులు లేనివాడు భగవంతుడు.

  2. నిర్విశేషమనగా సజాతీయ విజాతీయ స్వగతభేదము లేకుండుట - “యదస్త్యాహుః అశేష విశేష ప్రత్యనీక చిన్మాత్రం బ్రహ్మైవ పరమార్థః, తదతిరేకి నానావిధ జ్ఞాతృ జ్ఞేయ తద్రూప జ్ఞాన భేదాదిసర్వం తస్మిన్నేవ పరికల్పితం మిధ్యాభూతం”.

(సజాతీయ విజాతీయ స్వగతభేదములు లేని పరబ్రహ్మ మొక్కటియే సత్యము. తద్వ్యతిరేకములగు జ్ఞాతృజ్ఞేయములు జ్ఞానము అన్నియు ఆ బ్రహ్మమందు కల్పితములు - మిథ్యాభూతములు).

  1. బ్రహ్మ ‘అవ్యక్తము’ ఇంద్రియములకు గోచరము కానిది అని శ్రుతులు చెప్పుచున్నవి. ఏ విధమైన విశేషములు లేకపోవుటచేతనే అవ్యక్తము - అందుచేత పరబ్రహ్మ నిర్విశేషము.

  2. “అస్థూల మనణ్వు హ్రస్వమదీర్ఘం” ఇత్యేవమాద్యాశ్చ నిర్విశేషలింగాః - నిర్విశేషత్వం శ్రూయతే.

(“స్థూలముకానిది, అణువుకానిది, హ్రస్వముకానిది దీర్ఘముకానిది” అని చెప్పు శ్రుతివాక్యములు పరబ్రహ్మ నిర్విశేషమనియే చెప్పుచున్నవి).

  1. “నాన్యతోస్తి ద్రష్టా” ఇత్యాదినా శాస్త్రేణ పరమాత్మ వ్యతిరిక్తస్య చేతనస్య ‘నేతి నేతి’ “ఇత్యాదినాశాస్త్రేణ ప్రపంచస్య చ ప్రతిఖేధాత్ బ్రహ్మ ద్వితీయ మిత్యయమేవ సిద్ధాంతః. తస్మాత్ శ్రుతి బలాత్ నిర్విశేషమేకమేవ బ్రహ్మ ఇతి సిద్ధం”.

(ఇతనికంటె వేరుగా ద్రష్టయగువాడు లేడు - అనిన్నీ, ప్రపంచములోని వస్తువులన్నియు ’ ఇది పరబ్రహ్మ కాదు - ఇది కాదు ’ అని ఒక్కొక్కదానిని త్రోసిపుచ్చుటవలన బ్రహ్మ అద్వితీయమనియే సిద్ధాంతము. అందుచేత శ్రుతిబలమువలన - శ్రుతి ప్రమాణమువలన పరబ్రహ్మ నిర్విశేషమని, ఉన్నదంతా పరబ్రహ్మమే అని -అంతా ఒకడే పరబ్రహ్మయని సిద్ధించుచున్నది).

  1. శ్రుతులు పరబ్రహ్మ నిర్విశేషమని ఈ క్రిందవిధముగా చెప్పుచున్నవి : -
  1. “నిష్కలం, నిష్క్రియం, శాంతం, నిరవద్యం, నిరంజనం”

(ఆత్మ నిష్కలము, నిష్క్రియము, శాంతము, నిరవద్యము, నిరంజనము).

  1. “సవా ఏష మహానజ ఆత్మా, (అ)జరో, (అ)మరో, అమృతో, (అ)భయో బ్రహ్మ”.

(పరమాత్మ - పరబ్రహ్మ - జన్మ లేనివాడు, ముసలితనము లేనివాడు, మరణము లేనివాడు).

(3) “జ్ఞేయం యత్త త్ప్రవక్ష్యామి యద్జ్ఞాత్వా అమృతమశ్నతే |”

అనాది మత్పరం బ్రహ్మ న సత్తా న్నా స దుచ్యతే ||“. (శ్రీమద్భగవద్గీత - 13 - 12)

(తెలుసుకొన వస్తువును తెలియచేయుచున్నాను - దానిని తెలుసుకొనిన మోక్షమును పొందెదవు. అదిపరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ ’ సత్ ’ - సత్పదార్థమనికాని, అసత్’ - అసత్పదార్థమనికానిచెప్పుటకు వీలుకానిది - ఏ విధముగానైనను చెప్పుటకు వీలు కానిది. అందుచేత పరబ్రహ్మనిర్విశేషము).

  1. పరబ్రహ్మకు సవిశేషబ్రహ్మ అని నిర్విశేషబ్రహ్మయని రెండు రూపములు లేవు. ఒకనికి విరుద్ధమగురెండురూపములుండుట సంభవముకాదు. అందుచేత పరబ్రహ్మకు ఒకటే రూపము - అది నిర్విశేషము -

“నస్థానతోపి పరస్య ఉభయలింగం సర్వత్రహి” - (బ్రహ్మసూత్రములు - 3 - 2 -11)

కొన్నిచోట్ల పరబ్రహ్మ సవిశేషమని చెప్పబడినది - ఉపాధి భేదమువలన సవిశేషమని చెప్పబడినది -ఆ ఉపాధులలోనున్న పరబ్రహ్మ ఒకటే కనుక అతను నిర్విశేషుడు).

Transliteration
  1. sakala viśēṣa śūnyaṃ brahma. (brahma ē vidhamaina viśēṣamulu lēnivāḍu).

  2. nāma rūpādi viśēṣa śūnyaḥ. (nāmamu rūpamu modalagu viśēṣamulu lēnidi).

  3. yasmin na kaścidviśēṣōsti, nāma vā, rūpaṃ vā, jātirvā, guṇōvā, taddvārēṇaiva hi śabdavṛttirbhavati na caiṣāṃ kaścit viśēṣō brahmaṇi asti. atō na nirdēṣṭuṃ śakyatē idaṃ tat iti.

(nāmamu gāni, rūpamu gāni, jātikāni, guṇamukāni lēka ēvidhamaina viśēṣamulu lēnivāḍu - brahmamaṃdu ē vidhamaina viśēṣamulu lēvu, aṃducēta adi iṭuvaṃṭidi yani nirdēśiṃcuṭaku vīlu lēnidi).

  1. vājñmanasayō ragōcaratvā bhidhānāt nirviśēṣaṃ brahma.(vākkucē ceppuṭaku gāni, manasucē ālōciṃcuṭakugāni vīlukānivāḍu kanuka brahma nirviśēṣuḍu).

  2. pṛdhivyādi pariṇāma rāhitvāt pṛdhivītyādibhiḥ viśēṣaṇaiḥ nirdēṣṭuṃ aśakyaṃ.

(bhūmi modalagu vāṭivale pariṇāmamu ceṃdanidaguṭacēta aṭṭiviśēṣamulacēta nirdēśiṃpavīlukānidi).

  1. mūrti bhēdaṃ vinā paraṃ tatvaṃ.

(mūrti - ākāramu - modalagu bhēdamulu lēnaṭuvaṃṭi paramātma tatvamu).

  1. kālamugaḍacinakoladi vastuvulu pariṇāmamunu - mārpunu - ceṃducunnavi - bāluḍu yauvanuḍu, vṛddhuḍugā mārinaṭlu - iṭuvaṃṭi mārpulu lēnivāḍu bhagavaṃtuḍu.

  2. nirviśēṣamanagā sajātīya vijātīya svagatabhēdamu lēkuṃḍuṭa - “yadastyāhuḥ aśēṣa viśēṣa pratyanīka cinmātraṃ brahmaiva paramārthaḥ, tadatirēki nānāvidha jñātṛ jñēya tadrūpa jñāna bhēdādisarvaṃ tasminnēva parikalpitaṃ midhyābhūtaṃ”.

(sajātīya vijātīya svagatabhēdamulu lēni parabrahma mokkaṭiyē satyamu. tadvyatirēkamulagu jñātṛjñēyamulu jñānamu anniyu ā brahmamaṃdu kalpitamulu - mithyābhūtamulu).

  1. brahma ‘avyaktamu’ iṃdriyamulaku gōcaramu kānidi ani śrutulu ceppucunnavi. ē vidhamaina viśēṣamulu lēkapōvuṭacētanē avyaktamu - aṃducēta parabrahma nirviśēṣamu.

  2. “asthūla manaṇvu hrasvamadīrghaṃ” ityēvamādyāśca nirviśēṣaliṃgāḥ - nirviśēṣatvaṃ śrūyatē.

(“sthūlamukānidi, aṇuvukānidi, hrasvamukānidi dīrghamukānidi” ani ceppu śrutivākyamulu parabrahma nirviśēṣamaniyē ceppucunnavi).

  1. “nānyatōsti draṣṭā” ityādinā śāstrēṇa paramātma vyatiriktasya cētanasya ‘nēti nēti’ “ityādināśāstrēṇa prapaṃcasya ca pratikhēdhāt brahma dvitīya mityayamēva siddhāṃtaḥ. tasmāt śruti balāt nirviśēṣamēkamēva brahma iti siddhaṃ”.

(itanikaṃṭe vērugā draṣṭayaguvāḍu lēḍu - aninnī, prapaṃcamulōni vastuvulanniyu ’ idi parabrahma kādu - idi kādu ’ ani okkokkadānini trōsipuccuṭavalana brahma advitīyamaniyē siddhāṃtamu. aṃducēta śrutibalamuvalana - śruti pramāṇamuvalana parabrahma nirviśēṣamani, unnadaṃtā parabrahmamē ani -aṃtā okaḍē parabrahmayani siddhiṃcucunnadi).

  1. śrutulu parabrahma nirviśēṣamani ī kriṃdavidhamugā ceppucunnavi : -
  1. “niṣkalaṃ, niṣkriyaṃ, śāṃtaṃ, niravadyaṃ, niraṃjanaṃ”

(ātma niṣkalamu, niṣkriyamu, śāṃtamu, niravadyamu, niraṃjanamu).

  1. “savā ēṣa mahānaja ātmā, (a)jarō, (a)marō, amṛtō, (a)bhayō brahma”.

(paramātma - parabrahma - janma lēnivāḍu, musalitanamu lēnivāḍu, maraṇamu lēnivāḍu).

(3) “jñēyaṃ yatta tpravakṣyāmi yadjñātvā amṛtamaśnatē |”

anādi matparaṃ brahma na sattā nnā sa ducyatē ||“. (śrīmadbhagavadgīta - 13 - 12)

(telusukona vastuvunu teliyacēyucunnānu - dānini telusukonina mōkṣamunu poṃdedavu. adiparabrahma. ā parabrahma ’ sat ’ - satpadārthamanikāni, asat’ - asatpadārthamanikāniceppuṭaku vīlukānidi - ē vidhamugānainanu ceppuṭaku vīlu kānidi. aṃducēta parabrahmanirviśēṣamu).

  1. parabrahmaku saviśēṣabrahma ani nirviśēṣabrahmayani reṃḍu rūpamulu lēvu. okaniki viruddhamagureṃḍurūpamuluṃḍuṭa saṃbhavamukādu. aṃducēta parabrahmaku okaṭē rūpamu - adi nirviśēṣamu -

“nasthānatōpi parasya ubhayaliṃgaṃ sarvatrahi” - (brahmasūtramulu - 3 - 2 -11)

konnicōṭla parabrahma saviśēṣamani ceppabaḍinadi - upādhi bhēdamuvalana saviśēṣamani ceppabaḍinadi -ā upādhulalōnunna parabrahma okaṭē kanuka atanu nirviśēṣuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.