← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిశా niśā

Original — తెలుగు
  1. రాత్రిః - “సర్వ పదార్థానాం అవివేక కరీ తమ స్వభావత్వాత్ - యథా నక్తం చరాణాం అహ రేవసత్ అన్యేషాం నిశాభవతి తద్వత్. నక్తం చరస్థానీయానాం అజ్ఞానినాం, సర్వభూతానాం నిశా ఇవనిశాపరమార్థ తత్వం అగోచరత్వాత్ అతద్బుద్ధీనాం. తస్యాం పరమార్థ తత్వ లక్షణాయాం అజ్ఞాన నిద్రాయాంప్రబుద్ధో జాగర్తిసం యమీ సం యమవాన్ జితేంద్రియః యోగీ. యస్యాం గ్రాహ్య గ్రాహక లక్షణాయాం అవిద్యానిశాయాం. ప్రసుప్తాని ఏవ భూతాని జాగ్రతి ఇతి. ఉచ్యంతే యస్యాం న ఈ శాయాం ప్రసుప్తా ఇవ స్వప్నదృశః సానిశా అవిద్యా రూపత్వాత్ పరమార్థ తత్వం పశ్యతః మునేః ఇతి”.

(తమోగుణము స్వభావముగా కలిగియుండుటచేత సమస్త వస్తువుల గుఱించి అవివేకము (అజ్ఞానము) కలుగచేయునది. రాత్రులందు సంచరించువారికి - చోరులకు, రాక్షసులకు రాత్రియే పగలు అగును. అదియే ఇతరులకు రాత్రియగును. ఆ ప్రకారముగానే రాత్రి సంచరించువారివలెనుండు అజ్ఞానులకుపరమార్థ తత్వము బోధపడకుండుట రాత్రి యనబడును, అట్టివారు పరమార్థ తత్వలక్షణమగు అజ్ఞానమను నిద్రనుండి మేల్కొనుటయే పగలు. ఇంద్రియములను జయించినవాడు అజ్ఞానమను నిద్రయందు సమస్త భూతములు ఉన్నపుడు మేల్కొనియుండును. అతనికి అది పగలు)

  1. పరమార్థ తత్వం అనుభవతః నివృత్తా విద్యస్య సన్యాసినః ద్వైతావస్థానిశా.(పరమార్థ తత్వముననుభవించుచు అవిద్యను తొలగించివేసిన సన్యాసికి ద్వైతావస్థ నిశయనిపించును. ఒకడే పరమాత్మ, పరమాత్మ తప్ప ఇతరమేమియును లేదు అను జ్ఞానము కలిగినవానికి భగవంతుడుకాక ఇతర వస్తువు ఉన్నది యను ద్వైతభావము నిశాసమయము - రాత్రి సమయము. ఆత్మజ్ఞానము కలుగుటయే ఆ రాత్రి పోయి తత్వజ్ఞానము ఉదయించుట).

  2. నిశా శబ్దేన మహా నిశాఖ్యా ప్రళయః ఉచ్యతే. స ఏవ అంతః సకల జీవ సమాప్తిః. తత్ నిశాంతః

(నిశయనగా మహారాత్రియని పేరుగల ప్రళయము చెప్పబడుచున్నది).

  1. యోగనిద్రాసమయం.

(భగవంతుడు యోగనిద్రలోనున్న సమయము - సృష్టి ప్రారంభముకాని సమయము - భూతములన్నియుకారణరూపములో భగవంతునియందు లీనమై యున్న సమయము).

  1. “సహస్రయుగపర్యంత మహర్యద్బ్రహ్మణో విదుః |

రాత్రియుగ సహస్రాంతాం తే (అ)హోరాత్రవిదో జనాః |

అవ్యక్తా ద్వ్యక్తయ సర్వాః ప్రభవంత్య వరాగమే |

రాత్ర్యాగమే ప్రలీయం తే తత్రైవావ్యక్త సంజ్ఞికే |

భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |

రాత్ర్యాగమే (అ)వశః పార్థ; ప్రభవంత్యహ రాగమే ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 17 to 19)

(చతుర్ముఖ బ్రహ్మయొక్క పగలు సహస్ర యుగములు, రాత్రి సహస్ర యుగములు. ఆ బ్రహ్మ పగటికాలంరాగానే భూతములన్నియు - అంతవరకు అతనిలో లీనమై అవ్యక్తమైనవన్నియు వ్యక్తమై పుట్టుచున్నవి,అతని రాత్రికాలము రాగానే అతనియందే లీనమై పోవుచున్నవి. ఇట్లు భూతములన్నియు, (అవే) అవశులై (స్వతంత్రములేనివై) బ్రహ్మ రాత్రికాలములో అతనిలో లీనమగుచు, పగటికాలములో మరల మరల పుట్టుచుండును). –

“యా నిశా సర్వ భూతానాం తస్యాం జాగర్తి సం యమీ |

యస్యాం జాగర్తి భూతాని సానిశా పశ్యతో మునేః|| (శ్రీమద్భగవద్గీత - 2 - 64)

(సమస్త భూతములకు రాత్రి అయిన సమయము యోగికి పగలు, భూతములకు పగలు అయిన సమయముయోగికి రాత్రి).

Transliteration
  1. rātriḥ - “sarva padārthānāṃ avivēka karī tama svabhāvatvāt - yathā naktaṃ carāṇāṃ aha rēvasat anyēṣāṃ niśābhavati tadvat. naktaṃ carasthānīyānāṃ ajñānināṃ, sarvabhūtānāṃ niśā ivaniśāparamārtha tatvaṃ agōcaratvāt atadbuddhīnāṃ. tasyāṃ paramārtha tatva lakṣaṇāyāṃ ajñāna nidrāyāṃprabuddhō jāgartisaṃ yamī saṃ yamavān jitēṃdriyaḥ yōgī. yasyāṃ grāhya grāhaka lakṣaṇāyāṃ avidyāniśāyāṃ. prasuptāni ēva bhūtāni jāgrati iti. ucyaṃtē yasyāṃ na ī śāyāṃ prasuptā iva svapnadṛśaḥ sāniśā avidyā rūpatvāt paramārtha tatvaṃ paśyataḥ munēḥ iti”.

(tamōguṇamu svabhāvamugā kaligiyuṃḍuṭacēta samasta vastuvula guṟiṃci avivēkamu (ajñānamu) kalugacēyunadi. rātrulaṃdu saṃcariṃcuvāriki - cōrulaku, rākṣasulaku rātriyē pagalu agunu. adiyē itarulaku rātriyagunu. ā prakāramugānē rātri saṃcariṃcuvārivalenuṃḍu ajñānulakuparamārtha tatvamu bōdhapaḍakuṃḍuṭa rātri yanabaḍunu, aṭṭivāru paramārtha tatvalakṣaṇamagu ajñānamanu nidranuṃḍi mēlkonuṭayē pagalu. iṃdriyamulanu jayiṃcinavāḍu ajñānamanu nidrayaṃdu samasta bhūtamulu unnapuḍu mēlkoniyuṃḍunu. ataniki adi pagalu)

  1. paramārtha tatvaṃ anubhavataḥ nivṛttā vidyasya sanyāsinaḥ dvaitāvasthāniśā.(paramārtha tatvamunanubhaviṃcucu avidyanu tolagiṃcivēsina sanyāsiki dvaitāvastha niśayanipiṃcunu. okaḍē paramātma, paramātma tappa itaramēmiyunu lēdu anu jñānamu kaliginavāniki bhagavaṃtuḍukāka itara vastuvu unnadi yanu dvaitabhāvamu niśāsamayamu - rātri samayamu. ātmajñānamu kaluguṭayē ā rātri pōyi tatvajñānamu udayiṃcuṭa).

  2. niśā śabdēna mahā niśākhyā praḷayaḥ ucyatē. sa ēva aṃtaḥ sakala jīva samāptiḥ. tat niśāṃtaḥ

(niśayanagā mahārātriyani pērugala praḷayamu ceppabaḍucunnadi).

  1. yōganidrāsamayaṃ.

(bhagavaṃtuḍu yōganidralōnunna samayamu - sṛṣṭi prāraṃbhamukāni samayamu - bhūtamulanniyukāraṇarūpamulō bhagavaṃtuniyaṃdu līnamai yunna samayamu).

  1. “sahasrayugaparyaṃta maharyadbrahmaṇō viduḥ |

rātriyuga sahasrāṃtāṃ tē (a)hōrātravidō janāḥ |

avyaktā dvyaktaya sarvāḥ prabhavaṃtya varāgamē |

rātryāgamē pralīyaṃ tē tatraivāvyakta saṃjñikē |

bhūtagrāmaḥ sa ēvāyaṃ bhūtvā bhūtvā pralīyatē |

rātryāgamē (a)vaśaḥ pārtha; prabhavaṃtyaha rāgamē ||“. (śrīmadbhagavadgīta - 8 - 17 to 19)

(caturmukha brahmayokka pagalu sahasra yugamulu, rātri sahasra yugamulu. ā brahma pagaṭikālaṃrāgānē bhūtamulanniyu - aṃtavaraku atanilō līnamai avyaktamainavanniyu vyaktamai puṭṭucunnavi,atani rātrikālamu rāgānē ataniyaṃdē līnamai pōvucunnavi. iṭlu bhūtamulanniyu, (avē) avaśulai (svataṃtramulēnivai) brahma rātrikālamulō atanilō līnamagucu, pagaṭikālamulō marala marala puṭṭucuṃḍunu). –

“yā niśā sarva bhūtānāṃ tasyāṃ jāgarti saṃ yamī |

yasyāṃ jāgarti bhūtāni sāniśā paśyatō munēḥ|| (śrīmadbhagavadgīta - 2 - 64)

(samasta bhūtamulaku rātri ayina samayamu yōgiki pagalu, bhūtamulaku pagalu ayina samayamuyōgiki rātri).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.