← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పంచదోషాః paṃcadōṣāḥ

Original — తెలుగు
  1. సాగరతరణ రాజసేవాదిషు శరీరవినాశపర్యం తాః ఆర్జన దోషాః

  2. సహస్రప్రాకార పరివృత గర్భ గృహే నివేశితశ్యాపి రక్ష్య వస్తునః రాజ. దహన, చోరమూషికాదయః,తన్నివారణ క్లేశాదయశ్చ రక్షణ దోషాః –

  3. “స్వర్గే (అ)పిపాత భీతస్య క్షయిష్ణోర్నాస్తి నివృత్తిః ఇత్యాదయః క్షయ దోషాః

  4. నజాతం కామఃకామాకాం ఉప భోగేన శామ్యతి |

హవిషా కృష్ణ వర్త్మేవ భూయః ఏవాభి వర్ధతే” –

“అలాభే మత్తకాశిన్యా దృష్టా తిర్యక్షు కామితా |”

ఇత్యాదివత్ ఉత్తరోత్తర రాగ ప్రబంధనార్థ హేత్వయోగ్య విషయప్రవృత్యాదయః భోగదోషాః.

(5) సర్వస్యచ ప్రాయశః పరహింసా గర్భత్వాత్ తదధీనాః ఐహికాముష్కిక దుఃఖ సంతతయః హింసా దోషాః - పంచ విధాశ్చ ఎతే దోషాః ప్రత్యక్షాది సిద్ధాః“.

( (1) సముద్రము దాటుటలోను, రాజులను సేవించుట మొదలగువాటిలోను చనిపోవువఱకు ఆర్జనచేయుటలో దోషములు.

(2) వేయిప్రాకారములచేత ఆవరింపబడిన గర్భగృహమందు - రహస్యప్రదేశమందు ఉంచబడి రక్షించబడిన వస్తువులకు రాజువలన పాలకులవలన - అగ్నివలన, దొంగలవలన, ఎలుకలవలన రక్షించుటకు, వాటివలనకలుగు భయమును నివారించుటకు చేయు ప్రయత్నరూపమగు దోషములు.

(3) స్వర్గములోనున్నను పుణ్యఫలము క్షీణించగా మరల భూలోకములో జన్మించవలెను. కనుక క్షీణించువాటివలన నివృత్తి లేదు అను మొదలగునవి నివృత్తి దోషములు.

(4) కోరికలు నెరవేరుటవలన వాటికి అంతముండదు - కామము తగ్గిపోదు, నశించదు - అగ్నిలోహోమము చేసినదానివలన అగ్ని తగ్గదు,మఱింత ప్రజ్వలించును - ఈ మొదలగునవి భోగదోషములు

(5) ఈ లోకమునకు సంబంధించినవి పరలోకమునకు సంబంధినవి అయిన దుఃఖములు ఇతరులకుదుఃఖమును కలుగచేయునవియే కనుక అటువంటి హింసా దోషములు - ఇవి అయిదు విషయములైన దోషములు).

Transliteration
  1. sāgarataraṇa rājasēvādiṣu śarīravināśaparyaṃ tāḥ ārjana dōṣāḥ

  2. sahasraprākāra parivṛta garbha gṛhē nivēśitaśyāpi rakṣya vastunaḥ rāja. dahana, cōramūṣikādayaḥ,tannivāraṇa klēśādayaśca rakṣaṇa dōṣāḥ –

  3. “svargē (a)pipāta bhītasya kṣayiṣṇōrnāsti nivṛttiḥ ityādayaḥ kṣaya dōṣāḥ

  4. najātaṃ kāmaḥkāmākāṃ upa bhōgēna śāmyati |

haviṣā kṛṣṇa vartmēva bhūyaḥ ēvābhi vardhatē” –

“alābhē mattakāśinyā dṛṣṭā tiryakṣu kāmitā |”

ityādivat uttarōttara rāga prabaṃdhanārtha hētvayōgya viṣayapravṛtyādayaḥ bhōgadōṣāḥ.

(5) sarvasyaca prāyaśaḥ parahiṃsā garbhatvāt tadadhīnāḥ aihikāmuṣkika duḥkha saṃtatayaḥ hiṃsā dōṣāḥ - paṃca vidhāśca etē dōṣāḥ pratyakṣādi siddhāḥ”.

( (1) samudramu dāṭuṭalōnu, rājulanu sēviṃcuṭa modalaguvāṭilōnu canipōvuvaṟaku ārjanacēyuṭalō dōṣamulu.

(2) vēyiprākāramulacēta āvariṃpabaḍina garbhagṛhamaṃdu - rahasyapradēśamaṃdu uṃcabaḍi rakṣiṃcabaḍina vastuvulaku rājuvalana pālakulavalana - agnivalana, doṃgalavalana, elukalavalana rakṣiṃcuṭaku, vāṭivalanakalugu bhayamunu nivāriṃcuṭaku cēyu prayatnarūpamagu dōṣamulu.

(3) svargamulōnunnanu puṇyaphalamu kṣīṇiṃcagā marala bhūlōkamulō janmiṃcavalenu. kanuka kṣīṇiṃcuvāṭivalana nivṛtti lēdu anu modalagunavi nivṛtti dōṣamulu.

(4) kōrikalu neravēruṭavalana vāṭiki aṃtamuṃḍadu - kāmamu taggipōdu, naśiṃcadu - agnilōhōmamu cēsinadānivalana agni taggadu,maṟiṃta prajvaliṃcunu - ī modalagunavi bhōgadōṣamulu

(5) ī lōkamunaku saṃbaṃdhiṃcinavi paralōkamunaku saṃbaṃdhinavi ayina duḥkhamulu itarulakuduḥkhamunu kalugacēyunaviyē kanuka aṭuvaṃṭi hiṃsā dōṣamulu - ivi ayidu viṣayamulaina dōṣamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.