చిన లోకనికాయముల సృజించుటకును సా
ధనమగు సూక్ష్మార్థము మన
సున గని కాలానుగత రజోగుణమంతన్ .
సీ. పుట్టించె తద్గుణంబున పరమేశ్వరు నాభి దేశమునందు నళిననాళ
ముదయించె. మఱియప్పయోరుహ ముకుళంబు గర్మ బోధితమైన కాలమందు
తన తేజమున ప్రవృద్ధంబైన జలముచే జలజాప్తుగతి ప్రకారంబునొంద
జేసి, లోకాశ్రయస్థితి సర్వగుణ విభాసిత గతినొప్పు రాజీవమందు
నిజకళా కలితాంబు నిలిపి దాని
వలన నామ్నాయమయుడును వరగుణుండును
నాత్మయోనియునైన తోయజభవుడు
సరవి జతురాననుండు నా జననమయ్యె. (శ్రీమదాంధ్రమహాభాగవతము - - - )
నారాయణ నాభికమల నాళమున నజుం
డారయ బుట్టెననుట నిజ
మోరాజీవాక్ష పుట్టె నోటు తలంపన్. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా.- 560)
తత్ప్రాకృతంచ విజ్ఞేయం భూదేవీ అభిమానినీ |
పద్మాద్ధిరణ్మయం జ్జాతో బ్రహ్మాతు చతురాననః ||. (గారుడపురాణము - 11 - 20)
(విష్ణుని నాభినుండి సువర్ణకమలము పుట్టెను. దానినుండి చతురాననుండైన బ్రహ్మ పుట్టెను). (చూడుము - ‘పద్మనాభుడు’ ; ‘చతురాననుడు’).
cina lōkanikāyamula sṛjiṃcuṭakunu sā
dhanamagu sūkṣmārthamu mana
suna gani kālānugata rajōguṇamaṃtan .
sī. puṭṭiṃce tadguṇaṃbuna paramēśvaru nābhi dēśamunaṃdu naḷinanāḷa
mudayiṃce. maṟiyappayōruha mukuḷaṃbu garma bōdhitamaina kālamaṃdu
tana tējamuna pravṛddhaṃbaina jalamucē jalajāptugati prakāraṃbunoṃda
jēsi, lōkāśrayasthiti sarvaguṇa vibhāsita gatinoppu rājīvamaṃdu
nijakaḷā kalitāṃbu nilipi dāni
valana nāmnāyamayuḍunu varaguṇuṃḍunu
nātmayōniyunaina tōyajabhavuḍu
saravi jaturānanuṃḍu nā jananamayye. (śrīmadāṃdhramahābhāgavatamu - - - )
nārāyaṇa nābhikamala nāḷamuna najuṃ
ḍāraya buṭṭenanuṭa nija
mōrājīvākṣa puṭṭe nōṭu talaṃpan. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā.- 560)
tatprākṛtaṃca vijñēyaṃ bhūdēvī abhimāninī |
padmāddhiraṇmayaṃ jjātō brahmātu caturānanaḥ ||. (gāruḍapurāṇamu - 11 - 20)
(viṣṇuni nābhinuṃḍi suvarṇakamalamu puṭṭenu. dāninuṃḍi caturānanuṃḍaina brahma puṭṭenu). (cūḍumu - ‘padmanābhuḍu’ ; ‘caturānanuḍu’).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.