వినాశరహితత్వాత్ నిత్యః - అవినాశి. (నాశములేనివాడు కనుక నిత్యుడు).
వినాశకారణా భావాత్ నిత్యః. (నశింపచేయు కారణము లేనివాడగుటచేత నిత్యుడు భగవంతుడు).
మృత్యు శూన్యం (చావు లేనివాడు).
శాశ్వతః (ఎల్లపుడునుండువాడు)
కాలపరిచ్ఛిన్నం, త్రికాలబాధ్యం, కాలత్రయావస్థాయి.
(కాలపరిమితిలేనివాడు, మూడుకాలములందుండువాడు. పూర్వముండెను, ఇప్పుడులేదు, ఇకముందు ఉండడు అను సంశయములేకుండ భూత భవిష్యద్వర్తమానములందుండువాడు - ఎల్లపుడు ఉండువాడు).
సర్వకాలవర్తమానత్వం నిత్యత్వం. (అన్నికాలములందుండుటయే నిత్యము ఉండుట - అట్లుండువాడు కనుక నిత్యుడు).
స్వాభావిక వినాశరహితః (స్వభావమువలన కలుగు వినాశములేనివాడు).
ప్రాకృత వ్యోమ వల్లయ రహి తత్వాత్ నిత్యః. (ప్రకృతికి సంబంధించిన - ప్రకృతిలోనుండి పుట్టిన ఆకాశమువలె లయము - ప్రలయము, నాశము - లేనివాడు).
సర్వదా ఏక రూపః - అపక్షయ శూన్య మిత్యర్థః. (ఎల్లపుడు ఒకే రూపముతో నుండువాడు - అక్షయములేనివాడు - క్షీణించనివాడు).
సర్వదా ఏవం ప్రకాశమానః. (ఎల్లపుడు ఈ ప్రకారముగానే ప్రకాశించువాడు).
సదా పరిణామ రహితః - (మార్పు చెందక ఎల్లపుడు ఒకే రూపములో నుండువాడు).
ధ్రువం - చలన రహిత మిత్యర్థః. (స్థిరముగనుండువాడు - చలనము లేనువాడు).
సూక్ష్మత్వేద భేదనాద్య యోగ్యత్వాత్ నాశరహితః ఇత్యర్థః.
సత్తామాత్రత్వాత్ నిత్యః -
(సత్తా మాత్రుడు - సన్మాత్రుడు, శాశ్వతముగానుండు శక్తిగలవాడగుటచేత నిత్యుడు).
పారమార్థిక సద్రూపత్వాత్ నిత్యః -(పరమపురుషార్థమైన మోక్షము తానే అయి సత్తామాత్రముగా నుండువాడు).
నిరవధికైశ్వర్య సంపన్నత్వాత్ నిత్యః (పరిమితిలేని ఐశ్వర్యము - ఈశ్వరత్వము కలవాడగుటచేత నిత్యుడు).
"యోహి భూత్వాన భవతి సమ్రియతే ఇతి ఉచ్యతే లోకే, యస్మాత్ నమ్రయతే తస్మాత్ నిత్యః".
(ఇదివరకు ఉండి ఇప్పుడులేనివాడు చనిపోయినవాడు అని లోకములో ప్రసిద్ధి. పరమాత్మకు మృత్యువులేదు - కనుక నిత్యుడు). .
కూటస్థ సత్యం ( కూటమువలెకదలిక లేకయుండువాడగుటచేత నిత్యుడు).
"యో వై భూమా తద వృతం, అన్యదార్త" మిత్యాది శ్రుత్యా చ భూమాత్మా నిత్యః, తతో అన్యత్ అనిత్యం ఇతి వివేకో లభ్యతే.
(భూమా అయినది మృత్యువు లేనిది. అది కానిది మరణించునదే, క్షీణించునదే, అని శ్రుతి చెప్పుచున్నది. అందువలన భూమా అను ఆత్మ నిత్యమైనది, అదికానిది అనిత్యమైనది).
(శ్రీశంకరః)
(ఒకదానినొకటి నాశము చేయుటకు కారణమైన భూతములు ఈ ఆత్మను నాశము చేయుటకు ఉత్సహించుటలేదు - నాశము చేయ జాలవు - అందుచేత ఆత్మ నిత్యము).
అజో నిత్యః శాశ్వతీయా పురాణో నహన్యతే హన్యమానే శరీరే ||". (శ్రీమద్భగవద్గీత - 2 - 19)
"నజాయతే యతో వాయమభూత్వా భవితా పునః |
యోద్య భూత్వా భవత్యేనాముత్పత్తిం భజతే సచ |
యతోయం సత్య ఏవాస్తి తతో నోత్పద్యతే హ్యజః |
కాలత్రయేపి సత్యత్వాజ్జ నిర్నై వాస్య యుజ్యతే |
తథాత్మాప్యేష భూత్వా ప్రాక్పునర్న భవతీతిన |
యోహి భూత్వా పురా పశ్చాన్నభవ త్యేష మృత్యుభాక్ |
అయం తూత్తరకాలేపి సత్వాన్న మ్రియతే యతః |
అతో నిత్యో ననాశార్హః కదాచిదపి చిద్ఘనం ||" (గీతాభావప్రకాశము - 2 - 259 to 262)
(ఆత్మకి పుట్టుటలేదు - అందుచేత ఒకప్పుడు పుట్టి మఱియొకప్పుడు లేకపోవుట లేదు - లేక పోవునదికాదు , ఒకప్పుడు లేకుండి, మఱియొకప్పుడు ఉండునది కాదు. అందుచేత ఆత్మ సత్యమైనది. పుట్టునదికాదు కనుకను, భూతభవిష్యద్వర్తమానములందుండునది కనుక పుట్టుక లేనిది - పుట్టుట యున్నయడల మిగిలిన వికారములన్నియు ముసలితనము, మరణము మొదలగునవి యుండును. ఏ వస్తువైనను పూర్వముండి తిరిగి మరియుండనిదైన యడల అది చనిపోవునదియే - మరణించునదియే. ఆత్మ ముందుకాలమందు కూడా ఉండునది కనుక మరణము లేనిది. అందుచేత నిత్యమైనది - నాశము పొందునదికాదు. జననమరణములు లేవని చెప్పుటవలన మధ్యస్థితి కూడ లేదనుటే - అనగా ఏ విధమైన వికారములు లేనిది).
(ఈ ఆత్మ నశించనిది, నిత్యమైనది, పుట్టుకలేనిది, క్షీణించనిది అని తెలుసుకొనుము).
"నవినష్ట స్వభావో(అ)స్య, నవ్యయో నవ్యయోపచ యాత్మకః |
గుణాద్యపచయాదేవ వినాశో దృశ్యతే యతః |
యథా కస్తూరికా దీనాం గుణనాశే వ్యయో భవేత్ |
నాశో (అ)వయవతో యద్వత్తంతు నాశేపటవ్యయం |
నాశస్యా ద్ధర్మతో యద్వత్కటకాది వినాశతః |
హేమనాశో భవేత్త ద్వన్నిర్ధర్మక ఇహాత్మని |
నిర్గుణే నిష్కలే నాశస్తద భావాన్న యుజ్యతే |
నజాయతే యతో నిత్యో విద్యమానతయా సదా |
తం సర్వ విక్రియా శూన్యం స్వాత్మానం యస్తు సాక్షిణం ||" (గీతాభావప్రకాశము - 2 - 269 - 273 )
(ఈ ఆత్మ నశించు స్వభావము గలవాడుకాడు. అపచయములు కలుగచేయు వ్యయము - క్షీణించుట - లేనివాడు. గుణములు మొదలగు అపచయములుండుట చేతనే నాశము కలుగును - కస్తూరి మొదలగువాటికి వాటి గుణమునశించగా వాటికికూడా నాశము కలుగును - అవయవములు నశించిన అవయవములు కలదినశించును - దారముతో నేసిన బట్ట దారములు నశించగా, నశించును - బంగారము నశించగా బంగార ముతో చేయబడిన ఆభరణములు నశించును. ఆత్మ ధర్మములు లేనిది - గుణములేనిది - (నిర్గుణము) (నిష్కలము). అందుచేత బట్ట, ఆభరణములు, ధర్మము, అవయవములు లేనిదగుటవలన ఆత్మ అవి లేకపోయినను నశించదు. ఆత్మకు పుట్టుకలేదు, ఎల్లపుడు ఉండునది, కనుక నిత్యమైనది, ఏ విధమైన విక్రియములు - వికారములు, మార్పులు - లేనిది. అన్నింటికి సాక్షిగా ఉండునది, కనుక నిత్యమైనది).
నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః |
అచ్ఛేద్యోయమదాహ్యోయమక్లేద్యో (అ)శోష్య యేవచ |
నిత్యః సర్వగతస్థాణురచ లోయం సనాతనః ||". (శ్రీమద్భగవద్గీత - 2 - 23, 24)
"శస్త్రాణ్యంగ విభాగే న ద్విధా కర్తుం చిదాత్మకం |
నశక్నువంతి, వహ్నిర్నోభస్మీకర్తుం క్షమో విభుం |
నబార్ద్ద్రీకరణే ప్యాపః శక్నువం త్యేవ మాంతరం |
విశ్లిష్టాంగక మాత్మానం కర్తు తద్వన్న మారుతః |
ఆత్మానాం నీరసం కర్తుం శక్నోతి బలవత్తరః |
ప్రసిద్ధా నాశకా ఏతే ప్రభవంతి నచాత్మని |
పృధివ్యబ్వహ్ని వాయూనాం నాశకత్వ ప్రసిద్ధతః |
తేషా మప్యాంతరోహ్యాత్మా తం వినాతే మృషాత్మకాః |
శాస్త్రాదేరాత్మనో నాశా సామర్ధ్యే హేతువో హ్యమీ |
అచ్చేద్యత్వా దయాస్తేన నిత్య ఆత్మోక్షరో (అ)వ్యయః |
అన్యోన్య నాశహేతూని భూతాన్యాత్మాన మంతరం |
నోత్సహంతే యతోహంతుం నాశం, కామ తస్త్యజ |
సత్తాస్ఫూర్తి ప్రదాతాస్తి శస్త్రాదీనామయం యతః |
ప్రేరకో(అ)oతర్యామితయా కథమేనమి మాన్యపి |
శస్త్రాదీని ప్రకుర్యుస్తం స్వన్యాపారైక గోచరం ||" (గీతాభావప్రకాశము - 2 - 291 to 297, 300, 301)
(ఈ ఆత్మను శస్త్రములు నరికిముక్కలుగ చేయుటకు శక్తికలవికావు. అగ్ని దీనిని భస్మము చేయలేదు -వాయువుకూడ దీనిని దాని ప్రభావముచే నీరసింప చేయలేదు - ఈ భూతములు గొప్ప నాశము కలుగచేయు శక్తిగలవైనను అత్మను ఏమియు చేయలేవు - వాటిలోపల ఆత్మయుండి వాటికి ఆశక్తి కలుగచేయుటవలననే అది శక్తివంతమైనది. అందుచేత అవి ఆత్మను నాశము చేయలేవు. అందుచేత ఆత్మ నిత్యమైనది (ఎల్లపుడు ఉండునది), అక్షరము (నశింపనిది, క్షీణింపనిది), వ్యయములేనిది (తరిగిపోనిది). భూతములు ఒకదాని నొకటి నాశముచేయగలిగినవైనను ఆత్మను ఏమియు చేయజాలవు. వాటికి ఆత్మ తనసత్తా స్ఫూర్తినిచ్చి వాటికి వాటి వాటి శక్తులను కలిగించును - ఆత్మవలననే వీటి నాశము చేయగలిగినవి కనుక ఆత్మను ఇవి నాశము చేయలేవు. అందుచేత ఆత్మ నిత్యుడు).
యః సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి ||" (శ్రీమద్భగవద్గీత - 8 - 20)
"తస్మాచ్చరాచర స్థూల జగదాతోర్విదేః పరః |
వ్యతిరిక్తో అధవా శ్రేష్టోహేతు భూతో విధేరపి |
నతస్య ప్రతిమా స్తీతి శ్రుత్వంత విలక్షణః |
అన్యన్త ఇంద్రియా తీతో రూపస్పర్శాది వర్జితః |
అధ్యస్థేషుచ సర్వేషు కార్యేష్వనుగతో (అ)క్షరః |
నిత్యో య ఈ దృశో భావో నశ్యత్స్వప్య ఖిలేషు చ |
భూతేషు జాయమానేషు న నశ్యతి న జాయతే |
స్రష్టుర్హిరణ్య గర్భస్య కర్యస్యాత్రాభిమానినః |
తదుత్పత్తి వినాశాభ్యాం యుక్తేస్తో నాశ జన్మని |
అధిష్ఠానస్య సత్యస్యా వ్యక్తస్యా కృతి మస్యచ |
పరమేశ్వరస్య విష్ణోర్నాస్తి జన్మాది విక్రియా". (గీతాభావప్రకాశము - 8 - 120 to 125)
(అవ్యక్తమని చెప్పబడిన సమస్త చరాచర రూపమైన జగత్తునకు కారణమైన - (అనగా అవి పుట్టుటకు కారణమైన) చతుర్ముఖ బ్రహ్మకంటె వేరు అయినవాడున్నూ లేక అతనికన్న ఉత్కృష్టమైనవాడు, శ్రేష్టుడు అయినవాడున్నూ, ఆ చతుర్ముఖ బ్రహ్మకుకూడ కారణమైనవాడున్నూ (చతుర్ముఖ బ్రహ్మను పుట్టించినవాడున్నూ , అతని వంటిది మఱేదియు లేనట్టివాడు అని శ్రుతి చేత చెప్పబడువాడున్నూ, సృష్టిలోని వస్తువులకంటె అత్యంత విలక్షుడైనవాడున్నూ, అవ్యక్తుడున్నూ (కన్నులకు కనబడనివాడున్నూ) రూపము స్పర్శము మొదలగినవి లేనివాడున్నూ, అతని యందు అధ్యస్తమైన కార్యములైన సమస్త వస్తువులందు ఉన్నవాడున్నూ, క్షరము (నాశము) లేనివాడున్నూ, అందుచేత నిత్యుడు (మూడు కాలములందు ఉండువాడు) - ఇటువంటి స్వభావము కలిగియుండుటచేత సమస్త భూతములు నశించినను తాను నశింపనివాడు, అవి పుట్టుచున్నను తాను పుట్టనివాడు - (అనగా సమస్త భూతములకు జనన మరణములు కలుగుచున్నను తాను జనన మరణములు లేనివాడున్నూ, అధిష్ఠానము, సత్యము, అవ్యక్తము, పరమేశ్వరుడు అయిన విష్ణువునకు జన్మ మొదలగువిక్రియములు -మార్పులు - లేవు,. ఇతడే అవ్యక్తుడు, అక్షరుడు, పరమగతియని చెప్పుదురు).
సర్వ జగత్ప్రసిద్ధుడును సర్వగతుండగు చక్రప్రాణియీ
సర్వ శరీరులున్ నిగమసంగతి| జెంది విశీర్య మాణులై
పర్వినచో నభం గగతి బ్రహ్మముదా జెడకుండు నెప్పుడున్". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 7 - 210)
"ఈశ్వరేతర సామర్ధ్య నిగ్రహాలు అవాంతర ప్రళయ మహా ప్రళయాల యందు జననమరణాదులం దప్పించికొను సామర్ధ్యం లేదు కనుక అవెల్లాను భాధకాలైపోవును. ఈశ్వరుండొక్కడే స్వేచ్ఛా శక్తివల్ల సృష్టించి ఆ జగత్తును తనయందు ఉపసంహారం చేసుకొని తానే నిత్యస్వరూపుడై యుండుగనుక ఈశ్వరసామర్ధ్య నిగ్రహము నిత్యత్వం గలిగియున్నది - - పరమార్థ నిగ్రహానకు నిత్యత్వం గలుగుట ఏలాగంటే - ఆ సదాశివమనెడిది తనకు ఆత్మ స్వరూపమైన అవాజ్మానస గోచరమును - - - షడ్వినారాత్మకమై అవాంతరప్రళయ మహాప్రళయములందు జనన మరణ క్లేశవ్యాపారాదులకు లోనైంది కాదు " (బ్రహ్మవిద్యా సుధార్ణవము)
శ్లో||. నిత్య ఆత్మా నభో నిత్యం కాలో నిత్యో దిసాయథా |
విశ్వానాం గోళకం నిత్యం నిత్యోనో లోక ఏవ చ |
తదేక దేశో వైకుంఠో నమ్ర భాగానుసారకః |
తధైవ ప్రకృతిర్నిత్యా బ్రహ్మలీలా ననాతనీ |
యథాగ్నౌ దాహికా చంద్రేపద్మే శోభా ప్రభారవౌ |
శశ్వద్యుక్తా నభిన్నాసా తథా ప్రకృతిరాత్మని |
వినాస్వర్ణం స్వర్ణకారః కుండలం కర్తు మక్షమః |
వినామృదా ఘటం కర్తుం కులాలోహి నహీశ్వరః |
నహిక్షమస్త దాత్మాచ సృష్టం స్రష్టం తయావినా || (దేవీభాగవతం)
"నిత్య ఆత్మా యథా ప్రకృతిర్నిత్యా ఇత్యర్థః - ఆత్మా అత్ర చిదాభా సో జీవః. అన్యమోక్ష పర్యంతం అవస్థానాత్ నిత్యత్వం విశ్వానాం భూరాది లోకానాం బ్రహ్మాండ మిత్యర్థః"
(ఆత్మ అనగా ఇక్కడ జీవుడు - జీవుడు నిత్యుడు. ఆకాశము, కాలము, దిక్కులు, లోకముల గోళములైన బ్రహ్మాండము - నిత్యము. భక్తులు పొందు వైకుంఠలోకము నిత్యము. బ్రహ్మయొక్క లీల అయిన ప్రకృతి నిత్యము. అగ్నిలోని దాహశక్తి (దహించుసక్తి), చంద్రునియందు, పద్మమునందు గల శోభ, సూర్యునికాంతి అగ్నిని, చంద్రుని, రవిని వదలనట్లు ఆశ్రయించియున్నట్లే వాటికన్న వేఱు కానట్లే, ప్రకృతి ఆత్మను అంటియున్నది. బంగారము లేనిదే స్వర్ణకారుడు బంగారపు ఆభరణములను చేయ లేడు. మట్టి లేనియడల కుమ్మరివాడు కుండలు చేయలేడు. ఆ ప్రకారముగానే దేవీ (ప్రకృతి) లేనిదే ఆత్మసృష్టి చేయలేడు. మోక్షపర్యంతము ఇవి యుండును కనుక నిత్యములని చెప్పబడినవి. పైన చెప్పినవాటిలో గోలోకమనగా బ్రహ్మాండమే).
vināśarahitatvāt nityaḥ - avināśi. (nāśamulēnivāḍu kanuka nityuḍu).
vināśakāraṇā bhāvāt nityaḥ. (naśiṃpacēyu kāraṇamu lēnivāḍaguṭacēta nityuḍu bhagavaṃtuḍu).
mṛtyu śūnyaṃ (cāvu lēnivāḍu).
śāśvataḥ (ellapuḍunuṃḍuvāḍu)
kālaparicchinnaṃ, trikālabādhyaṃ, kālatrayāvasthāyi.
(kālaparimitilēnivāḍu, mūḍukālamulaṃduṃḍuvāḍu. pūrvamuṃḍenu, ippuḍulēdu, ikamuṃdu uṃḍaḍu anu saṃśayamulēkuṃḍa bhūta bhaviṣyadvartamānamulaṃduṃḍuvāḍu - ellapuḍu uṃḍuvāḍu).
sarvakālavartamānatvaṃ nityatvaṃ. (annikālamulaṃduṃḍuṭayē nityamu uṃḍuṭa - aṭluṃḍuvāḍu kanuka nityuḍu).
svābhāvika vināśarahitaḥ (svabhāvamuvalana kalugu vināśamulēnivāḍu).
prākṛta vyōma vallaya rahi tatvāt nityaḥ. (prakṛtiki saṃbaṃdhiṃcina - prakṛtilōnuṃḍi puṭṭina ākāśamuvale layamu - pralayamu, nāśamu - lēnivāḍu).
sarvadā ēka rūpaḥ - apakṣaya śūnya mityarthaḥ. (ellapuḍu okē rūpamutō nuṃḍuvāḍu - akṣayamulēnivāḍu - kṣīṇiṃcanivāḍu).
sarvadā ēvaṃ prakāśamānaḥ. (ellapuḍu ī prakāramugānē prakāśiṃcuvāḍu).
sadā pariṇāma rahitaḥ - (mārpu ceṃdaka ellapuḍu okē rūpamulō nuṃḍuvāḍu).
dhruvaṃ - calana rahita mityarthaḥ. (sthiramuganuṃḍuvāḍu - calanamu lēnuvāḍu).
sūkṣmatvēda bhēdanādya yōgyatvāt nāśarahitaḥ ityarthaḥ.
sattāmātratvāt nityaḥ -
(sattā mātruḍu - sanmātruḍu, śāśvatamugānuṃḍu śaktigalavāḍaguṭacēta nityuḍu).
pāramārthika sadrūpatvāt nityaḥ -(paramapuruṣārthamaina mōkṣamu tānē ayi sattāmātramugā nuṃḍuvāḍu).
niravadhikaiśvarya saṃpannatvāt nityaḥ (parimitilēni aiśvaryamu - īśvaratvamu kalavāḍaguṭacēta nityuḍu).
"yōhi bhūtvāna bhavati samriyatē iti ucyatē lōkē, yasmāt namrayatē tasmāt nityaḥ".
(idivaraku uṃḍi ippuḍulēnivāḍu canipōyinavāḍu ani lōkamulō prasiddhi. paramātmaku mṛtyuvulēdu - kanuka nityuḍu). .
kūṭastha satyaṃ ( kūṭamuvalekadalika lēkayuṃḍuvāḍaguṭacēta nityuḍu).
"yō vai bhūmā tada vṛtaṃ, anyadārta" mityādi śrutyā ca bhūmātmā nityaḥ, tatō anyat anityaṃ iti vivēkō labhyatē.
(bhūmā ayinadi mṛtyuvu lēnidi. adi kānidi maraṇiṃcunadē, kṣīṇiṃcunadē, ani śruti ceppucunnadi. aṃduvalana bhūmā anu ātma nityamainadi, adikānidi anityamainadi).
(śrīśaṃkaraḥ)
(okadāninokaṭi nāśamu cēyuṭaku kāraṇamaina bhūtamulu ī ātmanu nāśamu cēyuṭaku utsahiṃcuṭalēdu - nāśamu cēya jālavu - aṃducēta ātma nityamu).
ajō nityaḥ śāśvatīyā purāṇō nahanyatē hanyamānē śarīrē ||". (śrīmadbhagavadgīta - 2 - 19)
"najāyatē yatō vāyamabhūtvā bhavitā punaḥ |
yōdya bhūtvā bhavatyēnāmutpattiṃ bhajatē saca |
yatōyaṃ satya ēvāsti tatō nōtpadyatē hyajaḥ |
kālatrayēpi satyatvājja nirnai vāsya yujyatē |
tathātmāpyēṣa bhūtvā prākpunarna bhavatītina |
yōhi bhūtvā purā paścānnabhava tyēṣa mṛtyubhāk |
ayaṃ tūttarakālēpi satvānna mriyatē yataḥ |
atō nityō nanāśārhaḥ kadācidapi cidghanaṃ ||" (gītābhāvaprakāśamu - 2 - 259 to 262)
(ātmaki puṭṭuṭalēdu - aṃducēta okappuḍu puṭṭi maṟiyokappuḍu lēkapōvuṭa lēdu - lēka pōvunadikādu , okappuḍu lēkuṃḍi, maṟiyokappuḍu uṃḍunadi kādu. aṃducēta ātma satyamainadi. puṭṭunadikādu kanukanu, bhūtabhaviṣyadvartamānamulaṃduṃḍunadi kanuka puṭṭuka lēnidi - puṭṭuṭa yunnayaḍala migilina vikāramulanniyu musalitanamu, maraṇamu modalagunavi yuṃḍunu. ē vastuvainanu pūrvamuṃḍi tirigi mariyuṃḍanidaina yaḍala adi canipōvunadiyē - maraṇiṃcunadiyē. ātma muṃdukālamaṃdu kūḍā uṃḍunadi kanuka maraṇamu lēnidi. aṃducēta nityamainadi - nāśamu poṃdunadikādu. jananamaraṇamulu lēvani ceppuṭavalana madhyasthiti kūḍa lēdanuṭē - anagā ē vidhamaina vikāramulu lēnidi).
(ī ātma naśiṃcanidi, nityamainadi, puṭṭukalēnidi, kṣīṇiṃcanidi ani telusukonumu).
"navinaṣṭa svabhāvō(a)sya, navyayō navyayōpaca yātmakaḥ |
guṇādyapacayādēva vināśō dṛśyatē yataḥ |
yathā kastūrikā dīnāṃ guṇanāśē vyayō bhavēt |
nāśō (a)vayavatō yadvattaṃtu nāśēpaṭavyayaṃ |
nāśasyā ddharmatō yadvatkaṭakādi vināśataḥ |
hēmanāśō bhavētta dvannirdharmaka ihātmani |
nirguṇē niṣkalē nāśastada bhāvānna yujyatē |
najāyatē yatō nityō vidyamānatayā sadā |
taṃ sarva vikriyā śūnyaṃ svātmānaṃ yastu sākṣiṇaṃ ||" (gītābhāvaprakāśamu - 2 - 269 - 273 )
(ī ātma naśiṃcu svabhāvamu galavāḍukāḍu. apacayamulu kalugacēyu vyayamu - kṣīṇiṃcuṭa - lēnivāḍu. guṇamulu modalagu apacayamuluṃḍuṭa cētanē nāśamu kalugunu - kastūri modalaguvāṭiki vāṭi guṇamunaśiṃcagā vāṭikikūḍā nāśamu kalugunu - avayavamulu naśiṃcina avayavamulu kaladinaśiṃcunu - dāramutō nēsina baṭṭa dāramulu naśiṃcagā, naśiṃcunu - baṃgāramu naśiṃcagā baṃgāra mutō cēyabaḍina ābharaṇamulu naśiṃcunu. ātma dharmamulu lēnidi - guṇamulēnidi - (nirguṇamu) (niṣkalamu). aṃducēta baṭṭa, ābharaṇamulu, dharmamu, avayavamulu lēnidaguṭavalana ātma avi lēkapōyinanu naśiṃcadu. ātmaku puṭṭukalēdu, ellapuḍu uṃḍunadi, kanuka nityamainadi, ē vidhamaina vikriyamulu - vikāramulu, mārpulu - lēnidi. anniṃṭiki sākṣigā uṃḍunadi, kanuka nityamainadi).
nacainaṃ klēdayaṃtyāpō naśōṣayati mārutaḥ |
acchēdyōyamadāhyōyamaklēdyō (a)śōṣya yēvaca |
nityaḥ sarvagatasthāṇuraca lōyaṃ sanātanaḥ ||". (śrīmadbhagavadgīta - 2 - 23, 24)
"śastrāṇyaṃga vibhāgē na dvidhā kartuṃ cidātmakaṃ |
naśaknuvaṃti, vahnirnōbhasmīkartuṃ kṣamō vibhuṃ |
nabārddrīkaraṇē pyāpaḥ śaknuvaṃ tyēva māṃtaraṃ |
viśliṣṭāṃgaka mātmānaṃ kartu tadvanna mārutaḥ |
ātmānāṃ nīrasaṃ kartuṃ śaknōti balavattaraḥ |
prasiddhā nāśakā ētē prabhavaṃti nacātmani |
pṛdhivyabvahni vāyūnāṃ nāśakatva prasiddhataḥ |
tēṣā mapyāṃtarōhyātmā taṃ vinātē mṛṣātmakāḥ |
śāstrādērātmanō nāśā sāmardhyē hētuvō hyamī |
accēdyatvā dayāstēna nitya ātmōkṣarō (a)vyayaḥ |
anyōnya nāśahētūni bhūtānyātmāna maṃtaraṃ |
nōtsahaṃtē yatōhaṃtuṃ nāśaṃ, kāma tastyaja |
sattāsphūrti pradātāsti śastrādīnāmayaṃ yataḥ |
prērakō(a)otaryāmitayā kathamēnami mānyapi |
śastrādīni prakuryustaṃ svanyāpāraika gōcaraṃ ||" (gītābhāvaprakāśamu - 2 - 291 to 297, 300, 301)
(ī ātmanu śastramulu narikimukkaluga cēyuṭaku śaktikalavikāvu. agni dīnini bhasmamu cēyalēdu -vāyuvukūḍa dīnini dāni prabhāvamucē nīrasiṃpa cēyalēdu - ī bhūtamulu goppa nāśamu kalugacēyu śaktigalavainanu atmanu ēmiyu cēyalēvu - vāṭilōpala ātmayuṃḍi vāṭiki āśakti kalugacēyuṭavalananē adi śaktivaṃtamainadi. aṃducēta avi ātmanu nāśamu cēyalēvu. aṃducēta ātma nityamainadi (ellapuḍu uṃḍunadi), akṣaramu (naśiṃpanidi, kṣīṇiṃpanidi), vyayamulēnidi (tarigipōnidi). bhūtamulu okadāni nokaṭi nāśamucēyagaliginavainanu ātmanu ēmiyu cēyajālavu. vāṭiki ātma tanasattā sphūrtinicci vāṭiki vāṭi vāṭi śaktulanu kaligiṃcunu - ātmavalananē vīṭi nāśamu cēyagaliginavi kanuka ātmanu ivi nāśamu cēyalēvu. aṃducēta ātma nityuḍu).
yaḥ sarvēṣu bhūtēṣu naśyatsu na vinaśyati ||" (śrīmadbhagavadgīta - 8 - 20)
"tasmāccarācara sthūla jagadātōrvidēḥ paraḥ |
vyatiriktō adhavā śrēṣṭōhētu bhūtō vidhērapi |
natasya pratimā stīti śrutvaṃta vilakṣaṇaḥ |
anyanta iṃdriyā tītō rūpasparśādi varjitaḥ |
adhyasthēṣuca sarvēṣu kāryēṣvanugatō (a)kṣaraḥ |
nityō ya ī dṛśō bhāvō naśyatsvapya khilēṣu ca |
bhūtēṣu jāyamānēṣu na naśyati na jāyatē |
sraṣṭurhiraṇya garbhasya karyasyātrābhimāninaḥ |
tadutpatti vināśābhyāṃ yuktēstō nāśa janmani |
adhiṣṭhānasya satyasyā vyaktasyā kṛti masyaca |
paramēśvarasya viṣṇōrnāsti janmādi vikriyā". (gītābhāvaprakāśamu - 8 - 120 to 125)
(avyaktamani ceppabaḍina samasta carācara rūpamaina jagattunaku kāraṇamaina - (anagā avi puṭṭuṭaku kāraṇamaina) caturmukha brahmakaṃṭe vēru ayinavāḍunnū lēka atanikanna utkṛṣṭamainavāḍu, śrēṣṭuḍu ayinavāḍunnū, ā caturmukha brahmakukūḍa kāraṇamainavāḍunnū (caturmukha brahmanu puṭṭiṃcinavāḍunnū , atani vaṃṭidi maṟēdiyu lēnaṭṭivāḍu ani śruti cēta ceppabaḍuvāḍunnū, sṛṣṭilōni vastuvulakaṃṭe atyaṃta vilakṣuḍainavāḍunnū, avyaktuḍunnū (kannulaku kanabaḍanivāḍunnū) rūpamu sparśamu modalaginavi lēnivāḍunnū, atani yaṃdu adhyastamaina kāryamulaina samasta vastuvulaṃdu unnavāḍunnū, kṣaramu (nāśamu) lēnivāḍunnū, aṃducēta nityuḍu (mūḍu kālamulaṃdu uṃḍuvāḍu) - iṭuvaṃṭi svabhāvamu kaligiyuṃḍuṭacēta samasta bhūtamulu naśiṃcinanu tānu naśiṃpanivāḍu, avi puṭṭucunnanu tānu puṭṭanivāḍu - (anagā samasta bhūtamulaku janana maraṇamulu kalugucunnanu tānu janana maraṇamulu lēnivāḍunnū, adhiṣṭhānamu, satyamu, avyaktamu, paramēśvaruḍu ayina viṣṇuvunaku janma modalaguvikriyamulu -mārpulu - lēvu,. itaḍē avyaktuḍu, akṣaruḍu, paramagatiyani ceppuduru).
sarva jagatprasiddhuḍunu sarvagatuṃḍagu cakraprāṇiyī
sarva śarīrulun nigamasaṃgati| jeṃdi viśīrya māṇulai
parvinacō nabhaṃ gagati brahmamudā jeḍakuṃḍu neppuḍun". (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 7 - 210)
"īśvarētara sāmardhya nigrahālu avāṃtara praḷaya mahā praḷayāla yaṃdu jananamaraṇādulaṃ dappiṃcikonu sāmardhyaṃ lēdu kanuka avellānu bhādhakālaipōvunu. īśvaruṃḍokkaḍē svēcchā śaktivalla sṛṣṭiṃci ā jagattunu tanayaṃdu upasaṃhāraṃ cēsukoni tānē nityasvarūpuḍai yuṃḍuganuka īśvarasāmardhya nigrahamu nityatvaṃ galigiyunnadi - - paramārtha nigrahānaku nityatvaṃ galuguṭa ēlāgaṃṭē - ā sadāśivamaneḍidi tanaku ātma svarūpamaina avājmānasa gōcaramunu - - - ṣaḍvinārātmakamai avāṃtarapraḷaya mahāpraḷayamulaṃdu janana maraṇa klēśavyāpārādulaku lōnaiṃdi kādu " (brahmavidyā sudhārṇavamu)
ślō||. nitya ātmā nabhō nityaṃ kālō nityō disāyathā |
viśvānāṃ gōḷakaṃ nityaṃ nityōnō lōka ēva ca |
tadēka dēśō vaikuṃṭhō namra bhāgānusārakaḥ |
tadhaiva prakṛtirnityā brahmalīlā nanātanī |
yathāgnau dāhikā caṃdrēpadmē śōbhā prabhāravau |
śaśvadyuktā nabhinnāsā tathā prakṛtirātmani |
vināsvarṇaṃ svarṇakāraḥ kuṃḍalaṃ kartu makṣamaḥ |
vināmṛdā ghaṭaṃ kartuṃ kulālōhi nahīśvaraḥ |
nahikṣamasta dātmāca sṛṣṭaṃ sraṣṭaṃ tayāvinā || (dēvībhāgavataṃ)
"nitya ātmā yathā prakṛtirnityā ityarthaḥ - ātmā atra cidābhā sō jīvaḥ. anyamōkṣa paryaṃtaṃ avasthānāt nityatvaṃ viśvānāṃ bhūrādi lōkānāṃ brahmāṃḍa mityarthaḥ"
(ātma anagā ikkaḍa jīvuḍu - jīvuḍu nityuḍu. ākāśamu, kālamu, dikkulu, lōkamula gōḷamulaina brahmāṃḍamu - nityamu. bhaktulu poṃdu vaikuṃṭhalōkamu nityamu. brahmayokka līla ayina prakṛti nityamu. agnilōni dāhaśakti (dahiṃcusakti), caṃdruniyaṃdu, padmamunaṃdu gala śōbha, sūryunikāṃti agnini, caṃdruni, ravini vadalanaṭlu āśrayiṃciyunnaṭlē vāṭikanna vēṟu kānaṭlē, prakṛti ātmanu aṃṭiyunnadi. baṃgāramu lēnidē svarṇakāruḍu baṃgārapu ābharaṇamulanu cēya lēḍu. maṭṭi lēniyaḍala kummarivāḍu kuṃḍalu cēyalēḍu. ā prakāramugānē dēvī (prakṛti) lēnidē ātmasṛṣṭi cēyalēḍu. mōkṣaparyaṃtamu ivi yuṃḍunu kanuka nityamulani ceppabaḍinavi. paina ceppinavāṭilō gōlōkamanagā brahmāṃḍamē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.