← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పద్మనాభుడు padmanābhuḍu

Original — తెలుగు
  1. పద్మం నాభే యస్య సః పద్మనాభః.

(నాభి యందు పద్మముగలవాడు).

  1. “పద్మ మివ సువర్తులా నాభిః అస్య ఇతి -” (శ్రీశంకరః)

(పద్మమువలె గుండ్రమైన నాభి కలవాడు).

  1. పద్మస్య నాభౌ మధ్యే కర్ణికాయాం స్థితః ఇతి పద్మనాభః.

(పద్మము యొక్క కర్ణికయందు - దుద్దువలె నున్నదానియందు ఉండువాడు).

  1. హృదయపద్మస్య నాభౌ మధ్యే ప్రకాశనాత్ వా పద్మనాభః. (శ్రీశంకరః)

(హృదయపద్మ మధ్యమందుండువాడు).

  1. “సర్వ జగత్కారణం పద్మం నాభౌ యస్య సః పద్మనాభః” (శ్రీశంకరః)

(సమస్త జగత్తునకు కారణమైన కమలము నాభియందు కలవాడు). (శరీరములోని నాభినుండి అనేకనాడులు పుట్టి శరీరములో వ్యాపించును - ఆ ప్రకారముగానే శ్రీ మహావిష్ణువు యొక్క పద్మాకారముగనుండు నాభినుండి (నాభి యను పద్మమునుండి) జతుర్ముఖ బ్రహ్మ పుట్టి ప్రపంచమును - ప్రపంచములోని జీవరాసులను - సృష్టించెను - విష్ణువు లోపల లయమై యున్న జీవరాసులను పుట్టించెను) -

“క. - - నాలో

పల నడిగి యేకమై ని

శ్చలగతి వసియించి యున్న జనములనెల్లన్

తే. తగనహంకార మూల తత్వంబునొంది

నీవు పుట్టింపుమనుచు రాజీవభవుడు

వినగనానతి యిచ్చి, యవ్వన జనాభు

డంత నంతర్హితుడయ్యె ననఘ చరిత”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 9 - 330)

  1. “అన్నింటి సంఘాతంబున బాంచభౌతికంబైన హిరణ్య యాండంబు సృజియించె - అదియును జలాంతర్వర్తి యై వృద్ధి బొందుచుండె. అంత–

“సీ. నారాయాణాఖ్య నున్నతి నొప్పు బ్రహ్మంబు సాహస్ర దివ్య వర్షంబులోలి

వసియించి యుండె; నా వాసుదేవుని నాభియందు సహ్స్ర సూర్య ప్రదీప్తి

దనరుచు సకల జీవ నికాయ యుతమగు పంకజాతంబు సంభవము నొందె

బరగంగ నందులో భగవదధిష్ఠితుండై సర్వాట్టగు చతురాననుండు

జననమొందె - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 20 - )

  1. “యథా స్వకణికాతః సూక్ష్మాత్ వట బీజాత్ మహావటః అభూత్ శయనస్య విరమత్సమాధేః తవ (భగవతస్య) నాభేః సకాశాత్ త్వయి ఏవ గూఢం సత్ మహాబ్జం లోకపద్మం అభూత్ - కథం భూతౌ నిజయా కాల శక్త్యా సంబోధితాః ప్రకృతేః ధర్మాః సత్వాదయః, యేన - (స్వరూపత్వేక నిజత్వే హేతుః అనంతశయనాత్ యోగనిద్రాత్ విరమత్సమాధిః యస్య సః).

(సూక్ష్మమైన వటబీజమునుండి ఒక మహా వటవృక్షము పుట్టినట్లు పాల సముద్రములో అనంతుని మీద యోగనిద్రలోనుండి మేల్కొనిన శ్రీమహావిస్ధ్ణువు యొక్క నాభి నుండి, అతనియందే సూక్ష్మరూపములో అణగియున్న ఒక పెద్ద మహాపద్మము పుట్టెను - ఎట్లనగా, కాలమను భగవంతుని శక్తి చేతనే - ప్రకృతి ధర్మములు అయిన సత్వరజస్తమములచేత ప్రబోధింపబడుటచేత ఆ మహాపద్మము పుట్టెను. అది భగవంతుని నాభినుండి పుట్టినది కనుక, ఆ నాభి - అట్టినాభి కలవాడు కనుక భగవంతుడు పద్మనాభుడు. అ పద్మములోనుండి పుట్టినవాడు కనుక చతుర్ముఖబ్రహ్మ పద్మభవుడు, పద్మజుడు అని చెప్పబడుచున్నాడు).

Transliteration
  1. padmaṃ nābhē yasya saḥ padmanābhaḥ.

(nābhi yaṃdu padmamugalavāḍu).

  1. “padma miva suvartulā nābhiḥ asya iti -” (śrīśaṃkaraḥ)

(padmamuvale guṃḍramaina nābhi kalavāḍu).

  1. padmasya nābhau madhyē karṇikāyāṃ sthitaḥ iti padmanābhaḥ.

(padmamu yokka karṇikayaṃdu - dudduvale nunnadāniyaṃdu uṃḍuvāḍu).

  1. hṛdayapadmasya nābhau madhyē prakāśanāt vā padmanābhaḥ. (śrīśaṃkaraḥ)

(hṛdayapadma madhyamaṃduṃḍuvāḍu).

  1. “sarva jagatkāraṇaṃ padmaṃ nābhau yasya saḥ padmanābhaḥ” (śrīśaṃkaraḥ)

(samasta jagattunaku kāraṇamaina kamalamu nābhiyaṃdu kalavāḍu). (śarīramulōni nābhinuṃḍi anēkanāḍulu puṭṭi śarīramulō vyāpiṃcunu - ā prakāramugānē śrī mahāviṣṇuvu yokka padmākāramuganuṃḍu nābhinuṃḍi (nābhi yanu padmamunuṃḍi) jaturmukha brahma puṭṭi prapaṃcamunu - prapaṃcamulōni jīvarāsulanu - sṛṣṭiṃcenu - viṣṇuvu lōpala layamai yunna jīvarāsulanu puṭṭiṃcenu) -

“ka. - - nālō

pala naḍigi yēkamai ni

ścalagati vasiyiṃci yunna janamulanellan

tē. taganahaṃkāra mūla tatvaṃbunoṃdi

nīvu puṭṭiṃpumanucu rājīvabhavuḍu

vinaganānati yicci, yavvana janābhu

ḍaṃta naṃtarhituḍayye nanagha carita”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 9 - 330)

  1. “anniṃṭi saṃghātaṃbuna bāṃcabhautikaṃbaina hiraṇya yāṃḍaṃbu sṛjiyiṃce - adiyunu jalāṃtarvarti yai vṛddhi boṃducuṃḍe. aṃta–

“sī. nārāyāṇākhya nunnati noppu brahmaṃbu sāhasra divya varṣaṃbulōli

vasiyiṃci yuṃḍe; nā vāsudēvuni nābhiyaṃdu sahsra sūrya pradīpti

danarucu sakala jīva nikāya yutamagu paṃkajātaṃbu saṃbhavamu noṃde

baragaṃga naṃdulō bhagavadadhiṣṭhituṃḍai sarvāṭṭagu caturānanuṃḍu

jananamoṃde - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 20 - )

  1. “yathā svakaṇikātaḥ sūkṣmāt vaṭa bījāt mahāvaṭaḥ abhūt śayanasya viramatsamādhēḥ tava (bhagavatasya) nābhēḥ sakāśāt tvayi ēva gūḍhaṃ sat mahābjaṃ lōkapadmaṃ abhūt - kathaṃ bhūtau nijayā kāla śaktyā saṃbōdhitāḥ prakṛtēḥ dharmāḥ satvādayaḥ, yēna - (svarūpatvēka nijatvē hētuḥ anaṃtaśayanāt yōganidrāt viramatsamādhiḥ yasya saḥ).

(sūkṣmamaina vaṭabījamunuṃḍi oka mahā vaṭavṛkṣamu puṭṭinaṭlu pāla samudramulō anaṃtuni mīda yōganidralōnuṃḍi mēlkonina śrīmahāvisdhṇuvu yokka nābhi nuṃḍi, ataniyaṃdē sūkṣmarūpamulō aṇagiyunna oka pedda mahāpadmamu puṭṭenu - eṭlanagā, kālamanu bhagavaṃtuni śakti cētanē - prakṛti dharmamulu ayina satvarajastamamulacēta prabōdhiṃpabaḍuṭacēta ā mahāpadmamu puṭṭenu. adi bhagavaṃtuni nābhinuṃḍi puṭṭinadi kanuka, ā nābhi - aṭṭinābhi kalavāḍu kanuka bhagavaṃtuḍu padmanābhuḍu. a padmamulōnuṃḍi puṭṭinavāḍu kanuka caturmukhabrahma padmabhavuḍu, padmajuḍu ani ceppabaḍucunnāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.