← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిత్యముక్తః nityamuktaḥ

Original — తెలుగు
  1. స్వస్వరూపానందే స్థితః, స్వాత్మన్యేవరతః.

(స్వస్వరూపమనగా తన నిజరూపము, అనగా ఆత్మ రూపము. స్వస్వరూపానందమనగా ఆత్మానందము - ఆ ఆత్మానందమునందున్నవాడు, ఆత్మానందముననుభవించు చున్నవాడు. ఆత్మయందే రతిగలవాడు. నిత్యము ఆత్మయందే ధ్యానముగలవాడు).

  1. స్వస్వరూపా వారకాజ్ఞానా భావాత్ తస్య నిత్య ముక్తః.

(స్వస్వరూపమును ఆవరించు అజ్ఞానములేకపోవుటచే నిత్యముక్తుడు).

  1. "స్పర్శా న్కృత్యా బజిర్బాహ్యం శ్చక్షుశ్చైవాంతరే బ్రుహోః |

ప్రాణాపానౌ సమేకృత్వా నాసాభ్యంతర చారిణౌ |

యతేంద్రుయమనోబుద్ధిర్మ నిర్మోక్ష పరాయణః |

విగతేచ్ఛా భయక్రోధోయః సదాముక్తఏవ సః ||" (శ్రీమద్భగవద్గీత - 5 - 27, 28)

  1. "బాహ్యః శబ్దాదయో బుద్ధా దింద్రియైః సం ప్రవేశితాః |

వైరాగ్యేణైవతాన్ బాహ్యాన్ బహిః కృత్వా ప్రయత్న తః |

యద్యౌతౌ అంతరాః న్యుర్వై తదోపాయ సహస్ర కైః |

బహిర్నిస్యుః స్వభావస్య భంగః కర్తుం న శక్యతే |

బాహ్యం స్త్వం తః ప్రదిష్టాం స్తా న్రాగాదేశా ద్బహిస్తదా |

కర్తుం శక్యాన్ విరాగేణ బాహ్యానితి విశేషణాత్ |

వైరాగ్యం తదనేనోక్త్వా ప్రాహోభ్యాస మధోక్షజః |

అత్యంత మలనే నిద్రా ప్రసారే విభ్రమాదయః |

అతో(అ)ర్ధ మలనేనైవ భ్రూమధ్యే చక్షుషోః స్థితిః |

ఊర్ధ్వాధోగతి విచ్చేదా న్నాసాభ్యంతర చారిణా |

కుంభకేన సమేకృత్వా ప్రాణాపానౌ విచక్షణః |

నిం యతా ఇత్యుపాయేన యస్యేంద్రియ మనోధియః |

విషయా న్విషవత్ త్యక్త్వా సమునిర్మోక్ష తత్పరః |

ఇచ్చాదిరహితో యోగీ జీవన్నేవ విముచ్యతే ||". (గీతాభావ ప్రకాశము - 522 to 528)

(బాహ్యమందు ఉన్నటువంటి అనగా శరీరమునకు మనస్సునకు వెలుపల నున్నటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధములను ఇంద్రియములద్వారా లోనికి తీసుకొనుటచే వాటిని అనిభవించడమగును. అట్టి శబ్దాదులను వాటి యడల విరాగము పుట్టునట్లు ప్రయత్నముచేసి వెలుపలకు పంపివేసి - అనగా వాటియందు మనస్సు వెళ్ళకుండా ఉంచి - దృష్టి భ్రూమధ్యమందుంచి, లోనికి పీల్చిన ప్రాణవాయువును పైకి వదలివేయకుండా కుంభించి, ఈ ప్రకారము ఇంద్రియ మనోబుద్ధులను తన వశములో ఉంచుకొని, ఇచ్ఛా, భయ క్రోధములు లేని ముముక్ల్షువు అయిన మునినిత్య ముక్తుడే - ఎల్లపుడును ముక్తుడే అయి యుండును).

  1. "శబ్దాదీన్ బహిః కృత్వా (బాహ్యేంద్రియ వ్యాపారం ఉపసంహత్య , అచింతయతః, శ్రోతాదీని యోగేన నియమ్య, చక్షుషీ భ్రువోరంతరే(నాసాగ్రే)విన్యస్యభృవో మధ్యం అవలోకయన్ నాసాభ్యంతర చారిణౌ ప్రాణాపానౌ సమేకృత్వా (ఉచ్ఛ్వాస నిశ్వాశౌ సమగాతీ కృత్వా (కుంభకేస్థిత్వా) యతేంద్రియ మనోబుద్ధిః (యతాని సం యతాని) తతః ఏవవిగతేచ్ఛాభయ క్రోధః, మోక్ష పరాయణః (మోక్షైక ప్రయోజనః) మునిః (ఆత్మావలోకన శీలః) యః ఏవం వర్తతే సదాసః ముక్తః ఏవ. నతస్య మోక్షాయ అన్యః కర్తవ్యః అస్తి. (సాధ్యదశాయామివసాధన దశాయం అపి సః సదాముక్తః).

(బాహ్యేంద్రియములగు శ్రోత్రము మొదలగువాటిని వాటి వ్యాపరములనుండి మళ్ళించి - విషయసుఖముల గుఱించి చింతింపక - దృష్టిని కనుబొమల మధ్యను అనగా, నాసాగ్రమందు కేంద్రీకరించి, నాసాభ్యంతరమున నున్న ప్రాణవాయువును అపానవాయువును సమముగా చేసి - ఉచ్ఛ్వాస నిశ్వాసములను సమముగా చేసి, అనగా, కుంభకము చేసి - ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని నియమించియుంచి, దాని వలన ఇచ్ఛా, భయ, క్రోధములు లేనివాడై ఆత్మావలోకనపరుడై ఈ ప్రకారముగానుండు ముని ఎల్లపుడూ ముక్తుడే (నిత్యముక్తుడే) యగును. అట్టివానికి మోక్షము పొందుటకు ఇతర కర్తవ్యము లేదు - యోగ సిద్ధిని పొందినపుడు ఎట్లు ముక్తుడగునో యోగసాధనదశలోనున్నపుడు కూడ అట్టివాడు ముక్తుడగును. అందుచేత నిత్యముక్తుడు).

  1. "వివేకీ సర్వదాముక్తః కుర్వతో నాస్తి కర్తృతా |

అలేపవాదం సమాశ్రిత్య శ్రీకృష్ణ జనకోయథా ||".

(వివేకము గలవాడు, ఆత్మ యేదో, అనాత్మ యేదో అను వివేకముగలవాడు, కర్మ చేయుచున్నప్పటికీ అతనికి దాని కర్తృత్వములేదుకనుక, నిత్యముక్తుడు),

  1. "తత్వ విత్త్వాత్ నిత్య యుక్తః" (శ్రీ శంకరః)

(భగవత్తత్త్వము తెలుసుకొనియుండుటవలన నిత్యముక్తుడు).

  1. భగవదర్థ కర్మానుష్ఠానాదినా భగవన్నిష్ఠాస్సంతః శ్రేష్టయా శ్రద్ధయాచ యుక్తాః తం ఆరాధియంతి తే -(భగవంతునికొఱకే - భగవంతునుద్దేశించియే కర్మ చేయుటయను నిష్ఠకలిగియుండి మంచి శ్రద్ధతో భగవంతుని అరాధించువాడు నిత్యముక్తుడు)

(తదేక నిష్టుడు - నిరంతర దైవ చింతనాపరుడు).

  1. ఆరూఢ యోగీ (యోగములో పరిపూర్ణుడైనవాడు - తుది మెట్టు ఎక్కినవాడు).

  2. నిత్యం సమాహిత ధియః - సమాహిత మనాః - నిత్యం విక్షేపా భావతః - బుధః-

(భ్రాంతి విడిపోయినందున ప్రత్యగాత్మకన్న వేఱుకాని భగవంతునియందు సమాహితమైన మనస్సు కలవాడు).

Transliteration
  1. svasvarūpānaṃdē sthitaḥ, svātmanyēvarataḥ.

(svasvarūpamanagā tana nijarūpamu, anagā ātma rūpamu. svasvarūpānaṃdamanagā ātmānaṃdamu - ā ātmānaṃdamunaṃdunnavāḍu, ātmānaṃdamunanubhaviṃcu cunnavāḍu. ātmayaṃdē ratigalavāḍu. nityamu ātmayaṃdē dhyānamugalavāḍu).

  1. svasvarūpā vārakājñānā bhāvāt tasya nitya muktaḥ.

(svasvarūpamunu āvariṃcu ajñānamulēkapōvuṭacē nityamuktuḍu).

  1. "sparśā nkṛtyā bajirbāhyaṃ ścakṣuścaivāṃtarē bruhōḥ |

prāṇāpānau samēkṛtvā nāsābhyaṃtara cāriṇau |

yatēṃdruyamanōbuddhirma nirmōkṣa parāyaṇaḥ |

vigatēcchā bhayakrōdhōyaḥ sadāmuktaēva saḥ ||" (śrīmadbhagavadgīta - 5 - 27, 28)

  1. "bāhyaḥ śabdādayō buddhā diṃdriyaiḥ saṃ pravēśitāḥ |

vairāgyēṇaivatān bāhyān bahiḥ kṛtvā prayatna taḥ |

yadyautau aṃtarāḥ nyurvai tadōpāya sahasra kaiḥ |

bahirnisyuḥ svabhāvasya bhaṃgaḥ kartuṃ na śakyatē |

bāhyaṃ stvaṃ taḥ pradiṣṭāṃ stā nrāgādēśā dbahistadā |

kartuṃ śakyān virāgēṇa bāhyāniti viśēṣaṇāt |

vairāgyaṃ tadanēnōktvā prāhōbhyāsa madhōkṣajaḥ |

atyaṃta malanē nidrā prasārē vibhramādayaḥ |

atō(a)rdha malanēnaiva bhrūmadhyē cakṣuṣōḥ sthitiḥ |

ūrdhvādhōgati viccēdā nnāsābhyaṃtara cāriṇā |

kuṃbhakēna samēkṛtvā prāṇāpānau vicakṣaṇaḥ |

niṃ yatā ityupāyēna yasyēṃdriya manōdhiyaḥ |

viṣayā nviṣavat tyaktvā samunirmōkṣa tatparaḥ |

iccādirahitō yōgī jīvannēva vimucyatē ||". (gītābhāva prakāśamu - 522 to 528)

(bāhyamaṃdu unnaṭuvaṃṭi anagā śarīramunaku manassunaku velupala nunnaṭuvaṃṭi śabda sparśa rūpa rasa gaṃdhamulanu iṃdriyamuladvārā lōniki tīsukonuṭacē vāṭini anibhaviṃcaḍamagunu. aṭṭi śabdādulanu vāṭi yaḍala virāgamu puṭṭunaṭlu prayatnamucēsi velupalaku paṃpivēsi - anagā vāṭiyaṃdu manassu veḷḷakuṃḍā uṃci - dṛṣṭi bhrūmadhyamaṃduṃci, lōniki pīlcina prāṇavāyuvunu paiki vadalivēyakuṃḍā kuṃbhiṃci, ī prakāramu iṃdriya manōbuddhulanu tana vaśamulō uṃcukoni, icchā, bhaya krōdhamulu lēni mumuklṣuvu ayina muninitya muktuḍē - ellapuḍunu muktuḍē ayi yuṃḍunu).

  1. "śabdādīn bahiḥ kṛtvā (bāhyēṃdriya vyāpāraṃ upasaṃhatya , aciṃtayataḥ, śrōtādīni yōgēna niyamya, cakṣuṣī bhruvōraṃtarē(nāsāgrē)vinyasyabhṛvō madhyaṃ avalōkayan nāsābhyaṃtara cāriṇau prāṇāpānau samēkṛtvā (ucchvāsa niśvāśau samagātī kṛtvā (kuṃbhakēsthitvā) yatēṃdriya manōbuddhiḥ (yatāni saṃ yatāni) tataḥ ēvavigatēcchābhaya krōdhaḥ, mōkṣa parāyaṇaḥ (mōkṣaika prayōjanaḥ) muniḥ (ātmāvalōkana śīlaḥ) yaḥ ēvaṃ vartatē sadāsaḥ muktaḥ ēva. natasya mōkṣāya anyaḥ kartavyaḥ asti. (sādhyadaśāyāmivasādhana daśāyaṃ api saḥ sadāmuktaḥ).

(bāhyēṃdriyamulagu śrōtramu modalaguvāṭini vāṭi vyāparamulanuṃḍi maḷḷiṃci - viṣayasukhamula guṟiṃci ciṃtiṃpaka - dṛṣṭini kanubomala madhyanu anagā, nāsāgramaṃdu kēṃdrīkariṃci, nāsābhyaṃtaramuna nunna prāṇavāyuvunu apānavāyuvunu samamugā cēsi - ucchvāsa niśvāsamulanu samamugā cēsi, anagā, kuṃbhakamu cēsi - iṃdriyamulanu, manassunu, buddhini niyamiṃciyuṃci, dāni valana icchā, bhaya, krōdhamulu lēnivāḍai ātmāvalōkanaparuḍai ī prakāramugānuṃḍu muni ellapuḍū muktuḍē (nityamuktuḍē) yagunu. aṭṭivāniki mōkṣamu poṃduṭaku itara kartavyamu lēdu - yōga siddhini poṃdinapuḍu eṭlu muktuḍagunō yōgasādhanadaśalōnunnapuḍu kūḍa aṭṭivāḍu muktuḍagunu. aṃducēta nityamuktuḍu).

  1. "vivēkī sarvadāmuktaḥ kurvatō nāsti kartṛtā |

alēpavādaṃ samāśritya śrīkṛṣṇa janakōyathā ||".

(vivēkamu galavāḍu, ātma yēdō, anātma yēdō anu vivēkamugalavāḍu, karma cēyucunnappaṭikī ataniki dāni kartṛtvamulēdukanuka, nityamuktuḍu),

  1. "tatva vittvāt nitya yuktaḥ" (śrī śaṃkaraḥ)

(bhagavattattvamu telusukoniyuṃḍuṭavalana nityamuktuḍu).

  1. bhagavadartha karmānuṣṭhānādinā bhagavanniṣṭhāssaṃtaḥ śrēṣṭayā śraddhayāca yuktāḥ taṃ ārādhiyaṃti tē -(bhagavaṃtunikoṟakē - bhagavaṃtunuddēśiṃciyē karma cēyuṭayanu niṣṭhakaligiyuṃḍi maṃci śraddhatō bhagavaṃtuni arādhiṃcuvāḍu nityamuktuḍu)

(tadēka niṣṭuḍu - niraṃtara daiva ciṃtanāparuḍu).

  1. ārūḍha yōgī (yōgamulō paripūrṇuḍainavāḍu - tudi meṭṭu ekkinavāḍu).

  2. nityaṃ samāhita dhiyaḥ - samāhita manāḥ - nityaṃ vikṣēpā bhāvataḥ - budhaḥ-

(bhrāṃti viḍipōyinaṃduna pratyagātmakanna vēṟukāni bhagavaṃtuniyaṃdu samāhitamaina manassu kalavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.