← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పంచబ్రహ్మలు paṃcabrahmalu

Original — తెలుగు
  1. బ్రహం విష్ణు రుద్రేశ్వరాః మంచక కోణ ఖుర భూతాః, సదా శివస్తుచతుర్ణాం మస్తకోపరిఫలక స్థానీయః.

(బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు అను నలుగురు మంచమునకు కోళ్ళువలెనుండువారి మస్తకముమీద ఫలకము మీదనుండువాడు సదాశివుడు - ఈ అయిదుగురు పంచబ్రహ్మలు).

  1. “బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః |

ఇత్యాఖ్యావశతః పంచబ్రహ్మ రూపేణ సంస్థితం ||“.

(బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు అను పేర్లు గలవాడగుటచేత పంచబ్రహ్మలరూపములతో నుండువాడు - పరబ్రహ్మ).

  1. “ఏక ఏవ శివస్సాక్షాత్ సత్య జ్ఞానాది లక్షణః |

వికార రహిత శ్శుద్ధః స్వశక్త్యా పంచథా స్థితః ||”

ఎతే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర సదాశివాః సద్యో జాతాది పంచ బ్రహ్మ మూర్తయః“.

(సత్యము, జ్ఞానము, అనంతము అను లక్షణములుగలవాడున్నూ, వికారములు లేనివాడున్నూ,శుద్ధుడున్నూ అయిన సాక్షాత్ శివుడే తన శక్తిచేత అయిదు బ్రహ్మలుగానున్నాడు - అనగా బ్రహ్మ,విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడుగా శివుడే మారెను).

  1. “తేషాం పంచభూతానాం పతయః పంచ సదాశివేశ్వర రుద్ర, విష్ణు, బ్రహ్మణః”. (యోగచూడామణ్యుపనిషత్)

(పంచ భూతముల అధిపతులగు సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ అనువారుపంచబ్రహ్మలు -)

  1. “బ్రహ్మణోహృదయస్థానంకం రే విష్ణుః సమాశ్రితః |

తాలు మధ్యే స్థితో రుద్రో లలాటస్థో మహేశ్వరః |

నాసగ్రే అచ్యుతం విద్యాత్ తస్యాం తేత పరం పదం |

పరత్వాత్తుపరం నాస్తీ త్యేవం శాస్త్రస్య నిర్ణయః ||“. (బ్రహ్మవిద్యోపనిషత్)

(హృదయమందు బ్రహ్మస్థానము, కంఠము విష్ణుస్థానము, తాలుమధ్యమందు రుద్రుస్థానము, లలాటమందుమహేశ్వరునిస్థానము, నాసాగ్రము అచ్యుతుని స్థానము, దానిపై స్థానము పరమపదము. పరమపదముకంటె పరమమైనది లేదు. ఇట్లు శాస్త్రములో నిర్ణయించబడినది),

Transliteration
  1. brahaṃ viṣṇu rudrēśvarāḥ maṃcaka kōṇa khura bhūtāḥ, sadā śivastucaturṇāṃ mastakōpariphalaka sthānīyaḥ.

(brahma, viṣṇuvu, rudruḍu, īśvaruḍu anu naluguru maṃcamunaku kōḷḷuvalenuṃḍuvāri mastakamumīda phalakamu mīdanuṃḍuvāḍu sadāśivuḍu - ī ayiduguru paṃcabrahmalu).

  1. “brahmā viṣṇuśca rudraśca īśvaraśca sadāśivaḥ |

ityākhyāvaśataḥ paṃcabrahma rūpēṇa saṃsthitaṃ ||“.

(brahma, viṣṇuvu, rudruḍu, īśvaruḍu, sadāśivuḍu anu pērlu galavāḍaguṭacēta paṃcabrahmalarūpamulatō nuṃḍuvāḍu - parabrahma).

  1. “ēka ēva śivassākṣāt satya jñānādi lakṣaṇaḥ |

vikāra rahita śśuddhaḥ svaśaktyā paṃcathā sthitaḥ ||”

etē brahma, viṣṇu, rudra, īśvara sadāśivāḥ sadyō jātādi paṃca brahma mūrtayaḥ”.

(satyamu, jñānamu, anaṃtamu anu lakṣaṇamulugalavāḍunnū, vikāramulu lēnivāḍunnū,śuddhuḍunnū ayina sākṣāt śivuḍē tana śakticēta ayidu brahmalugānunnāḍu - anagā brahma,viṣṇuvu, rudruḍu, īśvaruḍu, sadāśivuḍugā śivuḍē mārenu).

  1. “tēṣāṃ paṃcabhūtānāṃ patayaḥ paṃca sadāśivēśvara rudra, viṣṇu, brahmaṇaḥ”. (yōgacūḍāmaṇyupaniṣat)

(paṃca bhūtamula adhipatulagu sadāśivuḍu, īśvaruḍu, rudruḍu, viṣṇuvu, brahma anuvārupaṃcabrahmalu -)

  1. “brahmaṇōhṛdayasthānaṃkaṃ rē viṣṇuḥ samāśritaḥ |

tālu madhyē sthitō rudrō lalāṭasthō mahēśvaraḥ |

nāsagrē acyutaṃ vidyāt tasyāṃ tēta paraṃ padaṃ |

paratvāttuparaṃ nāstī tyēvaṃ śāstrasya nirṇayaḥ ||“. (brahmavidyōpaniṣat)

(hṛdayamaṃdu brahmasthānamu, kaṃṭhamu viṣṇusthānamu, tālumadhyamaṃdu rudrusthānamu, lalāṭamaṃdumahēśvarunisthānamu, nāsāgramu acyutuni sthānamu, dānipai sthānamu paramapadamu. paramapadamukaṃṭe paramamainadi lēdu. iṭlu śāstramulō nirṇayiṃcabaḍinadi),

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.