← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిష్ఠా niṣṭhā

Original — తెలుగు
  1. నితరాం స్థితిః (ఎల్లపుడి ఒకే స్థితిలోనుండుట).

  2. స్థితిః; అనుష్టేయ తాత్పత్యం.(అనుష్టించుటయందు తాత్పర్యము గలిగియుండుట - అట్టి స్థితిలోనుండుట).

  3. నితిష్టత్యస్మిన్ అర్థే అధికర్తవ్యే అధికారి ఇతినిష్టా - నియతాస్థితి రేవ వా నిష్టా యావత్ఫలం స్థిరపరిగృహీతం ఉపయానుష్టానం ఇత్యర్థః.

(అధికారి అయినవాడు ఈ పనియందు శ్రద్ధ గలిగియున్నాడు కనుక అది నిష్ట; నియమించబడిన స్థితినిష్టఫలము కలిగేవరకు - సిద్ధించువరకు - ఉపాయమును అనుష్టించుట).

  1. నిషాదియి షిత పర్యంతావచ్ఛిన్న సాధనానుష్టానం నిష్టా.

(చేయుచున్నపని అవిచ్ఛిన్నముగా - అడ్డు లేకుండునట్లు - సాధించు పర్యంతము అనుష్టించుసాధనము నిష్ట).

  1. లోకే(అ)స్మిన్ ద్విధా నిష్టా పురా ప్రోక్తా మయానుష |

జ్ఞానయోగేన సాం ఖ్యానాం కర్మయోగేన యోగినాం ||. (శ్రీమద్భగవద్గీత - 3 - 30)

ఇత్యాది స్మృత్యనురోధేన విద్వద్య విద్వ వద్విషయత్వేన పూర్వోత్తరాఖ్యాం జ్ఞాననిష్టా కర్మనిష్టాచ అభిహితా ||.

“సమ్యుక్తత్వమతిః సంఖ్యాతాం సంప్రాప్తవతాం సతాం |

బ్రహ్మచర్యాశ్రమా దేవ వేదాంతశ్రవణాదిభిః |

జ్ఞానభూమౌ ప్రవిష్టానాం సాం ఖ్యానాం శుద్ధ చేతసాం |

యుజ్యతే బ్రహ్మణానేనజ్ఞానం తద్యోగ ఈ రితః |

జ్ఞానయోగేన తేనైవ నిష్టా తేషా ముదాహృతా |

కర్మ ధికారిణాం పుం సామశుద్ధమనసాం తథా |

కర్మైవయుజ్యతే చిత్త శుద్థ్యా నేనేతి యోగతః |

తేనైవ కర్మయోగేన నిష్ఠా తేషా ముదాహృతా ||“. (గీతాభావప్రకాశము - 3 - 34 to 38)

(అధికారి అనువాడు రెండు విధములు :- చిత్తశుద్ధిగలవారు, చిత్తశుద్ధిలేనివారు. వీరిద్దరు ఎవరు ఏ విధమైన నిష్ఠ చేయవలయునో శ్రీమద్భగవద్గీతలోని రెండవ అధ్యాయములో చెప్పబడినది _ సృష్టి ప్రారంభమునప్రజలు స్వర్గమునుగాని, మోక్షమునుగాని పొందుటకు వేదములో చెప్పబడిన ప్రకారమునిష్ఠ రెండు విధములుగా చెప్పితిని - సాధ్యము, సాధకము అను పేర్లు మాత్రము రెండు వేరుగనున్నవి.కాని ఆ రెండును ఒకటే - జ్ఞాన నిష్ఠ - (జ్ఞానమార్గము, జ్ఞానయోగము), కర్మ నిష్ఠ (కర్మయోగము). సాంఖ్యులకు జ్ఞాన నిష్ఠ, కర్మయోగులకు కర్మ నిష్ఠ (కర్మయోగము). బ్రహ్మచర్యాశ్రమమునుండి ప్రారంభించి వేదాంత విచారము చేయుచు జ్ఞాన భూమికలో ప్రవేశించినవారికి జ్ఞానయోగము నిష్ఠ - జ్ఞానముద్వారా బ్రహ్మను పొందవచ్చును. అజ్ఞానయోగమందు నిష్ఠులైయున్నవారికి మనశ్శుద్ధి లేకపోవుటచేత వారు కర్మయోగమువలన చిత్తశుద్ధి చేసుకొని భగవంతుని పొందవచ్చుననువారు కర్మయోగులు -వారికి కర్మయోగము నిష్ఠ. ఈ ప్రకారముగా చిత్త శుద్ధి ద్వారా జ్ఞానము కలిగినమీదట - అనగా, జ్ఞానయోగముద్వారా బ్రహ్మప్రాప్తే కలుగును).

  1. “సాధ్య సాధనరూపా ద్వౌయోగౌ పూర్వముదా హృతౌ |

సాధ్య సాధన యోరైక్యం ఫలైక్యా దౌపచారికం |

సాధనం కర్మయోగాఖ్యం సాధ్యం జ్ఞాన మనేక ధా ||” (గీతాభావప్రకాశము - 4 - 2, 3)

(యోగములు - నిష్ఠలు - రెండు విధములు - సాధ్యము, సాధనము - సాధ్యము (సాధించవలసినది) జ్ఞానయోగము, సాధనము (జ్ఞానమును సాధించుమార్గము) కర్మయోగము. సాధ్యసాధనములు ఒకటేఫలము నిచ్చునవి).

  1. బ్రహ్మ నిష్ఠా, బ్రహ్మస్థితి, మొక్షము సమకూర్చు మార్గము - సాధనముయొక్క పరిపక్వావస్థ, లేక పరాకాష్ఠ బుద్ధి నిశ్చయము.

  2. “బ్రాహ్మణులందు గర్మ నిష్ఠులు, దపోనిష్ఠులు, వేద శాస్త్రనిష్ఠులు, జ్ఞానయోగనిష్ఠులునై కొందఱువర్తింతురు.”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 15 - 455)

Transliteration
  1. nitarāṃ sthitiḥ (ellapuḍi okē sthitilōnuṃḍuṭa).

  2. sthitiḥ; anuṣṭēya tātpatyaṃ.(anuṣṭiṃcuṭayaṃdu tātparyamu galigiyuṃḍuṭa - aṭṭi sthitilōnuṃḍuṭa).

  3. nitiṣṭatyasmin arthē adhikartavyē adhikāri itiniṣṭā - niyatāsthiti rēva vā niṣṭā yāvatphalaṃ sthiraparigṛhītaṃ upayānuṣṭānaṃ ityarthaḥ.

(adhikāri ayinavāḍu ī paniyaṃdu śraddha galigiyunnāḍu kanuka adi niṣṭa; niyamiṃcabaḍina sthitiniṣṭaphalamu kaligēvaraku - siddhiṃcuvaraku - upāyamunu anuṣṭiṃcuṭa).

  1. niṣādiyi ṣita paryaṃtāvacchinna sādhanānuṣṭānaṃ niṣṭā.

(cēyucunnapani avicchinnamugā - aḍḍu lēkuṃḍunaṭlu - sādhiṃcu paryaṃtamu anuṣṭiṃcusādhanamu niṣṭa).

  1. lōkē(a)smin dvidhā niṣṭā purā prōktā mayānuṣa |

jñānayōgēna sāṃ khyānāṃ karmayōgēna yōgināṃ ||. (śrīmadbhagavadgīta - 3 - 30)

ityādi smṛtyanurōdhēna vidvadya vidva vadviṣayatvēna pūrvōttarākhyāṃ jñānaniṣṭā karmaniṣṭāca abhihitā ||.

“samyuktatvamatiḥ saṃkhyātāṃ saṃprāptavatāṃ satāṃ |

brahmacaryāśramā dēva vēdāṃtaśravaṇādibhiḥ |

jñānabhūmau praviṣṭānāṃ sāṃ khyānāṃ śuddha cētasāṃ |

yujyatē brahmaṇānēnajñānaṃ tadyōga ī ritaḥ |

jñānayōgēna tēnaiva niṣṭā tēṣā mudāhṛtā |

karma dhikāriṇāṃ puṃ sāmaśuddhamanasāṃ tathā |

karmaivayujyatē citta śudthyā nēnēti yōgataḥ |

tēnaiva karmayōgēna niṣṭhā tēṣā mudāhṛtā ||“. (gītābhāvaprakāśamu - 3 - 34 to 38)

(adhikāri anuvāḍu reṃḍu vidhamulu :- cittaśuddhigalavāru, cittaśuddhilēnivāru. vīriddaru evaru ē vidhamaina niṣṭha cēyavalayunō śrīmadbhagavadgītalōni reṃḍava adhyāyamulō ceppabaḍinadi _ sṛṣṭi prāraṃbhamunaprajalu svargamunugāni, mōkṣamunugāni poṃduṭaku vēdamulō ceppabaḍina prakāramuniṣṭha reṃḍu vidhamulugā ceppitini - sādhyamu, sādhakamu anu pērlu mātramu reṃḍu vēruganunnavi.kāni ā reṃḍunu okaṭē - jñāna niṣṭha - (jñānamārgamu, jñānayōgamu), karma niṣṭha (karmayōgamu). sāṃkhyulaku jñāna niṣṭha, karmayōgulaku karma niṣṭha (karmayōgamu). brahmacaryāśramamunuṃḍi prāraṃbhiṃci vēdāṃta vicāramu cēyucu jñāna bhūmikalō pravēśiṃcinavāriki jñānayōgamu niṣṭha - jñānamudvārā brahmanu poṃdavaccunu. ajñānayōgamaṃdu niṣṭhulaiyunnavāriki manaśśuddhi lēkapōvuṭacēta vāru karmayōgamuvalana cittaśuddhi cēsukoni bhagavaṃtuni poṃdavaccunanuvāru karmayōgulu -vāriki karmayōgamu niṣṭha. ī prakāramugā citta śuddhi dvārā jñānamu kaliginamīdaṭa - anagā, jñānayōgamudvārā brahmaprāptē kalugunu).

  1. “sādhya sādhanarūpā dvauyōgau pūrvamudā hṛtau |

sādhya sādhana yōraikyaṃ phalaikyā daupacārikaṃ |

sādhanaṃ karmayōgākhyaṃ sādhyaṃ jñāna manēka dhā ||” (gītābhāvaprakāśamu - 4 - 2, 3)

(yōgamulu - niṣṭhalu - reṃḍu vidhamulu - sādhyamu, sādhanamu - sādhyamu (sādhiṃcavalasinadi) jñānayōgamu, sādhanamu (jñānamunu sādhiṃcumārgamu) karmayōgamu. sādhyasādhanamulu okaṭēphalamu niccunavi).

  1. brahma niṣṭhā, brahmasthiti, mokṣamu samakūrcu mārgamu - sādhanamuyokka paripakvāvastha, lēka parākāṣṭha buddhi niścayamu.

  2. “brāhmaṇulaṃdu garma niṣṭhulu, dapōniṣṭhulu, vēda śāstraniṣṭhulu, jñānayōganiṣṭhulunai koṃdaṟuvartiṃturu.”

(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 15 - 455)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.