(సమస్తమైన అనర్ధములకు నివృత్తి పరమానందరూపమగు మోక్షము - చీకటిలో త్రాడును చూచి అది పాము అను భ్రమ అది పాము కాదు త్రాడు అను జ్ఞానమువలన నివృత్తి యగును. ఈ నివృత్తి నిత్యసిద్ధి. ఆ ప్రకారముగానే ఆత్మ (జీవుని) యొక్క దుఃఖము పరమానందరూపప్రాప్తి వలన నిత్య సిద్ధము).
(కంఠాభరణము తన కంఠమున ఉన్నను, తనకంటికి కనబడకపోయినందున అది పోయినదని అనికొని, ఇంకొకరు నీ కంఠమందే అది ఉన్నదని చెప్పగా పోయిన దానిని తిరిగి పొందినట్లు ఆనందించుట, ఆభరణము పోవుటలేదు, కంఠమునందే యున్నది - నిత్య సిద్ధముగానున్నది. అయినను ఒకరు చెప్పువరకు ఈ సంగతి తెలియలేదు - ఆభరణము కంఠమందు నిత్య సిద్ధమే - ఆ ప్రకారముగానే ఇంటిలో ఎక్కడ కనబడకుండ పాతి పెట్టిన ధనము - నిత్యము అక్కడనే ఉన్నప్పటికీ - కొత్తగా దొరికినట్లు భావించును - ఆ ప్రకారముగానే అందని పరమానందప్రాప్తి నిత్య సిద్ధమే - బ్రహ్మజ్ఞానము సంపాదించినవారికి).
(samastamaina anardhamulaku nivṛtti paramānaṃdarūpamagu mōkṣamu - cīkaṭilō trāḍunu cūci adi pāmu anu bhrama adi pāmu kādu trāḍu anu jñānamuvalana nivṛtti yagunu. ī nivṛtti nityasiddhi. ā prakāramugānē ātma (jīvuni) yokka duḥkhamu paramānaṃdarūpaprāpti valana nitya siddhamu).
(kaṃṭhābharaṇamu tana kaṃṭhamuna unnanu, tanakaṃṭiki kanabaḍakapōyinaṃduna adi pōyinadani anikoni, iṃkokaru nī kaṃṭhamaṃdē adi unnadani ceppagā pōyina dānini tirigi poṃdinaṭlu ānaṃdiṃcuṭa, ābharaṇamu pōvuṭalēdu, kaṃṭhamunaṃdē yunnadi - nitya siddhamugānunnadi. ayinanu okaru ceppuvaraku ī saṃgati teliyalēdu - ābharaṇamu kaṃṭhamaṃdu nitya siddhamē - ā prakāramugānē iṃṭilō ekkaḍa kanabaḍakuṃḍa pāti peṭṭina dhanamu - nityamu akkaḍanē unnappaṭikī - kottagā dorikinaṭlu bhāviṃcunu - ā prakāramugānē aṃdani paramānaṃdaprāpti nitya siddhamē - brahmajñānamu saṃpādiṃcinavāriki).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.