వస్తువు.
పదస్య అర్థః పదార్థః. (పదముయొక్క - మాటయొక్క - అర్థము).
సదసన్మిధ్యా చేతి త్రయః - సదేవ తత్ర బ్రహ్మ, అసత్తుచ్ఛం, జగత్కల్పితం బ్రహ్మణి, అసత్యం మిధ్యా.
(ఈ సృష్టిలో సత్తు, అసత్తు, మిధ్య యని మూడు పదార్థములున్నవి. వీటిలో సత్తు అనగా బ్రహ్మ, అసత్తుఅనగా ఏమియు లేనిది - బ్రహ్మముందు జగత్తు కల్పితముగాన అది అసత్తు, నిజమునకు అది జగత్తుకాదు,అదిబ్రహ్మయే. అందుచేత అంతా మిధ్య).
(ధర్మము, అర్థము, కామము, మోక్షము - ఇవియే, వీటికి సంబంధించినవియే పదార్థములు).
(శ్రీమదాంధ్ర,మహాభాగవతము - 11 - 105)
పంచేంద్రియములలో తెలియబడునది, నిత్యముకానిది, నశించునది. సృష్టిలోనున్న ప్రతివస్తువునశించునదే. నశింపక ఎల్లకాలముండునది భగవంతుడే. తిలలందు తైలము సత్యము, తిలలుఅసత్యము - జీవ శరీరములోనుండు జీవుడు నిత్యుడు, జీవుని శరీరము అనిత్యము. నిత్యమైనబ్రహ్మ - జీవుడు - నిత్యముకాని ప్రతి పదార్థములోను కలడు - భగవంతుడు లేని పదార్థము లేదు.అందుచేత పరబ్రహ్మ, జగత్తు అని రెండు పదార్థములున్నట్లు తోచినను అంతయు ఒకేపదార్థము -అదియే బ్రహ్మ –
“హరిమయము కాని ద్రవ్యము
పరమాణువు లేదు, వంశపావన వింటే ” (శ్రీమదాంధ్రమహాభాగవతము - - -)
vastuvu.
padasya arthaḥ padārthaḥ. (padamuyokka - māṭayokka - arthamu).
sadasanmidhyā cēti trayaḥ - sadēva tatra brahma, asattucchaṃ, jagatkalpitaṃ brahmaṇi, asatyaṃ midhyā.
(ī sṛṣṭilō sattu, asattu, midhya yani mūḍu padārthamulunnavi. vīṭilō sattu anagā brahma, asattuanagā ēmiyu lēnidi - brahmamuṃdu jagattu kalpitamugāna adi asattu, nijamunaku adi jagattukādu,adibrahmayē. aṃducēta aṃtā midhya).
(dharmamu, arthamu, kāmamu, mōkṣamu - iviyē, vīṭiki saṃbaṃdhiṃcinaviyē padārthamulu).
(śrīmadāṃdhra,mahābhāgavatamu - 11 - 105)
paṃcēṃdriyamulalō teliyabaḍunadi, nityamukānidi, naśiṃcunadi. sṛṣṭilōnunna prativastuvunaśiṃcunadē. naśiṃpaka ellakālamuṃḍunadi bhagavaṃtuḍē. tilalaṃdu tailamu satyamu, tilaluasatyamu - jīva śarīramulōnuṃḍu jīvuḍu nityuḍu, jīvuni śarīramu anityamu. nityamainabrahma - jīvuḍu - nityamukāni prati padārthamulōnu kalaḍu - bhagavaṃtuḍu lēni padārthamu lēdu.aṃducēta parabrahma, jagattu ani reṃḍu padārthamulunnaṭlu tōcinanu aṃtayu okēpadārthamu -adiyē brahma –
“harimayamu kāni dravyamu
paramāṇuvu lēdu, vaṃśapāvana viṃṭē ” (śrīmadāṃdhramahābhāgavatamu - - -)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.