← Back to న · Booklets 21–30 (digitized file 3)

నియమములు niyamamulu

Original — తెలుగు
  1. "శ్లో. || తపస్సంతోష మాస్తిక్యం దానమీశ్వర పూజనం |

సిద్దాంత శ్రవణం చైవ హ్రీర్మతిశ్చ జపోవ్రతం |

ఏతేచనియమాః ప్రోక్తాః ధశధైవ మహామతే ||" (దర్శనోపనిషత్ ; వరాహోపనిషత్)

(తపస్సు, సంతోషము, ఆస్తిక్యము, దానము, ఈశ్వరపూజ, శ్రవణము, హ్రీః, మతి, జపము, వ్రతము - ఈ పదియు నియమములని చెప్పబడినవి)

  1. "గురు భక్తిః సత్యమార్గానురక్తిః సుఖానుగత వస్త్వనుభవశ్చ, తద్విస్త్వనుభవేన తుష్టిః, నిస్సంగతా ఏకాం తవాసో, మనో నివృత్తిః, ఫలానభిలాషః, వైరాగ్యభావశ్చ నియమాః |” (మండల బ్రాహ్మణోపనిషత్)

(గురువునందు భక్తి , సత్యమార్గమిన నడచుటయందు అనురక్తి, సుఖముగా లభించిన వస్తువును అనుభవించుట, అట్టి వస్తువును అనుభవించుటచేత సంతోషము, దేనియందు అనురాగము చూపకుండుట, మనో నిగ్రహము, కర్మఫలమందభిలాష లేకుండుట, వైరాగ్యము - ఇవి నియమములు)

  1. "శౌచ సంతోష తపస్స్వా ధ్యాయేశ్వర ప్రణా ధానాని నియమాః" (పతంజలి యోగసూత్రములు - 2 - 32)

(శుచిగానుండుట, సంతోషము, తపస్సు, వేదాధ్యయనము, ఈశ్వరధ్యానము అనునవి నియమములు - శౌచము అనగా శరీరము లోపల పైన శుచిగానుండుట, మనసులో కల్మషము లేకుండ, శరీరమును స్నానాదులచే బాహ్య శుద్ధి చేయుట. తపము అనగా కృభ్ర చాందాయణము మొదలగునవి ఆచరించుట, సంతోషమనగా తనకు తానంతట లభ్యమైనదానితో తృప్తిపొందుట, స్వాధ్యాయమనగా వేదమును పఠించుట, ఈశ్వర ప్రణిధానమనగా ఈశ్వరుని ధ్యానము చేయుట).

(శౌచము రెండు విధములు - బాహ్య శౌచము, అంతశ్శౌచము. బాహ్య శౌచమనగా మట్టి, నీరు, మొదలగువాటితో శరీరమును శుద్ధి చేయుట. అంతశ్శౌచమనగా చిత్తశుద్ధి).

  1. "శౌచ మిజ్యా తపోదానం స్వాధ్యా యోపస్థ నిగ్రహః |

వ్రత మౌనోపవాసం చ, స్నానం చ నియమా దశ ||".

(శౌచము, యజ్ఞము, తపస్సు, దానము, స్వాధ్యాయము, ఇంద్రియజయము, వ్రతము, మౌనము, ఉపవాసము, స్నానము - ఈ పదియు నియమములు).

  1. "మౌనవ్రత బ్రహ్మచర్య క్షమా జప తపంబులును, నతిధి సత్కారంబును, బరహితంబును, ఔర్యాదిరహితత్వంబును ననునవి మొదలైనవి నియమంబులనందగు" (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 -
  2. నిష్ట ; వ్రతనిష్ట.
Transliteration
  1. "ślō. || tapassaṃtōṣa māstikyaṃ dānamīśvara pūjanaṃ |

siddāṃta śravaṇaṃ caiva hrīrmatiśca japōvrataṃ |

ētēcaniyamāḥ prōktāḥ dhaśadhaiva mahāmatē ||" (darśanōpaniṣat ; varāhōpaniṣat)

(tapassu, saṃtōṣamu, āstikyamu, dānamu, īśvarapūja, śravaṇamu, hrīḥ, mati, japamu, vratamu - ī padiyu niyamamulani ceppabaḍinavi)

  1. "guru bhaktiḥ satyamārgānuraktiḥ sukhānugata vastvanubhavaśca, tadvistvanubhavēna tuṣṭiḥ, nissaṃgatā ēkāṃ tavāsō, manō nivṛttiḥ, phalānabhilāṣaḥ, vairāgyabhāvaśca niyamāḥ |” (maṃḍala brāhmaṇōpaniṣat)

(guruvunaṃdu bhakti , satyamārgamina naḍacuṭayaṃdu anurakti, sukhamugā labhiṃcina vastuvunu anubhaviṃcuṭa, aṭṭi vastuvunu anubhaviṃcuṭacēta saṃtōṣamu, dēniyaṃdu anurāgamu cūpakuṃḍuṭa, manō nigrahamu, karmaphalamaṃdabhilāṣa lēkuṃḍuṭa, vairāgyamu - ivi niyamamulu)

  1. "śauca saṃtōṣa tapassvā dhyāyēśvara praṇā dhānāni niyamāḥ" (pataṃjali yōgasūtramulu - 2 - 32)

(śucigānuṃḍuṭa, saṃtōṣamu, tapassu, vēdādhyayanamu, īśvaradhyānamu anunavi niyamamulu - śaucamu anagā śarīramu lōpala paina śucigānuṃḍuṭa, manasulō kalmaṣamu lēkuṃḍa, śarīramunu snānādulacē bāhya śuddhi cēyuṭa. tapamu anagā kṛbhra cāṃdāyaṇamu modalagunavi ācariṃcuṭa, saṃtōṣamanagā tanaku tānaṃtaṭa labhyamainadānitō tṛptipoṃduṭa, svādhyāyamanagā vēdamunu paṭhiṃcuṭa, īśvara praṇidhānamanagā īśvaruni dhyānamu cēyuṭa).

(śaucamu reṃḍu vidhamulu - bāhya śaucamu, aṃtaśśaucamu. bāhya śaucamanagā maṭṭi, nīru, modalaguvāṭitō śarīramunu śuddhi cēyuṭa. aṃtaśśaucamanagā cittaśuddhi).

  1. "śauca mijyā tapōdānaṃ svādhyā yōpastha nigrahaḥ |

vrata maunōpavāsaṃ ca, snānaṃ ca niyamā daśa ||".

(śaucamu, yajñamu, tapassu, dānamu, svādhyāyamu, iṃdriyajayamu, vratamu, maunamu, upavāsamu, snānamu - ī padiyu niyamamulu).

  1. "maunavrata brahmacarya kṣamā japa tapaṃbulunu, natidhi satkāraṃbunu, barahitaṃbunu, auryādirahitatvaṃbunu nanunavi modalainavi niyamaṃbulanaṃdagu" (śrīmadāṃdhramahābhāgavatamu - 11 -
  2. niṣṭa ; vrataniṣṭa.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.