(భగవంతుని - శ్రీమహావిష్ణువును ఎల్లపుడు విడిచిపెట్టకుండ నుండునది - విష్ణు వక్షస్థలమందుండునది - శ్రీమహాలక్ష్మి - మాయ, భగవంతుని ఎల్లపుడు ఆవరించుకొని యుండునది, భగవంతునికి ఉపాధిగానుండునది. పార్వతి పరమశివుని అర్థ శరీరముగానుండుటవలన అతనిని ఎప్పుడైనను వదలియుందక, ఎప్పుడును అతనితోకలిసి యుండునది. సృష్టిలో ఎక్కడ చూచినను, ఏ వస్తువులోనైనను పురుష ప్రకృతులు కలిసియే యుండుట కనబడుచున్నది - ప్రపంచమంతటను ఏ చిన్నవస్తువులోనైనను, ఏ పెద్ద వస్తువులోనైనను, పురుషుని అంశ, ప్రకృతి అంశ కలిసియే యున్నది. ప్రకృతిని విడిచి పురుషుడు లేడు, పురుషుని విడిచి ప్రకృతి లేదు - అందుచేత ప్రకౄతి పురుషునకు నిత్యానపాయిని - శ్రీమహావిష్ణువునకు శ్రీమహాలక్ష్మివలె, శ్రీపరమశివునకు పార్వతివలె - అందుచేతనే శివుని సాంబశివుడనుచున్నారు –
"అంబయా సహితః సాంబః - సాంబశివః"
(అంబ - పార్వతి - తో కలిసియున్న శివుడు).
వారికి నిత్యానపాయిని యైన లక్ష్మి
నెరయచూసిన కస్తూరి నికరమనగ" (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 13 - 421)
(ఎల్లపుడు శ్రీ సీతామహాదేవితో కూడిన శ్రీరామచంద్రుని నా హృదయమందు స్మరించెదను).
(bhagavaṃtuni - śrīmahāviṣṇuvunu ellapuḍu viḍicipeṭṭakuṃḍa nuṃḍunadi - viṣṇu vakṣasthalamaṃduṃḍunadi - śrīmahālakṣmi - māya, bhagavaṃtuni ellapuḍu āvariṃcukoni yuṃḍunadi, bhagavaṃtuniki upādhigānuṃḍunadi. pārvati paramaśivuni artha śarīramugānuṃḍuṭavalana atanini eppuḍainanu vadaliyuṃdaka, eppuḍunu atanitōkalisi yuṃḍunadi. sṛṣṭilō ekkaḍa cūcinanu, ē vastuvulōnainanu puruṣa prakṛtulu kalisiyē yuṃḍuṭa kanabaḍucunnadi - prapaṃcamaṃtaṭanu ē cinnavastuvulōnainanu, ē pedda vastuvulōnainanu, puruṣuni aṃśa, prakṛti aṃśa kalisiyē yunnadi. prakṛtini viḍici puruṣuḍu lēḍu, puruṣuni viḍici prakṛti lēdu - aṃducēta prakṝti puruṣunaku nityānapāyini - śrīmahāviṣṇuvunaku śrīmahālakṣmivale, śrīparamaśivunaku pārvativale - aṃducētanē śivuni sāṃbaśivuḍanucunnāru –
"aṃbayā sahitaḥ sāṃbaḥ - sāṃbaśivaḥ"
(aṃba - pārvati - tō kalisiyunna śivuḍu).
vāriki nityānapāyini yaina lakṣmi
nerayacūsina kastūri nikaramanaga" (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 13 - 421)
(ellapuḍu śrī sītāmahādēvitō kūḍina śrīrāmacaṃdruni nā hṛdayamaṃdu smariṃcedanu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.