పదునైదు బీజములు గలది. ఆత్మవలన కలిగిన పంచభూత సూక్ష్మాంశములుపంచదశ మంత్రవర్ణములు.
శ్రీవిద్య, చిద్విద్య.
“సహస్రారంతర్గత షోడశ కళాత్మక చంద్రమండలము ఆత్మ. అందున్న ధృవకల సాక్షిగానువృద్ధిక్షయరహితమైన పదియారవ కల సాదాఖ్యకళయనియు (ధ్రువకళయనియు) అందువలన పంచదశకళలు ఉత్పన్నములు వృద్ధి క్షయములు కలిగి పంచదశ నిత్యలుగా నున్నవనియు, అవియే పంచదశమంత్ర వర్ణములుగాను, ఆ వర్ణములు భూతపంచకము, జ్ఞానేంద్రియపంచకము, అవ్యక్తమహత్తత్వాహంకారములును, జీవేశ్వరులు - ఈ పదియైదు వస్తువులుగానుండి షోడశీకలయగు ఆత్మరూప త్రిపురసుందరియందు తిరిగి తాదాత్మ్యమును పొందుచున్నవనియు ఆగమ రహస్యము”
“ఆత్మజ్ఞానమును తెలుసుకొనుటకు లోకమందు చతుర్దశ విద్యలు ఉత్పన్నమైనవి. వానిలోవేదములు సారభూతములు. అందు గాయత్రి సారము. అది రెండు రూపములుగలది. అందు ఒకటిసకల బ్రాహ్మణోపాసనలోనున్న ద్వాత్రింశాదక్షర రూపమైనది. రెండవది వేదములందు బహుగుప్తముగానున్నది. అదియే శ్రీవిద్య, పంచదశిగా నున్నది, గాన గాయత్రి పంచదశీ విద్యలకు బేధములేదు.”
పంచదశాక్షరీమంత్రార్థము ఈ విధముగానున్నది –
“పూర్వరూపం లజ్జాం లజ్జోప లక్షితాష్ట పాశాత్మకాం, అవిద్యాం నివర్తయ, బ్రహ్మ విషయకా జ్ఞానం నివర్తయ, బ్రహ్మ పరోక్షం వృత్తిం ప్రకాశయ. ఇత్యర్థః. సకలవృత్యుప శాంత్యాఖండ ప్రకాశచిదానంద రూపాపత్తిం సంపాదయ ఇత్యర్థః”.
(పూర్వ రూపమైన - అష్టపాశముల రూపమైన అవిద్యను నివర్తింప చేయుము. బ్రహ్మ గుఱించి కలిగిన అజ్ఞానమును నివర్తింపచేయుము. బ్రహ్మ పరోక్షజ్ఞానమును ప్రకాశింప చేయుము - సకలవృత్తులు ఉపశాంతి పొందినట్లు అఖండ ప్రకాశ చిదానందరూపమును నాకు కలుగ చేయుము. అని అర్థము).
padunaidu bījamulu galadi. ātmavalana kaligina paṃcabhūta sūkṣmāṃśamulupaṃcadaśa maṃtravarṇamulu.
śrīvidya, cidvidya.
“sahasrāraṃtargata ṣōḍaśa kaḷātmaka caṃdramaṃḍalamu ātma. aṃdunna dhṛvakala sākṣigānuvṛddhikṣayarahitamaina padiyārava kala sādākhyakaḷayaniyu (dhruvakaḷayaniyu) aṃduvalana paṃcadaśakaḷalu utpannamulu vṛddhi kṣayamulu kaligi paṃcadaśa nityalugā nunnavaniyu, aviyē paṃcadaśamaṃtra varṇamulugānu, ā varṇamulu bhūtapaṃcakamu, jñānēṃdriyapaṃcakamu, avyaktamahattatvāhaṃkāramulunu, jīvēśvarulu - ī padiyaidu vastuvulugānuṃḍi ṣōḍaśīkalayagu ātmarūpa tripurasuṃdariyaṃdu tirigi tādātmyamunu poṃducunnavaniyu āgama rahasyamu”
“ātmajñānamunu telusukonuṭaku lōkamaṃdu caturdaśa vidyalu utpannamainavi. vānilōvēdamulu sārabhūtamulu. aṃdu gāyatri sāramu. adi reṃḍu rūpamulugaladi. aṃdu okaṭisakala brāhmaṇōpāsanalōnunna dvātriṃśādakṣara rūpamainadi. reṃḍavadi vēdamulaṃdu bahuguptamugānunnadi. adiyē śrīvidya, paṃcadaśigā nunnadi, gāna gāyatri paṃcadaśī vidyalaku bēdhamulēdu.”
paṃcadaśākṣarīmaṃtrārthamu ī vidhamugānunnadi –
“pūrvarūpaṃ lajjāṃ lajjōpa lakṣitāṣṭa pāśātmakāṃ, avidyāṃ nivartaya, brahma viṣayakā jñānaṃ nivartaya, brahma parōkṣaṃ vṛttiṃ prakāśaya. ityarthaḥ. sakalavṛtyupa śāṃtyākhaṃḍa prakāśacidānaṃda rūpāpattiṃ saṃpādaya ityarthaḥ”.
(pūrva rūpamaina - aṣṭapāśamula rūpamaina avidyanu nivartiṃpa cēyumu. brahma guṟiṃci kaligina ajñānamunu nivartiṃpacēyumu. brahma parōkṣajñānamunu prakāśiṃpa cēyumu - sakalavṛttulu upaśāṃti poṃdinaṭlu akhaṃḍa prakāśa cidānaṃdarūpamunu nāku kaluga cēyumu. ani arthamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.