← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పంచాక్షరీమంత్రము paṃcākṣarīmaṃtramu

Original — తెలుగు
  1. “ఓం నమశ్శివాయః” అను అయిదు అక్షరములుగల మంత్రము.

  2. ‘ఓం’ ఇత్యగ్రే వ్యాహరేత్. “నమ” ఇతి పశ్చాత్, తత “శ్శివాయే” తి అక్షరత్రయం.

(మొదట ‘ఓం’ అని పలుకవలెను, తర్వాత ‘నమ’ అని, అటు తర్వాత ’ శివాయ ’ అను మూడుఅక్షరములు పలుకవలెను).

  1. “వేదేషు శాస్త్రేషు శివాగమేషు సారం స ముద్ధృత్య జగధ్థితాయ |

భక్త ప్రియ యః పార్వతి వల్లభశ్చ పంచాక్షరం ప్రాహ పరశ్శివో (అ)సౌ” (స్కాందే)

(వేదములందు, శాస్త్రములందు, శివాగమములందు ఉన్న సారమును పైకితీసి లోకములకుహితము చేయుటకు పారవతీపతి, భక్త ప్రియుడు అయీన్ పరమశివుడు యీ పంచాక్షరమును ‘ఓం నమశ్శివాయ’ అను పంచాక్షరీమంత్రమును పలికెను - అతనే పరమ శివుడు).

  1. “సర్వస్మా దధికో (అ)స్త్యేవ శివః పరమకారణం |

తత్కృతం హి జగత్సర్వం బ్రహ్మ ద్యాస్తస్యకింకరాః |

తత్ప్రసాద కృతైశ్వర్యాః దాసస్తస్య వయం ప్రభో |

స్వల్పాన్ దేవాన్ పరిత్యజ్య మనసాకర్మాణా గిరా |

తమేవసాంగం సగణం భజభావ పురస్సరం |

తస్య దేవాది దేవస్య శివస్య శివస్యశివదాయినః |

సాక్షాన్నమశ్శివాయే తి మంత్రోయం వాచకః స్మృతః |

సప్తకోటిమహామంత్రాః సర్వే సప్రణవాః పరే |

తస్మిన్నేవ విలీయంతే పునస్తస్మా ద్వి నిర్గతాః |

స ప్రసాదాశ్చతే మంత్రాః స్వాధికారాద్యపేక్షయం |

సర్వాధికారస్త్వేకో (అ)యం మంత్ర ఏ వేశ్వరాజ్ఞయా |

యథా నికృష్టానుత్కృష్టాన్ సర్వానప్యాత్మనః శివః |

క్షమంతే రక్షితుం తద్వన్మంత్రోయమపి సర్వదా |

ప్రబలస్త్వత ఏ వాయం మంత్రోమంత్రాం తరాదపి |

సర్వ రక్ష క్షమోహ్యేష నాపరః కశ్చిదిష్యతే |

తస్మాన్మంత్రాంతరం త్యక్త్వా పంచాక్షరపరో భవ ||“. (శివరహస్యే)

(అన్నిటికంటె, అందఱికంటె పరమకారణుడైన శివుడు అధికుడు. ఈ సృష్టి అతను చేసినదే. బ్రహ్మమొదలగు వారందరూ అతని కింకరులే (సేవకులే; భక్తులే), అతని కరుణవలననే వారందరూవారి వారి ఐశ్వర్యమును (పదవులను) పొందినవారు. చిన్న చిన్న దేవతులని విడిచిపెట్టి త్రికణములతో (మనో వాక్కాయములతో) ధ్యానములో ప్రమద గణములతో కూడియున్నటువంటిన్నీఆకారముతో కూడిన - సగుణరూపుడైన శివుని భజించుము. దేవ దేవుడు మంగళప్రదుడు అగుసాక్షాత్ శివునియొక్క వాచకమే యీ “ఓం నమశ్శివాయ” యను మంత్రము - శివుని పేరే - శివుడేఈ మంత్రము - సప్తకోటి మహా మంత్రములన్నియు ‘ఓం’ అను ఏకాక్షరము ముందు గలవియే. అవన్నియు యీ “ఓం నమశ్శివాయః” యను మంత్రములోనే లీనమై పోవునవి. అందునుండియే తిరిగి బైటకువచ్చినవి. అధికారిని బట్టి మంత్రములన్నియు ఫలమినిచ్చునవియే. ఈ మంత్రము ఈశ్వరుని ఆజ్ఞవలనఅధికారులందఱకు ఫలమునిచ్చును. మంత్రము అనగా మననము చేయువారిని రక్షించునది. అందుచేత మంత్రములన్నియు రక్షించుటకు శక్తి గలవియే. అట్టిమంత్రములకన్నా ఈ మంత్రము ప్రబలమైనది.అందఱినీ రక్షించునదీ మంత్రము - ఇటువంటిది మరియొకటిలేదు. అందుచేత మిగిలిన మంత్రములన్నింటినీ వదలి ఈ పంచాక్షరీమంత్రమును పఠించుచుండవలెను).

  1. “మంత్రే షడక్షరే సూక్ష్మః పంచబ్రహ్మ తమశ్శివః |

వాచ్య వాచక భావేన స్థితస్సాక్షాత్స్వ భావతః |

వాచ్య శివ ప్రమేయ త్వాత్ మంత్రస్త ద్వాచకః స్మృతః |

వాచ్య వాచక భావో (అ)య మనాది స్సంస్థితస్తయోః |

యదా అనాది ప్రవృత్తోయం ఘోర సంసారసాగరః |

శివోపి హి తథా (అ)నాది స్సంసారమోచకఃస్థితః |

వ్యాధీనాం భేషజం యద్వత్ ప్రతిపక్ష స్వభావాతః |

తద్వత్సంసార దోషాణాం ప్రతిపక్ష శ్శివఃస్మృతః ||” (శివ రహస్యే)

(షడక్షరమంత్రమందు పంచబ్రహ్మలు శరీరముగా గల సాక్షాత్ శివుడు స్వభావమువలన వాచ్యము,వాచకము తానే అయి యున్నాడు - ఆ మంత్రముచే చెప్పబడువాడు కనుక శివుడు వాచ్యుడు - శివునిచెప్పునది కనుక మంత్రము వాచకము. ఈ రెండు రూపములుగాను శివుడు ఆ మంత్రములోనున్నాడు.ఇట్లుండుట తన స్వభావమే - ఈ ఇద్దఱికి - వాచ్యుడగు శివునికి, వాచకమను మంత్రమునకు, గలసంబంధము (వాచ్య వాచకసంబంధము) అనాదినుండి యున్నది, శివుడు కూడ అనాదియే కనుకఅనాదిగా ఈ సంసారసాగరమునుండి తరింపచేయువాడు శివుడే. వ్యాధులను మాన్పుటకు ఔషధమువలె సంసారములోని దోషములను శివుడు పోగొట్టును.

  1. సర్వా సామేవ విద్యానా ముత్కృష్టా శ్రుతి రుచ్యతే |

ఋగ్యజుస్సామ వేదానాం శతరుద్రీయముచ్యతే |

ఏకాదశానువా కానా మష్టమ స్త్విష్ట దాయకః |

షణ్ణాం మనూనాం ద్వావేవ తయోరాద్యః ప్రశస్యతే |

తన్మధ్యే పరతత్వం స్త్యాచ్ఛివ ఇత్యక్షర ద్వయం |

పంచాక్షరీ శివపదేన విభాతి. రుద్రాధ్యాయస్తయాస్ఫురతి,

తేన చతుర్థ కాండః, కాండేన సర్వ యజురేవ విభాతి తే

న ఋక్సామ మధ్య మణి నా జావిభాంతి వేదాః. (బ్రహ్మ వైవర్తకే)

(విద్యలన్నింటిలోను శ్రుతులు - వేదములు - ఉత్క్రుష్టమైనవి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ మూడింటిలోను శతరుద్రీయము ఉత్తమమైనది. పదకొడు అనువాకములలోను ఎనిమిదవది ఉత్తమమము - ఆరు మంత్రములు సిద్ధినిచ్చునవి. వాటిలో రెండు ప్రశస్తమైనవి. వాటిలో పరతత్వమైన శివుడు అను రెండక్షరములున్నవి. పంచాక్షరీమంత్రము శివుడనే చెప్పబడుచున్నది).

Transliteration
  1. “ōṃ namaśśivāyaḥ” anu ayidu akṣaramulugala maṃtramu.

  2. ‘ōṃ’ ityagrē vyāharēt. “nama” iti paścāt, tata “śśivāyē” ti akṣaratrayaṃ.

(modaṭa ‘ōṃ’ ani palukavalenu, tarvāta ‘nama’ ani, aṭu tarvāta ’ śivāya ’ anu mūḍuakṣaramulu palukavalenu).

  1. “vēdēṣu śāstrēṣu śivāgamēṣu sāraṃ sa muddhṛtya jagadhthitāya |

bhakta priya yaḥ pārvati vallabhaśca paṃcākṣaraṃ prāha paraśśivō (a)sau” (skāṃdē)

(vēdamulaṃdu, śāstramulaṃdu, śivāgamamulaṃdu unna sāramunu paikitīsi lōkamulakuhitamu cēyuṭaku pāravatīpati, bhakta priyuḍu ayīn paramaśivuḍu yī paṃcākṣaramunu ‘ōṃ namaśśivāya’ anu paṃcākṣarīmaṃtramunu palikenu - atanē parama śivuḍu).

  1. “sarvasmā dadhikō (a)styēva śivaḥ paramakāraṇaṃ |

tatkṛtaṃ hi jagatsarvaṃ brahma dyāstasyakiṃkarāḥ |

tatprasāda kṛtaiśvaryāḥ dāsastasya vayaṃ prabhō |

svalpān dēvān parityajya manasākarmāṇā girā |

tamēvasāṃgaṃ sagaṇaṃ bhajabhāva purassaraṃ |

tasya dēvādi dēvasya śivasya śivasyaśivadāyinaḥ |

sākṣānnamaśśivāyē ti maṃtrōyaṃ vācakaḥ smṛtaḥ |

saptakōṭimahāmaṃtrāḥ sarvē sapraṇavāḥ parē |

tasminnēva vilīyaṃtē punastasmā dvi nirgatāḥ |

sa prasādāścatē maṃtrāḥ svādhikārādyapēkṣayaṃ |

sarvādhikārastvēkō (a)yaṃ maṃtra ē vēśvarājñayā |

yathā nikṛṣṭānutkṛṣṭān sarvānapyātmanaḥ śivaḥ |

kṣamaṃtē rakṣituṃ tadvanmaṃtrōyamapi sarvadā |

prabalastvata ē vāyaṃ maṃtrōmaṃtrāṃ tarādapi |

sarva rakṣa kṣamōhyēṣa nāparaḥ kaścidiṣyatē |

tasmānmaṃtrāṃtaraṃ tyaktvā paṃcākṣaraparō bhava ||“. (śivarahasyē)

(anniṭikaṃṭe, aṃdaṟikaṃṭe paramakāraṇuḍaina śivuḍu adhikuḍu. ī sṛṣṭi atanu cēsinadē. brahmamodalagu vāraṃdarū atani kiṃkarulē (sēvakulē; bhaktulē), atani karuṇavalananē vāraṃdarūvāri vāri aiśvaryamunu (padavulanu) poṃdinavāru. cinna cinna dēvatulani viḍicipeṭṭi trikaṇamulatō (manō vākkāyamulatō) dhyānamulō pramada gaṇamulatō kūḍiyunnaṭuvaṃṭinnīākāramutō kūḍina - saguṇarūpuḍaina śivuni bhajiṃcumu. dēva dēvuḍu maṃgaḷapraduḍu agusākṣāt śivuniyokka vācakamē yī “ōṃ namaśśivāya” yanu maṃtramu - śivuni pērē - śivuḍēī maṃtramu - saptakōṭi mahā maṃtramulanniyu ‘ōṃ’ anu ēkākṣaramu muṃdu galaviyē. avanniyu yī “ōṃ namaśśivāyaḥ” yanu maṃtramulōnē līnamai pōvunavi. aṃdunuṃḍiyē tirigi baiṭakuvaccinavi. adhikārini baṭṭi maṃtramulanniyu phalaminiccunaviyē. ī maṃtramu īśvaruni ājñavalanaadhikārulaṃdaṟaku phalamuniccunu. maṃtramu anagā mananamu cēyuvārini rakṣiṃcunadi. aṃducēta maṃtramulanniyu rakṣiṃcuṭaku śakti galaviyē. aṭṭimaṃtramulakannā ī maṃtramu prabalamainadi.aṃdaṟinī rakṣiṃcunadī maṃtramu - iṭuvaṃṭidi mariyokaṭilēdu. aṃducēta migilina maṃtramulanniṃṭinī vadali ī paṃcākṣarīmaṃtramunu paṭhiṃcucuṃḍavalenu).

  1. “maṃtrē ṣaḍakṣarē sūkṣmaḥ paṃcabrahma tamaśśivaḥ |

vācya vācaka bhāvēna sthitassākṣātsva bhāvataḥ |

vācya śiva pramēya tvāt maṃtrasta dvācakaḥ smṛtaḥ |

vācya vācaka bhāvō (a)ya manādi ssaṃsthitastayōḥ |

yadā anādi pravṛttōyaṃ ghōra saṃsārasāgaraḥ |

śivōpi hi tathā (a)nādi ssaṃsāramōcakaḥsthitaḥ |

vyādhīnāṃ bhēṣajaṃ yadvat pratipakṣa svabhāvātaḥ |

tadvatsaṃsāra dōṣāṇāṃ pratipakṣa śśivaḥsmṛtaḥ ||” (śiva rahasyē)

(ṣaḍakṣaramaṃtramaṃdu paṃcabrahmalu śarīramugā gala sākṣāt śivuḍu svabhāvamuvalana vācyamu,vācakamu tānē ayi yunnāḍu - ā maṃtramucē ceppabaḍuvāḍu kanuka śivuḍu vācyuḍu - śivuniceppunadi kanuka maṃtramu vācakamu. ī reṃḍu rūpamulugānu śivuḍu ā maṃtramulōnunnāḍu.iṭluṃḍuṭa tana svabhāvamē - ī iddaṟiki - vācyuḍagu śivuniki, vācakamanu maṃtramunaku, galasaṃbaṃdhamu (vācya vācakasaṃbaṃdhamu) anādinuṃḍi yunnadi, śivuḍu kūḍa anādiyē kanukaanādigā ī saṃsārasāgaramunuṃḍi tariṃpacēyuvāḍu śivuḍē. vyādhulanu mānpuṭaku auṣadhamuvale saṃsāramulōni dōṣamulanu śivuḍu pōgoṭṭunu.

  1. sarvā sāmēva vidyānā mutkṛṣṭā śruti rucyatē |

ṛgyajussāma vēdānāṃ śatarudrīyamucyatē |

ēkādaśānuvā kānā maṣṭama stviṣṭa dāyakaḥ |

ṣaṇṇāṃ manūnāṃ dvāvēva tayōrādyaḥ praśasyatē |

tanmadhyē paratatvaṃ styācchiva ityakṣara dvayaṃ |

paṃcākṣarī śivapadēna vibhāti. rudrādhyāyastayāsphurati,

tēna caturtha kāṃḍaḥ, kāṃḍēna sarva yajurēva vibhāti tē

na ṛksāma madhya maṇi nā jāvibhāṃti vēdāḥ. (brahma vaivartakē)

(vidyalanniṃṭilōnu śrutulu - vēdamulu - utkruṣṭamainavi. ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu ī mūḍiṃṭilōnu śatarudrīyamu uttamamainadi. padakoḍu anuvākamulalōnu enimidavadi uttamamamu - āru maṃtramulu siddhiniccunavi. vāṭilō reṃḍu praśastamainavi. vāṭilō paratatvamaina śivuḍu anu reṃḍakṣaramulunnavi. paṃcākṣarīmaṃtramu śivuḍanē ceppabaḍucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.